రోహిత్‌ను ఊరిస్తున్న అరుదైన రికార్డు! | IPL 2026: Rohit Sharma Eye on Virat Kohli Record Against Delhi Capitals | Sakshi
Sakshi News home page

IPL 2026: రోహిత్‌ను ఊరిస్తున్న అరుదైన రికార్డు!

Apr 4 2026 1:50 PM | Updated on Apr 4 2026 3:18 PM

IPL 2026: Rohit Sharma Eye on Virat Kohli Record Against Delhi Capitals

ఐపీఎల్ 2026 సీజ‌న్ శ‌నివారం డ‌బుల్ హెడ‌ర్ మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో మొద‌టి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, ముంబై ఇండియ‌న్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేప‌థ్యంలో ముంబై ఇండియ‌న్స్ సీనియ‌ర్ బ్యాట‌ర్ రోహిత్ శ‌ర్మను అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఢిల్లీ క్యాపిట‌ల్స్‌పై రోహిత్ శ‌ర్మ ఇప్ప‌టివ‌ర‌కు 37 మ్యాచ్‌ల్లో 1057 ప‌రుగులు సాధించాడు. 

కాగా రోహిత్ కంటే ముందు కోహ్లీ ఉన్నాడు. ఈ ఆర్సీబీ స్టార్ బ్యాట‌ర్ 30 ఇన్నింగ్స్‌ల్లో 1,130 ప‌రుగులు సాధించాడు. కోహ్లీ కంటే 73 ప‌రుగులు వెనుక‌బ‌డి ఉన్న రోహిత్ ఢిల్లీతో మ్యాచ్‌లోనే ఆ ఫీట్‌ను సాధిస్తాడా లేదా అనేది చూడాలి. ఈ సీజ‌న్‌ను రోహిత్ శ‌ర్మ మంచి ఈజ్‌తో ప్రారంభించాడు. 

కేకేఆర్‌తో జ‌రిగిన తొలి మ్యాచ్‌లోనే రోహిత్ 38 బంతుల్లోనే 78 ప‌రుగులు సాధించాడు. అత‌డి ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, ఆరు సిక్స‌ర్లు ఉన్నాయి. కేకేఆర్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ ఆరు వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని అందుకుంది. 

ఇక ఇవాళ్టి మ్యాచ్‌లో ఢిల్లీ  క్యాపిట‌ల్స్‌తో పోలిస్తే ముంబై ఇండియ‌న్స్ ఫేవ‌రెట్‌గా క‌నిపిస్తోంది. ఐదుసార్లు చాంపియ‌న్ అయిన ముంబై 21-16 విజ‌యాల‌తో ఢిల్లీపై ఆధిక్య‌త‌ను క‌లిగి ఉంది. గ‌త ఐదు మ్యాచ్‌ల్లో ఢిల్లీపై ముంబై నాలుగు విజ‌యాలు సాధించ‌డం విశేషం.

చదవండి: ‘నువ్వొక అద్భుతం.. ప్రపంచం నీ పాదాల చెంతకు’

Advertisement
 
Advertisement
Advertisement