north east states
-
ఎన్నికల యుద్ధానికి సై.. ఈ రాష్ట్రాల్లో గెలుపెవరిది?
సార్వత్రిక ఎన్నికల భేరి మోగింది. ఎన్నికల క్షేత్రంలో నువ్వా.. నేనా?.. విజయమా.. పరాజయమా? తేల్చుకోవాల్సిన సమయం అన్ని పార్టీలకు, ఆయా పార్టీల నాయకులకు ఆసన్నమైంది. ఓ వైపు దేశ ప్రధాని నరేంద్ర మోదీ 400 సీట్ల లక్ష్యంతో పర్యటిస్తున్నారు. మరో వైపు ఇండియా కూటమి కూడా తనదైన రీతిలో ప్రచారం సాగిస్తోంది. పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు మాత్రమే కాకుండా ఒడిశా, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో స్థానిక పార్టీలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. ఈ కథనంలో ఈశాన్య రాష్ట్రాల్లో ఏ పార్టీ బలంగా ఉంది.. కీలక నేతలు ఎవరనే వివరంగా వివరంగా తెలుసుకుందాం. పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), బీజేపీ, కాంగ్రెస్ ప్రధాన పార్టీలుగా.. 'మమతా బెనర్జీ, అధీర్ రంజాన్ చౌదరి, సువెందు అధికారి' కీలక నేతలుగా ఉన్నారు. కాగా 2019లో మొత్తం 42 లోక్‌సభ స్థానాల్లో 22 టీఎంసీ, 18 బీజేపీ, 2 కాంగ్రెస్ సొంతం చేసుకున్నారు. ఇక జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలుపొందనుందనే విషయం త్వరలోనే తెలుస్తుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మమతా బెనర్జీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మరో వైపు సందేశ్‌ఖాలీ దురాగతాలపై కూడా విమర్శలు జోరందుకున్నాయి. సీఏఏ అమలుపై టీఎంసీ ప్రభుత్వం వ్యతిరేకతను చూపుతోంది. ఈ తరుణంలో జరగనున్న 294 అసెంబ్లీ స్థానాల్లో ఏ పార్టీ ఎక్కువ స్థానాల్లో గెలుస్తుంది. ఏ ప్రభుత్వం అమల్లోకి వస్తుందనే విషయాలు తెలియాల్సి ఉంది. మధ్యప్రదేశ్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రధానంగా ఉన్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శివరాజ్‌సింగ్ చౌహన్, మోహన్ యాదవ్, కమల్‌నాథ్, జ్యోతిరాదిత్య సింధియా కీలకనేతలుగా ఉన్నారు. 2019లో బీజేపీ 28, కాంగ్రెస్ 1 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో హిందుత్వ వాదం, కుల సమీకరణ, నిరుద్యోగం వంటివి ప్రధాన సమస్యలుగా ఉన్న తరుణంలో 230 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనుంది. కాగా ఫలితాలు వెల్లడైన తరువాత మధ్యప్రదేశ్ ఏ పార్టీ హస్తగతం చేసుకోనుందనే విషయం తెలియాల్సి ఉంది. ఝార్ఖండ్ 14 లోక్‌సభ స్థానాలకు, 81 అసెంబ్లీ స్థానాలకు ఝార్ఖండ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ 2019లో ఎన్డీఏ 12 స్థానాల్లో యూపీఏ 2 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం మీద ఆరోపణలు, నగదు అక్రమ చలామణి కేసులో హేమంత్ సోరెన్ అరెస్ట్ వంటి విషయాలు కీలకమైన అంశాలుగా చెలరేగుతున్నాయి. ఒడిశా బిజూ జనతాదళ్ (బీజద), బీజేపీ, కాంగ్రెస్ ప్రధాన పార్టీలుగా ఉన్న ఒడిశాలో ఈ సారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో మరి కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది. నవీన్ పట్నాయక్ఎం మన్మోహన్ సామల్ కీలక నేతలుగా ఉన్న ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలులో అవినీతి వంటి అంశాలు ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. కాగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజద 12, బీజేపీ 8, కాంగ్రెస్ 1 స్థానాలను సొంతం చేసుకున్నాయి. అస్సాం 2019లో ఎన్డీఏ 9, కాంగ్రెస్ 3, ఇతరులు 2 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకున్న అస్సాం రాష్ట్రంలో ఈ సారి ఏ పార్టీ ఆధిక్యంలో ఉంటుందనేది తెలియాల్సి ఉంది. 126 స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో హిమంత బిశ్వశర్మ, బద్రుద్దీన్ అజ్మల్, భూపేన్ కుమార్ బోరా కీలక నేతలుగా ఉన్నారు. ఛత్తీస్‌గఢ్ 90 స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఛత్తీస్‌గఢ్ ఎవరి చేతుల్లోకి వెళుతుందనేది తెలియాల్సిన విషయం. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 9, కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలుపొందింది. విష్ణుదేవ్ సాయ్, రమణ్ సింగ్, భూపేశ్ బఘేల్ కీలక నేతలుగా ఛత్తీస్‌గఢ్ ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యలతో సతమతమవుతోంది. అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ రెండు లోక్‌సభ స్థానాలను 2019లో బీజేపీ హస్తగతం చేసుకుంది. అయితే ఈ రాష్ట్రంలో 60 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరనున్నాయి. పెమా ఖండూ, నబమ్ తుకి కీలక నేతలుగా రాష్ట్రంలో సరిహద్దు ప్రాంత అభివృద్ధి మాత్రమే కాకుండా.. మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమస్యలు ఉన్నట్లు సమాచారం. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. మణిపూర్ ఎన్డీఏ అధికార పక్షంగా ఉన్న మణిపూర్ రాష్ట్రంలో 60 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. 2019లో బీజేపీ1, నేషనల్ పీపుల్స్ పార్టీ 1 లోక్‌సభ స్థానాలను గెలుచుకున్నాయి. ఎన్. బీరేన్ సింగ్, ఇబోబి సింగ్ కీలక నేతలుగా ఈ రాష్ట్రంలో జాతుల మధ్య ఘర్షణ, శాంతి భద్రతల సమస్యలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ప్రధాన పార్టీలుగా బీజేపీ, నేషనల్ పీపుల్స్ పార్టీ, కాంగ్రెస్ ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. మేఘాలయ నేషనల్ పీపుల్స్ పార్టీ అధికారంలో ఉన్న మేఘాలయలో.. అస్సాం సరిహద్దు, నిరుద్యోగం వంటి సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. ఇక్కడ కెలక నేతలుగా కాన్రాడ్ సంగ్మా, ముకుల్ సంగ్మా కీలక నేతలుగా ఉన్నారు. 60 స్థానాలకు అసెంబ్లీ జరగాల్సి ఉంది. అయితే 2019లో ఇక్కడున్న రెండు లోక్‌సభ స్థానాలను కాంగ్రెస్, NPP చెరొకటి సొంతం చేసుకున్నాయి. త్రిపుర బీజేపీ అధికారంలో ఉన్న త్రిపురలోని రెండు లోక్‌సభ స్థానాలను భాజపా హస్తగతం చేసుకుంది. ఇక్కడ బీజేపీ, సీపీఎం ప్రధాన పార్టీలుగా.. మాణిక్ సాహా, మాణిక్ సర్కార్ కీలక నేతలుగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ధరల పెరుగుదల ప్రధాన సమస్యగా ఉంది. త్రిపురలో 60 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. మిజోరం మిజో నేషనల్ ఫ్రంట్ పార్టీ ఉన్న ఒక్క లోక్‌సభ స్థానం సొంతం చేసుకోగా.. అధికార పక్షంలో ZPM ఉంది. ఇక్కడ 40 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన నేతలుగా లాల్ దుహోమా, జోరథంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో రైతు సమస్యలు, రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేఖత, హిందూ క్రిస్టియన్ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. నాగాలాండ్ యునైటెడ్ డెమొక్రాటిక్ అలయెన్స్ కూటమి అధికారంలో ఉన్న నాగాలాండ్ రాష్ట్రంలో 'నెప్యూ రియో' కీలక నేతగా ఉన్నారు. బీజేపీ, నేషనల్ డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ, నాగా పీపుల్స్ ఫ్రంట్ పార్టీలు ప్రధానంగా ఉన్న ఈ రాష్ట్రంలో నేషనల్ డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ ఏట నాగాలాండ్ రాష్ట్రంలో ఏ పార్టీ జెండా ఎగురుతుందో చూడాలి. సిక్కిం 32 అసెంబ్లీ స్థానాలు, 1 లోక్‌సభ స్థానం ఉన్న సిక్కిం రాష్ట్రంలో సిక్కిం క్రాంతికారి మోర్చా (SKM), బీజేపీ కూటమి అధికార పక్షంగా ఉంది. ఈ రాష్ట్రంలో ప్రేమ్‌సింగ్ తమాంగ్, పవన్ కుమార్ చామ్లింగ్ కీలక నేతలుగా ఉన్నారు. సిక్కిం 1 లోక్‌సభ స్థానాన్ని 2019లో SKM సొంతం చేసుకుంది. ఈ ఏట ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలుసుకోవడానికి మరికొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ 2024 ఏప్రిల్ 19న ప్రారంభమై.. ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20, మే 25, జూన్ 1 తేదీల్లో మొత్తం ఏడు దశల్లో జరుగుతుంది. భారతీయ పౌరులు తప్పకుండా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును తప్పకుండా ఉపయోగించుకోవాలి. మందుకు, విందుకు, కరెన్సీ నోటుకు నీ ఓటును అమ్ముకుంటే.. భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుంది. కులానికో.. మతానికో కాకుండా సమర్ధుడైన నాయకున్ని ఎన్నుకుంటే సమర్థవంతమైన పాలన సాగుతుంది. మేలుకో.. తెలుసుకుని మసలుకో. -
India Meteorological Department: చలి తీవ్రత ఈసారి తక్కువే
ఢిల్లీ: దేశవ్యాప్తంగా అత్యధిక ప్రాంతాల్లో ఈసారి డిసెంబర్ నెలలో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా కాస్తంత అధికంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ‘‘ఉత్తర, వాయవ్య, మధ్య, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో చలి గాలుల తీవ్రత సాధారణ స్థాయి కన్నా తక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే ఈసారి డిసెంబర్లో చలి తక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ డిసెంబర్–ఫిబ్రవరి సీజన్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణంగా కన్నా కాస్తంత ఎక్కువ నమోదవ్వొచ్చు. ఈసారి ఎల్‌నినో పరిస్థితులు ఉండటమూ ఇందుకు మరో ప్రధాన కారణం’’ అని విశ్లేషించింది. -
త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ ఎన్నికల షెడ్యూల్ విడుదల
-
రెండ్రోజులపాటు 70వ ఎన్ఈసీ సమావేశాలు
గువాహటి నుంచి సాక్షి ప్రతినిధి: ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధే లక్ష్యంగా ఏర్పాటైన ఈశాన్య రాష్ట్రాల మండలి (నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్) 70 వ ప్లీనరీ సమావేశాలు నేటి నుంచి రెండు రోజుల పాటు అసోం రాజధాని గువాహటిలో జరగనున్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి, ఎన్ఈసీ ఎక్స్–అఫిషియో చైర్మన్ అమిత్ షా నేతృత్వంలో జరగనున్న ఈ సమావేశాల్లో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, చీఫ్ సెక్రటరీలు, డీజీపీలు, ఉన్నతాధికారులతో పాటు ఎనిమిది రాష్ట్రాల గవర్నర్లు కూడా పాల్గొననున్నారు. ఈ సమావేశాల్లో ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి స్థాపన తర్వాత మారుతున్న పరిస్థితులు, ఈ ఎనిమిది రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించిన ఆర్థిక మద్దతు, వివిధ ప్రాంతాల మధ్య అనుసంధానత (రైలు, రోడ్డు, విమాన, జలమార్గాల్లో), ఉడాన్ పథకంలో భాగంగా జరుగుతున్న విమానాశ్రయాల నిర్మాణం, టెలికామ్ అనుసంధానత, విద్యుత్, ఎనర్జీ రంగాలు, విద్య, వైద్యం, వ్యవసాయం రంగాల్లో గతంలో నిర్దేశించుకున్న లక్ష్యాల్లో ఎంతవరకు చేరుకున్నారు. భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి లక్ష్యాల నిర్దేశం తదితర అంశాలపై కూలంకశంగా చర్చించనున్నారు. దీంతోపాటుగా యువతకు ఉపాధి కల్పన, పరిశ్రమలు, పర్యాటకం, ఆగ్నేయాసియా దేశాలతో అనుసంధానత తదితర అంశాలపైనా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి జీ–20 సదస్సుకు భారతదేశం నేతృత్వం వహిస్తున్న సందర్భంలో.. ఈ సమావేశాల్లో ఈశాన్య రాష్ట్రాల భాగస్వామ్యం తదితర అంశాలను కూడా చర్చించనున్నారు. అంతేగాక ఇటీవల బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్ పర్యటనలో భాగంగా జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో ఈశాన్య రాష్ట్రాలతో సంబంధాలు మెరుగుపరిచేందుకు ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులను తీసుకొని బంగ్లాదేశ్‌లో పర్యటించాల్సిందిగా ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్‌రెడ్డిని కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో బంగ్లాదేశ్ పర్యటనకు సంబంధించిన అంశాలపై కూడా ప్లీనరీలో చర్చించే అవకాశం ఉంది. కాగా గతేడాది మేఘాలయ రాజధాని షిల్లాంగ్ లో 69వ ఎన్ఈసీ సమావేశాలు జరిగాయి. చదవండి: నేనేం సోనియా రిమోట్‌ను కాను -
కరోనా నుంచి బయటపడ్డ 5 రాష్ట్రాలు
న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాల్లోని ఐదు రాష్ట్రాలు కరోనా మహమ్మారి బారి నుంచి బయటపడ్డాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సిక్కిం, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, త్రిపుర కోవిడ్-19 లేని రాష్ట్రాలుగా నిలిచాయని ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఈశాన్య ప్రాంతంలోని మిగతా మూడు రాష్ట్రాలైన అసోం, మిజోరం, మేఘాలయా.. కరోనా ఫ్రీ కానప్పటికీ తాజాగా కోవిడ్ కేసులు నమోదు కాలేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పటిష్టమైన చర్యల కారణంగానే ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా ముప్పు తక్కువగా ఉందన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత ఆరేళ్ల నుంచి ఈశాన్య ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేసిందని చెప్పుకొచ్చారు. (కరోనా వైరస్.. మరో దుర్వార్త) ‘దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్నప్పటికీ నిత్యవసర సరుకుల కొరత రాకుండా కార్గో విమానాల ద్వారా ఈశాన్య రాష్ట్రాలకు సరుకులు తరలిస్తున్నాం. ఎయిర్ ఇండియా, ఇండియన్ వాయుసేన ద్వారా ఈశాన్య రాష్ట్రాలతో పాటు జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లకు ప్రాధాన్యతా క్రమంలో సరుకులు పంపిస్తున్నామ’ని జితేంద్ర సింగ్ తెలిపారు. ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి కట్టడికి షిల్లాంగ్‌లోని ఈశాన్య అభివృద్ధి మండలితో కలిసి సమన్వయంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. లాక్డౌన్ కంటే ముందే కేంద్రం నుంచి ఈశాన్య రాష్ట్రాలకు ఆర్థిక సహాయం అందించామన్నారు. (లాక్డౌన్ సడలింపా.. అదేం లేదు: సీఎం) -
‘పౌరసత్వం’పై అపోహలు.. నిజాలు తెలుసుకోండి..!
న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ఈశాన్య రాష్ట్రాల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహావేశాల్ని తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలకు ఎలాంటి విఘాతం కలిగించబోమని మరోమారు స్పష్టం చేసింది. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం అధీనంలోని పీఐబీ (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) పౌరసత్వ చట్టానికి సంబంధించి పలు నిజానిజాలను ట్విటర్లో శనివారం వెల్లడించింది. ఈశాన్య రాష్ట్రాల ప్రజలు భయపడుతున్నట్టు సీఏఏ వల్ల మనదేశంలోకి నూతన వలసలు ఉండబోవని స్పష్టం చేసింది. ఈనేపథ్యంలో సీఏఏపై ప్రచారంలో ఉన్న అపోహలు.. చట్టం చెబుతున్న వాస్తవాలను #Mythbusters పేరుతో పేర్కొంది. బంగ్లాదేశ్‌లో 28 శాతంగా ఉన్న హిందూ మైనారిటీల సంఖ్య 8 కి చేరిందని వెల్లడించింది. తీవ్రమైన ఉద్రిక్తతల నడుమ ఇప్పటికే చాలామంది మైనారిటీలు ఆయా దేశాల నుంచి ఇతర ప్రాంతాలకు, దేశాలకు వలస పోయారని పేర్కొంది. (చదవండి : ‘అల్లర్లు ఆగకపోతే రాష్ట్రపతి పాలనే’) ఆయా దేశాల్లో మైనారిటీలపై మతపరమైన హింస తగ్గిందని, దాంతో వలసలు కూడా తగ్గుముఖం పట్టాయని తెలిపింది. ఇక అస్సాంలో సరైన పత్రాలు లేకుండా నివసిస్తున్న లక్షా యాభై వేల మంది బంగ్లా హిందువులకు భారత పౌరసత్వం ఇస్తారనే వార్తల్లో వాస్తవం లేదని చెప్పింది. పౌరసత్వ చట్టానికి సవరణలు చేసినంత మాత్రాన విదేశీయులెవరైనా భారత పౌరసత్వం పొందగలరు అనుకుంటే పొరపాటే అవుతుందని కేంద్రం స్పష్టం చేసింది. మనదేశ పౌరసత్వం కోరుకునే ప్రతి ఒక్కరి దరఖాస్తును అత్యున్నత అథారిటీ పరిశీలిస్తుందని... నిబంధనలకు లోబడి దరఖాస్తులు ఉన్నప్పుడే భారత పౌరసత్వం లభిస్తుందని తేల్చి చెప్పింది. కాగా, గత నాలుగు రోజులుగా ఈశాన్య రాష్ట్రాల్లో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. (చదవండి : ‘పౌరసత్వం’పై కాంగ్రెస్ రెచ్చగొడుతోంది: అమిత్) Busting some #Myths : #Mythbusters focusing on North-Eastern India, especially #Assam, surrounding the #CitizenshipAmendmentAct. The 11-points address the most common misconceptions and fears in the region (1/2) #CAB #CAB2019 pic.twitter.com/dJ35FKxcBZ — PIB India (@PIB_India) December 14, 2019 -
ఇప్పుడు ‘ఆర్టికల్ 371’పై ఆందోళన
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న భారత రాజ్యాంగంలోని 370వ అధికరణను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో ఈశాన్య రాష్ట్రాలకు ఇలాగే ప్రత్యేక హక్కులను కల్పిస్తున్న రాజ్యాంగంలోని 371వ అధికరణను రద్దు చేస్తారన్న ఆందోళన ఆయా రాష్ట్రాల్లో గుబులు రేపుతోంది. ‘ఏ రెడ్ అలర్ట్ టు ది పీపుల్ ఆఫ్ నార్త్ ఈస్ట్’ అంటూ మిజోరం మాజీ ముఖ్యమంత్రి లాల్ తన్హావులా సోమవారం సాయంత్రం చేసిన ట్వీట్‌తో ఈ గుబులు బయల్దేరింది. ముఖ్యంగా నాగాలాండ్‌లో ఈ ఆందోళన ప్రజల్లోకి ఎక్కువగా చొచ్చుకుపోవడంతో ‘అలాంటి ఆందోళన ఏమీ అవసరం లేదు. 371 ఏ ఆర్టికల్ కింద మీకు కల్పిస్తున్న హక్కులు పవిత్రమైనవి’ అంటూ నాగాలాండ్ గవర్నర్ ఆర్ఎన్ రవీ మంగళవారం నాడు ఓ ప్రకటన జారీ చేశారు. మిజోరమ్, నాగాలాండ్, మనిపూర్, మేఘాలయ, ఆస్సాంలోని కొన్ని ప్రాంతాలకు 371 అధికరణ కింద కొన్ని ప్రత్యేక హక్కులు ఉన్నాయి. వాటిలో ఎక్కువగా ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఈశాన్య రాష్ట్రాల స్థలాలను కొనుగోలు చేయకుండా నివారించేందుకే అయినప్పటికీ కొన్ని ప్రత్యేక రాజకీయపరమైన హక్కులు కూడా ఉన్నాయి. వీటికి సంబంధించిన చట్టాలు కూడా ఏకరీతిగా లేవు. నాగాలాండ్‌కు వర్తించే ఆర్టికల్ 371 ఏ ప్రకారం నాగాల మత, సామాజిక పరమైన అంశాల్లో భారత పార్లమెంట్‌కు సంబంధించిన ఏ చట్టమూ వర్తించదు. నాగాలాండ్ రాష్ట్రం ప్రత్యేక శాసనం ద్వారా పార్లమెంట్ చట్టాలను వర్తింపచేయవచ్చు. మిజోరమ్‌కు కూడా ఆర్టికల్ 371 జీ కింద ఇలాంటి సామాజిక, మత హక్కులు ఉన్నాయి. మణిపూర్‌కు వర్తించే ఆర్టికల్ 371 సీ కింద కొండ ప్రాంతాలకు ప్రత్యేక హక్కులు ఉన్నాయి. అయితే ఆ హక్కులు ఆ కొండ ప్రాంతాల జిల్లా కౌన్సిళ్లకు పరిమితంగానే ఉన్నాయి. నాగాల సాయుధ పోరాటం ప్రత్యేక నాగాలాండ్ దేశం కోసం నాగాలు కొన్ని దశాబ్దాలపాటు సాయుధ పోరాటం జరిపారు. ఆ తర్వాత వారు కేంద్రంతో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నారు. అప్పటి నుంచి తమ రాష్ట్రానికి మరింత స్వయం ప్రతిపత్తి కావాలంటూ పలు నాగా గ్రూపులు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. వారితో ఎప్పటికప్పుడు చర్చలు జరిపేందుకు మధ్యవర్తి రవినే రాష్ట్ర గవర్నర్‌గా కేంద్రం నియమించింది. ‘మాకున్న హక్కులను రద్దు చేస్తారనే భయం ఇప్పుడు ప్రతి నాగాను వెంటాడుతోంది. మా ప్రత్యేక రాజకీయ చరిత్ర, సామాజిక సంస్కృతిని పరిరక్షించుకునేందుకు 371 ఏ కన్నా మంచి చట్టాలు కావాలంటూ మేము చర్చలకు సిద్ధమైన నేపథ్యంలో 371ఏను కేంద్రం రద్దు చేయాలనుకోవడం అంతకన్నా హస్వ దృష్టి మరోటి ఉండదు’ అని నాగా విద్యార్థి సమాఖ్య అధ్యక్షుడు నైనతో అవోమి వ్యాఖ్యానించారు. దేశంలోని మైనారిటీల పట్ల బీజేపీకి ప్రత్యేక అభిమానం లేకపోవడం, పార్లమెంట్లో వారికి ఎదురులేకపోవడం వల్ల ఇలాంటి భయాలు నాగాలకు కలుగుతున్నాయని మెజారిటీ నాగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ‘నాగా హొహో’ అధ్యక్షుడు పీ చుబా ఓజికుమ్ అన్నారు. ఆర్టికల్ 371 గురించి నాగాలు భయపడినంతగా ఇతర ఈశాన్య రాష్ట్రాల ప్రజలు అంతగా భయపడడం లేదు. -
అక్కడ అమిత్ షా కన్నా ఆయనే ముఖ్యం
న్యూఢిల్లీ : బీజేపీలో ప్రస్తుతం అమిత్ షా శకం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా అన్ని చోట్ల పార్టీ బలోపేతానికి అమిత్ షా కృషి చేస్తున్నారు. అయితే ఈశాన్య రాష్ట్రల్లో మాత్రం అమిత్ షా ప్రభావం అంతగా లేదట. అక్కడ అమిత్ షా కన్నా అస్సాం ఆర్థిక మంత్రి హిమంత బిశ్వా శర్మకే అధిక ప్రాధాన్యం ఉందంటున్నారు పార్టీ జనరల్ సెక్రటరీ రాం మాధవ్. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల్లో పార్టీ హిమంత బిశ్వాకు టికెట్ కేటాయించలేదు. ఈ విషయంపై స్పందించిన రాం మాధవ్.. ‘దీన్ని బట్టి పార్టీ అమిత్ షా కన్నా ఎక్కువ బాధ్యతలు హిమంతకే అప్పగించిందనే విషయం స్పష్టమవుతోంది. ఈశాన్య భారతంపై హిమంత బిశ్వాకు చాలా పట్టుంది. ఇప్పటి వరకూ 5, 6 ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోశించారు. అందుకే పార్టీ.. ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ప్రచార భారాన్నంత ఆయన మీదనే మోపింది. ఇందుకు చాలా శక్తి, సమయం కావాలి. ఈ బాధ్యతలు చూడ్డానికే టైం సరిపోదు. ఇక ఆయన కూడా పోటీలో ఉంటే.. పార్టీ ప్రచార బాధ్యతలతో పాటు ఆయన గెలుపు కోసం కూడా కష్టపడాల్సి ఉంటుంది. దీని వల్ల హిమంత బిశ్వాపై ఒత్తిడి పెరుగుతుంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకునే పార్టీ ఆయనకు టికెట్ కేటాయించలేద’ని తెలిపారు. హిమంత బిశ్వాకు టికెట్ కేటాయించకపోవడంపై అమిత్ షా స్పందిస్తూ.. ‘ప్రస్తుతం ఈశాన్యం ప్రాంతంలో పార్టీని బలోపేతం చేసే ముఖ్యమైన బాధ్యతలను ఆయనకు అప్పగించాం. అందుకే ఈ సారి ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం లేదని తెలిపారు. ఈశాన్య రాష్ర్టాల్లో బీజేపీకి లైఫ్ ఇచ్చిన హిమంత బిశ్వా.. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో కీలక నేత. 2015లో ఈయన బీజేపీలో చేరారు. ఆ తర్వాత ఈశాన్య ప్రాంతంలో కమలం వికసించేలా కృషి చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ ట్రబుల్ షూటర్‌గా గుర్తింపు పొందారు. -
గణతంత్ర వేడుకలకు దూరంగా ఈశాన్య రాష్ట్రాలు
మిజోరాం : దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతుండగా.. ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తుంది. పౌరసత్వ (సవరణ) బిల్లు, 2016ను వ్యతిరేకిస్తూ.. ఈశాన్య రాష్ట్రాల్లోని పలు సంస్థలు గణతంత్ర దినోత్సవ వేడుకలను బహిష్కరించాయి. వీటితో పాటు కొన్ని ఉగ్రవాద సంస్థలు కూడా రిపబ్లిక్ డే వేడుకలను బహిష్కరించాలని పిలుపునివ్వడంతో ఈశాన్య రాష్ర్టాల్లో హైఅలర్ట్ ప్రకటించారు పోలీసులు. ఇలా పిలుపునిచ్చిన వాటిల్లో నాగలాండ్‌కు చెందిన ‘నాగ స్టూడెంట్స్ ఫెడరేషన్’(ఎన్ఎస్ఎఫ్), మణిపూర్‌కు చెందిన మరి కొన్ని సంస్థలు ఉన్నాయి. ఈ క్రమంలో ఎన్ఎస్ఎఫ్ పౌరసత్వ బిల్లు పట్ల ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలంటూ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం తన ద్వంద్వ వైఖరితో ప్రజలను తప్పు దోవ పట్టింస్తోందని ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో రిపబ్లిక్ డే వేడుకలను బహిష్కరించాలంటూ ఎన్ఎస్ఎఫ్ పిలుపునిచ్చింది. ఇక మణిపూర్‌కు చెందిన ఐదు పౌరసంస్థలు కూడా పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను బహిష్కరించాలంటూ పిలుపునిచ్చాయి. దాంతో అక్కడి ప్రజలు రిపబ్లిక్ డే వేడుకలను బహిష్కరిస్తున్నట్లు బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి వలస వచ్చి ఆరేండ్ల పాటు దేశంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించాలని కేంద్రం ప్రతిపాదించిన పౌరసత్వ (సవరణ) బిల్లు, 2016ను పార్లమెంట్ ఆమోదించిన సంగతి తెలిసిందే. -
అదేం పెద్ద సమస్యే కాదు
ఓవైపు అసోం ఎన్ఆర్సీ వ్యవహారం రాజకీయ చిచ్చును రాజేసిన వేళ.. త్రిపుర సీఎం విప్లవ్ దేవ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఎన్ఆర్సీ అనేది చాలా చిన్న విషయమని.. దాన్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న రీతిలో ఆయన వ్యాఖ్యానించారు. మంగళవారం నాగ్‌పూర్‌కు వెళ్లిన విప్లవ్.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్భగత్ను కలిశారు. అనంతరం విప్లవ్ మీడియాతో మాట్లాడుతూ ఎన్ఆర్సీ వ్యవహారంపై స్పందించారు. (ఆమెను అందగత్తె అని ఎవరైనా అంటారా?) ‘ఎన్ఆర్సీ డిమాండ్ ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో అయితే లేదు. ప్రతీ విషయం కూడా మా రాష్ట్రంలో(త్రిపుర) చాలా పద్ధతిగా ఉంటుంది. నాకు తెలిసి అసోంలో కూడా అదేం పెద్ద విషయం కాదనే అనిపిస్తోంది. ఆ రాష్ట్ర సీఎం సర్బానంద సోనోవాల్ ఈ వ్యవహారాన్ని చక్కబెడతారన్న నమ్మకం ఉంది. శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసి కల్లోలం రేపాలని కొందరు యత్నిస్తున్నారు. విదేశీ మైండ్‌సెట్‌తో ఉన్నవాళ్లే ఈ అంశాన్ని వివాదాస్పదం చేస్తున్నారు’ అని విప్లవ్ మీడియాతో వ్యాఖ్యానించారు. కాగా, ఈ వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి. (భారతంలో ఇంటర్నెట్) -
ఈశాన్య రాష్ట్రాలను ముంచెత్తుతున్న వరదలు
-
ఈశాన్యంలో బీజేపీ ప్రభంజనం ఎక్కడ ?
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభంజనం సష్టించిందని, ఏడు ఈశాన్య రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో ఆరు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కైవసం చేసుకొందని, కాంగ్రెస్, వామపక్షాలను పూర్తిగా తుడిచి పెట్టేసిందని కాషాయ వర్గాలు తుపానుకన్నా బీభత్సంగా ప్రచారం చేస్తున్నాయి. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈశాన్య రాష్ట్రాలో ఆ పార్టీ ప్రభావం పెరిగిన మాట వాస్తవమేగానీ ప్రచారం చేసుకుంటున్నంతగా కాదు. అందులో సగం కూడా కాదు. ఆరు రాష్ట్రాల ప్రభుత్వాల్లో భాగస్వామిగా ఉంటున్న మాట కూడా వాస్తవమేగానీ రెండు రాష్ట్రాల్లో మాత్రమే అది ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో ఛోదక శక్తిగా వ్యవహరించింది. బీజేపీ సహా కాషాయ వర్గాలు ప్రచారం చేస్తున్నట్లుగా ప్రభంజనం, పెను తుపాను లాంటి మాటలను పక్కన పెడితే ఏడు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం కూడా మరీ ఎక్కువేమి కాదు. త్రిపురలో 43, మణిపూర్‌లో 36.28, అరుణాచల్ ప్రదేశ్‌లో 30.97, అస్సాంలో 29.51, నాగాలాండ్‌లో 15.3, మేఘాలయలో 9.6, మిజోరంలో 0.37 శాతం. 60 స్థానాలు కలిగిన త్రిపురలో 43 శాతం ఓట్లతో 35 సీట్లను బీజేపీ గెలుచుకొని ఎవరి మద్దతు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి చేరుకుంది. సీపీఎం 42.7 శాతం ఓట్లతో 16 సీట్లను మాత్రమే గెలుచుకుంది. కాకపోతే సీపీఎం 59 సీట్లకు పోటీ చేయగా, బీజేపీ 51 సీట్లకు పోటీ చేసింది. పోటీ చేసిన సీట్లలో 70 శాతం గెలుచుకోవడం ద్వారా బీజేపీ త్రిపురలో ఎక్కువగానే లాభ పడింది. సీపీఎం 29 శాతం సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. త్రిపుర పీపుల్స్ ఫ్రంట్ 9 సీట్లకు పోటీచేసి, ఎనిమిది సీట్లను గెలుచుకోవడం ద్వారా అన్ని పార్టీలకన్నా ఎక్కువగా రాణించింది. మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో బీజేపీది విజయం అని కూడా చెప్పలేం. మేఘాలయలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారు. ఆ పార్టీ కేవలం రెండంటే రెండు సీట్లను మాత్రమే గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత తీవ్రంగా ఉన్న జెయింటియా హిల్స్‌లో కూడా బీజేపీ ఒక్క సీటును కూడా గెలుచుకోలేదు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 21 సీట్లను గెలుచుకుంది. బీజేపీ మద్దతిచ్చిన నేషనల్ పీపుల్స్ పార్టీకి 19 సీట్లు వచ్చాయి. దాంతో ఆ పార్టీ బీజేపీ, హిల్ స్టేట్స్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, జేడీయూ, ఓ స్వతంత్య్ర అభ్యర్థి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రభుత్వం ఎంతోకాలం సుస్థిరంగా ఉండే అవకాశం లేదు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడాన్ని హిల్‌స్టేట్స్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ సోమవారం నాడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెల్సింది. ఇక నాగాలాండ్‌లో బీజేపీ గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే సీట్ల సంఖ్యను పెంచుకోగలిగింది. 2013 ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు రాగా, ఈ సారి 12 సీట్లు వచ్చాయి. ఓట్ల శాతాన్ని. 1.8 నుంచి 15. 3 శాతానికి పెంచుకుంది. ఇక్కడ బీజేపీ మద్దతిచ్చిన నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకి 17 సీట్లు వచ్చాయి. నాగాలాండ్‌లో ఈ రెండు పార్టీలకు కలిసి 29 సీట్లు వచ్చాయి. మొన్నటి వరకు అధికారంలో ఉన్న నాగా పీపుల్స్ పార్టీకి 27 సీట్లు వచ్చాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో చిన్నా, చితక పార్టీలను కలుపుకొని బీజేపీ మద్దతిచ్చిన నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నిస్తోంది. -
‘కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్లే బీజేపీ గెలిచింది’
కోల్‌కతా : తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈశాన్య రాష్ట్రాల ఫలితాలపై స్పందించే క్రమంలో బీజేపీతోపాటు కాంగ్రెస్ పార్టీపైనా ఆమె విమర్శలు చేశారు. కాంగ్రెస్ నిర్లక్ష్యం మూలంగానే బీజేపీ గెలిచిందని ఆమె వ్యాఖ్యానించారు. ‘బీజేపీని ఓడించేందుకు ప్రాంతీయ పార్టీలను కలుపుకునిపోవాలనికాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌కు నేను సూచించా. కానీ, కాంగ్రెస్ పార్టీ నా మాట వినలేదు. ఫలితం ఘోర పరాభవం చవిచూడాల్సి వచ్చింది. ఒకవేళ కాంగ్రెస్ సరైన పోరాటం చేసి ఉంటే కనీసం 10 స్థానాలైనా దక్కి ఉండేవి. కాంగ్రెస్ నిర్లక్ష్యమే వారిని దెబ్బ తీసింది. అదే బీజేపీకి ఆయువును అందించింది. వారు ఎవరి మాట వింటారో అర్థం కావట్లేదు. సొంత తప్పిదాలతోనే వారు వరుసగా ఎన్నికల్లో బోల్తాపడుతున్నారు’ అని ఆమె వ్యాఖ్యానించారు. ఇక ఒడిశా, పశ్చిమబెంగాల్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి వస్తే ఇక బీజేపీకి స్వర్ణయుగమే అని బీజేపీ చీఫ్ అమిత్ షా వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ మమత విరుచుకుపడ్డారు. ‘ఫించాలు పెట్టుకున్న బొద్దింకలు(బీజేపీని ఉద్దేశించి) తాము నెమళ్లు అయిపోయినట్లు కలలు కంటున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల గెలుపు కల ఎన్డీయే కూటమికి పెద్ద శరాఘాతమే అవుతుంది. కేంద్రంలోని అధికారాన్ని అడ్డుపెట్టుకుని.. యథేచ్ఛగా డబ్బు వెదజల్లి బీజేపీ అధికారంలోకి వచ్చింది. త్రిపురలో వామపక్ష పార్టీకి-బీజేపీకి కేవలం 5 శాతం ఓటింగ్ మాత్రమే తేడా వచ్చింది. అంత మాత్రానికే కమల పార్టీ నేతలు గప్పాలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు’అని ఎద్దేవా చేశారు. -
‘చైనా సాయంతో పాక్ పక్కా ప్లాన్’
న్యూఢిల్లీ: చైనా సాయంతో పాకిస్తానే పక్కా ప్రణాళికతో బంగ్లాదేశీయులు ఈశాన్య రాష్ట్రాల్లోకి వలస వచ్చేలా చేస్తోందని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ బుధవారం అన్నారు. ఈ ప్రాంతంలో అస్థిరత నెలకొనేలా చూడటమే వారి లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లోకి బంగ్లాదేశీయుల వలసలు పెరిగిపోతున్న అంశంపై ఆయన ఢిల్లీలో ఓ కార్యక్రమంలో మాట్లాడారు. అస్సాంలో ముస్లింల జనాభా పెరిగిపోతుండటాన్ని రావత్ ప్రస్తావిస్తూ అక్కడ ఏఐయూడీఎఫ్ అనే ముస్లిం పార్టీ బీజేపీ కన్నా చాల వేగంగా ఎదుగుతోందని అన్నారు. ఈశాన్య ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలోనే ఈ సమస్యకు పరిష్కారం దాగుందని రావత్ సూచించారు. -
బీసీసీఐలో ముంబై ఓటు గల్లంతు
ఈశాన్య రాష్ట్రాలకు ఓటు హక్కు న్యూఢిల్లీ: భారత క్రికెట్‌కు కేంద్ర బిందువైన ముంబై ఇపుడు ప్రభ కోల్పోనుంది. బీసీసీఐలో శాశ్వత ఓటు హక్కును ముంబై సంఘం కోల్పోయింది. జస్టిస్ లోధా కమిటీ కీలక సిఫార్సు అయిన ‘ఒక రాష్ట్రం–ఒక ఓటు’ను అమలు చేసేందుకు బోర్డు పరిపాలక కమిటీ (సీఓఏ) సిద్ధమైంది. దీంతో ఈశాన్య రాష్ట్రాలు కొత్తగా బీసీసీఐ ఓటు పరిధిలోకి వచ్చాయి. మణిపూర్, మేఘాలయా, మిజోరం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలకు ఇప్పుడు బోర్డులో పూర్తిస్థాయి సభ్యత్వం లభించింది. దీంతో ఈ రాష్ట్రాలు బీసీసీఐలో క్రియాశీలం కానున్నాయి. తెలంగాణ (హెచ్‌సీఏ), ఉత్తరాఖండ్ సంఘాలు కూడా శాశ్వత సభ్యులుగా పూర్తిస్థాయి హోదా పొందాయి. సీఓఏ తాజాగా సభ్య సంఘాల మెమోరాండం (ఎంఓఏ) కొత్త నియమావళిని అమల్లోకి తెచ్చింది. దీనికి సంబంధించిన నియమ నిబంధనలను అందులో పొందుపరిచింది. 41 సార్లు రంజీ చాంపియన్లను తయారు చేసిన ముంబై క్రికెట్ సంఘం ఇప్పుడు బీసీసీఐ అనుబంధ సభ్య సంఘంగా కొనసాగుతుంది. వీటితో పాటు బరోడా, సౌరాష్ట్ర సంఘాలు కూడా వారి మాతృ సంఘానికి జతగా... బీసీసీఐకి అనుబంధంగా కొనసాగుతాయి. ఇపుడీ సంఘాలు ప్రతి యేటా రొటేషన్‌లో ఓటు హక్కును వినియోగించుకుంటాయి. అలాగే ఏ సంఘం కూడా మాకు మేమే జవాబుదారీలమనే వైఖరిని విడనాడాల్సిందేనని సీఓఏ స్పష్టం చేసింది. కాంట్రాక్టులు, నిర్మాణం, నిర్వహణ విషయాల్లో అవినీతి వటవృక్షాలవుతున్న ఢిల్లీ క్రికెట్ సంఘం, హైదరాబాద్ క్రికెట్ సంఘాలను ఉద్దేశించి ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇకపై పారదర్శకంగా వ్యవహరించాల్సిందేనని చెప్పకనే చెప్పింది. -
అప్పుడు.. ఇప్పుడు అక్కడ అదే జరుగుతోందా?
దేశంలోని ఈశాన్య రాష్ట్రాలైన అసోం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరం, నాగాలాండ్, త్రిపురలలోని స్వయం పాలన మండళ్ల పరిధిలో ఉన్న బ్యాంకుల్లో స్థానిక ఎస్టీలందరికి ఖాతాలున్నాయి. ఆ ఖాతాలు ఎక్కువగా ఆ రాష్ట్రాల్లోని ధనవంతులు తమ నల్లడబ్బును దాచుకోవడానికే ఉపయోగపడుతున్నాయి. ఎందుకంటే వారికి ఆ డబ్బు ఎక్కడినుంచి వచ్చిందో, ఎందుకు వచ్చిందో చట్ట ప్రకారం స్థానిక ఎస్టీలను ఎవరూ అడక్కూడదు. ఆదాయం పన్ను చట్టంలోని సెక్షన్ 10 (26) కింద ఈశాన్య రాష్ట్రాల్లోని అటానమస్ అడ్మినిస్ట్రేటివ్ ఏరియాల్లో ఉన్న షెడ్యూల్డ్ తెగల వాళ్లు (ఎస్టీ) బ్యాంకుల్లో ఎంత డబ్బునైనా దాచుకోవచ్చు. వారికి పన్ను నుంచి పూర్తి మినహాయింపు ఉంది. ఎక్కడి నుంచి ఆ డబ్బు వచ్చిందని కూడా చట్టప్రకారం వారిని ప్రశ్నించరాదు. కొందరు స్థానిక ఎస్టీలు మాత్రమే ఆయా ప్రాంతాల్లో రబ్బరు వ్యాపారాన్ని నిర్వహిస్తుండగా, ఎక్కువమంది కూలీలుగానే పనిచేస్తుంటారు. వారి వ్యాపారాలకు కూడా ఇచ్చి పుచ్చుకునే రసీదులు ఉండవు. పెద్ద ఎత్తున డబ్బును డిపాజిట్ చేసినప్పుడు మాత్రమే రబ్బర్ బోర్డు నుంచి ఓ చిన్న రసీదును తీసుకొచ్చి చూపిస్తారు. 1978లో అప్పటి మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం వెయ్యి, ఐదువేలు, పదివేల రూపాయల నోట్లను రద్దు చేసినప్పుడు స్థానిక ఎస్టీల ఖాతాలన్నీ కూడా నల్లడబ్బును మార్చుకునేందుకే ఎక్కువ ఉపయోగపడ్డాయని, ఇప్పుడు కూడా నల్లడబ్బును వారి ఖాతాల ద్వారా మార్చుకునే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని అప్పుడు షిల్లాంగ్‌లో ఎస్బీఐ చీఫ్ రీజనల్ మేనేజర్‌కు స్పెషల్ సెక్రటరీగా పనిచేసిన నూరుల్ ఇస్లామ్ లష్కర్ తెలిపారు. షిల్లాంగ్‌కు 67 కిలోమీటర్ల దూరంలోని ఓ కుగ్రామానికి 1978లో తనను డిప్యూటేషన్ మీద పంపించారని, మొరార్జీ దేశాయి ప్రభుత్వం పెద్దనోట్లను రద్దుచేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఆ కుగ్రామంలో ఊహించని రీతిలో బ్యాంక్ వద్ద రద్దీ పెరిగిందని, అందుకే ఆ బ్యాంకు సిబ్బందికి సహాయంగా తనను పంపించారని లష్కర్ వివరించారు. తాను వెళ్లేటప్పటికి తమ బ్యాంకు ముందు స్థానిక ఎస్టీలు క్యూకట్టి నిలుచున్నారని, వారందరి వద్ద పెద్ద నోట్లు ఉన్నాయిని, అవన్ని ధనికులవేనన్న విషయం తమకు తెలుసునని చెప్పారు. నాడు అస్సాంలోని హసావో, కర్బీ ఆంగ్లాంగ్, బోడోల్యాండ్ టెరిటోరియల్ పరిధిలో, మేఘాలయలోని ఖాసి, జైంటియా, గారిహిల్స్తోపాటు ఇతర ఈశాన్య రాష్ట్రాల పరిధిలోని బ్యాంక్‌లన్నింటిలో ఇదే పరిస్థితి నెలకొందని, ఈ విషయాన్ని ఆదాయపన్ను శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం తప్ప తాము ఏం చేయలేకపోయామని లష్కర్ తెలిపారు. ఆ తర్వాత కూడా వారిపై ఆదాయపన్ను శాఖ అధికారులెవరూ ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారని చెప్పారు. స్థానిక ఎస్టీలు కమీషన్లకు ఆశపడి ధనవంతుల నల్లడబ్బును దాచేవారని, చట్ట ప్రకారం ఇప్పటికీ వారికి పూర్తిగా పన్ను మినహాయింపు ఉందని, ఇప్పుడు కూడా అక్కడ అదే జరుగుతుండవచ్చని ఆయన చెప్పారు. ఇదే విషయమై అగర్తలాలోని ఓ జాతీయ బ్యాంక్ సీనియర్ అధికారిని ప్రశ్నించగా నల్లడబ్బు మార్పిడి జరుగుతుండవచ్చని చెప్పారు. యాభైవేల రూపాయలకు పైబడిన డిపాజిట్లపైనా తాము నిఘా వేయగలంగానీ అన్నీ ఖాతాలపై నిఘా వేయడం కుదరని విషయమని ఆయన తెలిపారు. బ్యాంకు అధికారుల సమన్వయంతో డబ్బుల లావాదేవీలపై తాము నిఘావేసి ఉంచామని, ఏ రూపంగా నల్లడబ్బు వచ్చినా పట్టుకుంటామని మిజోరమ్ ఆదాయంపన్ను కమిషనర్ సాంగ్లామా చెబుతున్నారు.