Nagaland BJP Minister Temjen Imna Praises Rahul Gandhi Photo, Tweet Goes Viral - Sakshi
Sakshi News home page

వాహ్ క్యా పోజ్ హై.. రాహుల్‌ గాంధీపై బీజేపీ మంత్రి ప్రశంసలు

Published Wed, Mar 8 2023 7:33 PM | Last Updated on Wed, Mar 8 2023 7:51 PM

Nagaland BJP Minister Temjen Imna Praises Rahul Gandhi Photo - Sakshi

న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ లండన్ టూర్‌పై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సమయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కమలం పార్టీ నేత, నాగాలాండ్ మంత్రి తెజ్‌మెన్ ఇమ్నా అలోంగ్ రాహుల్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో నెటిజన్లు అవాక్కయ్యారు.

లండన్‌లోని ఛాథం హౌస్‌లో రాహుల్  గాంధీ మాటామంతీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సూటు ధరించి జేబులో చేతులు పెట్టుకున్న ఫొటోను కాంగ్రెస్ ట్విట్టర్‌లో షేర్ చేసింది.  'మీరు ఒంటరిగా ఉన్నా సరే.. మీరు నమ్మినదాని కోసమే నిలబడండి' అని రాసుకొచ్చింది.

దీనిపై స్పందించిన తెజ్‌మెన్ .. రాహుల్ ఫొటో చాలా బాగా వచ్చిందని, అందరూ దీన్ని ఒప్పుకోవాల్సిందేని ప్రశంసించారు. అలాగే ఆయన పోజు నెక్స్ట్‌ లెవల్ అని ఆకాశానికెత్తారు.

ఏంటీ ఈయన రాహుల్‌ను ఇంతలా పొగుడుతున్నారు అని అనుకునేలోపే అసలు ట్విస్ట్ ఇచ్చారు తెజ్‌మన్. ఈ ఫొటో బాగుంది కానీ, దీని క్యాప్షనే ఒరిజినల్ కాదని సైటర్లు వేశారు. కనీసం క్యాప్షన్ అయినా సొంతంగా రాసుకోవచ్చుగా అని ఎద్దేవా చేశారు.

చదవండి: త్రిపుర సీఎంగా డాక్టర్‌ మాణిక్‌ సాహా ప్రమాణం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement