
టీమిండియా ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా తన కుమారుడు అంగద్ పుట్టినరోజు సందర్భంగా అందమైన ఫొటోలు పంచుకున్నాడు

‘‘మా సంతోషం.. మా కుమారుడు.. మా చిన్నారి సూపర్ హీరోకు అప్పుడే ఏడాది నిండింది’’ అంటూ భార్యాపిల్లలతో దిగిన ఫొటోలు షేర్ చేశాడు

తన సతీమణి సంజనా గణేషన్ చేసిన పోస్టును బుమ్రా రీపోస్ట్ చేశాడు

టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన జట్టులో సభ్యుడైన బుమ్రా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు

ఈ ఫాస్ట్‌బౌలర్ తనకు దొరికిన విరామ సమయాన్ని కుటుంబానికి కేటాయించాడు

ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ నాటికి బుమ్రా టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది

కాగా 2021లో బుమ్రా.. స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్‌ల వివాహం జరిగింది

ఈ జంటకు సెప్టెంబరు 4, 2023లో కుమారుడు జన్మించగా అంగద్ బుమ్రాగా నామకరణం చేశారు




