Jasprit Bumrah Shares Emotional Post To His Wife Sanjana On First Marriage Anniversary - Sakshi
Sakshi News home page

Jasprit Bumrah: ఐ లవ్‌ యూ సంజన.. నువ్వుంటే సంతోషం: బుమ్రా భావోద్వేగం.. వీడియో వైరల్‌

Published Tue, Mar 15 2022 12:42 PM | Last Updated on Tue, Mar 15 2022 2:12 PM

Jasprit Bumrah Emotional Note On First Marriage Anniversary Shares Video - Sakshi

Jasprit Bumrah Emotional Note: ‘‘మనిద్దరం కలిసి ఉంటే జీవితం నిండుగా అనిపిస్తుంది. నా వెంట నువ్వుంటే సంతోషం. నన్ను శాంత స్వభావుడిగా, మరింత దయాహృదయుడిగా, హాస్య చతురత గల వ్యక్తిగా మార్చేశావు. మనిద్దరం కలిసి మన జీవితాలను అర్థవంతంగా మార్చుకున్నాం. ఈ ప్రయాణంలో ఏడాది కాలం అనేది చాలా చిన్న వ్యవధి.

ఏ చిన్న విరామం దొరికినా నేను నీ సమక్షంలోనే గడపాలని కోరుకుంటాను’’ అని టీమిండియా స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా తన భార్య సంజనా గణేషన్‌ను ఉద్దేశించి భావోద్వేగ పోస్టు చేశాడు. తమ మొదటి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సతీమణికి విషెస్‌ తెలియజేశాడు. ఐ లవ్‌ యూ అంటూ ఆమెపై ప్రేమను కురిపించాడు. ఈ సందర్భంగా తమ పెళ్లినాటి వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఇది వైరల్‌ అవుతోంది.

కాగా కొంతకాలం ప్రేమలో మునిగితేలిన బుమ్రా- స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌ సంజనా గణేషన్‌ గతేడాది మార్చి 15న గోవాలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇక శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో సత్తా చాటిన బుమ్రా... జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక ఐపీఎల్‌-2022 నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌ తరఫున అతడు బరిలోకి దిగనున్నాడు. మరోవైపు.. సంజన తన కెరీర్‌లో బిజీగా ఉన్నారు. ఏమాత్రం సమయం చిక్కినా ఇద్దరూ కలిసి ఒక్కచోట చేరి సమయాన్ని ఆస్వాదిస్తారీ జంట.

చదవండి: Rohit Sharma: అతడి ఆట తీరు ఎలా ఉన్నా స్వీకరిస్తాం.. అయితే, అనవసర షాట్లు వద్దని చెప్పాం: రోహిత్‌ శర్మ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement