IND Vs ENG: ఇంగ్లండ్‌తో పోరుకు టీమిండియా సై! ప్రాక్టీసు వీడియో! | IND Vs ENG 5th Test: India Train Hard at Edgbaston Watch | Sakshi
Sakshi News home page

IND Vs ENG: ఇంగ్లండ్‌తో పోరుకు టీమిండియా సై! ప్రాక్టీసు వీడియో!

Published Thu, Jun 30 2022 3:58 PM | Last Updated on Thu, Jun 30 2022 4:07 PM

IND Vs ENG 5th Test: India Train Hard at Edgbaston Watch - Sakshi

టీమిండియా ప్రాక్టీసు(PC: Sony)

ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్డ్‌ టెస్టు నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీసు మొదలుపెట్టారు. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా శుక్రవారం(జూలై 1) నుంచి ఆరంభం కానున్న మ్యాచ్‌ కోసం నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందుకు సంబంధించిన స్నీక్‌ పీక్‌ వీడియోను సిరీస్‌ అధికారిక ప్రసార నెట్‌వర్క్‌ సోనీ స్పోర్ట్స్ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

‘‘చారిత్రాత్మక టెస్టు ఆడే క్రమంలో టీమిండియా ఎంతగానో శ్రమిస్తోంది’’ అంటూ ఈ వీడియోకు క్యాప్షన్‌ జత చేసింది. కాగా వీడియోలో విరాట్‌ కోహ్లి, రవీంద్ర జడేజా, బుమ్రా తదితరులు కనిపించారు. కొంతమంది క్యాచెస్‌ ప్రాక్టీసు చేస్తుండగా.. మరికొంత మంది నెట్స్‌లో బ్యాటింగ్‌ చేశారు.

ఇక రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు కోవిడ్‌ సోకిన నేపథ్యంలో అతడు అందుబాటులోకి రానట్లయితే.. జస్‌ప్రీత్‌ బుమ్రా టీమిండియా సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. మరోవైపు ఇప్పటికే రోహిత్‌ స్థానాన్ని భర్తీ చేసేందుకు బీసీసీఐ మయాంక్‌ అగర్వాల్‌ను బీసీసీఐ ఇంగ్లండ్‌కు పంపింది. 

కాగా సోనీ షేర్‌ చేసిన వీడియోలో స్పోర్ట్స్ ప్రజెంటర్‌, బుమ్రా సతీమణి సంజనా గణేషన్‌ టీమిండియా గురించి మాట్లాడారు. ఈ వీడియోపై స్పందించిన నెటిజన్లు భర్త కెప్టెన్‌.. భార్య ప్రజెంటర్‌.. అదిరిందయ్యా బుమ్రా అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. 

చదవండి: Eoin Morgan: కొత్త అవతారమెత్తబోతున్న మోర్గాన్‌.. ఇండియాతో సిరీస్‌ నుంచి..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement