
మెగా క్రికెట్ సమరం టీ20 ప్రపంచకప్-2024 జూన్ 1న మొదలుకానుంది

అమెరికా- వెస్టిండీస్ వేదికగా సాగే ఈ ఐసీసీ టోర్నీ కోసం టీమిండియా ఇప్పటికే అమెరికా చేరుకుంది

ఆటగాళ్లంతా కలిసి ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు

ఇక టీమిండియా ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా కూడా జట్టుతో న్యూయార్క్‌లో ఉన్నాడు

అతడి భార్య, స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్ కూడా అమెరికాలోనే ఉన్నారు

ఐసీసీ వరల్డ్‌కప్-2024 ప్రజెంటర్లలో సంజనా కూడా ఒకరు

భర్త క్రికెట్‌తో బిజీగా ఉంటే.. ఆమె యాంకరింగ్‌తో బిజీగా ఉన్నారు

ఈ నేపథ్యంలో భర్త బుమ్రాతో కలిసి సంజనా ఫొటోలకు ఫోజులిచ్చారు


బుమ్రా టీమిండియా జెర్సీలో ఉండగా.. సంజనా క్యాజువల్ వేర్ ధరించారు

ఇందుకు సంబంధించిన ఫొటోను షేర్ చేస్తూ మన పని ప్రదేశానికి భర్త కూడా వస్తే ఇలా ఉంటుంది అంటూ క్యాప్షన్ జతచేశారు సంజనా




