త్రిపుర ముఖ్యమంత్రిగా విప్లవ్‌ కుమార్‌ దేవ్‌ | Biplab Deb Takes Oath As Tripura Chief Minister, PM Modi In Attendance | Sakshi
Sakshi News home page

త్రిపుర ముఖ్యమంత్రిగా విప్లవ్‌ కుమార్‌ దేవ్‌

Published Fri, Mar 9 2018 4:33 PM | Last Updated on Wed, Mar 20 2024 1:57 PM

ఈశాన్య రాష్ట్రం త్రిపురకు 11వ ముఖ్యమంత్రిగా విప్లవ్‌ కుమార్‌ దేవ్‌ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. అగర్తలాలోని అసోం రైఫిల్స్‌ మైదానంలో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ తథాగథ రాయ్‌ నూతన మంత్రివర్గం చేత ప్రమాణం చేయించారు. విష్ణు దెబార్మా డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, ఈశాన్య రాష్ట్రాల పర్యవేక్షకుడు రాంమాధవ్‌, బీజేపీ ఇతర ముఖ్యనేతలు సైతం వేడుకలో పాలుపంచుకున్నారు. విప్లవ్‌ దేవ్‌ ప్రత్యేక ఆహ్వానం మేరకు కమ్యూనిస్ట్‌ యోధుడు, త్రిపుర మాజీ సీఎం మాణిక్‌ సర్కార్‌ కూడా కార్యక్రమానికి హాజరయ్యారు.

Advertisement
 
Advertisement
 
Advertisement