Tanya
-
క్యూట్ అందాలతో అలరిస్తోన్న తాన్య రవిచంద్రన్ (ఫోటోలు)
-
ఓటీటీకి వచ్చేస్తోన్న రొమాంటిక్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అర్జున్ దాస్, తాన్య రవిచంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ చిత్రం 'రసవతి'. ఈ చిత్రం మే 10న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు శాంతకుమార్ దర్శకత్వం వహించారు. అయితే బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది.మిస్టరీ థ్రిల్లర్‌గా వచ్చిన రసవతి ఏకంగా మూడు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈనెల 21 నుంచి అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఆహా (తమిళం), సింప్లీ సౌత్‌లోనూ స్ట్రీమింగ్ కానున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఓవర్ సీస్ ఫ్యాన్స్ కోసమే సింప్లీసౌత్లోనూ స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ మేరకు రసవతి పోస్టర్‌ను మేకర్స్ పంచుకున్నారు. ఈ చిత్రంలో సదాశివగా అర్జున్ దాస్, సూర్యగా తాన్య రవిచంద్రన్ తమ పాత్రల్లో మెప్పించారు.ఈ చిత్రం కొడైకెనాల్ నేపథ్యంలో సాగుతుంది. ఓ గ్రామంలో వైద్యం చేసే సదాశివ అనే యువకుడి జీవితం ఆధారంగా తెరకెక్కించారు. కాగా.. ఇందులో నిఖిలా శంకర్, దీప, అరుల్ జోతి, రిషికాంత్, సుజాత శివకుమార్, రమ్య సుబ్రమణియన్, జిఎమ్ సుందర్, రేష్మా వెంకటేష్, సుజిత్ శంకర్ కీలక పాత్రలు పోషించారు. Rasavathi will be streaming on Amazon prime, Aha and simply south ( in simply south excluding India) from June 21st. #Rasavathi @iam_arjundas @actortanya @Reshmavenkat01 @actorramya @GMSundar_ @MusicThaman @EditorSabu @SPremChandra1 @minu_jayebal @dancersatz @SureshChandraa… pic.twitter.com/f5ElM8y7O0— Santhakumar (@Santhakumar_Dir) June 19, 2024 -
Tanya Ghavri: స్టయిలింగ్‌లో తనతో పోటీ అంటే.. కొంచెం కష్టమే!
స్టయిలింగ్‌లో తాన్యా ఘావ్రీతో పోటీ అంటే కొంచెం కష్టమే! శాంపుల్‌కి జాన్వీ కపూర్, అనన్య పాండేలను చూస్తే ఆ విషయం అర్థమైపోతుంది! అందుకే తాన్యాను ఇండియన్ స్టయిలింగ్ ఇండస్ట్రీ డ్రైవింగ్ ఫోర్స్‌గా కొనియాడుతుంటారు.తాన్యా ఘావ్రీ.. మాజీ టెస్ట్ క్రికెటర్ కర్షణ్ ఘావ్రీ కూతురు. ముంబైలో పుట్టిపెరిగింది. ఇంటర్ అయిపోయాక.. చాలామంది విద్యార్థుల్లాగే తాన్యా కూడా చదువుల చౌరస్తాలో నిలబడిపోయింది అయోమయంగా.. ఏ దారిన వెళ్లాలో తెలియక! తన బలాబలాలను బేరీజువేసుకుందోసారి. తనకు క్రియేటివ్ బోన్ ఉన్నట్లు అర్థమైంది. అందుకే ఫ్యాషన్ వైపు మళ్లింది. న్యూయార్క్, పార్సన్స్ ఆఫ్ స్కూల్లో ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీ చేసింది.ఇండియా తిరిగొచ్చాక ఎస్ఎన్డీటీ (శ్రీమతి నాథీబాయీ దామోదర్ ఠాకర్సీ) యూనివర్సిటీలో దుస్తుల తయారీ డిజైన్‌కి దరఖాస్తు పెట్టుకుంది. ఆ కోర్స్ అయిపోగానే అవకాశాలు క్యూ కడతాయనే ఉద్దేశంతో! కానీ చదువైపోయిన రెండున్నరేళ్లకు వచ్చింది ఒక చాన్స్.. ‘ఆయశా’ అనే హిందీ సినిమాకు అసిస్టెంట్ స్టయిలిస్ట్‌గా! ఆ చిత్రానికి స్టయిలిస్ట్ పర్నియా కురేశీ. ఆమెకు సహకారం అందించడమే తాన్యా పని. దానికి ముందు ఆ రెండున్నరేళ్లు.. ఫ్యాషన్ మ్యాగజైన్ వోగ్లో, స్టయిలిస్ట్‌లు అనాయితా ష్రాఫ్, అర్చనా వాలావల్కర్లాంటి వాళ్ల దగ్గర ఇంటర్న్‌షిప్ చేసింది.ఆమె స్టయిలింగ్ జర్నీ మొదలైంది మాత్రం ‘ఆయశా’ సినిమాతోనే! అందులోని కథానాయిక సోనమ్ కపూర్‌కి తాన్యా పనితనం నచ్చింది. తన పర్సనల్ స్టయిలిస్ట్‌గా అపాయింట్ చేసుకుంది. తాన్యా స్టయిలింగ్‌తో సోనమ్ ఫ్యాషన్ ఐకాన్ అయింది. అది గమనించిన ఐశ్వర్యా రాయ్ బచన్.. తనకూ స్టయిలింగ్ చేసిపెట్టమని తాన్యాను కోరింది. ఆ అపురూప సౌందర్యరాశికి అప్ టు డేట్ ఫ్యాషన్‌ని టచప్ చేసి.. అక్కాచెల్లెళ్లు కరిష్మా, కరీనా కపూర్ల దృష్టిలో పడింది తాన్యా. వాళ్ల నుంచీ సేమ్ రిక్వెస్ట్ అందుకుంది. ఫిజిక్‌ని బట్టే ఫ్యాషన్, సౌకర్యాన్ని బట్టే స్టయిల్ అని నమ్మే తాన్యా ఆ సూత్రాన్నే అప్లయ్ చేసి కపూర్ సిస్టర్స్ అపియరెన్స్నే మార్చేసింది.వాళ్ల వయసులో చెరో పదేళ్లు తగ్గించేసింది. ఆశ్చర్యపోయింది కరిష్మా, కరీనాల ఆప్తురాలు మలైకా అరోరా! సీక్రేట్ ఏంటని అడిగింది. తాన్యా అడ్రస్ చెప్పారు వాళ్లు. వెళ్లి వాలింది మలైకా! తాన్యాకు మారు మాట్లాడే చాన్స్ ఇవ్వకుండా తన వెంట రమ్మంది. అప్పటి నుంచి మలైకాకూ స్టయిలింగ్ సర్వీస్ ఇవ్వడం మొదలుపెట్టింది తాన్యా. ఆ డిమాండ్‌ను కత్రినా కైఫ్ కూడా గుర్తించింది. ఉఫ్.. ఇలా చెప్పుకుంటూ పోతే మాధురీ దీక్షిత్, సారా అలీఖాన్, జాన్వీ కపూర్, అనన్యా పాండే, దిశా పాట్నీ, శ్రద్ధా కపూర్, కృతి సనన్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, ఫ్రీదా పింటోలూ చేరి ఆ జాబితా పెరిగిపోతుంది.తాను ఎస్ఎన్డీటీలో జాయిన్ అయ్యేముందు ఊహించుకున్నట్టే తనను అవకాశాల వెల్లువ ముంచెత్తుతోంది. ఈ అచీవ్మెంట్ వయసు పదిహేనేళ్లు. స్టార్స్‌కి మెరుగులు అద్దుతూనే అంట్రప్రెన్యూర్‌షిప్ గురించీ ఆలోచించింది. పెళ్లిళ్లు, పేరంటాలు, పండగలు, పబ్బాలకు డిజైనర్ దుస్తులను అందించే ‘ధూమ్ ధామ్ వెడ్డింగ్స్’ అనే కంపెనీనీ స్థాపించి అంట్రప్రెన్యూర్గానూ మారింది."నా వర్క్‌ని రొటీన్‌గా ఎప్పుడూ ఫీలవను. ఏ రోజుకు ఆ రోజు కొత్తగా ఫీల్డ్‌లోకి వచ్చినట్టు భావిస్తాను. అందుకే వర్క్‌ని బాగా ఎంజాయ్ చేస్తాను. నేనెప్పటికీ మరచిపోలేని ఈవెంట్.. ఆస్కార్ పార్టీ కోసం ఫ్రీదా పింటోకి స్టయిల్ చేయడం. నా పర్సనల్ స్టయిల్ విషయానికి వస్తే జీన్స్, స్కర్ట్స్, షర్ట్స్, బ్లౌజెస్.. ఏ డ్రెస్ అయినా నాకు ఓకే. అయితే ఏదైనా ఓవర్ సైజ్డ్ స్టఫ్నే ఇష్టపడతా. నేను షార్ట్‌గా ఉంటాను కాబట్టి.. షార్ట్ డ్రెస్‌లు వేసుకుని ఓవర్ సైజ్డ్ షర్ట్‌తో కానీ జాకెట్‌తో కానీ నా హైట్‌ని బ్యాలెన్స్ చేస్తా"! – తాన్యా ఘావ్రీ -
Tanya Ravichandran Photos: క్యూట్ క్యూట్ అందాలతో అలరిస్తోన్న తాన్య రవిచంద్రన్…(ఫొటోలు)
-
అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా?.. యంగ్ హీరోయిన్‌కు ఉహించని ప్రశ్న!
ఒక్కోసారి హీరోయిన్లకు విచిత్రమైన సంఘటనలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా అభిమానుల నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు ఏం చెప్పాలో తెలియని అయోమయ పరిస్థితి ఉంటుంది. తాజాగా నటి తాన్యా రవిచంద్రన్‌కు అలాంటి పరిస్థితే ఎదురైంది. ప్రఖ్యాత నటుడు రవిచంద్రన్ మనవరాలైన తాన్యా రవిచంద్రన్.. ఆయన వారసత్వాన్ని తీసుకుని సినీ రంగప్రవేశం చేశారు. ఆమె 2017లో భలే వెళైదేవా అనే చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమయ్యారు. శశికుమార్ కథానాయకుడిగా నటించిన ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు. అయినప్పటికీ తాన్నా రవిచంద్రన్‌కు అవకాశాలు తలుపు తడుతూనే ఉన్నాయి. అలా బృందావనం, కరుప్పన్, నెంజుక్కు నీతి, మాయోన్, అకిలన్ వంటి చిత్రాల్లో నటించి తనకుంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.తాజాగా ఆమె రసవాది అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. ఈ సందర్భంగా తాన్యా రవిచంద్రన్ ఓ భేటీలో అభిమానులతో ముచ్చటించారు. వారితో తన చిత్రాల గురించి.. తాను నటించాలనుకుంటున్న పాత్రల గురించి వివరించారు. అదే సమయంలో తనకు ఎదురైన విచిత్రమైన ప్రశ్న గురించి చెప్పారు. ఒకసారి అభిమాని ఒకరు అనూహ్యంగా అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగారన్నారు. అతను అడిగిన విధానం తనకు అర్థం కాలేదన్నారు. అక్కా అన్నాడు.. పెళ్లి చేసుకుంటావా? అని సంబంధమే లేకుండా అడిగిన అతని ప్రశ్నకు బదులేం చెప్పాల్లో తనకు అర్థం కాలేదన్నారు. ఇలాంటి ఫన్నీ సంఘటనలు గుర్తొస్తే నవ్వొస్తుందని తాన్యా రవిచంద్రన్ పేర్కొన్నారు. కాగా రసవాది చిత్రం తనకు మంచి పేరు తెచ్చి పెడుతుందనే నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేశారు. -
Tanya Sharma: వియత్నాంలో హిందీ బుల్లితెర నటి సమ్మర్ వెకేషన్ (ఫోటోలు)
-
Rescue operation Specialist: ప్రమాదమా..? టాన్యా ఉందిగా..!
కాస్త ఖాళీ సమయం దొరికినప్పుడు... సెలవుల్లో స్నేహితులతో కలసి ట్రెక్కింగ్‌కు వెళ్తుంటారు చాలామంది యువతీ యువకులు. అయితే అనుకోకుండా ఏదైనా ప్రమాదంలో చిక్కుకుంటే వారిని ఎవరు కాపాడతారు? అందుకే అలాంటి వారికి అండగా ఉంటోంది టాన్యా. అవును, సరదాగా గడపాల్సిన వయసులో ఇతరుల ప్రాణాలను రక్షిస్తోంది టాన్యా కోలి. ఐదోఏటి నుంచే కొండలు ఎక్కడం నేర్చుకుని, టీనేజ్‌లోకి వచ్చినప్పటినుంచి ఏకంగా రెస్క్యూ టీమ్‌ను నిర్వహిస్తూ ఎంతోమందిని ఆపదల నుంచి బయటపడేసింది. పెద్ద పెద్ద్ద కొండలను అవలీలగా ఎక్కేస్తూ, మరొకరికి సాయంగా నిలబడుతూ.. నేటి యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తోంది టాన్యా. నాసిక్‌కు చెందిన టాన్యా కోలి ఐదేళ్ల వయసు నుంచే పర్వతాలు ఎక్కడం నేర్చుకోవడం మొదలు పెట్టింది. టాన్యా తండ్రి దయానంద్ కోలి నాసిక్ క్లైంబర్స్ అండ్ రెస్క్యూయర్స్ అసోసియేషన్‌లో పనిచేస్తుండడంతో తరచూ ట్రెక్కింగ్, రెస్క్యూ అనే పదాలను తండ్రి నోట వెంట వినేది. టాన్యాకూ ట్రెక్కింగ్‌పైన ఆసక్తి ఏర్పడడంతో తండ్రి దగ్గర ట్రెక్కింగ్ ఎలా చేయాలో నేర్చుకుంది. అలా ట్రెక్కర్‌గా మారిన టాన్యా, రెస్క్యూటీమ్ కలిసి ఎంతోమందిని ప్రమాదాల నుంచి బయటపడేస్తోంది. తండ్రి దగ్గర నేర్చుకున్న ట్రెక్కింగ్ మెళకువలతోపాటు, హిమాలయాల్లో ప్రత్యేకమైన శిక్షణ కూడా తీసుకుంది. ప్రమాదంలో ఉన్నవారిని కాపాడడంతోపాటు, పర్వతారోహకులకు ట్రెక్కింగ్‌లో శిక్షణ ఇస్తోంది టాన్యా. పర్వతాన్ని అధిరోహించేటప్పుడు జరిగే ప్రమాదాలను ఎలా ఎదుర్కోవాలో కూడా నేర్పిస్తుంది. టాన్యా దగ్గర శిక్షణ తీసుకుంటున్నవారిలో మహారాష్ట్ర ΄ోలీసు అకాడమీ ట్రైనీలు కూడా ఉన్నారు. ప్రతిసారీ తను అందుబాటులో ఉండడం కష్టం కాబట్టి ఇతరులకు నేర్పించడం ద్వారా ప్రమాద సమయంలో వారిని వారే కాపాడుకోవడంతోపాటు, ఇతరులను కూడా కాపాడగలరు. అందుకే మరింతమందికి రెస్క్యూలో శిక్షణ ఇస్తున్నాను అని టాన్యా చెబుతోంది. ‘‘ప్రమాదంలో ఉన్నారు, కాపాడాలి అని సమాచారం తెలిస్తే వెంటనే బయలుదేరతాం. అది అర్ధరాత్రి అయినా ఫస్ట్ ఎయిడ్ కిట్‌తో సిద్ధంగా ఉంటాం. ట్రెకింగ్ చేసేవారిని, ప్రమాదంలో ఉన్న వ్యక్తుల్ని రక్షించడం థ్రిల్లింగ్ ఇచ్చేదే అయినప్పటికీ చాలా సవాళ్లతో కూడుకున్నది. సమస్యలు ఉన్నప్పటికీ అవతలి వారిని ప్రమాదం నుంచి కాపాడగలిగామన్న సంతృప్తి ముందు ఆ సమస్యలు, సవాళ్లు చిన్నబోవలసిందే’’ అని చెబుతోంది తాన్యా. -
నయనతార చెల్లెలు తాన్యా రవిచంద్రన్ (ఫొటోలు)
-
రోడ్డు ప్రమాదంలో హీరోయిన్ మేనకోడలు దుర్మరణం.. ఎమోషనల్‌గా పోస్ట్
Dia Mirza Niece Tanya Kakade Dies At Car Accident In Hyderabad: ప్రముఖ మోడల్, హీరోయిన్, నిర్మాత దియా మీర్జా పుట్టింది హైదరాబాద్‌లో అయిన బాలీవుడ్లో పాపులారిటీ సంపాదించుకుంది. మిస్ ఆసియా పసిఫిక్ 2000 టైటిల్ గెలుచుకున్న దియా.. సంజు, తప్పడ్, కుర్బాన్, లగే రహో మున్నాభాయ్ వంటి చిత్రాలతో పేరు తెచ్చుకుంది. ఇటీవల టాలీవుడ్ కింగ్ నాగార్జున 'వైల్డ్ డాగ్' చిత్రంలో కూడా నటించింది దియా మీర్జా. అయితే దియా మీర్జా కుటుంబానికి సోమవారం (ఆగస్టు 1) ఎంతో విషాదకరమైంది. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కారు ప్రమాదంలో దియా మీర్జా మేనకోడలు తాన్యా కక్డే మృతిచెందింది. ఆమె మరణవార్తను తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ నోట్ రాసుకొచ్చంది దియా. 'నా కోడలు. నా బిడ్డ. నా ప్రాణం ఇక లేదు. తను స్వర్గానికి వెళ్లింది. నువ్ ఎక్కడున్న శాంతి, ప్రేమను పొందుతావని ఆశీస్తున్నాను. నువ్ ఎప్పుడూ మా హృదయాల్లో చిరు నవ్వు నింపేదానివి. నీ ఆట, పాట, చిరునవ్వు ఎప్పుడూ మాతోనే ఉంటాయి. ఓం శాంతి' అని భావోద్వేగంగా రాసుకొచ్చింది దియా మీర్జా. చదవండి: హీరోయిన్‌కు ముద్దు పెట్టిన హీరో.. కంట్రోల్ చేసుకోవాలని ట్వీట్ నాగార్జునతో 'విక్రమ్' లాంటి సినిమా చేయాలని ఉంది: డైరెక్టర్ View this post on Instagram A post shared by Dia Mirza Rekhi (@diamirzaofficial) కాగా తాన్యా కక్డే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మరో నలుగురు స్నేహితులతో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టడంతో బోల్తా పడింది. ఆస్పుత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో తాన్యా మృతిచెందింది. ఆమె మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బ్యూటీషియన్‌గా పనిచేస్తున్న 25 ఏళ్ల తాన్యా కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహమ్మద్ ఫిరోజ్ ఖాన్ కుమార్తె. చదవండి: భార్య ప్రణతితో జూనియర్ ఎన్టీఆర్ కబుర్లు.. ఫొటో వైరల్ సల్లూ భాయ్‌కి లైసెన్స్డ్ తుపాకీ.. ఎలాంటిది అంటే ? #NewProfilePic pic.twitter.com/8syvsi22Mw — Mohammed Feroz Khan (@ferozkhaninc) June 6, 2022 View this post on Instagram A post shared by Tanya Kakde (@tanyaakakade) View this post on Instagram A post shared by Tanya Kakde (@tanyaakakade) View this post on Instagram A post shared by Tanya Kakde (@tanyaakakade) -
కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్ కుమార్తె తనియా మృతి
-
సరికొత్తగా మూవీ ప్రమోషన్స్.. 40 రోజులపాటు ప్రచార రథయాత్ర..
చెన్నై సినిమా: మాయోన్ చిత్ర ప్రచారానికి వినూత్నంగా(విష్ణుమూర్తి శేష శయనం ప్రతిభతో) రథయాత్రను ప్రారంభించారు. నటుడు సిబిరాజ్, తాన్యా జంటగా నటించిన చిత్రం మాయోన్. డబుల్ మీనింగ్ ప్రొడక్షన్ పతాకంపై అరుణ్ మొళి మాణిక్యం కథను అందించి నిర్మించిన చిత్రం ఇది. ఎన్.కిషోర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర ప్రచార యాత్ర విశేషపూజ, హోమాలతో ఆదివారం ప్రారంభమైంది. ఇక రామాపురంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రచార రథయాత్రను రాష్ట్రవ్యాప్తంగా 40 రోజులపాటు నిర్వహించనున్నట్లు నిర్మాత తెలిపారు. దైవం, సైన్స్, విగ్రహాల స్మగ్లింగ్, గుప్తనిధులవేట వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో సస్పెన్స్ థ్రిల్లర్ కథతో రూపొందించిన చిత్రం ఇదని దర్శకుడు తెలిపారు. డావిన్సీ కోడ్ వంటి చిత్రాలు తనకు చాలా ఇష్టమని, ఆ తరహా చిత్రాల్లో నటించాలనే కోరిక ఈ చిత్రంతో నెరవేరిందని నటుడు సిబిరాజ్ పేర్కొన్నారు. -
IPL 2022: అందాల యాంకర్ రీ ఎంట్రీ.. టాప్-5లో ఉన్నది వీళ్లే!
ఐపీఎల్లో భారీ హిట్టర్లు, స్టార్ బౌలర్లు, సిక్సర్ల వీరులకు వీరాభిమానులు ఉన్నట్లే యాంకర్లకు సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. ఈ జాబితాలో ముందు వరుసలో ఉంటారు ప్రజెంటర్ మయాంతి లాంగర్. అందంతో పాటు అపారమైన ప్రతిభ కలిగిన యాంకర్‌గా ఆమె మంచి పేరు సంపాదించుకున్నారు. కాగా టీమిండియా క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ సతీమణి అయిన మయాంతి 2020లో మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె కొంతకాలం పాటు ఐపీఎల్ వంటి మెగా ఈవెంట్లకు దూరమయ్యారు. అయితే, తాజా సమాచారం ప్రకారం ఐపీఎల్-2022 సీజన్‌తో రీ ఎంట్రీ ఇచ్చేందుకు మయాంతి సిద్ధమవుతున్నారట. మరోసారి యాంకర్ అవతారంలో మెరిసేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వార్తలపై స్పందించిన అభిమానులు మయాంతిని మిస్సవుతున్నామని, ఆమె రీ ఎంట్రీ ఇస్తే బాగుంటుందటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by mayantilangerbinny (@mayantilanger_b) ఈ విషయం కాసేపు పక్కన పెడితే.. మయాంతితో పాటు ఐపీఎల్లో తళుక్కుమంటున్న అందాల యాంకర్లు ఎవరో చూద్దామా! సంజనా గణేషన్ ప్రస్తుతం భారత్‌లో టాప్ స్పోర్ట్స్ యాంకర్లలో ఒకరిగా ఉన్నారు సంజనా. మయాంతి గైర్హాజరీలో ఎన్నో ఈవెంట్లకు ఆమె హోస్ట్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్ టోర్నీతో బిజీగా ఉన్నారు. ఈ మెగా ఈవెంట్ తర్వాత ఆమె ఐపీఎల్లో ఎంట్రీ ఇవ్వనున్నారు. కాగా సంజనా గతేడాది.. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను పెళ్లాడిన సంగతి తెలిసిందే. తాన్యా పురోహిత్ ఉత్తరాఖండ్‌కు చెందిన తాన్యా పురోహిత్ గర్వాల్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ సినిమా ఎన్‌హెచ్-10తో వెలుగులోకి వచ్చిన తాన్యా... క్రికెట్ షోలకు యాంకర్‌గా వ్యవహరించే అవకాశం దక్కించుకున్నారు. ఈ క్రమంలో ఐపీఎల్ ప్రజెంటర్‌గా ఆమె గుర్తింపు పొందారు. నెరోలీ మెడోస్ ఆస్ట్రేలియన్ జర్నలిస్టు అయిన నెరోలీ క్రికెట్‌తో పాటు ఫుట్‌బాల్, బాస్కెట్ బాల్ టోర్నీలకు కూడా యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు. 2021లో ఐపీఎల్లో తన యాంకరింగ్‌తో అభిమానులను ఫిదా చేశారు. నశ్ప్రీత్ కౌర్ మెల్బోర్న్లో పుట్టి పెరిగిన భారత సంతతి యువతి నశ్ప్రీత్ కౌర్. క్రికెట్ షోలకు యాంకరింగ్ చేస్తూ గుర్తింపు పొందారు. ఐపీఎల్ -2022 సీజన్‌తో ఆమె పాపులారిటీ సంపాదించారు. చదవండి: IPL 2022: గుజరాత్ టైటాన్స్ ఫైనల్ చేరితే టీ20 ప్రపంచకప్ జట్టులో నేనూ ఉంటా: టీమిండియా ప్లేయర్ View this post on Instagram A post shared by mayantilangerbinny (@mayantilanger_b) -
Tanya Khanijow: ఎంట్రప్రెన్యూర్, ట్రావెల్ ఫిల్మ్‌మేకర్.. 8 లక్షల మంది సబ్స్క్రైబర్స్!
Tanya Khanijow is an Indian YouTuber, travel blogger, and a photographer: ఏ స్కూల్లోనైనా రెండేళ్లు చదివితే అక్కడి వాతావరణం, తోటి విద్యార్థులు మంచి స్నేహితులైపోతారు. అక్కడి నుంచి మారి వేరే స్కూల్లో చేరాలంటే బాధగా.. కొత్త వాతావరణానికి అలవాటు పడటం కష్టంగా అనిపిస్తుంది. అటువంటిది ఢిల్లీకి చెందిన తాన్య పదోతరగతి పాసయ్యేలోపు చాలా స్కూళ్లు మారింది... వెళ్లిన ప్రతిచోటా అక్కడి వాతావరణానికి సులభంగా అలవాటు పడడమే కాదు. అక్కడి వారితో ఇట్టే కలిసిపోయి స్నేహితులను సంపాదించుకునేది. తనకు అది నచ్చడంతో పెద్దయ్యాక ఏకంగా ట్రావెలింగ్‌నే కెరియర్‌గా మలచుకుంది. వివిధ ప్రదేశాల్లో పర్యటిస్తూ అక్కడి ఆసక్తికర అంశాలను తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ లక్షలమందిని అలరిస్తూ, ట్రావెల్ బ్లాగర్, సోషల్ మీడియా ఎంట్రప్రెన్యూర్, ట్రావెల్ ఫిల్మ్‌మేకర్‌గా రాణిస్తోంది. ఢిల్లీలోని ఓ ఆర్మీ కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయి తాన్య ఖనీజో. ఇంట్లో తాన్యానే పెద్దమ్మాయి, తనకు టివేషా అనే చెల్లి ఉంది. నాన్న ఆర్మీలో ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా పనిచేస్తుండేవారు. నాన్న ఉద్యోగ బదిలీ కారణంగా ప్రతి రెండేళ్లకు ఒక కొత్త ప్రదేశాన్ని చూడాల్సి వచ్చేది తాన్యకు. కుటుంబం మకాం మార్చిన ప్రతి ఊరిలో అక్కడి పరిస్థితులు, వాతావరణానికి అలవాటు పడటానికి కొంచెం ఇబ్బంది పడినప్పటికీ తొందరలోనే ఆ కొత్త ప్రదేశాన్ని ఇష్టపడేది. అలా దేశంలోని వివిధ ప్రాంతాల్లోని తొమ్మిది రకాల స్కూళ్లలో పాఠశాల విద్యనభ్యసించింది. తరువాత ఢిల్లీ టెక్నాలాజికల్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివింది. హాస్టల్లో ఉండి చదువుకున్న తాన్యా ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా రకరకాల అడ్వెంచర్స్లో పాల్గొనేది. అంతేగాక కాలేజీ స్నేహితులతో కలిసి ట్రిప్స్‌కు వెళ్తుండేది. ఇలా తరచూ ఊర్లు మారడం, ట్రిప్‌లకు వెళ్తుండడంతో చిన్నప్పటి నుంచి ట్రావెలింగ్‌పై తాన్యకు మక్కువ ఏర్పడింది. ఉద్యోగం వదిలేసి.. 2016లో ఇంజినీరింగ్ పూర్తైన వెంటనే ఆన్లైన్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో బిజినెస్ అనలిస్ట్‌గా చేరింది. ఉద్యోగంలో చేరినప్పటికీ ట్రావెలింగ్ మీద ఆసక్తి వదులుకోలేక ఉద్యోగం చేస్తూనే మరోపక్క సమయం దొరికినప్పుడల్లా ట్రిప్స్‌కు వెళ్లేది. ఇలా వెళ్లిన ప్రతిసారి అక్కడి ప్రదేశాల్లోని ఆసక్తికరమైన వాటిని ఫోటోలుగా, కొన్నింటిని వీడియోల రూపం లో భద్రపరచుకునేది. ఒకసారి వీటన్నింటిని సోషల్ మీడియా లో పెడితే బావుంటుందన్న ఆలోచన రావడంతో... ఒక బ్లాగ్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను ఓపెన్ చేసి దానిలో తన దగ్గర ఉన్న ఫోటోలు, వీడియోలు పోస్టు చేసేది. వాటికి మంచి స్పందన లభిస్తుండడంతో ఉద్యోగాన్ని వదిలేసి, ట్రావెలింగ్‌నే కెరియర్‌గా మలచుకోవాలనుకుంది. ఇందుకోసం జీతాన్ని పొదుపు చేసి డబ్బును జమ చేసుకుంది. తర్వాత ఆ ఉద్యోగం వదిలేసి పూర్తి సమయాన్ని ట్రావెలింగ్కు కేటాయించింది. సోలో గర్ల్ ఇన్ పాండిచ్చేరి.. ఉద్యోగం మానేసిన వెంటనే తాన్యా ఖనీజో పేరిట యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించింది. తొలిసారి ఢిల్లీ నుంచి పాండిచ్చేరికి నాలుగురోజుల సోలో ట్రిప్ వీడియోను ‘సోలో గర్ల్ ఇన్ పాండిచ్చేరి’ పేరిట పోస్టుచేసింది. ఈ వీడియోకు మంచి స్పందన లభించడంతో ట్రావెల్ వీడియో లు వ్యూవర్స్‌ను ఆకట్టుకుంటున్నాయని గ్రహించి, షూట్ చేసిన వీడియోలను మరింత నాణ్యంగా అందించేందుకు అర్థవంతంగా ఎడిట్ చేసి అప్లోడ్ చేసింది. వ్యూవర్స్ మరింతగా పెరిగారు. తొలినాళ్లలో ట్రావెల్ టిప్స్‌తోపాటు దియా, లైఫ్‌స్టైల్, ఫ్యాషన్‌కు సంబంధించిన అనేక అంశాలను పోస్టు చేసేది. తరువాత తక్కువ బడ్జెట్లోనే ఎక్కువ ప్రదేశాలను ఎలా సందర్శించవచ్చు, వంటి అంశాలతో కూడా వీడియోలు పోస్టు చేసేది. ఇండియాలోనే తొలి మహిళా ట్రావెలర్ కావడంతో తాన్యా ఛానల్‌కు మంచి వ్యూస్ వచ్చేవి. దేశ విదేశాల్లో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ అక్కడి విశేషాలను అర్థవంతంగా వివరిస్తుండడంతో.. ప్రస్తుతం తాన్య యూట్యూబ్ ఛానల్‌కు దాదాపు ఎనిమిది లక్షల మంది సబ్స్క్రైబర్స్, ఇన్స్టాగ్రామ్ లో నాలుగు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. తన జీవితంలో అనుకోకుండా ఎదురైన పరిస్థితులను ఆనందంగా స్వీకరించడమేగాక, వాటినే కెరియర్‌గా మలుచుకునీ ఎంతోమంది యువతీ యువకులకు ప్రేరణగా నిలుస్తోంది తాన్య. చదవండి: Bipin Rawat Wife Madhulika: భర్తకు తగ్గ భార్య.. ఆఖరి శ్వాస వరకు ఆయనతోనే -
ఇకపై అలాంటి కథలే ఎంచుకుంటా!
‘‘ఆర్ఎక్స్ 100’ తర్వాత నేను చేసిన సినిమాల వల్ల నాకు యాక్టర్‌గా పేరు వచ్చింది. కానీ, నేనంటే ఇష్టపడే వారు గర్వంగా చెప్పుకునే కమర్షియల్ హిట్ మూవీ రాలేదు. ఇక నుంచి నన్ను ఇష్టపడేవారు గర్వపడేలా కథలు ఎంచుకుంటానని మాట ఇస్తున్నా’’ అని హీరో కార్తికేయ అన్నారు. శ్రీ సరిపల్లి దర్శకత్వంలో కార్తికేయ, తాన్యా రవిచంద్రన్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘రాజా విక్రమార్క’. ఆదిరెడ్డి టి. సమర్పణలో ‘88’ రామారెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో కార్తికేయ మాట్లాడుతూ – ‘‘రాజా విక్రమార్క’ అనగానే చిరంజీవిగారు గుర్తొస్తారు. ఆయన అభిమానిగా ధైర్యం చేసి ఈ టైటిల్ పెట్టుకున్నాను. ‘రాజా విక్రమార్క’ సక్సెస్ అయితే శ్రీతో మరో సినిమా చేయాలని ఉంది. ఈ సినిమా సక్సెస్ నా కెరీర్‌కు ప్లస్ అవ్వడమే కాదు.. నా మీద నాకు ఆత్మవిశ్వాసాన్ని, నమ్మకాన్ని ఇస్తుంది. ఈ నెల 21న లోహితతో నా పెళ్లి జరుగుతుంది’’ అన్నారు. ‘‘రాజా విక్రమార్క’ ట్రైలర్ చూడగానే కార్తికేయను అభినందించాను. ఇండస్ట్రీలోకి వచ్చేవారికి బ్యాక్‌గ్రౌండ్ అవసరం లేదు. టాలెంట్ ఉంటే చాలు’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. ‘‘మూడు నెలల్లో ఈ సినిమా పూర్తి చేద్దామనుకున్నాం.. కరోనా వల్ల రెండేళ్లు పట్టింది’’ అన్నారు ‘88’ రామారెడ్డి. ‘‘కార్తికేయ వల్లే ‘రాజా విక్రమార్క’ నిర్మించే అవకాశం మాకు వచ్చింది’’ అన్నారు టి. ఆదిరెడ్డి. ‘‘కార్తికేయతో నా ప్రయాణం మూడేళ్ల క్రితం మొదలైంది’’ అన్నారు శ్రీ సరిపల్లి. ‘‘రాజా విక్రమార్క’ లో హీరోయిన్ తండ్రి పాత్ర పోషించాను’’ అన్నారు సాయికుమార్. ‘‘కార్తికేయలోని ఇన్నోసెన్స్ వల్ల ఎలాంటి పాత్ర అయినా చేయగలడు’’ అన్నారు హీరో సుధీర్ బాబు. ‘‘తెలుగు ఇండస్ట్రీలోని హీరోలందరూ మంచిగా మాట్లాడేది కార్తికేయ గురించే’’ అన్నారు హీరో విష్వక్ సేన్. ‘‘ఈ సినిమా హిట్ కావాలి’’ అన్నారు హీరో శ్రీవిష్ణు. హీరో కిరణ్ అబ్బవరం, సంగీత దర్శకుడు ప్రశాంత్ విహారి, పాటల రచయితలు కృష్ణకాంత్, సనారే, నటులు సుధాకర్ కోమాకుల, హర్షవర్ధన్ , నవీన్, ఎడిటర్ జస్విన్ ప్రభు పాల్గొన్నారు. -
చిన్న గ్యాప్ తరువాత మళ్లీ..
సినిమా: సినీరంగంలో హిట్‌తో పాటు లక్కు అవసరం. అలా సక్సెస్‌ను చూసినా నటి తాన్యా రవిచంద్రన్‌కు చిన్న గ్యాప్ వచ్చింది. ఇది తనే తీసుకున్న విరామమో, లేక సరైన అవకాశాలు రాకో తెలియదు గానీ మూడు చిత్రాలు చేసిన తరువాత సినిమాలకు కాస్త దూరం అయ్యిందీ బ్యూటీ. ఇంతకీ తాన్యా ఎవరో తెలిసే ఉంటుంది. దివంగత సీనియర్ నటుడు రవిచంద్రన్ మనవరాలు. నట కుటుంబం నుంచి వచ్చిన ఈ బామ వెల్లయదేవా చిత్రంతో హీరోయిన్గా పరిచయం అయ్యింది. ఆ తరువాత బృందావనం, కరుప్పన్ చిత్రాలలో నటించింది. వీటిలో విజయ్‌సేతుపతికి జంటగా నటించిన కరుప్పన్ చిత్రం సక్సెస్ అయ్యింది. ఆ తరువాత మరో చిత్రం చేయలేదు. తాజాగా సిబిరాజ్‌తో రొమాన్స్ చేసే అవకాశం ఈ ముద్దుగుమ్మను వరించింది. మాయాన్ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎన్.కిశోర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇళయరాజా సంగీతాన్ని, సత్యన్ సూర్యన్ ఛాయాగ్రహణను అందిస్తున్న ఈ చిత్రాన్ని గ్రీన్ ప్రొడక్షన్స్, మూ మెంట్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను చిత్ర వర్గాలు గత ఆగస్ట్ 27వ తేదీనే విడుదల చేశారు. ఈ చిత్రంతోనైనా నటి తాన్యాకు బ్రైట్ ఫ్యూచర్ కలుగుతుందేమో చూద్దాం. కాగా నిర్మాణ దశలో ఉన్న మాయాన్ చిత్రం విడుదల హక్కులను డబుల్ మీనింగ్ ప్రొడక్షన్స్ సంస్థ పొందింది. ఈ సంస్థ ఇప్పటికే మిష్కిన్ దర్శకత్వంలో ఉదయనిధిస్టాలిన్ హీరోగా నటిస్తున్న సైకో చిత్ర విడుదల హక్కులను కొనుగోలు చేశారన్నది గమనార్హం. -
మా కష్టాన్ని గుర్తించారు
‘‘నాది విజయనగరం దగ్గర సాలూర్. యూకేలో చదువుకున్నా. ముంబైలోని బ్యారిజాన్ యాక్టింగ్ స్కూల్లో ఆరు నెలలు శిక్షణ తీసుకున్నా. నటుడిగా నా తొలిచిత్రం ‘ప్రేమకు రెయిన్ చెక్’. చిన్నప్పటి నుంచి మహేశ్‌బాబుగారి సినిమాలు ఎక్కువగా చూస్తూ పెరిగాను’’ అని అభిలాష్ అన్నారు. అభిలాష్ మాడాడ, ప్రియ, తన్య హీరో హీరోయిన్లుగా స్టోన్ మీడియా ఫిల్మ్ పతాకంపై ఆకెళ్ళ పేరి శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ప్రేమకు రెయిన్ చెక్’. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ సమర్పిస్తున్న ఈ చిత్రం ఈ నెల 7న విడుదలవుతోంది. ఈ సందర్భంగా అభిలాష్ మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. రెయిన్ చెక్ అంటే భవిష్యత్తులో పూర్తయ్యే ప్రమాణం. మా అదృష్టం ఏంటంటే మా చిత్రనికి డైరెక్టర్, నిర్మాత ఒక్కరే కావడం. ‘ప్రేమకు రెయిన్ చెక్’ అన్నది ఆయన విజన్. అందుకు తగ్గట్టే బాగా తెరకెక్కించారు. నిర్మాత శరత్ మరార్‌గారికి మా సినిమా బాగా నచ్చడంతో సమర్పిస్తున్నారు. మా కష్టాన్ని గుర్తించారనిపించింది. ఎలాంటి పాత్ర అయినా న్యాయం చేయాలన్నదే నా లక్ష్యం’’ అన్నారు. -
పేపర్ బాయ్ లవ్ స్టోరీ
‘‘ఒక అమ్మాయి, ఓ పేపర్ బాయ్ మధ్య జరిగే ప్రేమ కథే ‘పేపర్ బాయ్’. ఈ చిత్రంలో అన్ని ఎమోషన్స్ ఉంటాయి. మంచి సబ్జెక్ట్ ఉన్న సినిమా. అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది. కెమెరామెన్ సౌందర్య రాజన్ మంచి విజువల్స్ అందించారు. భీమ్స్ మ్యూజిక్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఆగస్టులో సినిమా విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాత సంపత్ నంది అన్నారు. సంతోష్ శోభన్ హీరోగా, రియా, తాన్య హోప్ హీరోయిన్లుగా జయశంకర్ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘పేపర్ బాయ్’. సంపత్ నంది టీమ్ వర్క్స్ బ్యానర్లో ప్రచిత్ర క్రియేషన్స్, బిఎల్ఎన్ సినిమాపై సంపత్ నంది నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ను రియల్ పేపర్ బాయ్ అఖిల్ చేత విడుదల చేయించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు జయశంకర్ మాట్లాడుతూ– ‘‘నేను చేసిన షార్ట్ ఫిల్మ్ చూసి సంపత్‌గారు డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చారు. అందుకు ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటా. సింపుల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన చిత్రమిది. ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తున్నా’’ అన్నారు. ‘‘గోల్కొండ హైస్కూల్’తో బాల్య నటుడిగా నన్ను ఆదరించారు. ఇప్పుడు ‘పేపర్ బాయ్’గా మీ ముందుకు వస్తున్నా, ఆదరించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో అందరూ కొత్తవారే’’ అన్నారు సంతోష్ శోభన్. నిర్మాత నరసింహ, కథానాయిక రియా పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళి మామిళ్ల. -
తానియా.. తాలియా!
అంబర్‌పేట: డ్రగ్స్ బారిన పడి యువత తమ జీవితాలను దుర్భరం చేసుకుంటోంది. డగ్స్ తీసుకోవడం ఓ ఫ్యాషన్‌గా భావిస్తోంది. రోజురోజుకూ ఎక్కువవుతున్న ఈ వ్యసనం సమాజానికి సవాల్ విసురుతోంది. డగ్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రతిఒక్కరూ కంకణం కట్టుకోవాల్సిన అవసరముంది. దీని నిరోధానికి డ్రగ్స్ ఫ్రీ వరల్డ్ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో కృషి చేస్తోంది. ఇందులో భాగంగా భారత్‌లో సైతం ఈ సంస్థ తన సేవలను విస్తరించింది. వివిధ రూపాల్లో డ్రగ్స్‌తో జరిగే పరిణామాలపై వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా డ్రగ్స్‌ఫ్రీ వరల్డ్ సంస్థ ఇండియాకు జూనియర్ కాంపెయిన్ హెడ్‌గా నగరానికి చెందిన 8 ఏళ్ల చిన్నారి తానియా బేగంను ఎంచుకుంది. ఈ చిన్నారితో ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలు చేపట్టింది. మంగళవారం డగ్స్ వ్యతిరేక దినం సందర్భంగా ప్రత్యేక కథనం. ప్రసంగం.. అనర్గళం.. డ్రగ్స్‌ఫ్రీ వరల్డ్ ఇండియా జూనియర్ కంపెయిన్ హెడ్‌గా ఏడాది క్రితం నియమితురాలైంది తానియా. ఇప్పటి వరకు 50 అవగాహన కార్యక్రమాలకు పైగా పాల్గొంది. డ్రగ్స్‌పై నిర్వహించిన 5కే, 2కే రన్స్, అవగాహన ర్యాలీల్లో ఈ చిన్నారి పాల్గొని తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తోంది. చదివేది 2వ తరగతి అయినా డ్రగ్స్‌పై అనర్గళంగా ప్రసంగిస్తోంది. దీంతోపాటు వివిధ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని పలువురు ప్రముఖుల మన్ననలను సైతం పొందుతోంది. గ్రేటర్ మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నతాధికారులు, మంత్రులతో పాటు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ అభినందనలు పొందింది. రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతికి లేఖలు.. డ్రగ్స్ ఫ్రీ ఇండియా కోసం చిన్నారి తానియా తన ఆలోచనలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ ద్వారా పంచుకుంది. సమాజాన్ని పట్టిపీడిస్తున్న ఓ ప్రధాన అంశంపై తొలిసారిగా ఓ చిన్నారి లేఖ రాయడంతో రాష్ట్రపతి సైతం అబ్బురపడ్డారు. తానియా లేఖకు ఆయన చిత్రంతో పాటు సంతకం చేసి అభినందిస్తూ ఆమెకు పంపించారు. ఉప రాష్టపతి సైతం ఈ చిన్నారిని లేఖ ద్వారా అభినందించారు. పరుగు ఎక్కడుంటే అక్కడే.. నగరంలో వివిధ సామాజిక అంశాలపై జరిగే వివిధ పరుగుల్లో పాల్గొనేందుకు తానియా ఎంతో ఉత్సాహం చూపిస్తుంది. ఉదయం పరుగు ఉంటే రాత్రి నుంచే తండ్రి సలావుద్దీన్ సహకారం కోసం పట్టుపడుతుంది. తండ్రి సైతం ఆమె ఉత్సాహాన్ని ప్రోత్సహిస్తూ ఎక్కడ పరుగుంటే అక్కడే ఈ తండ్రీ కూతురు వాలిపోతారు. పరుగులోనూ అందరితో శభాష్ అనిపించుకుంటోంది. -
నటికి హత్యా బెదిరింపులు
తమిళసినిమా: నటి తాన్యకు అగంతుకుల నుంచి హత్యాబెదిరింపులు వస్తున్నాయి. దీంతో ఆమె గురువారం వెప్పేరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమె శుక్రవారం తెరపైకి రానున్న 18.05.2009 అనే చిత్రంలో కథానాయకిగా నటించారు. ఆ చిత్రంలో నటించినందుకుగానూ నటి తాన్యకు హత్యాబెదిరింపులు వస్తున్నాయట. దీని గురించి తాన్య వెపేరి పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొంటూ తాను స్థానిక వడపళనిలోని తిరునగర్ రెండవ వీధిలో తన తల్లితో పాటు నివశిస్తున్నానని పేర్కొన్నారు. తన తండ్రి 10 ఏళ్ల క్రితమే మరణించారని తెలిపారు. తాను 18–05–2009 చిత్రంలో నటించానన్నారు. ఈ నెల 14న అర్ధరాత్రి 1.15 గంటల ప్రాంతంలో ఒక ఫోన్ కాల్ వచ్చిందన్నారు. అది నో కాలర్ ఐడీ పేరుతో వచ్చిందన్నారు. తాను ఆ సయమంలో వేరే కాల్ వస్తే మాట్లాడుతుండడంతో తరువాత మళ్లీ అదే ఫోన్ వచ్చిందని పేర్కొన్నారు. ఆ ఫోన్‌కాల్‌ను తాను రిసీవ్ చేసుకోగా అవతల వ్యక్తి చాలా అసభ్యంగా మాట్లాడడంతో పాటు 18–05–2009 చిత్రంలో నటించింది నువ్వేగా, బయటకు రా నీ పనిచెప్తా అంటూ బెదిరించాడన్నారు. ఆ తరువాత 16వ తేదీ ఉదయం 5 గంటల ప్రాంతంలో 447404617369 అనే ఫోన్ నుంచి కాల్ వచ్చిందని చెప్పారు. అప్పుడు ఆ వ్యక్తి నువ్వు ఒంటరిగానేగా ఉంటున్నావు. నిన్ను చంపేస్తాను అని బెదిరించాడన్నారు. తాను ఒక నటినని, ఏదైనా ఉంటే ఆ చిత్ర దర్శక నిర్మాతలతో మాట్లాడుకోండని తాను చెప్పానన్నారు. ఆ వ్యక్తి చర్చలకు తాను తన తల్లి చాలా భయానికి గురవుతున్నామని, తనపై హత్యాబెదిరింపులకు పాల్పడుతున్న ఆ వ్యక్తిపై తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోరుతున్నానని ఆ ఫిర్యాదులో నటి తాన్య పేర్కొన్నారు. -
హీరోయిన్ తాన్యా స్టిల్స్
-
అందుకే మదురై అమ్మాయినయ్యా!
తమిళసినిమా: ఆ రెండు చిత్రాల్లో రాని గుర్తింపు కరుప్పన్ చిత్రం తెచ్చి పెడుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది నటి తాన్యా. ప్రఖ్యాత నటుడు రవిచంద్రన్ మనవరాలైన ఈ యువ నటి శశికుమార్‌కు జంటగా భలే వెళ్లైదేవా చిత్రం ద్వారా హీరోయిన్గా తెరంగేట్రం చేసింది. ఆ చిత్రం ఈ బ్యూటీని చాలా నిరాశపరచింది. ఆ తరువాత అరుళ్‌నిధి సరసన నటించిన బృందావనం చిత్రం ఈమె కెరీర్‌కు ఏ మాత్రం ఉపయోగపడలేదు. అయినా తాజాగా మంచి అవకాశాన్ని దక్కించుకుంది. సక్సెస్ఫుల్ హీరోగా రాణిస్తున్న విజయ్‌సేతుపతికి జంటగా కరుప్పన్ చిత్రంలో నటిస్తోంది. ప్రముఖ నిర్మాత ఏఎం.రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రానికి పన్నీర్‌సెల్వం దర్శకుడు. ఈ చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుంది. కరుప్పన్ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్న తాన్యా మాట్లాడుతూ ఇది మదురై నేపథ్యంలో తెరకెక్కుతున్న గ్రామీణ కథా చిత్రం అని చెప్పింది. ఇందులో తాను అన్భుసెల్వి అనే పాత్రలో నటిస్తున్నానని తెలిపింది. ఈ పాత్ర కోసం మదురై అమ్మాయిగా మారి నటిస్తున్నానని చెప్పింది. ఇందులో విజయ్‌సేతుపతితో కలిసి నటిస్తున్నప్పుడే తనకు సక్సెస్ ఖాయం అని భావించానని చెప్పింది. ఇంతకు ముందు నటించిన రెండు చిత్రాల్లో తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకున్నానని, అలాంటిది ఈ కరుప్పన్ చిత్రంలో పాత్ర పూర్తిగా మదురై స్లాంగ్‌లో మాట్లాడడంతో చెన్నై నగరంలో పుట్టి పెరిగిన తాను ఆ యాసలో పర్ఫెక్ట్గా మాట్లాడలేకపోవడంతో డబ్బింగ్ కళాకారిణితో చెప్పిస్తున్నారని తెలిపింది. రెండు చిత్రాల్లో రాని పేరు కరుప్పన్ చిత్రంతో తెచ్చుకుంటాననే నమ్మకం తనకు ఉందని అంది. ఈ చిత్రంతో స్టార్ హీరోయిన్ పట్టికలో చేరిపోతానన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది. -
గ్రామీణ నేపథ్యంగా కరుప్పన్
తమిళసినిమా: చిత్రాన్ని ఎలా ప్రమోట్ చేయాలో బాగా తెలిసిన నిర్మాత ఏఎం.రత్నం అని నటుడు విజయ్‌సేతుపతి వ్యాఖ్యానించారు. ఏన్నో సంచలన హిట్ చిత్రాలను నిర్మించిన ఏఎం.రత్నం తాజాగా శ్రీసాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం కరుప్పన్. వరుస విజయాలతో మంచి జోరు మీదున్న నటుడు విజయ్‌సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న ఇందులో ఆయనకు జంటగా నటి తాన్య నటించారు. బాబీసింహ ప్రతినాయకుడిగా నటించిన ఈ చిత్రానికి రేణుగుంట చిత్రం ఫేమ్ పన్నీర్‌సెల్వమ్ దర్శకుడు. డి.ఇమాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. విజయ్‌సేతుపతి మాట్లాడుతూ రేణుగుంట చిత్రంలోని వేశ్య పాత్రను కూడా ఎంతో ఉన్నతంగా చూపించిన దర్శకుడు పన్నీర్‌సెల్వం అని అన్నారు. ఈ పాత్రను కొంచెం కూడా అశ్లీలంగా చూపించలేదని, అలాగే ఇందులోని ఒక పాటను చాలా చక్కగా తెరకెక్కించారని చెప్పారు. ఇక ఈ చిత్ర నిర్మాత ఏఎం.రత్నం గురించి చెప్పాలంటే ఒక చిత్రానికి ఎలా ప్రచారం చేయాలో అనే యుక్తి తెలిసిన నిర్మాత ఆయనని వ్యాఖ్యానించారు. ఈ చిత్రంలో రెగ్యులర్ ప్రతికథానాయకుడు అవసరం లేకపోయిందన్నారు. ఒక హీరోనే విలన్‌గా నటిస్తే బాగుంటుందని నిర్ణయించుకున్న తరువాత నటుడు బాబీసింహాకు ఈ చిత్రం గురించి తాను చెప్పానన్నారు.ఆయన తనకు మంచి మిత్రుడు కావడంతో ఏమీ మాట్లాడకుండా ఇందులో విలన్‌గా నటించడానికి అంగీకరించారని తెలిపారు.కరుప్పన్ చిత్రంలో ఎద్దుతో పోరాడే సన్నివేశం చోటు చేసుకుంటుందని, అయితే తాను ఎద్దును ముట్టుకోనుకూడా లేదని, ఆ సన్నివేశాలను రియల్ బుల్‌ఫైట్ క్రీడా వీరుల సన్నివేశాలతో ఫైట్ మాస్టర్ రాజశేఖర్ చాలా అద్భుతంగా మ్యాచ్ చేశారని విజయ్‌సేతుపతి తెలిపారు. విజయ్‌సేతుపతి గురించి ముందే చెప్పా ఈ చిత్ర ప్రారంభానికి ముందే విజయ్‌సేతుపతిని కలిసి మీరు మరింత ఉన్నత స్థాయికి ఎదుగుతారని చెప్పానని నిర్మాత ఏఎం.రత్నం అన్నారు. ఆ తరువాత విజయ్‌సేతుపతి నటించిన రెండు చిత్రాలు ఈ ఏడాది విడుదలై మంచి విజయాలను సాధించాయన్నారు. ఇక కరుప్పన్ చిత్రం గురించి చెప్పాలంటే ఇది సస్పెన్స్, థ్రిల్లర్ కథా చిత్రం కాదన్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే సహజత్వంతో కూడిన చిత్రంగా ఉంటుందని అన్నారు. ఇందులో హీరోయిన్ కోసం చాలా మందిని అనుకున్నా నటి తాన్య పాత్రకు నప్పడంతో ఆమెను ఎంపిక చేసినట్లు తెలిపారు. హీరో విజయ్‌సేతుపతితో పాటు అందరూ చాలా బాగా నటించారని చెప్పారు. చిత్ర క్లైమాక్స్ చాలా కొత్తగా ఉంటుందని నిర్మాత ఏఎం.రత్నం తెలిపారు. -
శశికుమార్‌కు జంటగా తాన్యా
నటుడు శశికుమార్‌కు జంటగా నాటి సూపర్‌స్టార్ రవిచంద్రన్ మనవరాలు తాన్యా నటించనున్నారని తాజా సమాచారం. 1960-70 దశకంలో తమిళ చిత్ర పరిశ్రమలో సూపర్‌స్టార్‌గా వెలుగొందిన నటుడు రవిచంద్రన్. ఈయన వారసుడు హంసవర్దన్ హీరోగా తెరంగేట్రం చేసినా నిలదొక్కుకోలేకపోయారు. కాగా తాజాగా రవిచంద్రన్ మనవరాలు తాన్యా నాయకిగా రంగప్రవేశం చేశారు. ఇప్పటికే రెండు చిత్రాల్లో నాయకిగా నటిస్తున్నారు. రాధామోహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బృందావనం చిత్రంలో అరుళ్‌నిధికి జంటగా తాన్యా నటిస్తున్నారు. అదే విధంగా మిష్కిన్ దర్శకత్వంలో విశాల్ సరసన నాయకిగా నటిస్తున్నారు. తాజాగా శశికుమార్‌తో జత కట్టడానికి సిద్ధమవుతున్నారు. కిడారి వంటి విజయవంతమైన చిత్రం తరువాత శశికుమార్ తదుపరి చిత్రానికి రెడీ అయ్యారు. తన సొంత సంస్థ కంపెనీ పతాకంపై నిర్మించనున్న ఈ చిత్రం ద్వారా నవ దర్శకుడు ప్రకాశ్ పరిచయం కానున్నారు. ఇందులో శశికుమార్‌కు జంటగా తాన్యాను ఎంపిక చేశారన్నది తాజా సమాచారం. పూర్తి వినోదభరిత చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో నటి కోవైసరళ, సంగిలి మురుగన్ ముఖ్య పాత్రలు పోషించనున్నారు. దీనికి అలప్పారై అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు తెలిసింది.