Mayanti Langer
-
ఇది క్రికెట్ షోనా? లేదంటే.. అర్ధ నగ్న ఫొటోలు చూపిస్తూ..! సిగ్గుండాలి!
IPL 2023- SRH Vs RCB: ఐపీఎల్-2023 బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ నిర్వాహకులపై నెటిజన్లు మండిపడుతున్నారు. పిచ్చి పిచ్చి షోలతో మహిళా యాంకర్లను ఇబ్బంది పెట్టడం సరికాదని హితవు పలుకుతున్నారు. క్రికెట్, క్రికెటర్ల గురించి మాట్లాడటానికి ఎన్నో విషయాలు ఉన్నాయని.. ఆట గురించి కాకుండా అర్ధ నగ్న ఫొటోలు చూపిస్తూ ప్రశ్నలు అడగటం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ- సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో గురువారం తలపడిన విషయం తెలిసిందే. ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొంది పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. బీసీసీఐ బాస్ కోడలు సహా ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు ‘‘హాట్ ఆర్ నాట్’’ పేరిట స్టార్ స్పోర్ట్స్‌లో ఓ షో నిర్వహించారు. ప్రముఖ స్పోర్ట్స్ ప్రజెంటర్, బీసీసీఐ బాస్ రోజర్ బిన్నీ కోడలు మయంతి లాంగర్ సహా మరో ముగ్గురు యాంకర్లు ఈ షోలో పాల్గొన్నారు. బాలీవుడ్ నటుడు విద్యుత్ జమాల్‌తో కలిసి సురేన్ సుందరం నిర్వహించిన ఈ షోలో పురుష క్రికెటర్ల అర్ధ నగ్న ఫొటోలు చూపిస్తూ ఎవరు హాట్‌గా ఉన్నారో చెప్పాలంటూ అడిగారు. టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లి, శుబ్‌మన్ గిల్, వెస్టిండీస్ ప్లేయర్ ఆండ్రీ రసెల్ తదితరులు షర్టు లేకుండా నీళ్లలో ఉన్న ఫొటోలు స్క్రీన్ మీద చూపించారు. ఇది క్రికెట్ షోనా? సిగ్గుండాలి! మయంతి సహా మిగిలిన ముగ్గురు యాంకర్లు ఆ ఫొటోలు చూసేందుకు అసౌకర్యంగా ఫీలైనట్లు వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఇదే నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. ‘‘ఇది క్రికెట్ షోనా? లేదంటే మరేదైనానా? స్టార్ స్పోర్ట్స్' రోజురోజుకీ దిగజారి పోతోంది. షో నడిపించడానికి ఇంతకంటే మంచి కంటెంటే దొరకలేదా?’’ అని ఏకిపారేస్తున్నారు. ‘‘సీనియర్, ఓ బిడ్డకు తల్లి అయిన మయంతి లాంటి సీనియర్లకు కూర్చో బెట్టి ఇలాంటి ఫొటోలు చూపిస్తూ ఆ క్వశ్చన్లు అడగటానికి సిగ్గు లేదా?’’ అంటూ ఫైర్ అవుతున్నారు. ఇదిలా ఉంటే సన్‌రైజర్స్- ఆర్సీబీ మధ్య మ్యాచ్ సందర్భంగా ఐపీఎల్లో ఏకంగా రెండు సెంచరీలు నమోదైన విషయం తెలిసిందే. రైజర్స్ వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ 104 పరుగులు చేయగా.. ఆర్సీబీ స్టార్ కోహ్లి 100 పరుగులు సాధించాడు. చదవండి: రూ. 8 కోట్లు పెడితే మధ్యలోనే వదిలివెళ్లాడు.. ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దు! Is this a Cricket related show or what....Starsports u are disgrace#ViratKohli #SRHvRCB pic.twitter.com/gCygfzX8ga — I am NEGAN (@IamNEGA62524296) May 18, 2023 Star with their 'Hot or Not' segment in today's pre-match show clearly embarrassed themselves. Imagine asking a senior anchor and married woman like Mayanti Langer to pick sides for a junior fellow like Shubman Gill. She was clearly uncomfortable. #NotDone#IPL2023 — Subhayan Chakraborty (@CricSubhayan) May 18, 2023 -
IPL 2023 : టాప్-10 మోస్ట్ బ్యూటీఫుల్ క్రికెట్ యాంకర్స్ (ఫొటోలు)
-
బీసీసీఐ అధ్యక్షుడిపై ఆరోపణలు.. ఆమె కారణంగా..!
ముంబై: బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ పరస్పర విరుద్ధ ప్రయోజనాల (కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్) ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘానికి చెందిన సంజీవ్ గుప్తా ఈ విషయంపై బీసీసీఐ ఎథిక్స్ ఆఫీసర్ వినీత్ శరణ్‌కు ఫిర్యాదు చేశారు. దాంతో డిసెంబర్ 20లోగా వివరణ ఇవ్వాలంటూ బిన్నీకి వినీత్ నోటీసు జారీ చేశారు. భారత్‌లో బీసీసీఐ మ్యాచ్‌ల ప్రసార హక్కులు ఉన్న స్టార్ స్పోర్ట్స్‌లో రోజర్ బిన్నీ కోడలు మయంతి లాంగర్ పని చేస్తోందని... ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ కిందకే వస్తుందని గుప్తా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. భారత్ తరఫున 27 టెస్టులు, 72 వన్డేలు ఆడిన బిన్నీ ఇటీవలే బోర్డు అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. -
IPL 2022: అందాల యాంకర్ రీ ఎంట్రీ.. టాప్-5లో ఉన్నది వీళ్లే!
ఐపీఎల్లో భారీ హిట్టర్లు, స్టార్ బౌలర్లు, సిక్సర్ల వీరులకు వీరాభిమానులు ఉన్నట్లే యాంకర్లకు సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. ఈ జాబితాలో ముందు వరుసలో ఉంటారు ప్రజెంటర్ మయాంతి లాంగర్. అందంతో పాటు అపారమైన ప్రతిభ కలిగిన యాంకర్‌గా ఆమె మంచి పేరు సంపాదించుకున్నారు. కాగా టీమిండియా క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ సతీమణి అయిన మయాంతి 2020లో మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె కొంతకాలం పాటు ఐపీఎల్ వంటి మెగా ఈవెంట్లకు దూరమయ్యారు. అయితే, తాజా సమాచారం ప్రకారం ఐపీఎల్-2022 సీజన్‌తో రీ ఎంట్రీ ఇచ్చేందుకు మయాంతి సిద్ధమవుతున్నారట. మరోసారి యాంకర్ అవతారంలో మెరిసేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వార్తలపై స్పందించిన అభిమానులు మయాంతిని మిస్సవుతున్నామని, ఆమె రీ ఎంట్రీ ఇస్తే బాగుంటుందటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by mayantilangerbinny (@mayantilanger_b) ఈ విషయం కాసేపు పక్కన పెడితే.. మయాంతితో పాటు ఐపీఎల్లో తళుక్కుమంటున్న అందాల యాంకర్లు ఎవరో చూద్దామా! సంజనా గణేషన్ ప్రస్తుతం భారత్‌లో టాప్ స్పోర్ట్స్ యాంకర్లలో ఒకరిగా ఉన్నారు సంజనా. మయాంతి గైర్హాజరీలో ఎన్నో ఈవెంట్లకు ఆమె హోస్ట్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్ టోర్నీతో బిజీగా ఉన్నారు. ఈ మెగా ఈవెంట్ తర్వాత ఆమె ఐపీఎల్లో ఎంట్రీ ఇవ్వనున్నారు. కాగా సంజనా గతేడాది.. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను పెళ్లాడిన సంగతి తెలిసిందే. తాన్యా పురోహిత్ ఉత్తరాఖండ్‌కు చెందిన తాన్యా పురోహిత్ గర్వాల్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ సినిమా ఎన్‌హెచ్-10తో వెలుగులోకి వచ్చిన తాన్యా... క్రికెట్ షోలకు యాంకర్‌గా వ్యవహరించే అవకాశం దక్కించుకున్నారు. ఈ క్రమంలో ఐపీఎల్ ప్రజెంటర్‌గా ఆమె గుర్తింపు పొందారు. నెరోలీ మెడోస్ ఆస్ట్రేలియన్ జర్నలిస్టు అయిన నెరోలీ క్రికెట్‌తో పాటు ఫుట్‌బాల్, బాస్కెట్ బాల్ టోర్నీలకు కూడా యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు. 2021లో ఐపీఎల్లో తన యాంకరింగ్‌తో అభిమానులను ఫిదా చేశారు. నశ్ప్రీత్ కౌర్ మెల్బోర్న్లో పుట్టి పెరిగిన భారత సంతతి యువతి నశ్ప్రీత్ కౌర్. క్రికెట్ షోలకు యాంకరింగ్ చేస్తూ గుర్తింపు పొందారు. ఐపీఎల్ -2022 సీజన్‌తో ఆమె పాపులారిటీ సంపాదించారు. చదవండి: IPL 2022: గుజరాత్ టైటాన్స్ ఫైనల్ చేరితే టీ20 ప్రపంచకప్ జట్టులో నేనూ ఉంటా: టీమిండియా ప్లేయర్ View this post on Instagram A post shared by mayantilangerbinny (@mayantilanger_b) -
టీమిండియా క్రికెటర్ భార్య వెటకారం.. కోహ్లి, రహానేలపై సెటైర్లు!
న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ భార్య, ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత మయంతి లాంగర్.. ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్‌లో ఆండర్సన్ బౌలింగ్‌లో పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతూ, వికెట్లు సమర్పించుకున్న భారత స్టార్ ఆటగాళ్లపై పరోక్షంగా సెటైర్లు వేసింది. ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్ అనంతరం ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఓ స్టోరీ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. తన భర్త స్టువర్ట్ బిన్నీ బౌండరీ బాదితే, అతనికి బౌలింగ్ చేయలేక ఆండర్సన్ అసహనంతో తల పట్టుకున్న ఫోటోను ఆమె తన ఇన్‌స్టా స్టోరీగా పోస్ట్ చేసింది. ఈ ఫోటో 2014 ఇంగ్లండ్ పర్యటనలో తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా తీసింది. ఈ మ్యాచ్ ద్వారా టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన బిన్నీ.. తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగుకే అవుటైనా, రెండో ఇన్నింగ్స్‌లో 78 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఈ స్టోరీలో మయంతి ఎలాంటి కామెంట్లు చేయకపోయినా.. ఇంగ్లండ్‌లో ఆండర్సన్‌ను ఎదుర్కోవడం అందరి వల్లా కాదని, దానికి తన భర్తలా సపరేట్ టాలెంట్ ఉండాలని పరోక్షంగా కోహ్లి, రహానే, పుజారాపై సెటైర్లు వేసినట్లుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మయంతి చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాగా, భారత మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ కొడుకైన స్టువర్ట్ బిన్నీ.. క్రికెట్ యాంకర్ మయంతి లాంగర్‌ను ప్రేమించి పెళ్లాడాడు. వీరికి గతేడాది సెప్టెంబర్‌లో ఓ కొడుకు కూడా జన్మించాడు. 37 ఏళ్ల స్టువర్ట్ బిన్నీ, ఇంకా అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించలేదు. చివరిసారిగా 2016లో వెస్టిండీస్‌పై టీ20 మ్యాచ్ ఆడిన బిన్నీ.. ఆ మ్యాచ్‌లో ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు సమర్పించుకున్నాడు. టీమిండియా తరుపున 6 టెస్ట్‌లు ఆడిన అతను.. ఓ హాఫ్ సెంచరీతో 194 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో బిన్నీ మూడు వికెట్లు పడగొట్టాడు. అయితే, వన్డే క్రికెట్లో భారత్ తరఫున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు మాత్రం స్టువర్ట్ బిన్నీ(6/4) పేరిటే నమోదై ఉన్నాయి. 2014లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చిన బిన్నీ.. ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టి, అనిల్ కుంబ్లే(6/12) రికార్డును బ్రేక్ చేశాడు. చదవండి: అదును చూసి విరుచుకుపడ్డాం.. ఇంగ్లండ్ బౌలర్లను ఆకాశానికెత్తిన రూట్ -
'ఐపీఎల్ యాంకరింగ్ మిస్సవుతున్నా'
ముంబై : పలు ఐపీఎల్ సీజన్లలో యాంకరింగ్‌తో మంచి పాపులరిటీ సంపాదించిన మాయంతి లాంగర్ ఆరువారాల క్రితం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా తన భర్త ప్రముఖ క్రికెటర్ స్టువర్ట్ బిన్నీతో కలసి చేతిలో బిడ్డతో దిగిన ఫోటోను ట్విటర్లో షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ.. 'ఈసారి ఐపీఎల్ 2020 యాంకరింగ్ మిస్సవుతున్నా.. కానీ ఇంట్లోనే ఉంటూ రోజువారి ఐపీఎల్ మ్యాచ్‌లను స్టార్‌స్పోర్ట్స్‌లో చూస్తూ ఎంజాయ్ చేయబోతున్నా. ఈ సందర్భంగా మా గ్యాంగ్ సభ్యులైన జతిన్ సపారు, సుహైల్ చాందోక్, క్రికెట్ ఆకాశ్, సంజన గణేషన్, స్కాట్ బైరిస్, బ్రెట్ లీ లాంటి వాళ్లను మిస్సవుతున్నా.. అంటూ' పేర్కొన్నారు. (చదవండి : 'మేం లేకపోయినా.. చెన్నైకి నష్టం లేదు') 'గత ఐదేళ్లుగా స్టార్‌స్పోర్ట్స్ తన కుటుంబంలో నన్ను ఒకదానిలా చూసింది. వారు నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఒక యాంకర్‌గా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించా. కరోనా లేకపోయుంటే మార్చిలో ఐపీఎల్ జరుగుంటే.. ఐదు నెలల ప్రెగ్నెన్సీతో యాంకరింగ్ చేద్దామనుకున్నా. కరోనా వల్ల దాదాపు నెలల తర్వాత ఐపీఎల్ మొదలవుతుంది. కానీ స్టార్‌స్పోర్ట్స్ యాజమాన్యం నాకు ఈ విషయంలో చాలా మద్దతునిచ్చింది. ఆ విషయంలో వారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నా. ఆరు వారాల క్రితం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చా. స్టువర్ట్ బిన్నీ, బిడ్డతో కలిసి మధురక్షణాలను అనుభవిస్తున్నా.. బాబు మా జీవితంలోకి ప్రేవేశించాకా చాలా కొత్తగా అనిపిస్తుందంటూ' తెలిపారు.(చదవండి : 'ఆర్సీబీలో కోహ్లి, డివిలియర్స్ ఫేవరెట్ కాదు') So I’m going to love watching the IPL @StarSportsIndia all the best to the team 😁 @jatinsapru @suhailchandhok @cricketaakash @SanjanaGanesan @ProfDeano @scottbstyris @BrettLee_58 @Sanjog_G and the full gang!! pic.twitter.com/fZVk0NUbTi — Mayanti Langer Binny (@MayantiLanger_B) September 18, 2020 స్పోర్ట్స్ వ్యాఖ్యాతల్లో తనదైన ముద్ర వేసిన మయాంతి ఐసీసీ నిర్వహించే ప్రపంచకప్ టోర్నీలతో పాటు ఇండియన్ కౌన్సిల్ లీగ్(ఐసీఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లాంటి టోర్నీలకు యాంకర్‌గా వ్యవహరించారు. ఇక మయాంతి భర్త క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ టీమిండియా తరపున 14 వన్డేలు, 6 టెస్టులు ఆడాడు. రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన బిన్నీని గతేడాది ఐపీఎల్ వేలం సందర్భంగా జట్టు నుంచి రిలీజ్ చేసింది. -
ప్రపంచకప్‌లో సందడంతా వీరిదే!
హైదరాబాద్: టెలివిజన్ కార్యక్రమాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది వ్యాఖ్యాతే(యాంకర్). కార్యక్రమం చూసే ప్రేక్షకుల దృష్టి ముందుగా వచ్చే యాంకర్‌పైనే ఉంటుంది. కొందరు మాటలు, పంచ్‌లతో ఆకట్టుకుంటే.. మరికొందరు తమ అందంతో ఆకర్షిస్తారు. అలా అందంతో మాటలతో క్రికెట్ అభిమానులను కట్టిపడేస్తున్నారు ప్రపంచకప్ యాంకర్లు. ప్రస్తుతం ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్‌లో ఐదుగురు యాంకర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. వారి వివరాలు ఏంటో తెలుసుకుందాం.. మయంతి లాంగర్ క్రికెట్, ఫుట్‌బాల్ అభిమానులకు తెగ నచ్చిన మోస్ట్ ఫేవరేబుల్ యాంకర్ మయంతి లాంగర్. 1985 ఫిబ్రవరి 8న ఢిల్లీలో జన్మించిన మయంతి స్థానిక హిందూ కాలేజీలో గ్యాడ్యూయేషన్ పూర్తి చేసింది. కాలేజీలో నిర్వహించే కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించేది. దీంతో పీజీ చేస్తుండగానే జీ స్పోర్ట్స్‌లో యాంకర్‌గా అవకాశం వచ్చింది. తన పెర్ ఫార్మెన్స్ చాలా మందికి నచ్చడంతో ఆమె కెరీర్ తారా జువ్వలా దూసుకుపోయింది. 2010లో ఫిఫా ప్రపంచకప్‌కి తొలిసారి వాఖ్యాతగా వ్యవహరించింది. అక్కడ విజయవంతం కావడంతో 2010లో ప్రతిష్టాత్మకమైన కామన్వెల్త్ క్రీడలకు టీవీ ప్రెజెంటర్‌గా చేసింది. ఇక అప్పటినుంచి ఐపీఎల్, ప్రపంచకప్‌లకు వ్యాఖ్యాతగా కొనసాగుతోంది. ఐపీఎల్లో బెస్ట్ యాంకర్‌గా తనదైన ముద్ర వేసుకుంది. మ్యాచ్‌కు ముందు జరిగే విశ్లేషణలను చాలా మంది మయంతి కోసమే చూస్తారంటే అతిశయోక్తి కాదు. 2013లో క్రికెటర్ స్టువార్ట్ బిన్నిని వివాహం చేసుకుంది. ఈ మధ్య ఎక్కువగా అమె వస్త్రధారణతో ట్రోలింగ్స్‌కు గురవతున్నారు. అయితే అవేమి పట్టించుకోకుండా మంచి వ్యాఖ్యాతగా రాణిస్తుంది. ప్రపంచకప్‌లో ప్రధాన యాంకర్‌గా వ్యవహిరస్తోంది. సంజన గణేశన్ పుణెకు చెందిన సంజన గణేశన్ అనతికాలంలోనే టీవీ ప్రెజెంటర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇంజనీరింగ్‌లో గోల్డ్‌మెడల్ సాధించిన సంజన గణేశన్‌కు మోడలింగ్‌పై అమితాసక్తి ఉండేది. దీంతో సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేసి మోడిలింగ్ వైపు అడుగులు వేసింది. 2014లో మిస్ ఇండియా ఫైనలిస్టుగా నిలిచిన గణేశన్.. అనంతరం వ్యాఖ్యాతగా మారారు. స్టార్‌లో యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ప్రపంచకప్‌లో టీమిండియా మ్యాచ్‌లకు సంబంధించిన సమాచారాన్ని క్రికెట్ అభిమానులతో పంచుకోనుంది. రిధిమ పాఠక్ టీమిండియా సారథి విరాట్ కోహ్లి ఇంటర్వ్యూతో వార్తల్లో నిలిచింది రిధిమ పాఠక్. చెన్నైలో పుట్టినప్పటికీ ఎడ్యుకేషన్ మొత్తం పుణెలో కొనసాగింది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన రిధిమ మోడలింగ్‌పై ఆసక్తి ఉండటంతో 2012లో మోడల్‌గా అనంతరం వ్యాఖ్యాతగా మారారు. క్రికెట్ కంటే ముందు బాస్కెట్ బాల్ పోటీలకు యాంకరింగ్ చేసిన తొలి భారతీయురాలిగా గుర్తింపు పొందారు. ప్రొఫెషనల్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్. అభిజీత్ చౌదరీ దర్శకత్వంలో సినిమా హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం ప్రపంచకప్‌లో భారత్ మ్యాచ్‌లకు సంబంధించిన సమాచారాన్ని క్రికెట్ అభిమానులతో పంచుకోనుంది. పేయ జన్నతుల్ 2007లో మిస్ బంగ్లాదేశ్‌గా ఎన్నికైన ఈ భామ అనతికాలంలోనే ఎన్నో పేరుప్రఖ్యాతలను సంపాదించుకుంది. 2008 నుంచి పూర్తిగా మోడలింగ్ రంగానికే పరిమితమై పలు సినిమాల్లో నటించింది. అంతేకాకుండా 2013లో మిస్ ఇండియా ప్రిన్సెస్ ఇంటర్నేషనల్ అవార్డును కైవసం చేసుకుంది. అనంతరం యాంకరింగ్‌గా మారిన జన్నతుల్.. కొద్దికాలంలోనే స్టార్డమ్ సంపాదించుకుంది. బంగ్లాదేశ్ టీ20 లీగ్‌కు వ్యాఖ్యాతగా పనిచేసింది. ఇక బంగ్లా క్రికెటర్లతో కలిసి ఎన్నో ప్రకటనల్లో నటించింది. బంగ్లాదేశ్‌లోని గాజీ టీవీలో ప్రపంచకప్ అప్ డేట్స్ ఇవ్వనుంది. జైనబ్ అబ్బాస్ పాకిస్తాన్లో పాపులర్ స్పోర్ట్స్ స్టార్ జైనబ్ అబ్బాస్. సోషల్ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉంటుంది. ఈ మధ్యే పాక్ స్టార్ బ్యాట్స్‌మన్ బాబర్ అజామ్ ఆగ్రహానికి గురైంది. పాకిస్తాన్ టీ20 లీగ్‌కు వ్యాఖ్యాతగా పనిచేసి క్రికెట్ ఫ్యాన్స్‌ను అలరించింది. ప్రపంచకప్‌లో పాకిస్తాన్ మ్యాచ్‌లకు సంబంధించిన సమాచారాన్ని క్రికెట్ అభిమానులకు అందిస్తుంది. -
‘తొలిసారి భర్త ఫొటో పెట్టింది; నిజమా?’
‘క్షమించండి. నాకు తెలిసి కింగ్స్ ఎలెవన్, రాజస్తాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చూడలేదనుకుంటా. మరేం పర్లేదు. #MarutiSuzukiCricketLiveలో హెచ్డీలో మ్యాచులు వీక్షించండి. ఓకేనా’ అంటూ తన భర్త, క్రికెటర్ స్టువర్ట్ బిన్నీని ట్రోల్ చేసిన వారికి గట్టి కౌంటర్ ఇచ్చారు స్పోర్ట్స్ ప్రజెంటర్ మయంతి లాంగర్. ఐపీఎల్ సీజన్ 12లో భాగంగా మోహాలీలో పంజాబ్‌తో జరిగిన మ్యాచులో రాజస్తాన్ రాయల్స్ 12 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. అయితే మంగళవారం నాటి ఈ మ్యాచ్ ద్వారా రాయల్స్ ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ ఈ సీజన్లో తొలిసారిగా మైదానంలో అడుగుపెట్టాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తరుణంలో (11 బంతుల్లో 33 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించి గౌరవప్రదమైన స్కోరు నమోదు చేయడంలో తనవంతు పాత్ర పోషించాడు. చదవండి : (సొంతగడ్డపై పంజాబ్ ప్రతాపం) అయితే ఇన్నాళ్లుగా బిన్నీ ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడంతో.. కొంతమంది నెటిజన్లు... ‘ స్టువర్ట్ ఎక్కడ మయంతి. అసలు తను ఆడతాడా’ అంటూ వ్యంగాస్త్రాలు సంధించారు. మరికొంత మంది బిన్నీ ప్రదర్శనను పొగుడుతూనే.. ‘ఈనాటి ఇన్నింగ్స్ కారణంగా మొట్ట మొదటిసారి మయంతి సోలో డీపీ తీసేసి.. భర్తతో ఉన్న ఫొటో పెట్టింది’ అంటూ ఆమెను ట్రోల్ చేశారు. ఇందుకు స్పందించిన మయంతి.. ‘ నిజమా? మీ దగ్గర నా నెంబర్ లేదనుకుంటా. నిజానికి నేను డీపీగా ఏ ఫొటో పెట్టానో మీకు తెలిసే అవకాశం లేదు. అయితే ఇంత మంచి ఫొటోను వెదికిపెట్టినందుకు మీకు ధన్యవాదాలు’ అంటూ వాళ్ల నోర్లు మూయించారు. కాగా ప్రస్తుతం ఇండియాలో ఉన్న గొప్ప స్పోర్ట్స్ ప్రజెంటర్లలో ఒకరిగా మయంతి కీర్తి గడించారు. 2012లో టీమిండియా ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీని పెళ్లాడారు. ప్రస్తుతం భార్యాభర్తలిద్దరు తమ తమ ప్రొఫెషన్లలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నప్పటికీ.. భర్త కంటే కూడా మయంతినే ఓ మెట్టు పైన ఉందని, అందుకే బిన్నీని ఆమె లెక్కచేయదంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో మయంతి కూడా వారికి గట్టిగా సమాధానమిస్తూనే యాంకర్‌గా దూసుకుపోతున్నారు. Sorry that you seemed to have missed #KXIPvRR on @StarSportsIndia you can join us on #MarutiSuzukiCricketLive on SS 1/2/Hindi/HD and of course @hotstartweets Cheers 👍🏼 https://t.co/Jv59z4xOXZ — Mayanti Langer Binny (@MayantiLanger_B) April 16, 2019 Really Navneet? Considering you don’t have my number you don’t know what the picture actually is 🤭 but thanks a ton for digging out this one, it’s a super pic 👍🏼 https://t.co/kgmgm6qBhT — Mayanti Langer Binny (@MayantiLanger_B) April 16, 2019 -
ఐపీఎల్: ఆమెనే బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ స్టార్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్‌లు చూసేవారికి ఆమె సుపరిచితురాలు. ప్రతిరోజు ప్రత్యర్థి జట్లు మారతాయి. కానీ మ్యాచ్ ఉంటే చాలు ఆమె స్టేడియంలో ప్రత్యక్షమవుతారు. ఆమె మరెవరో కాదు స్పోర్ట్స్ జర్నలిస్ట్, కామెంటెటర్ మయాంతి లాంగర్. టీమిండియా క్రికెటర్ స్టూవర్ట్ బిన్నీ భార్యగా తొలుత ప్రపంచం ఆమెను గుర్తించినా, ప్రస్తుతం తన ప్రొఫెషనల్ వర్క్‌తో ఆమె ఆకట్టుకుంటున్నారు. మయాంతిపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, కామెంటెటర్ డీన్ జోన్స్ ట్విటర్ వేదికగా ప్రశంసల జల్లులు కురిపించారు. ఐపీఎల్లో తాను ఎంతో మంది గొప్ప వ్యక్తులతో కలిసి పనిచేయడాన్ని ఆస్వాదించాను. కానీ అందరిలోనూ మయాంతి లాంగర్ బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ స్టార్ అని కితాబిచ్చారు. ఆమె తన వృత్తిపట్ల ఎంతో నిబద్దతతో ఉంటారని, గ్రేట్ జాబ్ మయాంతి అని ట్వీట్లో రాసుకొచ్చారు మాజీ క్రికెటర్ డీన్ జోన్స్. ఐపీఎల్లో మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగే చర్చలో ఆమె తన విలువైన అభిప్రాయాలను షేర్ చేసుకోవడం చూస్తూనే ఉంటాం. యాంకర్, కామెంటెటర్ మయాంతి లాంగర్ భర్తే క్రికెటర్ బిన్నీ అంటూ నెటిజన్లు తరచుగా కామెంట్లు చేయడం తెలిసిందే. As much as I have loved working with many of the greats on this @IPL. Our BEST and BIGGEST STAR is @MayantiLanger_B !!! She is soooo good at her job. And all of us at @StarSportsIndia #kentcricketlive & #SelectDugout are in awe of how good she is! Great job Mayanti 👏🏻👏🏻👏🏻 pic.twitter.com/8Z5ukO6vUW — Dean Jones (@ProfDeano) 26 May 2018 -
వైఫై పాస్వర్డ్ ప్లీస్..
సాక్షి, న్యూఢిల్లీ : ఇండియా-న్యూజిలాండ్ మధ్య కాన్పూర్‌లో జరిగిన మూడో వన్డే సందర్భంగా క్రికెట్ వ్యాఖ్యాత మయాంతి లాంగర్, క్రికెటర్ సురేష్ రైనా మధ్య ఆసక్తికర సంభాషణ సాగింది. దీనిని మయాంతి స్క్రీన్ షాట్ తీసి ట్విటర్లో పోస్ట్ చేశారు. కాన్పూర్ వన్డే జరుగుతున్న సమయంలో మయాంతి తన మొబైల్ ఫోన్లో వైఫై నెట్వర్క్స్ చూస్తున్న సమయంలో అందులో సురేష్ రైనా అని కనిపించింది. వెంటనే మయాంతి.. సురేష్ రైనాకు వైఫై పాస్వర్డ్ చెప్పాలంటూ మెసేజ్ పెట్టింది. స్క్రీన్ షాట్ ఫొటోల్లో థర్డ్ అంఫైర్ వైఫై కూడా కనిపించడం విశేషం. మయాంతి ట్వీట్‌కు సురైష్ రైనా స్పందించలేదు.. అయితే క్రికెట్ అభిమానులు మాత్రం విపరీతంగా ప్రతిస్పందించారు. ఒకరైతే.. ధోని పాస్వర్డ్ కోసం ట్రై చేయమంటే.. మరొకరు.. రైనా దగ్గరి వ్యక్తిని అడగండి అని, ఇంకొకరు అయితే.. నో షార్ట్స్ బాల్స్ ప్లీస్ అంటూ రీ ట్వీట్ చేశారు. సురేష్ రైనా టీమిండియాకు దూరమై చాలా కాలమైంది. మళ్లీ జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు ఈ మధ్యే సురేష్ రైనా తెలిపారు. Hi 🙋🏻 @ImRaina possible to get the password to your network? 😃 #Kanpur #IndvNZ pic.twitter.com/z0FUJ31tLp — Mayanti Langer Binny (@MayantiLanger_B) 29 October 2017 -
క్రికెటర్ ను ఇంటర్వ్యూ చేసిన భార్య!
-
క్రికెటర్ ను ఇంటర్వ్యూ చేసిన భార్య!
బెంగళూరు: కర్ణాటక ప్రీమియర్ లీగ్ ఆరంభమై వారం రోజులైనప్పటికీ అక్కడ అదనపు ఆకర్షణ అనేది కరువైంది..ప్రధానంగా స్టార్ ఆటగాళ్లైన కేఎల్ రాహుల్, మనీష్ పాండేలు అంతర్జాతీయ మ్యాచ్‌లో బిజీగా ఉండటంతో కర్ణాటక ప్రీమియర్ లీగ్ కు కళ తప్పింది. కాకపోతే, శుక్రవారం చోటు చేసుకున్న అరుదైన సంఘటనతో ఈ లీగ్ కు కాస్త జోష్ వచ్చింది. ఇందుకు కారణం ఆల్ రౌండర్ స్టువర్ట్ బిన్నీ, అతని భార్య మయాంతి లాంగర్లే. కర్ణాటక ప్రీమియర్ లీగ్ లో బెలగావీ పాంథర్స్ తరపున ఆడుతున్న స్టువర్ట్ బిన్నీని ఇంటర్వ్చూ చేసే అవకాశం స్పోర్ట్స్ ప్రెజెంటర్ గా ఉన్న మయాంతికి వచ్చింది. బ్రాడ్ కాస్టింగ్ కవరేజ్ లో భాగంగా ఆ ఈవెంట్ కు హాజరైన మయాంతి.. భర్త స్టువర్ట్ బిన్నీని ఇంటర్వ్యూ చేయడం అభిమానుల్లో మజాను తీసుకొచ్చింది. వివరాల్లోకి వెళితే.. నిన్న బెంగాళూరు బ్లాస్టర్స్ తో జరిగిన మ్యాచ్ లో స్టువర్ట్ బిన్నీ 46 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 87 పరుగులు నమోదు చేశాడు. దాంతో తొలుత బ్యాటింగ్ చేసిన బెలగావీ పాంథర్స్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లకు 192 పరుగులు చేసింది. ఆపై బెంగళూరు బ్లాస్టర్స్ 19.3 ఓవర్లలో169 పరుగులు చేసింది. ఇక్కడ స్టువర్ట్ బిన్నీ రెండు వికెట్లతో్ రాణించారు. దాంతో పాంథర్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన భర్త స్టువర్ట్ బిన్నీని ఇంటర్య్వూ చేసే అరుదైన అవకాశం మయాంతికి వచ్చింది. ఇలా భర్తను భార్య ఇంటర్వ్యూ చేయడంపై ట్విట్టర్ లో ప్రశంసల వర్షం కురుస్తోంది. స్టువర్ట్ బిన్నీ రాణించడానికి భార్య మయాంతి అక్కడకు రావడమేనని ఒకరు అభిప్రాయపడగా, భర్తను ఇంటర్య్యూ చేయడం అత్యున్నతమైన గిఫ్ట్ అంటూ మరొకరు ట్వీట్ చేశారు. -
మీ పని చూసుకోండి!
విమర్శకులకు మయంతి ఘాటు జవాబు బెంగళూరు: ఒక ఆటగాడు విఫలమైనప్పుడు అతడిని కాకుండా ‘దురభిమానులు’ అతడి వెనుక ఉన్న అమ్మాయిని సోషల్ మీడియాలో ఆడిపోసుకోవడం ఇటీవల తరచూ కనిపిస్తోంది. కోహ్లి బాగా ఆడని రోజు అనుష్క శర్మపై అంతా విరుచుకు పడ్డారు. ఇప్పుడు స్టువర్ట్ బిన్నీ వైఫల్యంపై అతని భార్య మయంతి లంగర్‌కు ఇదే అనుభవం ఎదురైంది. విండీస్‌తో జరిగిన తొలి టి20లో ఒకే ఓవర్లో స్టువర్ట్ 32 పరుగులిచ్చిన తర్వాత ఇది మొదలైంది. గతంలో కూడా మయంతి అందచందాలపై చాలా మంది పలు వ్యాఖ్యలు చేసినా... ట్విట్టర్లో ఈ సారి బిన్నీ ఆటకు ఆమెను బాధ్యులను చేయడం మయంతికి ఆగ్రహం తెప్పించింది. ఏం చేసి అతడిని భారత జట్టులో ఉంచుతున్నావని కొందరంటే, వెంటనే విడాకులు తీసుకొమ్మని ఇంకొందరు వ్యాఖ్యానించారు. అసలు ఆత్మహత్య చేసుకోలేకపోయావా అని కూడా మయంతిని అడిగేశారు! చివరకు దీనిపై మయంతి స్పందించింది. ‘ఆత్మహత్య చేసుకోమని చెప్పడం చూస్తే సిగ్గుగా అనిపిస్తోంది. విడాకుల గురించి మాట్లాడుతున్నారు. మీ జీవితంలో అలాంటిది జరగకుండా మీకు తగిన ప్రేమాభిమానాలు దక్కాలని కోరుకుంటున్నా. మమ్మల్ని విమర్శించడంలో మీకు చాలా ఆనందం లభిస్తుందని అనిపిస్తోంది. నేను 18 ఏళ్ల వయసునుంచి సంపాదిస్తున్నాను. డబ్బు కోసం బిన్నీని చేసుకున్నానని అనే బదులు వెళ్లి ఒక మంచి ఉద్యోగం చూసుకోండి. మీ కుటుంబానికి ఉపయోగపడుతుంది’ అని లంగర్ సమాధానం ఇచ్చింది.