Biplab Deb
-
బీజేపీ ఎంపీకి తృటిలో తప్పిన పెను ప్రమాదం
ఛండీగఢ్: బీజేపీ నేత, త్రిపుర మాజీ సీఎం, రాజ్యసభ ఎంపీ విప్లవ్ దేబ్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. బిప్లవ్ దేబ్ ప్రయాణిస్తున్న కారు.. మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విప్లవ్ దేబ్ సురక్షితంగా బయటపడ్డారు. దీంతో, అందరూ ఊపిరిపీల్చుకున్నారు. వివరాల ప్రకారం.. బిప్లవ్ దేబ్ ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ సందర్భంగా కారు డ్రైవర్ సెక్షన వ్యవధిలో చాకచక్యంగా కారును పక్కకు తప్పించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ రోడ్డు ప్రమాదంలో కారు ముందు భాగం బాగా దెబ్బతిన్నది. ఇక, ఈ ఘటన హర్యానాలోని పానిపట్‌లో ఉన్న జీటీ రోడ్డులో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం అనంతరం.. బిప్లవ్ దేబ్ మరో కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు. Former Tripura CM and Rajya Sabha MP Biplab Deb had a narrow escape after his car met with an accident on GT Road in Haryana's Panipat today: Office of Biplab Deb pic.twitter.com/c7FElT0cdi — ANI (@ANI) February 20, 2023 -
త్రిపురలో హైటెన్షన్.. బీజేపీ మాజీ సీఎం టార్గెట్‌గా దాడులు!
త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ ఇంటిపై దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఆయన ఇంటిపై దాడి చేసి, ఇంటికి నిప్పంటించారు. ఈ ఘటనలో ఇంటి బయట పార్క్ చేసి ఉన్న కారు, ఇతర వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో, ఒక్కసారిగా త్రిపురలో ఉద్రిక్తకర వాతావరణం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. త్రిపుర మాజీ సీఎం, బీజేపీ నేత బిప్లబ్ దేబ్ పూర్వీకుల ఇంటిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి తెగబడ్డారు. ఉదయ్‌పూర్‌లోని జామ్‌జూరి ప్రాంతంలోని రాజ్‌నగర్‌లోని బిప్లబ్‌దేవ్ పూర్వీకుల ఇంటిపై దుండగులు దాడి చేసి, నిప్పంటించారు. మొత్తం ఇంటిని ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా ఇంటి బయట పార్క్ చేసి ఉన్న వాహనాలకు నిప్పంటించారు. మరోవైపు.. బిప్లవ్ దేవ్ తండ్రి హిరుధన్ దేవ్ స్మారకార్థం బుధవారం కావడం కారణంగా ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఈ తరుణంలో ఇలా జరగడం త్రిపురలో హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉండగా.. ఈ దాడిపై బీజేపీ నేతలు సీరియస్‌గా స్పందిస్తున్నారు. ఈ దాడికి సీపీఎం మద్దతుదారులే కారణమని బీజేపీ నేతలు చెబుతున్నారు. అంతేకాకుండా.. దాడి చేసిన వారితో కక్రాబన్ ఎమ్మెల్యే రతన్ చక్రవర్తి మంగళవారం సమావేశమైనట్లు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దాడి ఘటన సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని భద్రత ఏర్పాటు చేశారు. Former Tripura CM Biplab Deb’s ancestral house set on fire by LEFT workers. pic.twitter.com/1WxXakn3Mh — News Arena India (@NewsArenaIndia) January 3, 2023 -
నేపాల్, శ్రీలంకలో కూడా బీజేపీ ప్రభుత్వం!
అగర్తల: వివాదాస్పద, సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. తరచుగా వార్తల్లో నిలిచే త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ దేవ్ కుమార్ మరో సారి టాక్ ఆఫ్ ది స్టేట్ అయ్యారు. బీజేపీ విదేశాల్లో కూడా అధికారంలోకి వస్తుందని.. ఇందుకు గాను కేంద్ర హోం మంత్రి అమిత్ షా తగిన వ్యూహ రచన చేస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యాలు చేశారు విప్లవ్ దేవ్. రాజధాని అగర్తలాలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశం సందర్భంగా విప్లవ్ దేవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. విప్లవ్ దేవ్ మాట్లాడుతూ.. ‘‘అమిత్ షా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు ఒకసారి మన రాష్ట్రానికి అతిథిగా వచ్చారు. ఆ సమయంలో మనలో ఒకరు.. నాకు తెలిసి అజయ్ జమ్వాల్(ఈశాన్య జోనల్ బీజేపీ సెక్రటరీ) అనుకుంటా అమిత్ షాతో ‘‘ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అందుకు అభినందనలు తెలుపుతున్నాను’’ అన్నారు. అందుకు అమిత్ షా.. ‘‘శ్రీలంక, నేపాల్ మిగిలి ఉన్నాయి. పార్టీని అక్కడ కూడా విస్తరించి.. నేపాల్, శ్రీలంకలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలన్నారు’’ అంటూ విప్లవ్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విప్లవ్ దేవ్ మాట్లాడుతూ.. ‘‘కేరళలలో గత కొన్నేళ్లుగా పాతుకుపోయిన పాత సంప్రదాయాన్ని బీజేపీ మార్చనుంది. గతంలో కేరళలో ఐదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటే.. తరువాతి 5 సంవత్సరాలు లెఫ్ట్ అధికారంలో ఉండేది. బీజేపీ ఈ పద్దతిని మార్చనుంది. త్వరలోనే పార్టీ దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయనుంది’’ అని తెలిపారు. ఇక ఇలాంటి వింత వింత వ్యాఖ్యలు చేయడంలో విప్లవ్ దేవ్ ముందు వరుసలో ఉంటారు. మూడేళ్ల క్రితం భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగం మహాభారత కాలం నుంచే ఉందన్నారు విప్లవ్ దేవ్. సంజయుడు యుద్ధ భూమిని సందర్శించకుండానే.. అక్కడ ఏం జరుగుతుందనే వివరాల్ని ధృతరాష్ట్రుడికి వివరించాడని.. ఇదంతా ఇంటర్నెట్ వల్లనే అని.. అప్పటి నుంచి భారత్‌లో నెట్ వినయోగం ఉందన్నారు విప్లవ్ దేవ్. చదవండి: బెంగాలీలతో సరితూగలేరు; ఇది సిగ్గుచేటు! ‘దీదీ భయపడింది.. అందుకే ఆ నిర్ణయం’ -
త్రిపుర సీఎం కుటుంబంలో కరోనా కలకలం
అగర్తలా : త్రిపుర ముఖ్యమంత్రి నివాసంలో కరోనా వైరస్ కలకలం రేగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్ కుటుంబంలోని ఇద్దరు సభ్యులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో వీరిని ఆసుపత్రికి తరలించారు. తనకు కూడా పరీక్షలు నిర్వహించారనీ, ఇంకా ఫలితాలు రావాల్సి ఉందని సీఎం కుమార్ దేవ్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా తాను ఇంట్లోనే హోం ఐసోలేషన్‌లో ఉన్నానని సీఎం ట్వీట్ చేశారు. బాధిత కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామన్నారు. కాగా ఈశాన్య రాష్ట్రం త్రిపురలో 5374 మందికి కరోనా సోకగా 27 మంది ప్రాణాలు కోల్పోయారు. (మాజీ సీఎంకు కరోనా పాజిటివ్) Two of my family members found COVID19 POSITIVE.Other family members found NEGATIVE I have undergone COVID19 test, result is yet to come I am following self isolation at my residence & all precautionary measures have been taken Praying for the speedy recovery of family members — Biplab Kumar Deb (@BjpBiplab) August 3, 2020 -
బెంగాలీలతో సరితూగలేరు; ఇది సిగ్గుచేటు!
న్యూఢిల్లీ: జాట్లు, పంజాబీలు శారీరకంగా బలవంతులే గానీ వారికి మెదడు ఎక్కువగా పనిచేయదంటూ త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ దేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలివితేటల్లో వారు బెంగాలీలతో పోటీ పడలేరంటూ వివాదానికి తెరతీశారు. ఓ కార్యక్రమంలో విప్లవ్ దేవ్ మాట్లాడుతూ.. ‘‘పంజాబీల గురించి మాట్లాడాల్సి వస్తే వారిని సర్దార్ అంటాం. వారికి తెలివి తక్కువగా ఉన్నా శారీరకంగా దృఢంగా ఉంటారు. కాబట్టి వారిని ప్రేమ, ఆప్యాయతలతో మాత్రమే గెలవగలం. ఇక హర్యానాలో చాలా మంది జాట్లు ఉన్నారు. వారికి మెదడు సరిగా పనిచేయదు. అయితే ఆరోగ్యవంతులుగా ఉంటారు. తెలివితేటల్లో బెంగాలీలతో వారు సరితూగలేరు. బెంగాలీలు తెలివైనవారని భారతదేశమంతటా గుర్తింపు ఉంది’’ అని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేసిన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా విప్లవ్ దేవ్, బీజేపీ తీరుపై మండిపడ్డారు. త్రిపుర సీఎం వ్యాఖ్యలు సిగ్గుచేటని ధ్వజమెత్తారు. బీజేపీ మైండ్‌సెట్ ఇదేనంటూ దుయ్యబట్టారు. హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ విప్లవ్ దేవ్ వ్యాఖ్యలపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. (అసమర్థుడు.. పనికిరాని వాడు! ) ఈ మేరకు.. ‘‘దురదృష్టకరం, సిగ్గుచేటు. బీజేపీ ముఖ్యమంత్రి విప్లవ్ దేవ్ పంజాబ్‌లోని సిక్కు సోదరులను, హర్యానాలోని జాట్ సామాజిక వర్గాన్ని అవమానించారు. వారికి తెలివితేటలు లేవు అన్నారు. నిజానికి బీజేపీ అసలైన ఆలోచనా విధానం ఇదే. ఖట్టార్ జీ, దుష్యంత్ జీ ఎందుకు మౌనంగా ఉన్నారు. మోదీజీ, నడ్డాజీ ఎక్కడున్నారు? క్షమాపణ కోరాలి. చర్యలు తీసుకోవాలి’’అని రణ్‌దీప్ సూర్జేవాలా బీజేపీ అధినాయకత్వం, ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. అయితే ఈ వీడియో ఏ కార్యక్రమానికి సంబంధించినదీ, ఎప్పుడు జరిగిందీ తదితర వివరాలు మాత్రం తెలియరాలేదు. కాగా త్రిపుర సీఎం విప్లవ్ దేవ్‌కు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలవడం కొత్తేమీ కాదు. మహాభారతంలో ఇంటర్నెట్ ఉంది.. మే డే రోజున ప్రభుత్వోద్యోగులకు సెలవు ఎందుకు?.. విద్యావంతులైన యువతీ యువకులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం వెంపర్లాడకుండా ఆవులను పెంచుకోవాలి.. లేదంటే పాన్‌షాప్ పెట్టుకోవాలి వంటి సూచనలు చేసి తీవ్ర విమర్శల పాలయ్యారు. शर्मनाक व दुर्भाग्यपूर्ण! भाजपा के मुख्यमंत्री, त्रिपुरा,बिप्लब देव ने पंजाब के सिख भाइयों व हरियाणा के जाट समाज को अपमानित कर उनका “दिमाग़ कम” बताया ये भाजपा की औछी मानसिकता है। खट्टरजी व दुष्यंत चौटाला चुप्प क्यों हैं? मोदी जी और नड्डाजी कहाँ हैं? माफ़ी माँगे, कार्यवाही करें pic.twitter.com/whI8QOyKVk — Randeep Singh Surjewala (@rssurjewala) July 20, 2020 -
ఆరోగ్యశాఖ మంత్రికి ఉద్వాసన..!
అగర్తలా : త్రిపుర ఆరోగ్యశాఖ మంత్రి, బీజేపీ నేత సుదీప్‌రాయ్ బర్మన్ మత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురయ్యారు. లోక్‌సభ తాజా ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో బర్మన్కు పదవీ గండం తప్పలేదు. ఆయనను మంత్రివర్గం నుంచి తప్పిస్తున్నట్టు శుక్రవారం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. బర్మన్ ఉద్వాసనతో ఆయన మంత్రిగా ఉన్న ఆరోగ్య శాఖ, ఐటీ, ప్రజాపనుల శాఖల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి బిప్లబ్ దేవ్ చేపట్టనుండగా.. కుటుంబ సంక్షేమ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉపముఖ్యమంత్రి జిష్ణుదేవ్ వర్మ చేపట్టనున్నారు. త్రిపుర మాజీ సీఎం సమీర్ రంజన్ కుమారుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన బర్మన్ కాంగ్రెస్‌లో కీలక నేతగా ఎదిగారు. రెండేళ్ల క్రితం ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సహా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్రంలో బీజేపీ-ఐపీఎఫ్టీ కూటమి బలోపేతం కావడానికి కృషి చేశారు. ఆయన 1998 నుంచి నేటి వరకు అగర్తలా శాసనసభా స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 25 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతున్న సీపీఎంను గద్దెదించి బీజేపీ అధికారాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. రెండు లోక్‌సభ స్థానాలున్న రాష్ట్రంలో ఒకటి సీపీఎం గెలుచుకోగా.. మరో స్థానంలో బీజేపీ విజయం సాధించింది. కాగా, లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో హింస రాజుకుంది. ఇప్పటి వరకు ముగ్గురు మరణించగా కొన్ని వందల మంది గాయపడ్డారు. -
మేడే రోజున సెలవెందుకు?
అగార్తల : త్రిపుర సీఎం విప్లవ్ దేవ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది కార్మిక సంఘాలు మే1న మేడే దినోత్సవం జరుపుకుంటున్న విషయం తెలిసిందే. మేడే సందర్భంగా ప్రపంచ దేశాలు కార్మికులకు, ఉద్యోగులకు సెలవు దినంగా పాటిస్తాయి. విప్లవ్ మాత్రం మేడే రోజున ఉద్యోగులకు సెలవు ఎందుకని ప్రశ్నించారు. సోమవారం త్రిపురలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘మేడే రోజున ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ఎందుకు ఇవ్వాలి?. మీరేమీ కార్మికులు కాదు. కర్మాగారాలు, ఫ్యాక్టరీలలో పనిచేసే లేబర్స్‌కి మాత్రమే ఆ రోజున సెలవు మంజూరు చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు కార్మికులుగా పరిగణించరు. అందుకే ఉద్యోగులకు ఆరోజు సెలవు ఇవ్వడం లేదు’’ అని వ్యాఖ్యానించారు. తాను రాష్ట్రానికి సీఎంని అని.. కానీ కార్మికుడిని కాదని ఆయన అన్నారు. దేశ వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఆ రోజున సెలవు దినంగా పాటిస్తాయని, ఈ ఏడాది నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు మేడే రోజున సెలవు ఉండదని విప్లవ్ పేర్కొన్నారు. గత వారం త్రిపుర ప్రభుత్వం ప్రకటించిన సెలవుల పట్టికలో మేడేను వర్కింగ్ డేగా ప్రకటించడంతో ఈ విషయం చర్చనీయాంశమైంది. కాగా గతంలో ఉన్న సీపీఎం ప్రభుత్వం 1978 నుంచి ప్రతీ ఏటా మేడేను సెలవుదినంగా పాటిస్తోంది. సీఎం నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. వెట్టి చాకిరికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమాన్ని గుర్తుచేసుకుంటూ ఆ రోజున కార్మిక దినోత్సవంగా పాటిస్తున్న విషయం తెలిసిందే. -
అదేం పెద్ద సమస్యే కాదు
ఓవైపు అసోం ఎన్ఆర్సీ వ్యవహారం రాజకీయ చిచ్చును రాజేసిన వేళ.. త్రిపుర సీఎం విప్లవ్ దేవ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఎన్ఆర్సీ అనేది చాలా చిన్న విషయమని.. దాన్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న రీతిలో ఆయన వ్యాఖ్యానించారు. మంగళవారం నాగ్‌పూర్‌కు వెళ్లిన విప్లవ్.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్భగత్ను కలిశారు. అనంతరం విప్లవ్ మీడియాతో మాట్లాడుతూ ఎన్ఆర్సీ వ్యవహారంపై స్పందించారు. (ఆమెను అందగత్తె అని ఎవరైనా అంటారా?) ‘ఎన్ఆర్సీ డిమాండ్ ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో అయితే లేదు. ప్రతీ విషయం కూడా మా రాష్ట్రంలో(త్రిపుర) చాలా పద్ధతిగా ఉంటుంది. నాకు తెలిసి అసోంలో కూడా అదేం పెద్ద విషయం కాదనే అనిపిస్తోంది. ఆ రాష్ట్ర సీఎం సర్బానంద సోనోవాల్ ఈ వ్యవహారాన్ని చక్కబెడతారన్న నమ్మకం ఉంది. శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసి కల్లోలం రేపాలని కొందరు యత్నిస్తున్నారు. విదేశీ మైండ్‌సెట్‌తో ఉన్నవాళ్లే ఈ అంశాన్ని వివాదాస్పదం చేస్తున్నారు’ అని విప్లవ్ మీడియాతో వ్యాఖ్యానించారు. కాగా, ఈ వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి. (భారతంలో ఇంటర్నెట్) -
సీఎం ఉన్నా.. మోదీ పాలనే
సాక్షి, న్యూఢిల్లీ : త్రిపురలో పాతికేళ్ల వామపక్ష ప్రభుత్వంలో ఎప్పుడూ మూక దాడులు జరిగిన ఘటనలు చోటుచేసుకోలేదని త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ పేర్కొన్నారు. కనీసం ఏడాది కూడా ముగియకముందే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం దాడులకు పాల్పడి, ప్రజలను భయాందోళనకు గురిచేస్తోందని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయడంలో బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, తన వైఫల్యాల నుంచి తప్పించుకునేందుకే ఈ దాడులకు పాల్పడుతోందని మాణిక్ ఆరోపించారు. ఢిల్లీలో వామపక్షల ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజాస్వామ్య హత్య’ నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘దేశ వ్యాప్తంగా బీజేపీ గోరక్షణ పేరుతో అమాయక ప్రజలపై దాడులకు పాల్పడుతోంది. పాతికేళ్ల వామపక్ష ప్రభుత్వంలో త్రిపురలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. హిందుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం టార్గెట్ చేస్తోంది. మైనార్టీ, దళితులకు దేశంలో రక్షణ లేదు. ప్రతీక్షణం భయం, భయంగా బతుకుతున్నారు. మూక దాడులు అనేవి ప్రభుత్వం చేస్తున్న గొప్ప కుట్ర. త్రిపురలో సీఎం ఉన్నా.. అక్కడ సాగేది మోదీ పాలనే’ అని అన్నారు. -
నోబెల్‌ను టాగూర్ తిరస్కరించారట!
అగర్తలా: ఇటీవల తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న త్రిపుర సీఎం విప్లవ్ దేవ్ మరోసారి నోరుజారి విమర్శలను ఎదుర్కొంటున్నారు. జాతీయ గీత రచయిత, ప్రముఖ కవి రవీంద్ర నాథ్ టాగూర్ అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన సాహిత్య నోబెల్ బహుమతిని వెనక్కు ఇచ్చారని విప్లవ్ దేవ్ అన్నారు. గీతాంజలి నవలకు 1913లో టాగూర్‌కు నోబెల్ ఇచ్చారు. వాస్తవానికి బ్రిటిష్ ప్రభుత్వం తనకు ఇచ్చిన ‘బ్రిటిష్ నైట్‌హుడ్’ బిరుదును జలియంవాలా బాగ్ ఊచకోతకు నిరసనగా 1919లో టాగూర్ వదిలేశారు. నోబెల్‌ను తిరస్కరించలేదు. కానీ విప్లవ్ దేవ్ మాత్రం బ్రిటిష్ పాలనకు నిరసనగా టాగూర్ నోబెల్‌నే వెనక్కు ఇచ్చారని చెప్పడం విమర్శలకు దారితీసింది. విప్లవ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో సరదా వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. -
మరోసారి విప్లవ్ దేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
మా జోలికొస్తే గోళ్లు కత్తిరిస్తా: ముఖ్యమంత్రి
న్యూఢిల్లీ : తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలవడం బాగా అలవాటయ్యింది త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్. ఈయన ప్రతి రోజు ఏదో ఒక వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో నెటిజన్లు విప్లవ్‌ని, బీజేపీలను విపరీతంగా ట్రోల్ చేసేస్తున్నారు. మహాభారత కాలంలో శాటిలైట్ కమ్యూనికేషన్ ఉందంటూ మొదలైన ఆయన వ్యవహారం.. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీకి మతి చెడిందంటూ వ్యాఖ్యలు... మాజీ మిస్ వరల్డ్ డయానా హెడెన్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు... సివిల్ సర్వీసెస్‌కు సివిల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్లే సరితూగుతారని, మెకానికల్ వాళ్లు పనికి రారని ప్రకటన... చివరకు.. చదువుకోవటం కన్నా పాన్ షాపులు పెట్టుకోవటం, ఆవులు మేపుకోవటం ఉత్తమం అంటూ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించటం, ఇలా వరుస వివాదస్పద వ్యాఖ్యలతో రోజు మీడియాలో నిలుస్తున్నారు. తాజాగా బిప్లబ్ కుమార్ దేబ్ తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవారికి ప్రమాదం తప్పదు అని హెచ్చరిస్తున్న వీడియో ఒకటి వైరల్‌గా మారడంతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ వీడియోలో తన ప్రభుత్వం జోలికి వస్తే ఎలాంటి పరిస్థితిలు ఎదురవుతాయో చెప్పడానికి ఆయన కూరగాయలు అమ్మే వ్యక్తిని ఉదాహరణగా తీసుకున్నాడు. ‘కూరగాయలు అమ్మే వ్యక్తి సొరకాయలను అమ్ముదామని ఉదయ 8 గంటల ప్రాంతంలో మార్కెట్‌కు వచ్చాడు. కానీ 9 గంటలకల్లా ఆ సొరకాయ చెడిపోయింది. కారణం... వచ్చిన వినియోగదారలందరూ సొరకాయను పరీక్షించడానికి తమ గోర్లతో నొక్కి చూసారు. అందువల్ల ఆ సొరకాయ చెడిపోయింది.’ అలానే ఎవరైన నా ప్రభుత్వ వ్యవహరాల్లో జోక్యం చేసుకున్న, నా ప్రభుత్వాన్ని హేళన చేస్తే... నేను వారి గోళ్లను కత్తిరిస్తాను. కాబట్టి జాగ్రత్త నా ప్రభుత్వాన్ని తాకే ప్రయత్నం కూడా చేయకండి అంటూ హెచ్చరించారు. బిప్లబ్ రోజు ఇలా ఏదో ఒక వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో అతని నోటికి అడ్డుకట్ట వేసేందుకు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు. బిప్లబ్‌ను తన ఎదుట హాజరు కావాల్సిందిగా ఆయన సమన్లు జారీ చేశారు. మే 2నఆయనను తమ ఎదుట హాజరు కావాలని ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఆదేశించినట్లు సీనియర్ నేత ఒకరు మీడియాకు వెల్లడించారు. -
ఆవుల్ని పెంచుకోండి.. పాన్‌షాప్ పెట్టుకోండి..
అగర్తలా: త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ దేబ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విద్యావంతులైన యువతీయువకులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం వెంపర్లాడకుండా ఆవులను పెంచుకోవాలని లేదంటే పాన్‌షాప్ పెట్టుకోవాలని సూచించారు. రాజకీయ పార్టీల చుట్టూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం తిరగడం వల్ల జీవితంలో విలువైన సమయం వృథా అవుతుందని అభిప్రాయపడ్డారు. త్రిపుర వెటర్నరీ కౌన్సిల్ ఆదివారం నాడిక్కడ నిర్వహించిన ఓ సెమినార్లో బిప్లవ్ మాట్లాడుతూ.. ‘ప్రతి ఇంట్లో ఓ ఆవు ఉండాలి. ఒక్కో లీటర్ ఆవుపాలు ప్రస్తుతం రూ.50గా ఉంది. పదేళ్ల పాటు ప్రభుత్వ ఉద్యోగాల కోసం తిరగడానికి బదులుగా పాలు అమ్ముకుని ఉంటే ప్రస్తుతం ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాల్లో రూ.10 లక్షలు ఉండేవి. కనీసం రూ.75 వేల పెట్టుబడితో కొంచెం కష్టపడితే నెలకు వీరు రూ.25,000 ఆర్జించవచ్చు. కానీ గత 25 ఏళ్లలో రాష్ట్రంలో ఏర్పడ్డ కమ్యూనిస్టు సంస్కృతే దీనికి అడ్డంకిగా మారింది’ అని వ్యాఖ్యానించారు. ‘కనీసం 10 మంది నిరుద్యోగ యువతకు ఉపాధిని కల్పించాలని అధికారులకు నేను చెప్పాను. ఆవుల్ని, పందుల్ని, కోళ్లను పెంచుకోవడం ద్వారా ఆదాయాన్ని ఆర్జించవచ్చు. రాబోయే మూడు నెలల్లో 3,000 మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని వెల్లడించారు. గతంలో ఓ సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. పకోడీలు అమ్ముకుని రోజుకు రూ.200 ఆర్జించేవారిని నిరుద్యోగులుగా పరిగణించలేమని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. విద్యావంతులు వ్యవసాయం చేయలేరన్న సంకుచిత మనస్తత్వమే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యకు ప్రధాన కారణమని బిప్లవ్ అభిప్రాయపడ్డారు. ఇంతకుముందు సివిల్స్ పరీక్షను సివిల్ ఇంజనీర్లే రాయాలనీ, మెకానికల్ ఇంజనీర్లు రాయకూడదంటూ బిప్లవ్ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. -
అవునా సార్?!
త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ డయానా హైడన్ పై చేసిన వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి? దేశంలో ‘మీటూ’ ఉద్యమం జరుగుతోంది. ఆడవాళ్ల మీద, పసి పిల్లల మీద ఆత్యాచారాల విషయంలో, స్త్రీల హక్కులను భంగపరిచే విషయంలో భూగోళంలోనే భారతదేశం ముందు వరసలో ఉందని సర్వేలు చెబుతున్నాయి. స్త్రీలను గౌరవించే, వారి మర్యాదను కాపాడే వ్యక్తిత్వాన్ని అలవరుచుకునే పరిస్థితుల లేమి గురించి, వాటి అవసరాన్ని గురించి చర్చ జరుగుతున్నది. ఇలాంటి సమయంలో నేతలు ఆచితూచి మాట్లాడాలి. కాని అలా జరగడం లేదు. ఒక్కొక్కరు ఒక్కోవిధంగా నోరు జారుతున్నారు. ‘దేశంలో అత్యాచారాలు ఆపలేం.. అవి ఏవో ఒక మూల జరుగుతూనే ఉంటాయి. వాటిని రాద్ధాంతం చేయవద్దు’ అని ఒక పురుషనేత అంటే ‘అత్యాచారాలు సంస్కృతిలో భాగం’ అన్నట్టుగా ఒక మహిళా నేత వ్యాఖ్యానించారు. ఇప్పుడు తాజాగా త్రిపుర ముఖ్యమంత్రి ‘బాడీ షేమింగ్’కు పాల్పడ్డారు. ఇటీవల కాలంలో త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ జోరుగా వార్తలకెక్కుతున్నారు. మహా భారతం కాలంలోనే మనకు ఇంటర్నెట్ ఉండేదని ఆయనన్న వ్యాఖ్యతో దేశంలో కొందరు నొసలు చిట్లిస్తే మరికొందరు మంచి జోక్ విన్నట్టుగా హాయిగా నవ్వారు. ఈయన ఇప్పుడు ‘అందంను కొలిచే’ షరాబు అవతారం ఎత్తారు. శుక్రవారం త్రిపుర రాజధాని అగర్తలాలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న బిప్లబ్ ‘భారతీయ అందానికి ప్రతీక ఐశ్వర్యరాయ్ మాత్రమే. డయానా హైడన్‌ను అందగత్తె అంటారా ఎవరైనా? ఆమె మిస్ వరల్డ్ గెలిచిందంటే నవ్వొస్తుంది’ అని వ్యాఖ్యానించారు. ఐశ్వర్యారాయ్ 1994లో ‘మిస్ వరల్డ్’ టైటిల్ గెలుచుకున్నారు. మన హైదరాబాద్‌కు చెందిన డయానా హైడన్ 1997లో ‘మిస్ వరల్డ్’ గెలుచుకున్నారు. బిప్లబ్ ఏమంటారంటే ‘సౌందర్య సాధనాల సంస్థలు మన దేశ మార్కెట్‌ను వశపరుచుకోవడానికి దేశ యువతులకు వరుసగా అందాల టైటిల్స్ ఇస్తూ వెళ్లాయి. ఆఖరుకు డయానా హైడన్‌కు కూడా ఇచ్చాయి’ అనే అర్థంలో మాట్లాడారు. ఇది డయానా రంగు, రూపును అవమాన పరచడమే అని సోషల్ మీడియాలో చాలామంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. రూపాన్ని, ఆకారాన్ని బట్టి అందాన్ని వ్యాఖ్యానించడం ఏమిటి అంటున్నారు. ద్రవిడులు రంగు తక్కువగా ఉండొచ్చు, కొందరు పొట్టిగా ఉండొచ్చు, కొందరి ముక్కు వెడల్పుగా ఉండొచ్చు... కాని దేని సౌందర్యం దానిదే... ఫలానా విధంగా ఉండటమే అందం అని నిర్థారించడం సాంస్కృతిక ఆధిపత్యం అని విమర్శిస్తున్నారు. ‘అందమైన యువతి లక్ష్మీ దేవి, సరస్వతి దేవిలా ఉండాలి’ అని బిప్లబ్ వ్యాఖ్యానించారు. ఇలా అనడం వల్ల అలా లేని వాళ్లను ఎద్దేవా చేయొచ్చని ప్రోత్సహించినవారయ్యారు. ఇది కచ్చితంగా ‘బాడీ షేమింగ్’ కింద వచ్చే అంశమే అంటున్నారు నెటిజన్లు. ‘మన ఆడపిల్లలకు అందాల టైటిల్స్ ఇచ్చి ఇక్కడి మార్కెట్‌ను వశ పరుచుకున్నాక ఇక అలాంటి టైటిల్స్ ఇవ్వడం మానుకున్నారు’ అని బిప్లబ్ అన్నారు. ‘ఈ పెద్ద మనిషికి గత సంవత్సరమే మానుషి చిల్లర్‌కు మిస్ వరల్డ్ వచ్చిన సంగతి తెలియనట్టుంది’ అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధాని నరేందర్ మోడీ ఇటీవల తన పార్టీ శ్రేణులకీ, పదవుల్లో ఉన్నవారికి ‘ఆచి తూచి మాట్లాడండి’ అని ఆదేశాలు ఇచ్చారు. కాని– ఈ బిజెపి ముఖ్యమంత్రి మాత్రం నోరు దఫదఫాలుగా తెరుస్తూ విమర్శలకు పాత్రమవుతున్నారు. -
మహాభారతంలో ఇంటర్నెట్ ఉంది : సీఎం
అగర్తలా, త్రిపుర : భారతీయ జనతా పార్టీ మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ వ్యాఖ్యలను మరువక ముందే ఆ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. అగర్తలాలోని ఓ ఈవెంట్‌కు హాజరైన మహాభారత కాలంలోనే ఇంటర్నెట్, ఉపగ్రహ వ్యవస్థ భారత్‌కు అందుబాటులో ఉన్నాయని అన్నారు. మహాభారత సంగ్రామంలో ఎప్పటికప్పుడు ఏం జరగుతుందో సంజయ ద్రుతరాష్ట్రుడి తెలియజేశాడని, అది ఇంటర్నెట్ వల్లే సాధ్యం అయిందని చెప్పారు. అయితే, ఈ టెక్నాలజీ అప్పట్లోనే ఉందని మనకు తెలియలేదని అన్నారు. ఇంటర్నెట్ను పాశ్చాత్య దేశాలు కనుగొన్నాయని భావించే ప్రతిఒక్కరూ లక్షల సంవత్సరాల క్రితమే భారత్ ఇంటర్నెట్ను వినియోగించిందని తెలుసుకోవాలని వ్యాఖ్యానించారు. సాంకేతికతకు పుట్టినిల్లు అయిన భారత్‌లో జన్మించినందుకు తనకు గర్వంగా ఉందన్నారు. ఇంటర్నెట్ వంటి అద్భుత సాంకేతికతను దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ అందరికీ అందుబాటులోకి తెస్తున్నారని అన్నారు. కాగా, విప్లవ్ వ్యాఖ్యలపై సోషల్‌మీడియాలో జోకులు పేలుతున్నాయి. బీజేపీలో ఉంటూ కెరీర్‌ను అభివృద్ధి పథాన నడిపించుకోవాలంటే స్టూపిడ్ కామెంట్స్ చేయాలని ఒకరు. అవునా..!! అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే, కొందరు నిపుణులు విప్లవ్ కామెంట్లపై ప్రశ్నలు సంధించారు. మీరు చెప్పిందే నిజమైతే పద్మవ్యూహంలోకి వెళ్లిన అభిమన్యుడు ఎలా వెనక్కురావాలో క్వొరాలో అడగలేదు ఎందుకు? అని ప్రశ్నించారు. కొద్ది రోజుల క్రితం సత్యపాల్ డార్విన్ సిద్ధాంతాన్ని తప్పుబట్టిన విషయం తెలిసందే. This raises a few questions. Why didn't Abhimanyu ask Quora how to escape the Chakravyuha? Why did Sanjay narrate the Kurukshetra War when Siri could have done it? Also, Krishna really should have streamed the Bhagavad-Gita on Facebook Live. #Mahabharata — Audrey Truschke (@AudreyTruschke) 17 April 2018 How to build your career in BJP. Say stupider things than your supreme leader. 🤦♂️https://t.co/jTKLGJ6Zug — Sasidharan Pazhoor (@inquestioner) 17 April 2018 -
సీఎం నివాసంలో అస్తిపంజరం ; మళ్లీ కలకలం
అగర్తలా : త్రిపుర అభివృద్ధిబాటలో మాణిక్ సర్కార్‌ను కూడా కలుపుకొని వెళతామంటూనే.. ఆయనను ఇరుకునపెట్టే ప్రయత్నాలను ముమ్మరం చేసింది బీజేపీ! కాషాయదళం విజయానికి కారకుడైన సునీల్ దేవ్‌ధర్ శనివారం పేల్చిన ఓ ట్వీట్.. రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ‘‘త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ దేవ్‌కు నాదొక విన్నపం.. అధికారిక నివాసాల్లోకి చేరబోయేముందు అక్కడి సెప్టిక్ ట్యాంకులను ఓ సారి శ్రుభ్రం చేయించండి. గతంలో మాణిక్ సర్కార్ నివాసంలో మహిళ అస్తిపంజరం లభించిన అనుభవం దృష్ట్యా మీరీ పని తప్పక చెయ్యాలి..’ అని దేవ్‌ధర్ కామెంట్ చేశారు. సీఎం నివాసంలో అస్తిపంజరమా? : అగర్తలాలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో మాణిక్ సర్కార్ 1998 నుంచి మొన్నటిదాకా ఉన్నారు. కాగా, 2005 జనవరి4న ఆ అధికారిక నివాసంలోని సెప్టిక్ ట్యాంకులో ఓ మహిళ అస్తిపంజరం బయటపడటం అప్పట్లో పెను సంచలనాన్ని సృష్టించింది. సెప్టిక్ ట్యాంకును శుభ్రం చేయడానికి వచ్చిన మున్సిపల్ సిబ్బంది దానిని గుర్తించారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న మాణిక్ సర్కార్ కేసును సీఐడీకి అప్పగించారు. ఆ తర్వాత అది సీబీఐకి బదిలీ అయింది. 13ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఆ కేసు ఇంకా కొలిక్కిరాకపోవడంతో పలు విమర్శలకు తావిచ్చినట్లైంది. ‘ఇది మాణిక్ నియంత పాలనకు నిదర్శనమని’ సీపీఎం ప్రత్యర్థులు ఆరోపిస్తారు. ఇప్పుడు ఉన్నపళంగా సునీల్ దేవ్‌ధర్ ‘అస్తి పంజరం’ ఉదంతాన్ని కోట్ చేస్తూ ట్వీట్ చేయడం వ్యూహంలో భాగమా, లేక యాదృశ్చికమా తెలియాల్సిఉంది. ఇంతకీ ఆ స్కెలిటన్ ఎవరిది? : సీఎం నివాసంలోని సెప్టిక్ ట్యాంక్‌లో తేలిన అస్తిపంజరం ఎవరిదనేదానిపై త్రిపురలో భిన్నకథనాలు ప్రచారంలో ఉన్నాయి. నేపాల్‌కు చెందిన పని అమ్మాయిని.. సీఎం సిబ్బందిలో ఒకరు లేదా కొందరు అత్యాచారం చేసి, హతమార్చి ఉంటారని నాటి కాంగ్రెస్ నేత సమీర్ రాజన్ బర్మన్ ఆరోపించారు. హత్యాచారం కేసును తొక్కిపెట్టేక్రమంలో మృతురాలి కుటుంబాన్ని బలవంతంగా నేపాల్‌కు పంపించేశారని ఆయన పేర్కొన్నారు. మాణిక్ సర్కార్‌పై దినేశ్ కాంజీ అనే రచయిత రాసిన ‘మాణిక్ సర్కార్ : ది రియల్ అండ్ వర్చువల్’ అనే పుస్తకంలోనూ అస్తిపంజరం వ్యవహారాన్ని ప్రస్తావించారు. ‘‘అప్పట్లో జాతీయ స్థాయి మీడియాలో సైతం చర్చనీయాంశమైన ఈ కేసులో బర్మన్(కాంగ్రెస్ నేత) ఆరోపణలను ఏఒక్కరూ పట్టించుకోకపోవడం కొంత ఆశ్చర్యం అనిపిస్తుంద’ని రచయిత రాసుకొచ్చారు. దేవ్‌ధర్ తాజా ట్వీట్‌పై సీపీఎం శ్రేణులు ఇంకా స్పందించాల్సిఉంది. I request @BjpBiplab, new CM of Tripura, to get septic tanks of all minister quarters cleaned before occupying them. It should be recollected that a woman’s skeleton was found in septic tank of Ex CM Manik Sarkar's quarter on Jan 4, 2005 but the case was deliberately suppressed. — Sunil Deodhar (@Sunil_Deodhar) 10 March 2018 -
అద్వానీని అవమానించిన మోదీ !
-
అద్వానీని అవమానించిన మోదీ!
అగర్తలా : త్రిపురలో తొలిసారి బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం సందర్భంగా చోటుచేసుకున్న దృశ్యాలు కొన్ని వైరల్ అయ్యాయి. అగర్తలాలోని అసోం రైఫిల్స్ మైదానంలో శుక్రవారం అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో త్రిపుర కొత్త సీఎంగా విప్లవ్ కుమార్ దేవ్ ప్రమాణం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్జోషి.. తదితరుల ముఖ్యులంతా ఈ వేడుకకు హాజరయ్యారు. విప్లవ్ వ్యక్తిగత ఆహ్వానం మేరకు కమ్యూనిస్ట్ యోధుడు, త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ కూడా వేదిక ఎక్కారు. కాగా, ముఖ్యఅతిథి అయిన మోదీ వేదికపైకి వస్తూ వరుసగా ఒక్కొక్కరికీ ప్రమాణాలు చేస్తూ ముందుకు నడిచారు. తొలుత అమిత్ షా, రాజ్‌నాథ్‌లకు నమస్కరించిన మోదీ.. ఆ పక్కనే చేతులు జోడించి నిల్చున్న అద్వానీవైపు మాత్రం కన్నెత్తి చూడలేదు. అంతేనా, అద్వానీ పక్కనే ఉన్న మాణిక్ సర్కార్‌పై దగ్గరికి వెళ్లిమరీ ఆప్యాయత కురిపించి, రెండు సెక్లను మాట్లాడారు. అంతసేపూ అద్వానీ చేతులు దండం పెడుతూనేఉన్నా.. మోదీ పట్టించుకోకుండా వెళ్లిపోయారు. వాస్తవానికి వారి మనసుల్లో ఏముందో, లేదో తెలియదుగానీ.. ‘గురువును విస్మరించిన శిశ్యుడు..’,, ‘అద్వానీని అవమానించిన మోదీ..’ , ‘పెద్దాయనను చూస్తే జాలేస్తోంది..’ అంటూ ఈ వీడియోకు రకరకాల భాష్యాల జోడిస్తున్నారు సోషల్ మీడియాలో! -
త్రిపుర సీఎంగా విప్లవ్ ప్రమాణం
అగర్తలా: సుమారు పాతికేళ్ల కమ్యూనిస్టుల పాలన అనంతరం త్రిపురలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర నూతన సీఎంగా విప్లవ్ కుమార్ దేవ్(48) శుక్రవారం ప్రమాణం చేశారు. అగర్తలాలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తథాగతరాయ్ విప్లవ్‌తో సీఎంగా ప్రమాణంచేయించారు. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ , కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్, బీజేపీ నాయకులు అడ్వాణీ, ఎంఎం జోషి, తాజా మాజీ సీఎం మాణిక్ సర్కార్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. విప్లవ్‌తో పాటు బీజేపీకే చెందిన జిష్ణు దేవ్ వర్మన్ ఉప ముఖ్యమంత్రిగా, మరో ఏడుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు. బీజేపీ సీఎంలు రూపానీ(గుజరాత్), శివరాజ్ సింగ్ చౌహాన్(మధ్యప్రదేశ్), సర్బానంద సోనోవాల్(అసోం), రఘువర్ దాస్(జార్ఖండ్)లూ కార్యక్రమంలో పాల్గొన్నారు. త్రిపురకు పూర్తి మద్దతు: మోదీ త్రిపుర సమగ్రాభివృద్ధి కోసం కొత్త ప్రభుత్వానికి కేంద్రం పూర్తిగా మద్దతిస్తుందని ప్రధాని మోదీ ప్రకటించారు. విప్లవ్ ప్రమాణ స్వీకారం చేశాక మోదీ ప్రసంగించారు. ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి చెందడానికి అవకాశాలు అపారంగా ఉన్నాయని, వాటిని వెతికిపట్టుకోవాలని పిలుపునిచ్చారు. ‘ త్రిపుర ప్రజల జీవితాల్లో మార్పు రావాలంటే రాష్ట్రాన్ని అభివృద్ధిలో కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలి. ప్రతి భారతీయుడు ఈశాన్య వాసులకు అండగా ఉంటాడు’ అని అన్నారు. ఆరెస్సెస్ నుంచి మరో సీఎం.. విప్లవ్ రాజకీయ ప్రస్థానం ఆరెస్సెస్‌తో∙మొదలైంది. గోమతి జిల్లా రాజ్‌ధార్ నగర్ గ్రామంలోని మధ్య తరగతి కుటుంబంలో 1971, నవంబర్ 25న విప్లవ్ జన్మించారు. ఆయన తండ్రి జనసంఘ్‌లో పనిచేశారు. డిగ్రీ పూర్తిచేసిన విప్లవ్ ఆరెస్సెస్‌లో చేరి సుమారు 16 ఏళ్లు సేవలందించారు. -
త్రిపుర ముఖ్యమంత్రిగా విప్లవ్ కుమార్ దేవ్
-
అనుమానాలొద్దు..అండగా ఉంటాం: మోదీ
అగర్తలా : త్రిపురలో నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వానికి కేంద్రం పూర్తిస్థాయిలో అండగా నిలబడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. సమాఖ్య స్ఫూర్తితో ఈశాన్య రాష్ట్రాలను మరింతగా వృద్ధిలోకి తెస్తామన్నారు. అగర్తలాలోని అసోం రైఫిల్స్ మైదానంలో శుక్రవారం జరగిన ప్రమాణ స్వీకారమహోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ‘‘అపారమైన సహజవనరులు ఈశాన్యాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలన్నదే కేంద్ర ప్రభుత్వ సంకల్పం. కొత్త శిఖరాలను చేరే మీ(ఈశాన్య) ప్రయాణంలో యావత్ దేశం అండగా నిలుస్తుంది. త్రిపుర ప్రజల జీవితాల్లో కొత్తవెలుగులు నింపడానికి అవసరమైన సహాయసహకారాలన్నీ కేంద్రం అందిస్తుంది. ఈ విషయంలో మీకు ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు’’ అని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు. ఈ సదర్భంగా త్రిపుర కొత్త సీఎం విప్లవ్ కుమార్ దేవ్‌ను, డిప్యూటీ సీఎం విష్ణు దెబార్మా, ఇతర మంత్రులకు శుభాభినందనలు తెలిపారు. ఏపీ, బిహార్, అసోంలకూ ఇలాగే : పార్లమెంట్లో వరుస ఆందోళనల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశైంది. ఈ తరుణంలో ప్రధాని మోదీ ఆయా రాష్ట్రాలకు గతంలో ఇచ్చిన హామీల తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏపీకి హోదా కల్పిస్తామని సాక్షాత్తూ వేంకటేశ్వరుడి సన్నిధిలో మోదీ ప్రకటించడం, బిహార్ ఎన్నికలప్పుడు ఆ రాష్ట్రానికి రూ.1.50లక్షల ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాననడం, అసోం ఎన్నికల ప్రచారంలోనూ భారీ తాయిలాలు ప్రకటించడం తెలిసిందే. ఆయా రాష్ట్రాల్లోని ఎన్డీయే ప్రభుత్వాల్లో ఏమేరకు మోదీ హామీలు అమలుజరిగాయన్నది విదితమే! -
ఐ లవ్ మాణిక్ సర్కార్ : సీఎం విప్లవ్
అగర్తలా : ఈశాన్య రాష్ట్రం త్రిపురకు 11వ ముఖ్యమంత్రిగా విప్లవ్ కుమార్ దేవ్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. అగర్తలాలోని అసోం రైఫిల్స్ మైదానంలో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తథాగథ రాయ్ నూతన మంత్రివర్గం చేత ప్రమాణం చేయించారు. విష్ణు దెబార్మా డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, ఈశాన్య రాష్ట్రాల పర్యవేక్షకుడు రాంమాధవ్, బీజేపీ ఇతర ముఖ్యనేతలు సైతం వేడుకలో పాలుపంచుకున్నారు. విప్లవ్ దేవ్ ప్రత్యేక ఆహ్వానం మేరకు కమ్యూనిస్ట్ యోధుడు, త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. ఐ లవ్ మాణిక్‌జీ : సీఎంగా ప్రమాణం చేయడానికి కొద్ది నిమిషాల ముందు విప్లవ్ దేవ్ మీడియాతో మాట్లాడారు. ‘త్రిపుర ప్రజలే నాకు స్ఫూర్తి. వారినే సర్వస్వంగా భావిస్తా. నా ప్రజలు మునుపెన్నడూ చూడని అభివృద్ధిని తప్పక చేసి చూయిస్తా. సీపీఎం అభివృని నిర్లక్ష్యం చేసింది. నేను మాత్రం త్రిపురయే శ్వాసగా జీవిస్తాను. నాకు కమ్యూనిస్టులన్నా, మాణిక్ సర్కార్ అన్నా కూడా ప్రేమే. ఐ లవ్ మాణిక్ సర్కార్జీ’’ అని విప్లవ్ దేవ్ పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వ ప్రమాణస్వీకారం ఫొటోలు.. -
త్రిపురకు ఆయనే 'బిగ్‌బీ'
బిగ్‌బీ అనగానే మనకు వెంటనే గుర్తుచ్చేది బాలీవుడ్ దిగ్గజం అమితాబచ్చన్. కానీ త్రిపుర ప్రజలకు మాత్రం బిగ్‌బీ అనగానే గుర్తుచ్చేది విప్లవ్ కుమార్ దేవ్. కొన్ని రోజులుగా ఈ పేరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 25 ఏళ్ల చరిత్ర గల కమ్యూనిస్ట్ కంచుకోటను బద్దలు కొట్టిన వ్యూహకర్తగా పేరొందారు. త్రిపుర ప్రజలకు నూతన ముఖ్యమంత్రి కూడా. తన మద్దతు దారులకు, రాష్ట్ర ప్రజలకు బిగ్బిగా సుపరిచితులు. త్రిపురలో పుట్టి పెరిగిన విప్లవ్ తన గ్రాడ్యుయేషన్ అనంతరం ఢిల్లీ వెళ్లి 16 ఏళ్లు ఆరెస్సెస్‌లో పని చేశారు. అనంతరం 2015 లో త్రిపురకు తిరిగొచ్చి బీజేపీలో కీలక బాధ్యతలు చేపట్టారు. 15 ఏళ్లు సేవలు అందించి పార్టీ పిలుపుమేరకు రెండేళ్ళ క్రితం రాష్ట్ర పార్టీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2014 సాధారణ ఎన్నికల సమయంలో రాష్ట్ర ఇన్చార్జ్ నుంచి.. మొన్నటి ఎన్నికల్లో 25 ఏళ్ళ నుంచి రాష్ట్రాన్ని అప్రతిహతంగా పరిపాలిస్తున్న మానిక్ సర్కార్ ప్రభుత్వాన్ని పడగొట్టడంలో కీలక పాత్ర పోషించారు. సాధారణ ప్రజలతో మమేకమై.. వారి కష్టాలను దగ్గర నుంచి చూస్తూ.. నేడు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. తనను కలవడానికి వచ్చే ప్రజలే ఆదర్శమని.. వాళ్లు ప్రేమతో ఇచ్చే రోటీనే బలమంటారు విప్లవ్ కుమార్. తాను త్రిపుర ప్రజలను ప్రేమిస్తున్నాని, మానిక్ సర్కార్‌పై.. కమ్యూనిస్టు పార్టీ మీద తనకు అపారమైన గౌరవమని తెలిపారు. కానీ త్రిపుర ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించకోవడంలో మానిక్ ఘోరంగా విఫలమయ్యారన్నారు. -
నేడు త్రిపుర సీఎం ఎంపిక
అగర్తలా: మంగళవారం జరిగే త్రిపుర బీజేపీ, దాని మిత్రపక్షం ఐపీఎఫ్టీ శాసనసభా పక్ష సమావేశంలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోనున్నారు. త్రిపుర సీఎంగా ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విప్లవ్ దేవ్ పేరు దాదాపుగా ఖరారైనా.. నేడు జరిగే భేటీలో కొత్తగా ఎన్నికైన∙ఎమ్మెల్యేలు ఆయనను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకోనున్నారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు గడ్కారీ, ఓరంలు పరిశీలకులుగా హాజరవుతారు. ఈనెల 8న నూతన మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేస్తుంది. నాగాలాండ్‌లో..: ఎన్నికల భాగ స్వామి ఎన్డీపీపీతో కలిసే నాగా లాండ్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని బీజేపీ తెలిపింది. 15 ఏళ్ల పాటు మిత్రపక్షంగా కొనసాగిన నాగా పీపుల్స్ ఫ్రంట్(ఎన్పీఎఫ్)కు మద్దతు ఇవ్వబోమని చెప్పింది. -
త్రిపుర కొత్త సీఎం విప్లవ్!
అగర్తలా: త్రిపుర తదుపరి ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విప్లవ్ కుమార్ దేవ్ నియమితులు కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నిర్ణయం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. బీజేపీ–ఐపీఎఫ్టీ (ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర) కూటమి ఎమ్మెల్యేలు మంగళవారం సమావేశమై తమ ముఖ్యమంత్రిని ఎన్నుకోనున్నారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ హాజరవనున్నారు. విప్లవ్ మాట్లాడుతూ ‘నేను ఇంకా బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నిక కాలేదు. మాణిక్‌ను కలసి ఆశీర్వాదం తీసుకున్నాను’ అని చెప్పారు. త్రిపురలో పుట్టి పెరిగిన విప్లవ్ తన గ్రాడ్యుయేషన్ అనంతరం ఢిల్లీ వెళ్లి 16 ఏళ్లు ఆరెస్సెస్‌లో పనిచేశారు. అనంతరం 2015లో త్రిపురకు తిరిగొచ్చి బీజేపీలో కీలక బాధ్యతలు చేపట్టారు. 2016లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. గతేడాది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీలోకి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించారు. విప్లవ్ సీఎంగా ఈనెల 8న ప్రమాణం చేసే అవకాశముంది. మాణిక్ సర్కార్ రాజీనామా శాసనసభ ఎన్నికల్లో ఓడిపోవడంతో త్రిపుర ప్రస్తుత సీఎం మాణిక్ సర్కార్ తన పదవికి రాజీనామా చేశారు. మాణిక్ ఆదివారం గవర్నర్ తథాగత రాయ్‌ని కలసి తన రాజీనామా లేఖను సమర్పించారు. 1998 నుంచీ త్రిపుర సీఎంగా ఉన్న మాణిక్ సర్కార్.. బీజేపీ కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకునే వరకు పదవిలో కొనసాగుతారు. త్రిపురలో 59 స్థానాలకు ఎన్నికలు జరగ్గా బీజేపీ–ఐపీఎఫ్టీ కూటమి 43, సీపీఎం 16 సీట్లు గెలుపొందడం తెలిసిందే. కాగా, మంత్రివర్గంలో తమ పార్టీకి గౌరవనీయమైన ప్రాతినిధ్యం కల్పించాలని బీజేపీని ఐపీఎఫ్టీ కోరింది. బీజేపీ 35 స్థానాల్లో గెలవడంతో సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే స్థితిలో ఉంది. అటు ఐపీఎఫ్టీ 9 స్థానాల్లో పోటీచేసి 8 చోట్ల గెలిచింది. కాంగ్రెస్‌తో పొత్తుపై పునరాలోచన.. జనవరిలో సీపీఎం కేంద్ర కమిటీ సమావేశం జరిగినప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ, భవిష్యత్తులో కాంగ్రెస్‌తో ఎలాంటి పొత్తులూ ఉండకూదంటూ పార్టీ శ్రేణులు అప్పట్లో ఓ ముసాయిదా తీర్మానం కూడా చేశాయి. వచ్చే నెలలో సీపీఎం మహాసభలు జరగనున్నాయి. ఇప్పుడు త్రిపురలో ఓటమి నేపథ్యంలో ఆ తీర్మానాన్ని వెనక్కు తీసుకునే అవకాశముంది. ‘కాంగ్రెస్‌తో పొత్తులు, సర్దుబాట్లు ఉండకూడదని గతంలో నిర్ణయించాం. కానీ ఇప్పుడు పునరాలోచించాల్సిన అవసరం ఉంది’ అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు హన్నన్ మొల్లా చెప్పారు.