సాక్షి క్రీడా విభాగం: గత కొంతకాలంగా అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న భారత మహిళల క్రికెట్ జట్టు... అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టోర్నీల్లో మాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతోంది. మెగా టోర్నీల్లో మంచి ఆరంభాలు లభించినా... చివరి దశకు వచ్చేసరికి ఒత్తిడిని తట్టుకోలేక రిక్తహస్తాలతో వెనుదిరుగుతోంది. ఆ అడ్డంకిని అధిగమించి ముందడుగు వేసి ప్రపంచ చాంపియన్‌గా అవతరించేందుకు మన మహిళల జట్టుకు మరో అవకాశం వచ్చింది. అక్టోబర్ 3 నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేదికగా మహిళల టి20 ప్రపంచకప్ జరగనుంది.
ఈ టోర్నీ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యం వహించనున్న ఈ జట్టులో అనుభవానికి, యువతరానికి సమాన ప్రాధాన్యత కల్పించారు. పురుషుల జట్టు సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ... ఇటీవల టి20 ప్రపంచకప్ సాధించగా... ఇప్పుడదే బాటలో మహిళల జట్టు కూడా జగజ్జేతగా నిలవాలని అభిమానులు ఆశిస్తున్నారు.
మెగా టోర్నీకి ఎంపిక చేసిన మన ప్లేయర్ల బలాబలాలను ఒకసారి పరిశీలిస్తే... అంతర్జాతీయ టి20ల్లో 173 మ్యాచ్‌లు ఆడిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అందరికంటే సీనియర్ కాగా.. వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న స్మృతి మంధాన 141 మ్యాచ్‌ల్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. వీరిద్దరి తర్వాత స్పిన్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ 117 మ్యాచ్‌లు ఆడగా.. జెమీమా రోడ్రిగ్స్ 100 మ్యాచ్‌లు ఆడింది.
ఇక అండర్-19 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు విజేతగా నిలవడంలో ప్రధాన పాత్ర పోషించిన విధ్వంసక ఓపెనర్ షఫాలీ వర్మతో పాటు వికెట్ కీపర్ రిచా ఘోష్ కూడా కీలకం కానున్నారు. మొత్తం 10 జట్లు పాల్గొంటున్న ప్రపంచకప్‌లో... ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంకతో కలిసి భారత్ గ్రూప్ ‘బి’ నుంచి పోటీ పడనుంది. మెగా టోర్నీలో భాగంగా అక్టోబర్ 4న న్యూజిలాండ్‌తో హర్మన్ బృందం తొలి మ్యాచ్‌లో తలపడనుంది.
అనంతరం అక్టోబర్ 6న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆడుతుంది. జట్టులో స్పిన్నర్లకు కొదవ లేకున్నా... పేస్ ఆల్‌రౌండర్ల లోటు కనిపిస్తోంది. శ్రేయంక పాటిల్, యస్తికా భాటియాను ఎంపిక చేసినా... గాయాల నుంచి పూర్తిగా కోలుకుంటేనే వీరిద్దరు జట్టుతో కలిసి యూఏఈ బయలుదేరుతారు. ఇక ట్రావెల్ రిజర్వ్‌లుగా తనూజ కన్వర్, ఉమా ఛెత్రీ, సైమా ఠాకూర్ ఎంపికయ్యారు.
----
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్)
మ్యాచ్‌లు 173
పరుగులు 3426
అత్యధిక స్కోరు 103
సగటు 28.08
సెంచరీలు 1
అర్ధ సెంచరీలు 12
వికెట్లు 32
---
స్మృతి మంధాన (వైస్ కెప్టెన్)
మ్యాచ్‌లు 141
పరుగులు 3493
అత్యధిక స్కోరు 87
సగటు 28.86
అర్ధ సెంచరీలు 26
---
షఫాలీ వర్మ
మ్యాచ్‌లు 81
పరుగులు 1948
అత్యధిక స్కోరు 81
సగటు 25.63
అర్ధ సెంచరీలు 10
---
యస్తికా భాటియా
మ్యాచ్‌లు 19
పరుగులు 214
అత్యధిక స్కోరు 36
సగటు 16.46
---
దీప్తి శర్మ
మ్యాచ్‌లు 117
పరుగులు 1020
అత్యధిక స్కోరు 64
సగటు 23.72
అర్ధ సెంచరీలు 2
వికెట్లు 131
---
జెమీమా రోడ్రిగ్స్
మ్యాచ్‌లు 100
పరుగులు 2074
అత్యధిక స్కోరు 76
సగటు 30.50
అర్ధ సెంచరీలు 11
---
రిచా ఘోష్
మ్యాచ్‌లు 55
పరుగులు 860
అత్యధిక స్కోరు 64*
సగటు 28.66
అర్ధ సెంచరీలు 1
---
పూజ వస్త్రకర్
మ్యాచ్‌లు 70
వికెట్లు 57
అత్యుత్తమ ప్రదర్శన 4/13
సగటు 21.24
ఎకానమీ 6.36
---
అరుంధతి రెడ్డి
మ్యాచ్‌లు 29
వికెట్లు 21
అత్యుత్తమ ప్రదర్శన 2/19
సగటు 34.66
ఎకానమీ 7.92
---
రేణుక సింగ్
మ్యాచ్‌లు 47
వికెట్లు 50
అత్యుత్తమ ప్రదర్శన 5/15
సగటు 22.02
ఎకానమీ 6.40
---
హేమలత
మ్యాచ్‌లు 23
పరుగులు 276
అత్యధిక స్కోరు 47
సగటు 16.23
వికెట్లు 9
---
ఆశా శోభన
మ్యాచ్‌లు 3
వికెట్లు 4
ఉత్తమ ప్రదర్శన 2/18
సగటు 20.50
ఎకానమీ 7.45
---
రాధ యాదవ్
మ్యాచ్‌లు 80
వికెట్లు 90
ఉత్తమ ప్రదర్శన 4/23
సగటు 19.62
ఎకానమీ 6.55
---
శ్రేయాంక పాటిల్
మ్యాచ్‌లు 12
వికెట్లు 16
ఉత్తమ ప్రదర్శన 3/19
సగటు 18.75
ఎకానమీ 7.14
---
సజన సజీవన్
మ్యాచ్‌లు 9
పరుగులు 30
అత్యధిక స్కోరు 11
సగటు 10.00
Comments
Please login to add a commentAdd a comment