మహిళల టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం 15 మంది సభ్యుల భారత జట్టును ఇవాళ (ఆగస్ట్ 27) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ ఎంపిక కాగా.. వైస్ కెప్టెన్‌గా స్మృతి మంధన వ్యవహరించనుంది. వికెట్‌కీపర్ బ్యాటర్ యస్తికా భాటియా, స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ.. ఫిట్‌నెస్ ప్రామాణికంగా వారి ఎంపిక జరుగనుంది.
ఈ జట్టుతో పాటు భారత సెలెక్టర్లు ముగ్గురు ట్రావెలింగ్ రిజర్వ్‌లు, ఇద్దరు నాన్ ట్రావెలింగ్ రిజర్వ్‌లను కూడా ఎంపిక చేశారు. ట్రావెలింగ్ రిజర్వ్‌లుగా ఉమా ఛెత్రి (వికెట్‌కీపర్), తనూజా కన్వర్, సైమా ఠాకూర్.. నాన్ ట్రావెలింగ్ రిజర్వ్‌లుగా రాఘవి బిస్త్, ప్రియా మిశ్రా ఎంపికయ్యారు.
టీ20 వరల్డ్‌కప్ కోసం భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్‌కీపర్), యాస్తికా భాటియా (వికెట్‌కీపర్)*, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, దయాళన్ హేమలత, ఆశా శోభన, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్*, సంజన సజీవన్
ట్రావెలింగ్ రిజర్వ్‌లు: ఉమా ఛెత్రీ (వికెట్‌కీపర్), తనూజా కన్వర్, సైమా ఠాకూర్
నాన్ ట్రావెలింగ్ రిజర్వ్‌లు: రాఘవి బిస్త్, ప్రియా మిశ్రా
కాగా, మహిళల టీ20 వరల్డ్‌కప్ అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు జరుగనుంది. ఈ మెగా టోర్నీలో భారత్ అక్టోబర్ 4న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. దుబాయ్ వేదికగా జరిగే ఆ మ్యాచ్‌లో భారత్ న్యూజిలాండ్‌తో తలపడుతుంది. అనంతరం దుబాయ్ వేదికగానే అక్టోబర్ 6న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగనుంది. అక్టోబర్ 9న శ్రీలంకతో, 13న ఆస్ట్రేలియాతో టీమిండియా మ్యాచ్‌లు ఆడనుంది.
Comments
Please login to add a commentAdd a comment