త్రిపుర మాజీ సీఎం మాణిక్‌తో కొత్త సీఎం విప్లవ్ దేవ్ (పక్కన సర్కార్‌కు విప్లవ్ పాదాభివందనం)
అగర్తలా : ఈశాన్య రాష్ట్రం త్రిపురకు 11వ ముఖ్యమంత్రిగా విప్లవ్ కుమార్ దేవ్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. అగర్తలాలోని అసోం రైఫిల్స్ మైదానంలో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తథాగథ రాయ్ నూతన మంత్రివర్గం చేత ప్రమాణం చేయించారు. విష్ణు దెబార్మా డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, ఈశాన్య రాష్ట్రాల పర్యవేక్షకుడు రాంమాధవ్, బీజేపీ ఇతర ముఖ్యనేతలు సైతం వేడుకలో పాలుపంచుకున్నారు. విప్లవ్ దేవ్ ప్రత్యేక ఆహ్వానం మేరకు కమ్యూనిస్ట్ యోధుడు, త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ కూడా కార్యక్రమానికి హాజరయ్యారు.
ఐ లవ్ మాణిక్‌జీ : సీఎంగా ప్రమాణం చేయడానికి కొద్ది నిమిషాల ముందు విప్లవ్ దేవ్ మీడియాతో మాట్లాడారు. ‘త్రిపుర ప్రజలే నాకు స్ఫూర్తి. వారినే సర్వస్వంగా భావిస్తా. నా ప్రజలు మునుపెన్నడూ చూడని అభివృద్ధిని తప్పక చేసి చూయిస్తా. సీపీఎం అభివృని నిర్లక్ష్యం చేసింది. నేను మాత్రం త్రిపురయే శ్వాసగా జీవిస్తాను. నాకు కమ్యూనిస్టులన్నా, మాణిక్ సర్కార్ అన్నా కూడా ప్రేమే. ఐ లవ్ మాణిక్ సర్కార్‌జీ’’ అని విప్లవ్ దేవ్ పేర్కొన్నారు.
బీజేపీ ప్రభుత్వ ప్రమాణస్వీకారం ఫొటోలు..
Comments
Please login to add a commentAdd a comment