chief ministerial candidate
-
Mizoram Election Result 2023: మిజోరంలో జెడ్పీఎం
ఐజ్వాల్: ఈశాన్య రాష్ట్రం మిజోరం శాసనసభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీ జోరాం పీపుల్స్ మూవ్మెంట్(జెడ్పీఎం) సంచలన విజయం సాధించింది. అధికార మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్)ను మట్టికరిపించింది. మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు గాను 27 స్థానాల్లో గెలిచింది. మెజారిటీ మార్కును సులువుగా దాటేసింది. మిజోరం ఎన్నికల్లో సోమవారం ఓట్ల లెక్కింపు నిర్వహించారు. అధికార ఎంఎన్ఎఫ్ కేవలం 10 స్థానాల్లో నెగ్గింది. బీజేపీకి రెండు స్థానాలు లభించాయి. కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక్క స్థానంలో గట్టెక్కింది. ఈ ఎన్నికల్లో అధికార ఎంఎన్ఎఫ్కు దారుణ పరాభవం ఎదురైంది. ఎంఎన్ఎఫ్ అధినేత, ముఖ్యమంత్రి జోరామ్‌తాంగ ఓటమిపాలయ్యారు. ఐజ్వాల్ ఈస్ట్–1 స్థానంలో ఆయనపై జెడ్పీఎం అభ్యర్థి లాల్థాన్సాంగ 2,101 ఓట్ల మెజారీ్టతో విజయం సాధించారు. జెడ్పీఎం నేత, ముఖ్యమంత్రి అభ్యర్థి లాల్దుహొమా.. సెర్చిప్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంఎన్ఎఫ్ అభ్యర్థి జె.వాంచ్వాంగ్పై 2,982 ఓట్ల మెజారీ్టతో గెలుపొందారు. ఎన్నికల్లో పోటీ చేసిన 11 మంది మంత్రుల్లో ఏకంగా 9 మంది పరాజయం పాలయ్యారు. ఉప ముఖ్యమంత్రి తాన్లూయా, ఆరోగ్య శాఖ మంత్రి ఆర్.లాల్థాంగ్లియానా, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి లారౌత్కిమా, విద్యుత్ శాఖ మంత్రి ఆర్.లాల్జిర్లియానా, వ్యవసాయం, నీటిపారుదల శాఖ మంత్రి సి.లాల్రిన్సంగా, ఆహారం, పౌర సరఫరాల శాఖ మంత్రి కె.లాల్రిన్లియానా, ఎక్సైజ్ శాఖ మంత్రి లాల్రినామా తదితరులు ఓడిపోయారు. పాఠశాల విద్యా శాఖ మంత్రి లాల్చాందామా రాల్టే, పర్యాటక శాఖ సహాయ మంత్రి రాబర్ట్ రొమావియా రాయ్టే విజయం సాధించారు. మిజోరం నూతన ముఖ్యమంత్రిగా జెడ్పీఎం అధ్యక్షుడు లాల్దుహొమా త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నవంబర్ 7వ తేదీన జరిగిన మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్ఎఫ్, జెడ్పీఎం, కాంగ్రెస్ పారీ్టలు మొత్తం 40 స్థానాల్లో పోటీ చేశాయి. బీజేపీ 23 సీట్లలో తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. రాష్ట్రంలో తొలిసారిగా ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) సైతం పోటీ చేసింది. నాలుగు స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు పోటీపడ్డారు. అలాగే 17 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎన్నికల్లో ‘ఆప్’ ఖాతా తెరవలేకపోయింది. స్వతంత్రులెవరూ నెగ్గలేదు. ఇందిరాగాంధీ అంగరక్షకుడు కాబోయే ముఖ్యమంత్రి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటుకు గురైన మొట్టమొదటి ఎంపీగా అప్రతిష్ట మూటగట్టుకున్న 73 ఏళ్ల లాల్దుహోమా మిజోరం ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆయన రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. అన్నింటినీ తట్టుకొని ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. లాల్దుహొమా ఐపీఎస్ అధికారిగా పనిచేశారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ భద్రతా సిబ్బందికి ఇన్చార్జిగా సేవలందించారు. ఆయన నాయకత్వంలో జోరాం పీపుల్స్ మూవ్మెంట్(జెడ్పీఎం) 2019లో రాజకీయ పారీ్టగా ఎన్నికల సంఘం వద్ద నమోదైంది. కేవలం నాలుగేళ్లలో మిజోరం ఎన్నికల్లో అతిపెద్దగా పార్టీగా అవతరించి, అధికారం చేపడుతుండడం విశేషం. లాల్దుహొమా తొలిసారిగా 1984లో కాంగ్రెస్ టికెట్‌పై మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేశారు. కేవలం 846 ఓట్ల తేడాతో పీపుల్స్ కాన్ఫరెన్స్ పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అదే సంవత్సరం లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత మిజోరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1986లో ఆ పారీ్టకి రాజీనామా చేశారు. అప్పటి ముఖ్యమంత్రి లాల్ థాన్హాలాకు, కేబినెట్ మంత్రులకు వ్యతిరేకంగా కుట్ర పన్నినట్లు లాల్దుహొమాపై ఆరోపణలు వచ్చాయి. 1988లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఆయనపై అనర్హత వేటు పడింది. అలాగే 2020లో ఎంఎన్ఎఫ్ ఎమ్మెల్యేగా ఉన్న లాల్దుహొమాపై మిజోరం అసెంబ్లీ స్పీకర్ లాల్రిన్లియానా సాయ్‌లో అనర్హత వేటు వేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడుతున్నారంటూ లాల్దుహొమాపై ఎంన్ఎఫ్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. మిజోరంలో ఈ చట్టం కింద అనర్హతకు గురైన మొదటి ఎమ్మెల్యే లాల్దుహొమా కావడం గమనార్హం. జెడ్ఎన్పీ అభ్యర్థిగా 2003లో, 2008లో, 2018లో, 2021లోఎమ్మెల్యేగా ఆయన విజయం దక్కించుకున్నారు. రాజకీయ యోధుడిని ఓడించిన మూకదాడి బాధితుడు రాయ్‌పూర్: మత ఘర్షణల్లో కుమారుడిని కోల్పోయి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆ తండ్రి చూపిన ధర్మాగ్రహం.. అక్కడి స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఎన్నికల్లో మట్టికరిపించింది. ఆదివారం వెల్లడైన ఛత్తీస్‌గఢ్ శాసనసభ ఎన్నికలు ఈ ఘటనకు సాక్ష్యంగా నిలిచాయి. అసలేం జరిగిందనేది ఓ సారి గమనిస్తే.. బేమేతరా జిల్లా బిరాన్‌పూర్ గ్రామంలో ఈశ్వర్ సాహూ అనే కార్మికుడికి 23 ఏళ్ల భువనేశ్వర్ సాహూ అనే కుమారుడు ఉన్నాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆ గ్రామంలో జరిగిన మత ఘర్షణల్లో వేరే మతానికి చెందిన అల్లరిమూక భువనేశ్వర్ సాహూను హతమార్చింది. కొడుకును కోల్పోయిన తనకు న్యాయం చేయాలంటూ తమ సాజా నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రవీంద్ర చౌబేను తండ్రి వేడుకున్నాడు. భూపేశ్ బఘేల్ సర్కార్ తనకు ఎలాంటి న్యాయం చేయలేదంటూ ఈశ్వర్ సాహూ కన్నీరుమున్నీరవడం, ఆయన ఆక్రందన నాడు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హత్య ఘటన తర్వాత హతుడి తల్లినీ అల్లరిమూక బెదిరించింది. హత్యకు నిరసనగా నాడు విశ్వహిందూ పరిషత్ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. పట్టించుకోని ప్రభుత్వానికి బుద్ది చెప్పాలనే సంకల్పంతో ఇతనికి బీజేపీ టికెట్ ఇచ్చింది. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సాజా నియోజకవర్గంలో రాజకీయ యోధుడిగా పేరొందిన రవీంద్ర చౌబేకు పోటీగా బరిలో నిలిపింది. ఈశ్వర్ సాహూకు జరిగిన అన్యాయంపై ప్రజల్లో గూడుకట్టుకున్న ఆగ్రహావేశాలు తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్ఫుటంగా కనిపించాయి. రవీంద్ర చౌబే కంటే ఎక్కువ ఓట్లు సాధించి ఈశ్వర్ ఘన విజయం సాధించారు. ‘ ఈశ్వర్ సాహూ ఒకప్పుడు కార్మికుడు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే. హంతకులకు మద్దతు పలికిన కాంగ్రెస్‌కు ఈశ్వర్ తగిన గుణపాఠం చెప్పారు’ అని బీజేపీ ఐటీ విభాగ జాతీయ సమన్వయ కర్త అమిత్ మాలవీయ వ్యాఖ్యానించారు. -
మాయావతికి సీఎం పోస్ట్ ఆఫర్ చేశాం
న్యూఢిల్లీ: బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దామని కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించినా ఆమె స్పందించలేదని, ముఖ్యమంత్రి అభ్యర్థిగా చేస్తామని ఆఫర్ కూడా ఇచ్చామని ఆయన వెల్లడించారు. సీబీఐ, ఈడీ, పెగసస్ల భయంతోనే ఆమె బీజేపీ విజయానికి బాటలు వేశారని పేర్కొన్నారు. సమృద్ధ్ భారత్ ఫౌండేషన్ ప్రచురించిన ‘ది దళిత్ ట్రూత్’పుస్తకావిష్కరణ కార్యక్రమంలో శనివారం రాహుల్ ప్రసంగించారు. భారత రాజ్యాంగం ఒక ఆయుధమని కాంగ్రెస్ నేత రాహుల్ అభివర్ణించారు. ప్రస్తుతం రాజ్యాంగ వ్యవస్థలన్నిటినీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) హస్తగతం చేసుకుందని ఆరోపించారు. రాజ్యాంగంతో ప్రయోజనం లేకుండా పోయిందన్నారు.‘కేవలం అధికారం చేజిక్కించుకోవడం గురించే ఎల్లప్పుడూ ఆలోచించే కొందరు రాజకీయ నేతల వంటి వాడిని కాదు. ఈ దేశం నాకు చాలా ఇచ్చింది. అదేవిధంగా, తీవ్రంగా కొట్టి హింసింది. నేనింకా నేర్చుకోవాలని దేశం భావిస్తున్నట్లు దాని ద్వారా తెలుసుకున్నాను’అని అన్నారు. -
చెన్నై: ఏఐడీఎంకేలో కీలక రాజకీయ పరిణామాలు
-
ఉత్కంఠ : నేడే సీఎం అభ్యర్థి ప్రకటన
అన్నాడీఎంకే రాజకీయ వివాదాలకు తెరపడేనా అనే ఉత్కంఠ కేడర్‌లో నెలకొంది. సీఎం అభ్యర్థి ఎవరో తేల్చేనా లేదా, నాన్చేనా అనేది మరి కొన్ని గంటల్లో తేలనుంది. ఆమేరకు బుధవారం అన్నాడీఎంకేలో కీలక సమావేశం జరగనుంది. ఆ తర్వాత ప్రకటన వెలువడనుంది. సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో సాగుతున్న కుర్చీ కొట్లాట గురించి తెలిసిందే. వారం రోజులుగా ఓ వైపు అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ , డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వం, మరో వైపు కో కన్వీనర్, సీఎం పళనిస్వామి వేర్వేరుగా మద్దతు నేతలతో మంతనాల్లో మునిగారు. మంగళవారం కూడా మంతనాలు జోరుగానే సాగాయి. మంత్రులు జయకుమార్, ఎస్పీ వేలుమణి, తంగమణి, ఆర్బీ ఉదయకుమార్ గంటల తరబడి పన్నీరుతో ఓ వైపు, పళనితో మరో వైపు సమావేశమయ్యారు. ఇక, తన నివాసంలో సమన్వయ కమిటీ ప్రతినిధులు వైద్యలింగం, కేపీ మునుస్వామిలతో పన్నీరుసెల్వం పొద్దుపోయే వరకు సమావేశం అయ్యారు. సీఎం అభ్యర్థి, ప్రధాన కార్యదర్శి వ్యవహారం, మార్గదర్శక కమిటీ ఎంపిక, ఈ కమిటీలో ఎవరెవరు ఉండాలో అనే విషయంగా సుదీర్ఘంగానే సమాలోచన సాగినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మార్గదర్శక కమిటీ పారీ్టకి కీలకం కానున్న దృష్ట్యా, అందులో చోటు దక్కించుకునేందుకు సీనియర్లు తీవ్రంగానే ప్రయత్నాలు చేశారు. నేడు కీలక ప్రకటన.. ముందుగా తీసుకున్న నిర్ణయం మేరకు బుధవారం సీఎం అభ్యర్థి ఎవరో ప్రకటించాల్సి ఉంది. మార్గదర్శక కమిటీ విషయంగా కూడా స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అలాగే, ప్రధాన కార్యదర్శిగా దివంగత సీఎం జయలలితే శాశ్వతం అని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో, ఆ పదవి విషయంగా ఎలాంటి నిర్ణయం తాజాగా వెలువడుతుందో అన్న ఉత్కంఠ తప్పడం లేదు. పన్నీరు, పళనిల మధ్య బయలుదేరిన ఈ కుర్చీ కొట్లాటలో కేంద్రం పెద్దలు సైతం జోక్యం చేసుకునిన్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. ఈ దృష్ట్యా, బుధవారం జరిగి పార్టీ సమావేశం వ్యవహారాలన్నీ సామరస్యపూర్వంగానే సాగే అవకాశాలు ఉన్నాయని, ఐక్యతతో ప్రకటన చేయవచ్చన్నట్టుగా సీనియర్ నేతలు పేర్కొంటున్నారు. ఇక 11 మందితో కూడిన మార్గదర్శక కమిటీ ఏర్పాటయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉండడంతో సీఎం అభ్యర్థి ఎవరో తాజాగా ప్రకటించే అవకాశాలు తక్కువేనని పేర్కొనడం గమనార్హం. మార్గదర్శక కమిటీలో మెజారిటీ సభ్యుల అభిప్రాయాల మేరకు మరో రోజు సీఎం అభ్యర్థి విషయంగా నిర్ణయం తీసుకోవచ్చని ఓ నేత పేర్కొన్నారు. ఈ మంతనాల గురించి మంత్రి జయకుమార్‌ను కదిలించగా, ఇక, అన్నీ గోల్డెన్ డేస్ అని వ్యాఖ్యానించారు. అమ్మ పాలన మళ్లీ రావాలన్న సంకల్పంతో సమష్టిగా ముందుకు సాగే అవకాశాలు ఎక్కువేనని స్పందించారు. ఈ పరిణామాల నేపథ్యంలో పన్నీరే సీఎం అంటూ కొన్నిచోట్ల, పళని సీఎం అభ్యర్థి అంటూ మరి కొన్ని చోట్ల మద్దతుదారుల పోస్టర్లు హల్చల్ చేశాయి. (తమిళనాడులో హీట్ పెంచిన ట్వీట్ ) నేనే ప్రిసీడియం చైర్మన్.. అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్‌గా మధుసూదన్ ఉన్న విషయం తెలిసిందే. వయోభారం దృష్ట్యా, ఆయన్ను పక్కన పెట్టవచ్చన్న ప్రచారం సాగుతున్న నేపథ్యంలో మధుసూదన్ మీడియా ముందుకు వచ్చారు. తాను జీవించి ఉన్నంత కాలం ప్రిసీడియం చైర్మన్‌గానే వ్యవహరించడం జరుగుతుందని, ఇది అమ్మ జయలలిత తనకు ఇచ్చిన పదవి అని వ్యాఖ్యానించారు. ధర్మయుద్ధంలో పన్నీరు విజయం సాధిస్తారని పేర్కొనడం గమనార్హం. -
నేడు త్రిపుర సీఎం ఎంపిక
అగర్తలా: మంగళవారం జరిగే త్రిపుర బీజేపీ, దాని మిత్రపక్షం ఐపీఎఫ్టీ శాసనసభా పక్ష సమావేశంలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోనున్నారు. త్రిపుర సీఎంగా ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విప్లవ్ దేవ్ పేరు దాదాపుగా ఖరారైనా.. నేడు జరిగే భేటీలో కొత్తగా ఎన్నికైన∙ఎమ్మెల్యేలు ఆయనను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకోనున్నారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు గడ్కారీ, ఓరంలు పరిశీలకులుగా హాజరవుతారు. ఈనెల 8న నూతన మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేస్తుంది. నాగాలాండ్‌లో..: ఎన్నికల భాగ స్వామి ఎన్డీపీపీతో కలిసే నాగా లాండ్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని బీజేపీ తెలిపింది. 15 ఏళ్ల పాటు మిత్రపక్షంగా కొనసాగిన నాగా పీపుల్స్ ఫ్రంట్(ఎన్పీఎఫ్)కు మద్దతు ఇవ్వబోమని చెప్పింది. -
ఎస్పీ సీఎం అభ్యర్థి అఖిలేషే..
లక్నో: వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సమాజ్‌వాదీ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రస్తుత సీఎం అఖిలేష్ యాదవ్ ఉంటారని ఆ పార్టీ ఎంపీ నరేష్ అగర్వాల్ చెప్పారు. ఎస్పీ చీఫ్ ములయాం సింగ్ యాదవ్ ఇంట్లో రాజకీయ ఆధిపత్యపోరు జరుగుతున్న నేపథ్యంలో నరేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. 'ములయాం, అఖిలేష్ మార్గదర్శకత్వంలో ఎన్నికలను ఎదుర్కొంటాం. సీఎం అభ్యర్థిగా అఖిలేషే ఉంటారు' అని నరేష్ అన్నారు. పార్టీ విషయాల్లో బయటివారు ఎవరైనా జోక్యం చేసుకుంటే వెంటనే మానుకోవాలని చెప్పారు. ములయాం సోదరుడు, యూపీ కేబినెట్ మంత్రి శివపాల్ సింగ్ యాదవ్, అఖిలేష్ మధ్య విబేధాలు తీవ్రస్థాయికి చేరినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో నరేష్.. అఖిలేష్‌కు మద్దతుగా మాట్లాడారు. పార్టీలో గొడవలకు బయటనుంచి వచ్చిన వ్యక్తే కారణమని అఖిలేష్ ఆరోపించిన మరుసటి రోజు నరేష్ ఇవే వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా పార్టీలో బాబాయ్, అబ్బాయ్ మధ్య ఎలాంటి విబేధాలూ లేవని ఆయన చెప్పారు. -
డీఎంకే సీఎం అభ్యర్థి కరుణానిధే
చెన్నై: వచ్చే ఎన్నికల్లో డీఎంకే గెలిస్తే ఆ పార్టీ అధ్యక్షుడు కరుణానిధి తమిళనాడు ముఖ్యమంత్రి అవుతారని ఆయన కుమారుడు స్టాలిన్ చెప్పారు. కరుణానిధి నాయకత్వంలోనే పార్టీ వ్యవహారాలు నడుస్తాయని స్పష్టం చేశారు. డీఎంకే తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా స్టాలిన్‌ను ప్రకటించాలని ఆయన మద్దతుదారులు డిమాండ్ చేసిన నేపథ్యంలో పైవిధంగా స్పందించారు. మాజీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన స్టాలిన్ ప్రస్తుతం డీఎంకే కోశాధికారిగా వ్యవహరిస్తున్నారు. డీఎంకే నుంచి బహిష్కరణకు గురైన తన సోదరుడు అళగిరి మళ్లీ పార్టీలోకి వస్తారన్న వార్తల గురించి మాట్లాడేందుకు స్టాలిన్ నిరాకరించారు. -
ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై గందరగోళం
ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై గందరగోళం కొనసాగుతోంది. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు విజయ్ గోయెల్ తాను ఏ పదవికీ అభ్యర్థిని కాదని సోమవారం చెప్పారు. ముందుగా అభ్యర్థిని ఎంపిక చేయడం వల్ల పార్టీలో విభేదాలు వస్తాయని, దీనివల్ల ఎన్నికల ఫలితాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆయన అన్నారు. ఢిల్లీ ఆరోగ్య శాఖ మాజీ మంత్రి హర్షవర్ధన్ పేరు కూడా వినిపిస్తోంది. ముఖ్యమంత్రి పదవి విషయంలో హర్షవర్ధన్‌తో పోటీపడుతున్నారా అన్న ప్రశ్నకు.. తాను ఏ పదవికీ పోటీదారుడు కాదని గోయెల్ బదులిచ్చారు. ఈ విషయంపై బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది కార్యకర్తల అభీష్టం మేరకు ఎంపిక చేస్తుందని తెలిపారు. హర్షవర్ధన్‌ను ఎంపిక చేస్తే పార్టీ పదవికి తాను రాజీనామా చేస్తానని వచ్చిన వార్తలను గోయెల్ ఖండించారు. పార్టీ అగ్రనేతలు రాజ్‌నాథ్ సింగ్, నరేంద్ర మోడీలతో ఆయన ఇటీవల సమావేశమయ్యారు.