ఐపీఎల్‌లో భారీ హిట్టర్లు, స్టార్ బౌలర్లు, సిక్సర్ల వీరులకు వీరాభిమానులు ఉన్నట్లే యాంకర్లకు సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. ఈ జాబితాలో ముందు వరుసలో ఉంటారు ప్రజెంటర్ మయాంతి లాంగర్. అందంతో పాటు అపారమైన ప్రతిభ కలిగిన యాంకర్‌గా ఆమె మంచి పేరు సంపాదించుకున్నారు. కాగా టీమిండియా క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ సతీమణి అయిన మయాంతి 2020లో మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆమె కొంతకాలం పాటు ఐపీఎల్ వంటి మెగా ఈవెంట్లకు దూరమయ్యారు. అయితే, తాజా సమాచారం ప్రకారం ఐపీఎల్-2022 సీజన్‌తో రీ ఎంట్రీ ఇచ్చేందుకు మయాంతి సిద్ధమవుతున్నారట. మరోసారి యాంకర్ అవతారంలో మెరిసేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వార్తలపై స్పందించిన అభిమానులు మయాంతిని మిస్సవుతున్నామని, ఆమె రీ ఎంట్రీ ఇస్తే బాగుంటుందటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ విషయం కాసేపు పక్కన పెడితే.. మయాంతితో పాటు ఐపీఎల్‌లో తళుక్కుమంటున్న అందాల యాంకర్లు ఎవరో చూద్దామా!
సంజనా గణేషన్
ప్రస్తుతం భారత్‌లో టాప్ స్పోర్ట్స్ యాంకర్లలో ఒకరిగా ఉన్నారు సంజనా. మయాంతి గైర్హాజరీలో ఎన్నో ఈవెంట్లకు ఆమె హోస్ట్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్ టోర్నీతో బిజీగా ఉన్నారు. ఈ మెగా ఈవెంట్ తర్వాత ఆమె ఐపీఎల్‌లో ఎంట్రీ ఇవ్వనున్నారు. కాగా సంజనా గతేడాది.. టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాను పెళ్లాడిన సంగతి తెలిసిందే.
తాన్యా పురోహిత్
ఉత్తరాఖండ్‌కు చెందిన తాన్యా పురోహిత్ గర్వాల్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ సినిమా ఎన్‌హెచ్-10తో వెలుగులోకి వచ్చిన తాన్యా... క్రికెట్ షోలకు యాంకర్‌గా వ్యవహరించే అవకాశం దక్కించుకున్నారు. ఈ క్రమంలో ఐపీఎల్ ప్రజెంటర్‌గా ఆమె గుర్తింపు పొందారు.
నెరోలీ మెడోస్
ఆస్ట్రేలియన్ జర్నలిస్టు అయిన నెరోలీ క్రికెట్‌తో పాటు ఫుట్‌బాల్, బాస్కెట్ బాల్ టోర్నీలకు కూడా యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు. 2021లో ఐపీఎల్‌లో తన యాంకరింగ్‌తో అభిమానులను ఫిదా చేశారు.
నశ్‌ప్రీత్ కౌర్
మెల్‌బోర్న్‌లో పుట్టి పెరిగిన భారత సంతతి యువతి నశ్‌ప్రీత్ కౌర్. క్రికెట్ షోలకు యాంకరింగ్ చేస్తూ గుర్తింపు పొందారు. ఐపీఎల్ -2022 సీజన్‌తో ఆమె పాపులారిటీ సంపాదించారు.
చదవండి: IPL 2022: గుజరాత్ టైటాన్స్ ఫైనల్ చేరితే టీ20 ప్రపంచకప్ జట్టులో నేనూ ఉంటా: టీమిండియా ప్లేయర్
Comments
Please login to add a commentAdd a comment