
సాక్షి, హైదరాబాద్: నగరంలో బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఓ యువతి హల్‌చల్ చేసింది. మద్యం మత్తులో ఓ పబ్బు బయట అపస్మారకంగా పడి ఉన్న ఆమెను బంజారాహిల్స్ పోలీసులు కాపాడి స్టేషన్‌కు తీసుకువచ్చారు. అయితే మెలుకువ వచ్చిన తరువాత ఆ యువతి పారిపోయేందుకు ప్రయత్నించగా మహిళా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎస్సైని అసభ్యపదజాలంతో తిడుతూ ఓ కానిస్టేబుల్ చేతిని కొరికింది. మరో కానిస్టేబుల్ మెడపై రక్కింది. మహిళా పోలీసులు ఆమెను ఎట్టకేలకు అదుపు చేశారు. వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించగా అంతు చూస్తానని ఆ యువతి పోలీసులను బెదిరించింది.
సదరు యువతి నాగాలాండ్ నుంచి వచ్చిందని, ఆమె పేరు లీసా అని తెలుస్తోంది. మాదాపూర్ ప్రాంతంలోని ఓ ఐటీ కంపెనీలో ఆమె పని చేస్తోందని పోలీసులు గుర్తించారు. యువతి డ్రగ్స్ తీసుకుందా? లేక మద్యం మత్తులో ఉందా? అన్న విషయాన్ని తేల్చేందుకు రక్త పరీక్షలు నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు. యువతి తల్లిదండ్రులను పిలిపించి అప్పగిస్తామని పోలీసులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment