
విజయసాయి రెడ్డి (ఫైల్ ఫోటో)
బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారికి కనీసం రెసిడెన్షియన్ స్టేటస్ అయినా ఇవ్వాలి..
సాక్షి, న్యూఢిల్లీ : అసోంలో నివశిస్తున్న నిజమైన భారతీయుల పేర్లను జాబితా నుంచి తొలగించకూడదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు. అసోంలో నివశిస్తున్న 40లక్షల మందిని అక్రమ వలసదారులుగా గుర్తిస్తు పౌర జాబితా నుంచి వారి పేర్లను తొలగించిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం రాజ్యసభలో చర్చ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. అసోంలో నివాసముంటున్న అమాయక ప్రజలను శిక్షించకూడదని, తిరిగి వారి పేర్లను జాబితాలో చేర్చాలని కోరారు.
పౌరసత్వ చట్టాల ప్రకారం బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారికి కనీసం రెసిడెన్షియన్ స్టేటస్ అయినా ఇవ్వాలని పేర్కొన్నారు. ఎలాంటి అవరోధాలు సృష్టించకుండా ప్రశాంతంగా బతికే వారికి అవకాశం కల్పించాలని, ఆ తరువాతి తరాలకు భారతీయ పౌరసత్వం లభిస్తుందన్నారు.