కరోనా నుంచి బయటపడ్డ 5 రాష్ట్రాలు | Five Out of Eight NE States Corona Free Now: Jitendra Singh | Sakshi
Sakshi News home page

ఐదు రాష్ట్రాల్లో కరోనా లేదు: కేంద్రం

Published Mon, Apr 27 2020 6:25 PM | Last Updated on Mon, Apr 27 2020 6:57 PM

Five Out of Eight NE States Corona Free Now: Jitendra Singh - Sakshi

ఐదు రాష్ట్రాలు కరోనా మహమ్మారి బారి నుంచి బయటపడ్డాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాల్లోని ఐదు రాష్ట్రాలు కరోనా మహమ్మారి బారి నుంచి బయటపడ్డాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సిక్కిం, నాగాలాండ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, మణిపూర్‌, త్రిపుర కోవిడ్‌-19 లేని రాష్ట్రాలుగా నిలిచాయని ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ వెల్లడించారు. ఈశాన్య ప్రాంతంలోని మిగతా మూడు రాష్ట్రాలైన అసోం, మిజోరం, మేఘాలయా.. కరోనా ఫ్రీ కానప్పటికీ తాజాగా కోవిడ్‌ కేసులు నమోదు కాలేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పటిష్టమైన చర్యల కారణంగానే ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా ముప్పు తక్కువగా ఉందన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత ఆరేళ్ల నుంచి ఈశాన్య ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేసిందని చెప్పుకొచ్చారు. (కరోనా వైరస్‌.. మరో దుర్వార్త

‘దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్నప్పటికీ నిత్యవసర సరుకుల కొరత రాకుండా కార్గో విమానాల ద్వారా ఈశాన్య రాష్ట్రాలకు సరుకులు తరలిస్తున్నాం. ఎయిర్‌ ఇండియా, ఇండియన్‌ వాయుసేన ద్వారా ఈశాన్య రాష్ట్రాలతో పాటు జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌లకు ప్రాధాన్యతా క్రమంలో సరుకులు పంపిస్తున్నామ’ని జితేంద్ర సింగ్‌ తెలిపారు. ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి కట్టడికి షిల్లాంగ్‌లోని ఈశాన్య అభివృద్ధి మండలితో కలిసి సమన్వయంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ కంటే ముందే కేంద్రం నుంచి ఈశాన్య రాష్ట్రాలకు ఆర్థిక  సహాయం  అందించామన్నారు. (లాక్‌డౌన్‌ సడలింపా.. అదేం లేదు: సీఎం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement