2024 T20 World Cup: ‘టీమిండియా హై హమ్‌’ రెహమాన్ స్పెషల్‌ సాంగ్‌ వైరల్‌ | T20 World Cup AR Rahman gifts special song for Team India goes viral | Sakshi
Sakshi News home page

2024 T20 World Cup: ‘టీమిండియా హై హమ్‌’ రెహమాన్ స్పెషల్‌ సాంగ్‌ వైరల్‌

Published Mon, Jul 1 2024 12:09 PM | Last Updated on Mon, Jul 1 2024 12:25 PM

 T20 World Cup AR Rahman gifts special song for Team India goes viral

హోరాహోరీగా జరిగిన పోరులో దక్షిణాఫ్రికాపై విజయం సాధించి టీ20 ప్రపంచకప్‌ను భారత జట్టు కైవసం చేసుకోవడంతో దేశవ్యాప్తంగా  సంబరాలు మిన్నంటాయి.  17 ఏళ్ల తరువాత  టీ20 వరల్డ్ కప్ టైటిల్‌ను దక్కించుకోవడంపై సర్వత్రా హర్హం వ్యక్తమవుతోంది. ఈ అపురూపమైన సందర్భాన్ని ఆస్కార్‌ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్‌ కూడా సంబరంగా జరుపుకున్నారు. అంతేకాదు మెన్ ఇన్ బ్లూకి ఒక అధ్బుతమైన  గిఫ్ట్‌ ఇచ్చారు.

  

టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఏఆర్ రెహమాన్ బ్లూ ఇన్ మెన్‌కి   అభినందనలుత తెలుపుతూ 'టీమ్ ఇండియా హై హమ్'  పేరుతో ప్రత్యేక గీతాన్ని బహుమతిగా అందించారు. ఈ మ్యూజిక్ వీడియోకి సంబంధించిన యూట్యూబ్ లింక్‌ను ఏఆర్ రెహమాన్  సోషల్‌ మీడియాలో షేర్ చేశారు. ఈ సాంగ్‌ను తొలుత  అజయ్ దేవగన్ 'మైదాన్' కోసం కంపోజ్  చేశారట. భారత ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా అజయ్ దేవగన్  హీరోగా 'మైదాన్'  మూవీకోసం 'టీమ్ ఇండియా హై హమ్'ఒరిజినల్‌ సాంగ్‌ను  ఏఆర్ రెహమాన్ , నకుల్ అభ్యంకర్ పాడారు.

కాగా జూన్29న ఉత్కంఠభరితంగా జరిగిన టీ20 వరల్డ్‌ కప్‌ పైనల్‌ మ్యాచ్‌లో రోహిత్ శర్మ నాయకత్వంలో  టీమిండియా దక్షిణాఫ్రికాపై  ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో దేశవ్యాప్తంగా యువత రోడ్లపైకి వచ్చి, బాణా సంచా పేల్చి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నసంగతి తెలిసిందే. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement