ఓవైపు అసోం ఎన్‌ఆర్‌సీ వ్యవహారం రాజకీయ చిచ్చును రాజేసిన వేళ.. త్రిపుర సీఎం విప్లవ్ దేవ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఎన్‌ఆర్‌సీ అనేది చాలా చిన్న విషయమని.. దాన్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న రీతిలో ఆయన వ్యాఖ్యానించారు. మంగళవారం నాగ్‌పూర్‌కు వెళ్లిన విప్లవ్.. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్‌భగత్‌ను కలిశారు. అనంతరం విప్లవ్ మీడియాతో మాట్లాడుతూ ఎన్‌ఆర్‌సీ వ్యవహారంపై స్పందించారు. (ఆమెను అందగత్తె అని ఎవరైనా అంటారా?)
‘ఎన్‌ఆర్‌సీ డిమాండ్ ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో అయితే లేదు. ప్రతీ విషయం కూడా మా రాష్ట్రంలో(త్రిపుర) చాలా పద్ధతిగా ఉంటుంది. నాకు తెలిసి అసోంలో కూడా అదేం పెద్ద విషయం కాదనే అనిపిస్తోంది. ఆ రాష్ట్ర సీఎం సర్బానంద సోనోవాల్ ఈ వ్యవహారాన్ని చక్కబెడతారన్న నమ్మకం ఉంది. శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసి కల్లోలం రేపాలని కొందరు యత్నిస్తున్నారు. విదేశీ మైండ్‌సెట్‌తో ఉన్నవాళ్లే ఈ అంశాన్ని వివాదాస్పదం చేస్తున్నారు’ అని విప్లవ్ మీడియాతో వ్యాఖ్యానించారు. కాగా, ఈ వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment