
హైదరాబాద్‌లో జరిగిన కారు ప్రమాదంలో దియా మీర్జా మేనకోడలు తాన్యా కక్డే మృతిచెందింది.
Dia Mirza Niece Tanya Kakade Dies At Car Accident In Hyderabad: ప్రముఖ మోడల్, హీరోయిన్, నిర్మాత దియా మీర్జా పుట్టింది హైదరాబాద్‌లో అయిన బాలీవుడ్‌లో పాపులారిటీ సంపాదించుకుంది. మిస్ ఆసియా పసిఫిక్ 2000 టైటిల్ గెలుచుకున్న దియా.. సంజు, తప్పడ్, కుర్బాన్, లగే రహో మున్నాభాయ్ వంటి చిత్రాలతో పేరు తెచ్చుకుంది. ఇటీవల టాలీవుడ్ కింగ్ నాగార్జున 'వైల్డ్ డాగ్' చిత్రంలో కూడా నటించింది దియా మీర్జా. అయితే దియా మీర్జా కుటుంబానికి సోమవారం (ఆగస్టు 1) ఎంతో విషాదకరమైంది.
సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కారు ప్రమాదంలో దియా మీర్జా మేనకోడలు తాన్యా కక్డే మృతిచెందింది. ఆమె మరణవార్తను తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ నోట్ రాసుకొచ్చంది దియా. 'నా కోడలు. నా బిడ్డ. నా ప్రాణం ఇక లేదు. తను స్వర్గానికి వెళ్లింది. నువ్ ఎక్కడున్న శాంతి, ప్రేమను పొందుతావని ఆశీస్తున్నాను. నువ్ ఎప్పుడూ మా హృదయాల్లో చిరు నవ్వు నింపేదానివి. నీ ఆట, పాట, చిరునవ్వు ఎప్పుడూ మాతోనే ఉంటాయి. ఓం శాంతి' అని భావోద్వేగంగా రాసుకొచ్చింది దియా మీర్జా.
చదవండి: హీరోయిన్‌కు ముద్దు పెట్టిన హీరో.. కంట్రోల్ చేసుకోవాలని ట్వీట్
నాగార్జునతో 'విక్రమ్' లాంటి సినిమా చేయాలని ఉంది: డైరెక్టర్
కాగా తాన్యా కక్డే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి మరో నలుగురు స్నేహితులతో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టడంతో బోల్తా పడింది. ఆస్పుత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో తాన్యా మృతిచెందింది. ఆమె మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బ్యూటీషియన్‌గా పనిచేస్తున్న 25 ఏళ్ల తాన్యా కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహమ్మద్ ఫిరోజ్ ఖాన్ కుమార్తె.
చదవండి: భార్య ప్రణతితో జూనియర్ ఎన్టీఆర్ కబుర్లు.. ఫొటో వైరల్
సల్లూ భాయ్‌కి లైసెన్స్‌డ్ తుపాకీ.. ఎలాంటిది అంటే ?
#NewProfilePic pic.twitter.com/8syvsi22Mw
— Mohammed Feroz Khan (@ferozkhaninc) June 6, 2022