Citizenship Issue
-
భారతీయులకు దెబ్బ మీద దెబ్బ ట్రంప్ సంచలనం
-
'చెన్నమనేని బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే'
సాక్షి, సిరిసిల్లా : వేములవాడ ఎమ్మెల్యే చెన్నమ్మనేని రమేశ్ పౌరసత్వంపై కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ కీలక వాఖ్యలు చేశారు. రమేశ్ తాను భారతదేశ పౌరున్ని అంటూనే జర్మనీ పాస్‌పోర్టుపై జర్మనీ ఎలా ప్రయాణం చేస్తున్నాడని శ్రీనివాస్ పేర్కొన్నాడు. జర్మనీ పాస్‌పోర్టుపై మద్రాస్ నుంచి జర్మనీ వెళ్లే పరిస్థితి ఎందుకు వచ్చిందని, దీనిపై ప్రజలకు వివరణ ఇవ్వాల్పిన అవసరం ఉందని పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ మూడు సార్లు చెన్నమనేని రమేశ్ భారతదేశ పౌరుడు కాదని తేల్చి చెప్పినా గత 11 సంవత్సరాలుగా నియోజకవర్గ ప్రజలను, దేశాన్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. సాక్షాత్తు భారతదేశ న్యాయస్థానం ఈ దేశ పౌరుడు కాదని తేల్చి చెప్పినా దొంగ చాటుగా పౌరసత్వం పొంది వివాదంలో కూరుకుపోయిన వ్యక్తికి టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఎలా ఇచ్చిందని మండిపడ్డారు. ఇప్పటికే కోర్టు పలుమార్లు మొట్టికాయలు వేసినా ఆయనకు బుద్ధి రాలేదని , వెంటనే నియోజకవర్గ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. -
పౌర బిల్లుపై భగ్గుమన్న ఈశాన్యం
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభల్లో పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో ఈశాన్య భారతంలో బిల్లుకు వ్యతిరేకంగా హింసాత్మక నిరసనలు కొనసాగతున్నాయి. పోలీసు కాల్పులు, లాఠీచార్జ్, రైళ్ల నిలిపివేతతో ఈశాన్య రాష్ట్రాల్లో అలజడి రేగింది. అసోం, త్రిపురల్లో పలు ప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగడంతో సైన్యం, పారామిలటరీ బలగాలు రంగంలోకి దిగాయి. బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వీధుల్లోకి రావడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనల నేపథ్యంలో అసోం, త్రిపురలో విమాన, రైలు సర్వీసులు దెబ్బతిన్నాయి. కర్ఫ్యూ ఉత్తర్వులను ధిక్కరించి గువహటిలో పెద్దసంఖ్యలో ఆందోళనకారులు వీధుల్లోకి చేరడంతో పోలీసులు కాల్పులు జరిపారు. నగరంలోని లాలుంగ్ గావ్ ప్రాంతంలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు కాల్పులు జరిపామని పోలీసులు తెలిపారు. పోలీసుల కాల్పుల్లో నలుగురు ఆందోళనకారులకు గాయాలయ్యాయని స్ధానికులు పేర్కొన్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు రాష్ట్రాల్లో లోకల్ ట్రైన్లను నిలిపివేశామని అధికారులు తెలిపారు. రైలు, విమాన సర్వీసులకు విఘాతం కలగడంతో ఇరు రాష్ట్రాల్లో ప్రయాణీకులు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం కూడా ప్రజలకు అసౌకర్యం కలిగించింది. మరోవైపు పౌరసత్వ సవరణ బిల్లుతో ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని ప్రధాని నరేంద్ర మోదీ ఈశాన్య రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చారు. -
మా పార్టీ వైఖరిపై నిరాశ చెందా : పీకే
సాక్షి, ఢిల్లీ : కేంద్ర హోం మంత్రి సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన పౌరసత్వ బిల్లుకు తమ పార్టీ జనతాదళ్(యు) మద్దతు తెలపడంపై ఆ పార్టీ ఉపాధ్యక్షుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందించారు. ఈ బిల్లును మొదట్లో వ్యతిరేకించిన జనతాదళ్, బిల్లు ప్రవేశపెట్టే ముందు రోజు (ఆదివారం) మద్దతివ్వాలని నిర్ణయించింది. ఈ పరిణామం పట్ల ప్రశాంత్ కిషోర్ స్పందిస్తూ.. ఇది తనకు నిరాశకు గురిచేసిందని వ్యాఖ్యానించారు. మత ప్రాతిపదికన పౌరసత్వం కల్పించే ఈ బిల్లు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు, గాంధీ సిద్ధాంతాలకు వ్యతిరేకమని సోమవారం ట్విటర్లో పేర్కొన్నారు. మరోవైపు బిల్లుకు జనతాదళ్ పార్టీ మద్దతు తెలపడంపై బీహార్‌లో ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ విమర్శించింది. నితీష్‌కుమార్ ప్రధాని మోదీకి బానిసలా వ్యవహరిస్తున్నారని, 370 రద్దు, ట్రిపుల్ తలాక్, ఎన్నార్సీలకు మద్దతు తెలపడంతో ఈ విషయం రూడీ అయిందని వాగ్బాణాలు సంధించింది. -
ఎవరికీ నష్టం లేదు : సమానత్వాన్ని కాలరాస్తారా?
సాక్షి, న్యూఢిల్లీ: పౌరసత్వ (సవరణ) బిల్లుపై లోక్‌సభలో వాడీవేడి చర్చ జరిగింది. ప్రతిపక్షాలు, ఈశాన్య రాష్ట్రాల ఎంపీలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా.. కేంద్ర హోంమంత్రి, బీజేపీ చీఫ్ అమిత్ షా మాత్రం పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతుగా తన వాదనను వినిపించారు. పౌరసత్వ సవరణ బిల్లుకు 130 కోట్ల మంది భారతీయుల మద్దతు ఉందని, 2014, 2019 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ రెండు ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. దేశ విభజనకు కాంగ్రెస్ పార్టీయే కారణమని నిందించిన అమిత్ షా.. పౌరసత్వ సవరణ బిల్లుతో ఎవరికీ అన్యాయం జరగబోదని, ఈ బిల్లు మైనారిటీలకు వ్యతిరేకం కాదని అన్నారు. ఈ బిల్లు వెనుక ఎలాంటి రాజకీయాలు, అజెండా లేదని స్పష్టం చేశారు. ఈ బిల్లు ద్వారా నిజానికి మైనారిటీలు హక్కులు పొందుతారని, విదేశాల నుంచి దేశంలోకి శరణార్థులుగా వచ్చిన మైనారిటీలు హక్కులు పొందుతారని చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ నేత మనీష్ తివారీ పౌరసత్వ సవరణ బిల్లుపై ధ్వజమెత్తారు. ఈ బిల్లు అతి పెద్ద తప్పిదమని, ఈ అసమగ్ర బిల్లు కొన్ని వర్గాలపై వివక్ష చూపేలా ఉందన్నారు. ఆర్టికల్ 14, 15, 21, 25, 26లకు వ్యతిరేకంగా బిల్లు ఉందని, రాజ్యాంగంలోని సమానత్వ హక్కును ఈ బిల్లు కాలరాస్తుందని మండిపడ్డారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లలో మత వివక్ష కారణంగా వలసవచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన పౌరసత్వ బిల్లును కేంద్రం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. -
రేపు లోక్‌సభ ముందుకు ప్రతిష్టాత్మక బిల్లు
సాక్షి, న్యూఢిల్లీ: మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నపౌరసత్వ సవరణ బిల్లు రేపు పార్లమెంట్ ముందుకు రానుంది. లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు లోక్‌సభ బిజినెస్‌లో పౌరసత్వ సవరణ బిల్లును లిస్ట్ చేసింది మోదీసర్కార్. బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్‌కు వలసొచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించేందుకు వీలుగా ఈ సవరణ బిల్లు తెచ్చింది కేంద్రం. 1955 పౌరసత్వ బిల్లుకు సవరణలు చేసింది. ముస్లిం దేశాల నుంచి మతఘర్షణల కారణంగా వలసొచ్చిన హిందువులు, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు, పార్శీలకు ఈ బిల్లు ద్వారా లబ్ధి చేకూరనుంది. అయితే మతప్రాతిపదిక పౌరసత్వాన్ని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం వ్యతిరేకిస్తున్నాయి. -
18 నుంచి డిసెంబర్ 13 వరకు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబర్ 18 నుంచి డిసెంబర్ 13 వరకు జరగనున్నాయి. పార్లమెంటు ఉభయ సభల సెక్రటేరియట్లకు సోమవారం ఈ సమాచారాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ పంపించింది. గత రెండేళ్లుగా శీతాకాల సమావేశాలు నవంబర్ 21న ప్రారంభమై.. జనవరి మొదటివారం వరకు కొనసాగాయి. ఈ సమావేశాల్లో రెండు ఆర్డినెన్సులు, పలు కీలక బిల్లులు పార్లమెంటు ముందుకు రానున్నాయి. నూతన, దేశీ తయారీ సంస్థలకు కార్పొరేట్ పన్నును తగ్గిస్తూ జారీ అయిన ఆర్డినెన్స్, ఈ–సిగరెట్ల తయారీ, అమ్మకం, నిల్వను నిషేధిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌లకు చట్టరూపం ఇవ్వాల్సి ఉంది. ఆర్థిక వృద్ధిలో వైఫల్యం, కశ్మీర్లో స్థానికుల పరిస్థితి, ఎన్నార్సీ, పౌరసత్వ బిల్లు.. మొదలైన అంశాలపై విపక్ష సభ్యులు లేవనెత్తేవీలుంది. పార్లమెంటు సమావేశాలను మరో వారం పాటు పొడగించే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇటీవలి వర్షాకాల సమావేశాల్లో 28 బిల్లులు పార్లమెంటు ఆమోదం పొందాయి. ఈ సమావేశాల్లోనే కార్మిక సంస్కరణలకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందే అవకాశముంది. -
అంతమాత్రాన బ్రిటిష్ పౌరుడౌతారా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ చీఫ్ రాహుల్ పౌరసత్వం అంశం తేలేదాకా ఆయన్ను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. బ్రిటన్‌కు చెందిన ఓ కంపెనీ 2005–06లో వెలువరించిన తన వార్షిక నివేదికలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌ను బ్రిటిష్ పౌరుడిగా పేర్కొందంటూ దాఖలైన పిటిషన్‌ను సీజేఐ జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్ గురువారం విచారించింది. బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి అందజేసిన సమాచారంపై కేంద్రం, ఈసీ స్పందించిన తీరు తమకు అసంతృప్తి కలిగించిందని పిటిషనర్లు జై భగవాన్ గోయెల్, సీపీ త్యాగి పేర్కొన్నారు. రాహుల్ బ్రిటిష్ జాతీయుడనేందుకు ప్రాథమిక ఆధారాలున్నందున ఈ విషయంలో స్పష్టత వచ్చే వరకు ఆయన్ను యూపీలోని అమేథీ, కేరళలోని వయనాడ్‌ల నుంచి పోటీ చేయకుండా చూడాలని కోరారు. బ్రిటిష్ పౌరుడైన రాహుల్ పేరును ఓటర్ల జాబితా నుంచి తొలగించేలా ఈసీకి సూచించాలని కోరారు. ద్వంద్వ పౌరసత్వం కలిగినట్లు ఆరోపణలున్న రాహుల్ ప్రధాని కావాలనుకుంటున్నారని పేర్కొన్నారు. స్పందించిన ధర్మాసనం..‘ఓ కంపెనీ తన పత్రాల్లో రాహుల్ జాతీయతను బ్రిటిష్ అని పేర్కొన్నంత మాత్రాన ఆయన బ్రిటిష్ పౌరుడైపోతారా? ఒకవేళ 123 కోట్ల మంది ప్రజలు ఆ వ్యక్తిని ప్రధానిగా ఎన్నుకుంటే మీరేం చేస్తారు?’ అని ప్రశ్నించింది. ‘అసలు మీరెవరు? మీరేం చేస్తుంటారు?’అని ధర్మాసనం ప్రశ్నించగా..‘ప్రజా సంబంధ అంశాలపై స్పందిస్తుంటాం, సంఘ సేవకులం, రాజకీయాల్లో కూడా ఉన్నాం’ అని పిటిషనర్లు బదులిచ్చారు. అందుకు ధర్మాసనం.. ‘అయితే, మీరు రాజకీయ సామాజిక సేవలో ఉన్నారన్నమాట’ అని వ్యాఖ్యానించింది. 2005–2006 సంవత్సరాల్లో ఈ ఘటన జరగ్గా ఇప్పటిదాకా కోర్టుకు ఎందుకు రాలేదు? మీరు ఈ విషయం ఎప్పుడు తెలుసుకున్నారు? అని ధర్మాసనం అడగ్గా.. ఈ అంశం 2015లో మాత్రమే వెలుగులోకి వచ్చిందని పిటిషనర్ల లాయర్ బదులిచ్చారు. ‘అయినప్పటికీ, న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు మీరు నాలుగేళ్లు తీసుకున్నారు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. బీఎస్ఎఫ్ జవాన్ పిటిషన్ తిరస్కరించిన సుప్రీం న్యూఢిల్లీ: వారణాసి లోక్‌సభ స్థానంనుంచి ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వేసిన నామినేషన్‌ను ఎన్నికల సంఘం తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ, మాజీ బీఎస్ఎఫ్ జవాన్ తేజ్‌బహదూర్ యాదవ్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ‘పిటిషన్‌ను విచారించడానికి సహేతుకమైన కారణాలు కనిపించడం లేదు’ అంటూ సీజేఐ జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్ ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి తిరస్కరించడంపై ఎన్నికల సంఘం మోదీకి అనుకూలంగా పనిచేస్తుందని ఆరోపిస్తూ బహదూర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
పౌరసత్వం అంశం.. రాహుల్‌కి కేంద్రం నోటీసులు
న్యూఢిల్లీ : రాహుల్ గాంధీ పౌరసత్వంపై వస్తోన్న ఆరోపణలపై స్పందించిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మంగళవారం రాహుల్‌కి నోటీసులు జారీ చేసింది. ఈ విషయంలో వాస్తవాలేంటో 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని రాహుల్‌ను ఆదేశించింది. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి నుంచి అందుకున్న ఫిర్యాదు మేరకు ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ నోటీసులపై రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ స్పందించారు. రాహుల్ భారతీయుడనే విషయం దేశం మొత్తానికి తెలుసని.. ఆయన ఇక్కడే పుట్టి.. ఇక్కడే పెరిగిరాని ప్రియాంక స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఇలాంటి నోటీసులు పంపుతున్నారని ప్రియాంక మండిపడ్డారు. రాహుల్ గాంధీ భారతీయుడు కాదని.. ఆయనకు బ్రిటిష్ పౌరసత్వం ఉందని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి గత కొంత కాలంగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఆధారాలను ఆయన 2015లోనే స్పీకర్ సుమిత్రామహాజన్‌కు అందజేశారు. వాటి ఆధారంగా రాహుల్‌ను ఎంపీకి అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. దీనిపై అప్పట్లో దుమారం రేగడంతో తాను భారతీయుడినేనని రాహుల్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించుకోవాల్సి వచ్చింది. -
పౌరసత్వ రగడ : రాహుల్‌కు హోం శాఖ నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. రాహుల్ పౌరసత్వంపై 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని హోం శాఖ కోరింది. బీజేపీ రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఫిర్యాదు ఆధారంగా రాహుల్‌కు నోటీసులు జారీ అయ్యాయి. రాహుల్ గాంధీకి నాలుగు పాస్‌పోర్ట్‌లున్నాయని, ఒకదానిపై ఆయన పేరు రౌల్ విన్సీ, క్రిస్టియన్‌గా నమోదైందని సుబ్రఃహ్మణ్య స్వామి ఇటీవల ఆరోపించారు. కాగా రాహుల్ పౌరసత్వంపై వివాదం నేపధ్యంలో ఈసీ ఇటీవల రాహుల్ నామినేషన్ పత్రాలను ఆమోదించడంతో కాంగ్రెస్ వర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి. మరోవైపు రాహుల్ పౌరసత్వంపై ఆమేధిలో ఆయనపై స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేసిన ధ్రవ్‌లాల్ సైతం ఫిర్యాదు చేశారు. బ్రిటన్‌లో ఓ కంపెనీ నమోదు సమయంలో రాహుల్ గాంధీ తాను బ్రిటన్ పౌరుడినని ప్రకటించుకున్నారని ధ్రువ్‌లాల్ న్యాయవాది రవిప్రకాష్ పేర్కొన్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం భారతీయేతరులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులని చెప్పారు. -
మోదీ అబద్ధాలకోరు
అలిపుర్దార్ (బెంగాల్): మోదీ అబద్ధాలకోరు. ఐదేళ్లుగా దేశప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఆయన నిలబెట్టుకోలేదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. శనివారం అలిపుర్దార్ జిల్లా బరోబిషాలో ఎన్నికల ర్యాలీలో మమత మాట్లాడారు. సొంత భార్యకు న్యాయం చేయలేని వ్యక్తి, దేశానికి ఎలా న్యాయం చేయగలరని మోదీని ఉద్దేశించి అన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత ఏర్పడే ప్రభుత్వంలో తృణమూల్ కాంగ్రెస్ కీలకమవుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. పౌరసత్వ సవరణ బిల్లు బీజేపీ ప్రభుత్వ మరో కుట్ర అని, తృణమూల్ కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో వారి ఆటలు సాగునివ్వబోదని ఆమె అన్నారు. అధికారుల బదిలీలపై ఈసీకి లేఖ: కోల్‌కతా, బిద్దన్నగర్ పోలీసు కమిషనర్లతో సహా నలుగురు ఐపీఎస్ అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేయడంపై శనివారం ఈసీకి ఆమె లేఖ రాశారు. బీజేపీ ప్రభుత్వ ప్రేరణతోనే ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా భావిస్తున్నామని అన్నారు. వారిని బదిలీ చేసేందుకు కారణాలు తెలపాలని, బదిలీ నిర్ణయాన్ని ఈసీ పునఃసమీక్షిస్తుందని భావిస్తున్నట్టు చెప్పారు. బెంగాల్లో శాంతి భద్రతల సమస్య ఉందని ఇటీవల మోదీ ఆరోపణల నేపథ్యంలోనే∙ఈసీ బదిలీల నిర్ణయం తీసుకుందని మమతా బెనర్జీ ఆరోపించారు. -
‘సరైన సమయంలో ఎన్డీయేను వీడుతాం’
షిల్లాంగ్: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈశాన్య భారతంలో ఎన్డీయే కూటమికి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద పౌరసత్వ బిల్లు-2016ను ఈశాన్య ప్రాంతంలోని పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో కొనసాగుతున్న పార్టీలు బిల్లుకు నిరసనగా బయటకు రావాలని యోచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మేఘాలయ ముఖ్యమంత్రి, నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) అధినేత కాన్రాడ్ సంగ్మా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఎన్డీయేతో సంబంధాలు తెంచుకునేందుకు తగిన సమయంకోసం ఎదురుచుస్తున్నామని సంగ్మా అన్నారు. పౌరసత్వ బిల్లుకు రాజ్యసభలో తమ పార్టీ సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేస్తారని ఆయన స్పష్టంచేశారు. మేఘాలయ అసెంబ్లీలో ఇద్దరు శాసన సభ్యులున్న బీజేపీ, ఇతర పార్టీల మద్దతుతో గత ఏడాది సంగ్మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మేఘాలయతో పాటు మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్‌లో ఎన్పీపీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాలే నడుస్తున్నాయి. మణిపూర్, అరుణాచల్ ప్రద్‌శ్‌లో బీజేపీకి సంగ్మా మద్దతు ప్రకటించడంతో అక్కడ బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. ఎన్డీయే కూటమి నుంచి ఎన్పీపీ బయటకు వచ్చినట్లుయితే ఆ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు పడిపోయే అవకాశం ఉంది. మేఘాలయలో కాంగ్రెస్ 21 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచినా.. రెండే సీట్లు గెలిచిన బీజేపీ ఇతరుల మద్దతు కూడగట్టి ఎన్పీపీ అధికారంలోకి వచ్చేలా చక్రం తిప్పింది. బీజేపీ నుంచి విడిపోతే మేఘలయ తమకు ఇతర ప్రాంతీయ పార్టీల మద్దతు ఉందని సంగ్మా ఇదివరకు ప్రకటించారు. మరికొన్ని పార్టీలు కూడా బీజేపీని వీడేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈశాన్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారనున్నాయి. కాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం లోక్‌సభలో ఆమోదం పొందిన బిల్లును త్వరలోనే రాజ్యసభ ప్రవేశపెట్టనున్నారు. -
గణతంత్ర వేడుకలకు దూరంగా ఈశాన్య రాష్ట్రాలు
మిజోరాం : దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతుండగా.. ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తుంది. పౌరసత్వ (సవరణ) బిల్లు, 2016ను వ్యతిరేకిస్తూ.. ఈశాన్య రాష్ట్రాల్లోని పలు సంస్థలు గణతంత్ర దినోత్సవ వేడుకలను బహిష్కరించాయి. వీటితో పాటు కొన్ని ఉగ్రవాద సంస్థలు కూడా రిపబ్లిక్ డే వేడుకలను బహిష్కరించాలని పిలుపునివ్వడంతో ఈశాన్య రాష్ర్టాల్లో హైఅలర్ట్ ప్రకటించారు పోలీసులు. ఇలా పిలుపునిచ్చిన వాటిల్లో నాగలాండ్‌కు చెందిన ‘నాగ స్టూడెంట్స్ ఫెడరేషన్’(ఎన్ఎస్ఎఫ్), మణిపూర్‌కు చెందిన మరి కొన్ని సంస్థలు ఉన్నాయి. ఈ క్రమంలో ఎన్ఎస్ఎఫ్ పౌరసత్వ బిల్లు పట్ల ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలంటూ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం తన ద్వంద్వ వైఖరితో ప్రజలను తప్పు దోవ పట్టింస్తోందని ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో రిపబ్లిక్ డే వేడుకలను బహిష్కరించాలంటూ ఎన్ఎస్ఎఫ్ పిలుపునిచ్చింది. ఇక మణిపూర్‌కు చెందిన ఐదు పౌరసంస్థలు కూడా పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను బహిష్కరించాలంటూ పిలుపునిచ్చాయి. దాంతో అక్కడి ప్రజలు రిపబ్లిక్ డే వేడుకలను బహిష్కరిస్తున్నట్లు బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి వలస వచ్చి ఆరేండ్ల పాటు దేశంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించాలని కేంద్రం ప్రతిపాదించిన పౌరసత్వ (సవరణ) బిల్లు, 2016ను పార్లమెంట్ ఆమోదించిన సంగతి తెలిసిందే. -
‘ఆ ఓట్లు వెనక్కి ఇచ్చేస్తారా?’
న్యూఢిల్లీ : పౌరసత్వ బిల్లు పట్ల అస్సాంకు చెందిన ప్రముఖ గాయకుడు జుబీన్ గర్గ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బిల్లును తిరస్కరించాలంటూ అస్సాం ముఖ్యమంత్రి సోనొవాల్‌ను కోరారు. అలా చేయలేకపోతే 2016లో తన పాటలను వాడుకుని గెల్చిన ఓట్లను తిరిగిచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాలన్నింటిని జుబీన్ తన ఫేస్బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ‘డియర్ సర్బానంద సోనొవాల్.. కొన్ని రోజుల క్రితం పౌరసత్వ బిల్లును ఉద్దేశిస్తూ మీకు లేఖ రాశాను. కానీ మీరు నల్లజెండాలను లెక్కపెట్టుకోవడంలో బిజీ అయిపోయినట్లున్నారు. 2016లో నా పాటలతో గెలిచిన ఓట్లన్నీ తిరిగిచ్చేస్తారా? కావాలంటే మీరు నాకు ఇచ్చిన పారితోషికాన్ని వెనక్కి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని పేర్కొన్నారు. జుబీన్ పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది. పౌరసత్వ బిల్లును తిరస్కరించకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని జనవరి 8న జుబీన్, సీఎం సోనొవాల్‌ను హెచ్చరిస్తూ లేఖ రాశారు. ఈ విషయం గురించి జుబీన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇటీవల పౌరసత్వ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కనీసం అప్పుడైనా సోనొవాల్ దానిని తిరస్కరించవచ్చు కదా? కానీ అలా చేయలేదు. ముందు మీరు బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడి చూడండి. ఆ తర్వాత జరిగేది జరుగుతుంది. ఇప్పటికీ నేను కోపాన్ని అణచివేసుకుంటున్నాను. నేను మరో వారం రోజులు అస్సాంలో ఉండటంలేదు. ఈలోపు సోనొవాల్ పౌరసత్వ బిల్లుపై నిర్ణయం తీసుకుంటే ఆయనకే మంచిది. లేదంటే నేనే రంగంలోకి దిగుతాను. నేనేం చేస్తానో నాకే తెలీదు’ అంటూ హెచ్చరించారు జుబిన్. -
అంబులెన్స్‌పై దాడి చేసిన పోలీసులు
అగర్తల : అంబులెన్స్ వస్తోందంటే దానికి దారి వదలడం కనీస మానవ ధర్మం. మనం చేసే ఆ కాస్త సాయం విలువ ఓ మనిషి ప్రాణం. కానీ నేటి ఉరుకులపరుగుల జీవితాల్లో ఈ విషయం గురించి పట్టించుకునేంత తీరిక ఎవరికి ఉండటం లేదు. అంబులెన్స్‌కు దారి ఇవ్వకపోవడమే పెద్ద బాధ్యతారాహిత్యం అనుకుంటే.. క్షతగాత్రులను తీసుకెళ్లే అంబులెన్స్ మీద దాడి చేయడం మరీ దారుణం. ఇక్కడ ఇంతకంటే బాధకరమైన విషయం ఏంటంటే అలా దాడి చేసిన వారు పోలీసులు కావడం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. త్రిపుర రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలు.. పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా ఈ నెల ఎనిమిదిన త్రిపురలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. జనాలను అదుపు చేసేందుకు ప్రభుత్వం ‘త్రిపుర స్టేట్ రైఫిల్స్ టీమ్’ను రంగంలోకి దింపింది. ఆందోళనకారులకు, భద్రతా సిబ్బందికి మధ్య ఘర్షణ తీవ్ర రూపం దాల్చింది. దాంతో సిబ్బంది.. ఆందోళనకారుల మీద దాడి చేయడమే కాక కాల్పులు కూడా జరిపారు. ఈ దాడుల్లో గాయాలపాలైన ఇద్దరు వ్యక్తులను అంబులెన్స్‌లో ఎక్కించి ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో పోలీసులు అంబులెన్స్ మీద విచక్షణారహితంగా దాడి చేశారు. అంతటితో ఊరుకోక అంబులెన్స్ డ్రైవర్ని కూడా చితకబాదారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీని గురించి పోలీసు అధికారులను వివరణ కోరగా.. ఈ వీడియోల గురించి తమకు తెలియదని.. ఇంకా వీటిని తాము చూడలేదని తెలిపారు. అంతేకాక తమ అధికారులేవరూ అంబులెన్స్ మీద దాడి చేయరంటూ వివరణ ఇచ్చారు. -
‘అమాయకులను శిక్షించకూడదు’
సాక్షి, న్యూఢిల్లీ : అసోంలో నివశిస్తున్న నిజమైన భారతీయుల పేర్లను జాబితా నుంచి తొలగించకూడదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు. అసోంలో నివశిస్తున్న 40లక్షల మందిని అక్రమ వలసదారులుగా గుర్తిస్తు పౌర జాబితా నుంచి వారి పేర్లను తొలగించిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం రాజ్యసభలో చర్చ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. అసోంలో నివాసముంటున్న అమాయక ప్రజలను శిక్షించకూడదని, తిరిగి వారి పేర్లను జాబితాలో చేర్చాలని కోరారు. పౌరసత్వ చట్టాల ప్రకారం బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారికి కనీసం రెసిడెన్షియన్ స్టేటస్ అయినా ఇవ్వాలని పేర్కొన్నారు. ఎలాంటి అవరోధాలు సృష్టించకుండా ప్రశాంతంగా బతికే వారికి అవకాశం కల్పించాలని, ఆ తరువాతి తరాలకు భారతీయ పౌరసత్వం లభిస్తుందన్నారు. -
అదేం పెద్ద సమస్యే కాదు
ఓవైపు అసోం ఎన్ఆర్సీ వ్యవహారం రాజకీయ చిచ్చును రాజేసిన వేళ.. త్రిపుర సీఎం విప్లవ్ దేవ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఎన్ఆర్సీ అనేది చాలా చిన్న విషయమని.. దాన్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న రీతిలో ఆయన వ్యాఖ్యానించారు. మంగళవారం నాగ్‌పూర్‌కు వెళ్లిన విప్లవ్.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్భగత్ను కలిశారు. అనంతరం విప్లవ్ మీడియాతో మాట్లాడుతూ ఎన్ఆర్సీ వ్యవహారంపై స్పందించారు. (ఆమెను అందగత్తె అని ఎవరైనా అంటారా?) ‘ఎన్ఆర్సీ డిమాండ్ ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో అయితే లేదు. ప్రతీ విషయం కూడా మా రాష్ట్రంలో(త్రిపుర) చాలా పద్ధతిగా ఉంటుంది. నాకు తెలిసి అసోంలో కూడా అదేం పెద్ద విషయం కాదనే అనిపిస్తోంది. ఆ రాష్ట్ర సీఎం సర్బానంద సోనోవాల్ ఈ వ్యవహారాన్ని చక్కబెడతారన్న నమ్మకం ఉంది. శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసి కల్లోలం రేపాలని కొందరు యత్నిస్తున్నారు. విదేశీ మైండ్‌సెట్‌తో ఉన్నవాళ్లే ఈ అంశాన్ని వివాదాస్పదం చేస్తున్నారు’ అని విప్లవ్ మీడియాతో వ్యాఖ్యానించారు. కాగా, ఈ వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి. (భారతంలో ఇంటర్నెట్) -
ప్లీజ్.. సంయమనం పాటించండి
గువాహటి: ఎన్ఆర్సీ తుది జాబితా విడుదల తర్వాత అసోం నివురుగప్పిన నిప్పులా మారింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్లో ప్రభుత్వం, పోలీసులు ఉన్నారు. నేటి ఉదయం నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్ఆర్సీ) తుది ముసాయిదాను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇంకో 1.9 కోట్ల మందినే అసోం పౌరులుగా గుర్తించి జాబితాలో చోటు కల్పించారు. సుమారు 40 లక్షల మందికి పౌరసత్వం దక్కకపోవటంతో ఆందోళనలు తలెత్తే అవకాశం ఉందని అప్రమత్తమయ్యారు. అల్లర్లు తలెత్తకుండా రాష్ట్రమంతటా పోలీసులతో పాటు 220 కంపెనీల సాయుధ బలగాలను మోహరించారు. బర్పెట, దరంగ్, దిమా హసొవ్, సోనిట్‌పుర్, కరీమ్గంజ్, గోలాఘాట్, ధుబ్రి జిల్లాలో అధికారులు 144 సెక్షన్‌తో పాటు నిషేధాజ్ఞల్ని విధించారు. మరోవైపు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సోషల్‌మీడియాపై డేగ కన్ను వేశారు. ప్రశాంతంగా ఉండాలి... ‘తాజా పరిస్థితుల నేపథ్యంలో అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ప్రజలకు ప్రశాంతంగా ఉండాలని పిలుపునిచ్చారు. ‘గతంలో మొదటి డ్రాఫ్ట్ విడుదల తర్వాత ప్రశాంత వాతావరణం కనిపించింది. ఇప్పుడు అదే రీతిలో సమన్వయం పాటించాలని ప్రజలను నేను కోరుతున్నా’ అని ఆయన ఓ ప్రకటనలో ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే హింసాత్మక ఘటనలను మాత్రం ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, రాష్ట్రంలో ఎన్ఆర్సీపై భయాందోళనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో రిపోర్టు పేరు లేనంత మాత్రన వారిని విదేశీయులుగా భావించబోమని సోనోవాల్ ఇదివరకే స్పష్టం చేశారు. మమతాగ్రహం.. మరోవైపు ఎన్ఆర్సీ తుది డ్రాఫ్ట్‌పై రాజకీయ పక్షాలు మండిపడుతున్నాయి. ప్రజలపై బీజేపీ రాజకీయ ప్రతీకారం తీర్చుకుంటోందని, విజభన రాజకీయాలకు పాల్పడుతోందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.తాజా ముసాయిదా జాబితాలో పౌరసత్వం దక్కని వలస మైనార్టీ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఎన్ఆర్సీ... అస్సాంలో స్థానికుల్ని, స్థానికేతరుల్ని గుర్తించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్ఆర్సీ) పేరిట ముసాయిదాను విడుదల చేసింది. గతేడాది డిసెంబర్ 31న విడుదల చేసిన తొలి ముసాయిదాలో.. మొత్తం 3.29 కోట్ల మందిలో కేవలం 1.9 కోట్ల మందినే అస్సాం పౌరులుగా గుర్తించి జాబితాలో చేర్చింది. ఇక ఇప్పుడు తుది జాబితా పేరిట సోమవారం ఉదయం మరో డ్రాఫ్ట్‌ను రిలీజ్ చేసింది. తాజాగా ప్రకటించిన జాబితాతో మొత్తం 2,89,83,677 మందికి పౌరసత్వం లభించింది. అంటే మిగతా 40 లక్షల మంది భవితవ్యంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పైగా 1971, మార్చి 25కు ముందు రాష్ట్రంలో నివాసం ఉన్నవారినే స్థానికులుగా గుర్తిస్తున్నట్లు అందులో ప్రభుత్వం పేర్కొంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం గుర్తించిన జాబితా అని, తుది జాబితా మాత్రం కాదని ఎన్ఆర్సీ అస్సాం సమన్వయకర్త ప్రతీక్ హజేలా తెలిపారు.అక్రమ వలసల్ని నిరోధించేందుకు ఈ ముసాయిదాను ప్రకటించామని, ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేయవచ్చునని వెల్లడించారు. పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి మైనార్టీల అక్రమ వలసలు కొనసాగడం వల్లే పౌరసత్వ జాబితాను రూపొందించాల్సి వచ్చిందని నార్త్ ఈస్ట్ జాయింట్ సెక్రటరీ సత్యేంద్ర గార్గ్ తెలిపారు. -
చెన్నమనేని రివ్యూ పిటిషన్ కొట్టివేత
సాక్షి, న్యూఢిల్లీ: తన పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ఆగస్టు 31న జారీ చేసిన ఉత్తర్వులను సమీక్షించాల్సిందిగా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ దాఖలు చేసుకున్న దరఖాస్తును కేంద్ర హోంశాఖ కొట్టేసింది. ఆయన దరఖాస్తులో ఎలాంటి సమర్థనీయమైన అంశాలు లేవంటూ హోంశాఖలోని పౌరసత్వ విభాగ అదనపు కార్యదర్శి బి.ఆర్.శర్మ ఈ నెల 13న ఉత్తర్వులు జారీ చేశారు. భారత పౌరసత్వం పొందేందుకు చేసుకునే దరఖాస్తుకు ముందు దేశంలో ఏడాదిపాటు నివసించి ఉండాలని, కానీ చెన్నమనేని వాస్తవాలను దాచిపెట్టి మోసపూరితంగా పౌరసత్వం పొందారని హోంశాఖ మండిపడింది. దీనిపై పూర్తి ఆధారాలతోనే ఆగస్టు 31న ఉత్తర్వులు జారీ చేశామని తెలిపింది. ప్రజాసంక్షేమానికి పాటుపడిన అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని చెన్నమనేని కోరారని, అయితే ఈ అంశాన్ని తాము గతంలోనే పరిశీలించామని వివరించింది. ప్రజాప్రతినిధిగా ఇతరులకు ఆదర్శంగా నిలిచేందుకు ఆయన సమాజం, దేశంపట్ల మరింత నిజాయితీతో వ్యవహరించి ఉండాల్సిందని అభిప్రాయపడింది. సాగుతున్న వివాదం... జర్మనీ వలసవెళ్లి ఆ దేశ పౌరసత్వం పొందిన చెన్నమనేని రమేశ్ తప్పుడు ధ్రువపత్రాలతో 2008లో తిరిగి భారత పౌరసత్వం పొందినందున ఆయన ఎన్నిక చెల్లదంటూ ఎన్నికల్లో ఆయన సమీప ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ 2009లో హైకోర్టును ఆశ్రయించారు. దీంతో చెన్నమనేని పౌరసత్వం చెల్లదంటూ హైకోర్టు 2013లో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ చెన్నమనేని సుప్రీంకోర్టును ఆశ్రయించి స్టే పొందగా స్టే తొలగించాలని ఆది శ్రీనివాస్ సుప్రీంలో న్యాయ పోరాటం చేశారు. 2016 డిసెంబర్లో ఈఅంశంపై దర్యాప్తు చేయాలని హోంశాఖను సుప్రీం ఆదేశించింది. దీంతో కేంద్ర హోంశాఖ ఆగస్టు 31న చెన్నమనేని పౌరసత్వంపై నిర్ణయాన్ని ప్రకటించింది. రాజీనామా చేయాలి: ఆది శ్రీనివాస్ తన పౌరసత్వానికి సంబంధించి తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించిన చెన్నమనేని రమేశ్ దేశాన్ని అగౌరవపరిచారని బీజేపీ నేత ఆది శ్రీనివాస్ విమర్శించారు. చెన్నమనేని భారత పౌరుడు కాదని హైకోర్టు, కేంద్ర హోంశాఖ మూడు సార్లు స్పష్టం చేశాయన్నారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దేశాన్ని అగౌరవపరిచిన చెన్నమనేని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని లేదా ప్రభుత్వమే ఆయన్ను తప్పించాలని డిమాండ్ చేశారు. మరోసారి హైకోర్టును ఆశ్రయిస్తా పౌరసత్వ వివాదంపై చెన్నమనేని సాక్షి, హైదరాబాద్/సిరిసిల్ల: చట్టరీత్యా నిబంధనలు సంపూర్ణంగా తనవైపు ఉన్నందున మరోసారి హైకోర్టును ఆశ్రయిస్తానని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పేర్కొన్నారు. ఆగస్టు 31న కేంద్ర హోంశాఖ ఏ నోటీసు లేకుండా తన పౌరసత్వాన్ని రద్దు చేసిందని, దీంతో హైకోర్టును ఆశ్రయించి తన వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని కోరినట్లు గుర్తు చేశారు. తన వాదనలను, కొత్తగా ఇచ్చే సాక్ష్యాలను పూర్తిగా పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు హోం శాఖకు సూచించిందన్నారు. దీంతో మూడు పర్యాయాలు తన వాదనలు వినిపించానని, సుమారు నూరు పేజీల వివరణ కూడా సమర్పించానని చెప్పారు. -
ఎమ్మెల్యే చెన్నమనేనికి ఊరట
సాక్షి, హైదరాబాద్: వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్‌కు తాత్కాలిక ఊరట లభించింది. భారత పౌరసత్వాన్ని కేంద్ర హోం శాఖ రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఉమ్మడి హైకోర్టు స్టే విధించింది. ఆయన పౌరసత్వ రద్దుపై ఆరువారాల్లో తేల్చాలని కేంద్రానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై తిరిగి సమీక్షించాలని కోరే అవకాశం ఒక్కటే ఆయనకుండగా, హైకోర్టులో రిట్ దాఖలు చేశారు. తన పౌరుసత్వ రద్దు నిర్ణయాన్ని కొట్టివేయాలంటూ రిట్లో రమేశ్ కోరారు. పౌరసత్వం రద్దు నిర్ణయం ఆగస్టు 31 నుంచి అమల్లో ఉంటుందంటూ కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి తీసుకున్న చెల్లదని చెన్నమనేని పిటిషన్లో పేర్కొన్నారు. ‘భారతీయ పౌరసత్వ చట్టం సెక్షన్ 10(3) ప్రకారం ఒక వ్యక్తి కారణంగా దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా, ప్రజలకు హాని కలిగించేలా ఉంటే మినహా, ఆ వ్యక్తి పౌరసత్వాన్ని రద్దు చేయడానికి వీల్లేదు. ఈ విషయంలో నా అభ్యర్థనను పరిశీలించాలని కేంద్ర హోంశాఖకు ఉమ్మడి హైకోర్టు స్పష్టంచేసినప్పటికీ కనీసం పట్టించుకోలేదు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఆది శ్రీనివాస్ నాపై కేంద్రానికి ఫిర్యాదు చేశాడు. ఈ విషయం విన్నవించినప్పటికీ కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి ఏకపక్షంగా నాపై నిర్ణయం తీసుకున్నారు’ అని రమేశ్ తన వాదనలను వినిపించారు. ఆయన పౌరసత్వం అస్సలు చెల్లదు