
న్యూఢిల్లీ: ఒకే మ్యాచ్‌లో 136 వైడ్ బాల్స్ నమోదు అయ్యాయి. నాగాలాండ్, మణిపూర్ జట్ల మధ్య బుధవారం అండర్-19 మహిళల వన్డే మ్యాచ్‌ను బీసీసీఐ నిర్వహించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేపట్టిన నాగాలాండ్ 38 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ పరుగుల్లో 94 వైడ్లు ఉన్నాయి. ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోరును సాధించారు.
తర్వాత బ్యాటింగ్‌కు దిగిన మణిపూర్ మహిళల జట్టు27.3 ఓవర్లలో 94 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ ఇన్నింగ్స్‌లో 42 వైడ్లు నమోదయ్యాయి. ఈ మ్యాచ్ ధన్‌బాద్‌లోని నెహ్రూ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో ఏకంగా 136 వైడ్ బాల్స్ నమోదవ్వడంతో ఈశాన్య రాష్ట్రాల్లో క్రికెట్ ఇంకా మెరుగు పడాల్సిన అవసముందని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు.