తమిళసినిమా: నటి తాన్యకు అగంతుకుల నుంచి హత్యాబెదిరింపులు వస్తున్నాయి. దీంతో ఆమె గురువారం వెప్పేరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమె శుక్రవారం తెరపైకి రానున్న 18.05.2009 అనే చిత్రంలో కథానాయకిగా నటించారు. ఆ చిత్రంలో నటించినందుకుగానూ నటి తాన్యకు హత్యాబెదిరింపులు వస్తున్నాయట. దీని గురించి తాన్య వెపేరి పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొంటూ తాను స్థానిక వడపళనిలోని తిరునగర్ రెండవ వీధిలో తన తల్లితో పాటు నివశిస్తున్నానని పేర్కొన్నారు. తన తండ్రి 10 ఏళ్ల క్రితమే మరణించారని తెలిపారు. తాను 18–05–2009 చిత్రంలో నటించానన్నారు. ఈ నెల 14న అర్ధరాత్రి 1.15 గంటల ప్రాంతంలో ఒక ఫోన్ కాల్ వచ్చిందన్నారు. అది నో కాలర్ ఐడీ పేరుతో వచ్చిందన్నారు.
తాను ఆ సయమంలో వేరే కాల్ వస్తే మాట్లాడుతుండడంతో తరువాత మళ్లీ అదే ఫోన్ వచ్చిందని పేర్కొన్నారు. ఆ ఫోన్‌కాల్‌ను తాను రిసీవ్ చేసుకోగా అవతల వ్యక్తి చాలా అసభ్యంగా మాట్లాడడంతో పాటు 18–05–2009 చిత్రంలో నటించింది నువ్వేగా, బయటకు రా నీ పనిచెప్తా అంటూ బెదిరించాడన్నారు. ఆ తరువాత 16వ తేదీ ఉదయం 5 గంటల ప్రాంతంలో 447404617369 అనే ఫోన్ నుంచి కాల్ వచ్చిందని చెప్పారు. అప్పుడు ఆ వ్యక్తి నువ్వు ఒంటరిగానేగా ఉంటున్నావు. నిన్ను చంపేస్తాను అని బెదిరించాడన్నారు. తాను ఒక నటినని, ఏదైనా ఉంటే ఆ చిత్ర దర్శక నిర్మాతలతో మాట్లాడుకోండని తాను చెప్పానన్నారు. ఆ వ్యక్తి చర్చలకు తాను తన తల్లి చాలా భయానికి గురవుతున్నామని, తనపై హత్యాబెదిరింపులకు పాల్పడుతున్న ఆ వ్యక్తిపై తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోరుతున్నానని ఆ ఫిర్యాదులో నటి తాన్య పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment