![Biplab Deb To Become Tripura Chief Minister - Sakshi](/styles/webp/s3/article_images/2018/03/6/tripura.jpg.webp?itok=biJ7Vauh)
అగర్తలా: మంగళవారం జరిగే త్రిపుర బీజేపీ, దాని మిత్రపక్షం ఐపీఎఫ్‌టీ శాసనసభా పక్ష సమావేశంలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోనున్నారు. త్రిపుర సీఎంగా ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విప్లవ్ దేవ్ పేరు దాదాపుగా ఖరారైనా.. నేడు జరిగే భేటీలో కొత్తగా ఎన్నికైన∙ఎమ్మెల్యేలు ఆయనను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకోనున్నారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు గడ్కారీ, ఓరంలు పరిశీలకులుగా హాజరవుతారు. ఈనెల 8న నూతన మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేస్తుంది.
నాగాలాండ్‌లో..: ఎన్నికల భాగ స్వామి ఎన్‌డీపీపీతో కలిసే నాగా లాండ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని బీజేపీ తెలిపింది. 15 ఏళ్ల పాటు మిత్రపక్షంగా కొనసాగిన నాగా పీపుల్స్ ఫ్రంట్(ఎన్‌పీఎఫ్)కు మద్దతు ఇవ్వబోమని చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment