KKR Wins IPL ‘హ్యాపీ నా పప్పా’: అటు పెద్దోడు, ఇటు చిన్నోడు : తండ్రీ కూతుళ్ల ఎమోషనల్‌ వీడియో | Suhana Khan Hugs And Asks Dad Shah Rukh Khan If He Is Happy After KKR Wins IPL 2024, Video Goes Viral | Sakshi
Sakshi News home page

KKR Wins IPL ‘హ్యాపీ నా పప్పా’: అటు పెద్దోడు, ఇటు చిన్నోడు : తండ్రీ కూతుళ్ల ఎమోషనల్‌ వీడియో

Published Mon, May 27 2024 11:10 AM | Last Updated on Mon, May 27 2024 1:05 PM

 Suhana Khan Hugs And Asks Dad Shah Rukh Khan If He Is Happy After KKR Wins IPL2024

ఐపీఎల్-2024  టైటిల్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు చేజిక్కించుకుంది. 10 ఏళ్ల తర్వాత ట్రోఫీని గెల్చుకోడంతో కేకేఆర్‌ కో-ఫౌండర్‌ షారుఖ్ ఖాన్ భావోద్వేగానికి  లోనయ్యాడు. ఈ సందర్భంగా మైదానంలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.  దీనికి సంబంధించిన విజువల్స్‌నెట్టింట​ తెగ సందడి చేస్తున్నాయి.

ఫైనల్‌  మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించిన షారుఖ్‌ ప్యామిలీ,  పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టైటిల్‌ను అందుకున్న ఆనంద క్షణాల్లో మునిగి తేలాయి.  ఈ సందర్భంగా  షారుఖ్‌ ముద్దుల తనయ సుహానా ఖాన్‌ పరుగున వచ్చి ‘‘మీరు సంతోషంగా ఉన్నారా’’అడిగింది.  దీంతో సూపర్ స్టార్ ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఈ తండ్రీ- కూతుళ్ల ఆనంద క్షణాలు  అటు ఫ్యాన్స్‌ను, ఇటు నెటిజనులు   సంతోషంలో ముంచేశాయి.

ఆ తరువాత కాసేపటికే షారుఖ్ చిన్న కుమారుడు అబ్రామ్, తండ్రీ-కూతురు ద్వయం పరస్వరం గట్టిగా కౌగిలించుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ఇంతలోనే పెద్ద కుమారుడు ఆర్యన్, హగ్గింగ్ ఫెస్ట్‌లో చేరి పోవడం విశేషం. అంతేకాదు చివరి పరుగుతో వెంకేటేష్ అయ్యర్ విజయాన్ని అందించడంతో బాలీవుడ్‌ రొమాన్స్ కింగ్  తన భార్య గౌరీ నుదిటిపై ముద్దు పెట్టుకుని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. దీంతో ,ఇద్దరూ ఆనంద క్షణాల్లో మునిగి తేలిన దృశ్యాలు వైరల్‌ అయ్యాయి. 

 

కాగా ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్స్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు  కేకేఆర్‌ చేతిలో ఘోర పరాజయం పాలైంది.  తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ జట్టు కేవలం 113 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కోల్‌కతా ఈ టార్గెట్‌ను కేవలం 10.3 ఓవర్లలోనే ముగించి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. వెంకటేష్ అయ్యర్ విన్నింగ్ షాట్‌తో 2012, 2014 తర్వాత ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడింది. దీంతో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత అత్యధిక సార్లు ట్రోఫీని గెలిచిన జట్టుగా కోల్‌కతా నిలిచింది. దీంతో షారుఖ్  ఖాన్‌ ఎమోషనల్ అయ్యాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement