సినీ తారలు, క్రికెటర్ల సంబంధాలు సర్వ సాధారణమే. ఆ జాబితాలో విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్ ఇలా చాలా మంది క్రికెటర్స్ బాలీవుడ్ భామలతో రొమాన్స్ చేసిన వారు ఉన్నారు. తాజాగా యువ క్రికెటర్ కేఎల్ రాహుల్, యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇలానే మరో జంట సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
బాలీవుడ్ బాద్‌షా, కోల్‌కతా నైట్‌రైడర్స్ యజమాని షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ యువ క్రికెటర్ శుబ్‌మాన్ గిల్‌తో ప్రేమలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ మ్యాచ్‌ల అనంతరం నైట్‌రైడర్స్ యువ ఆటగాడు గిల్‌తో సుహానా ముచ్చటించడం అందరి ఆకర్షించింది. ప్రస్తుతం వీరు బయట డిన్నర్లు, పార్టీలకంటూ తిరుగుతున్నారని సోషల్ మీడియాలో వదంతులు వినిపిస్తున్నాయి. సుహానా ఇటీవలే తన 18వ పుట్టిన రోజు వేడుకలు చేసుకుంది.
యువ క్రికెటర్‌తో సుహానా ఖాన్ ప్రేమాయణం?
Published Sat, Jun 2 2018 8:52 AM | Last Updated on Sat, Jun 2 2018 2:42 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment