IPL 2023: Mayanti Langer Uncomfortable During IPL Show Hot Or Not Fans Slam Broadcasters - Sakshi
Sakshi News home page

IPL 2023: ఇది క్రికెట్‌ షోనా? లేదంటే.. అర్ధ నగ్న ఫొటోలు చూపిస్తూ! బీసీసీఐ బాస్‌ కోడలు సహా..

Published Fri, May 19 2023 3:33 PM | Last Updated on Fri, May 19 2023 4:06 PM

Mayanti Langer Uncomfortable IPL Show Hot Or Not Fans Slam Broadcasters - Sakshi

షోలో ఇబ్బంది పడ్డ మయంతి లాంగర్‌ (PC: IPL/Star Sports)

IPL 2023- SRH Vs RCB: ఐపీఎల్‌-2023 బ్రాడ్‌కాస్టర్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ నిర్వాహకులపై నెటిజన్లు మండిపడుతున్నారు. పిచ్చి పిచ్చి షోలతో మహిళా యాంకర్లను ఇబ్బంది పెట్టడం సరికాదని హితవు పలుకుతున్నారు. క్రికెట్‌, క్రికెటర్ల గురించి మాట్లాడటానికి ఎన్నో విషయాలు ఉన్నాయని.. ఆట గురించి కాకుండా అర్ధ నగ్న ఫొటోలు చూపిస్తూ ప్రశ్నలు అడగటం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్లే ఆఫ్స్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో గురువారం తలపడిన విషయం తెలిసిందే. ఉప్పల్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ 8 వికెట్ల తేడాతో గెలుపొంది పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది.

బీసీసీఐ బాస్‌ కోడలు సహా
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌ ఆరంభానికి ముందు ‘‘హాట్‌ ఆర్‌ నాట్‌’’ పేరిట స్టార్‌ స్పోర్ట్స్‌లో ఓ షో నిర్వహించారు. ప్రముఖ స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌, బీసీసీఐ బాస్‌ రోజర్‌ బిన్నీ కోడలు మయంతి లాంగర్‌ సహా మరో ముగ్గురు యాంకర్లు ఈ షోలో పాల్గొన్నారు. 

బాలీవుడ్‌ నటుడు విద్యుత్‌ జమాల్‌తో కలిసి సురేన్‌ సుందరం నిర్వహించిన ఈ షోలో పురుష క్రికెటర్ల అర్ధ నగ్న ఫొటోలు చూపిస్తూ ఎవరు హాట్‌గా ఉన్నారో చెప్పాలంటూ అడిగారు. టీమిండియా స్టార్లు విరాట్‌ కోహ్లి, శుబ్‌మన్‌ గిల్‌, వెస్టిండీస్‌ ప్లేయర్‌ ఆండ్రీ రసెల్‌ తదితరులు షర్టు లేకుండా నీళ్లలో ఉన్న ఫొటోలు స్క్రీన్‌ మీద చూపించారు.

ఇది క్రికెట్‌ షోనా? సిగ్గుండాలి!
మయంతి సహా మిగిలిన ముగ్గురు యాంకర్లు ఆ ఫొటోలు చూసేందుకు అసౌకర్యంగా ఫీలైనట్లు వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఇదే నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. ‘‘ఇది క్రికెట్‌ షోనా? లేదంటే మరేదైనానా? స్టార్‌ స్పోర్ట్స్‌' రోజురోజుకీ దిగజారి పోతోంది. షో నడిపించడానికి ఇంతకంటే మంచి కంటెంటే దొరకలేదా?’’ అని ఏకిపారేస్తున్నారు. 

‘‘సీనియర్‌, ఓ బిడ్డకు తల్లి అయిన మయంతి లాంటి సీనియర్లకు కూర్చో బెట్టి ఇలాంటి ఫొటోలు చూపిస్తూ ఆ క్వశ్చన్లు అడగటానికి సిగ్గు లేదా?’’ అంటూ ఫైర్ అవుతున్నారు. ఇదిలా ఉంటే సన్‌రైజర్స్‌- ఆర్సీబీ మధ్య మ్యాచ్‌ సందర్భంగా ఐపీఎల్‌లో ఏకంగా రెండు సెంచరీలు నమోదైన విషయం తెలిసిందే. రైజర్స్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ 104 పరుగులు చేయగా.. ఆర్సీబీ స్టార్‌ కోహ్లి 100 పరుగులు సాధించాడు.

చదవండి: రూ. 8 కోట్లు పెడితే మధ్యలోనే వదిలివెళ్లాడు.. ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement