డీఎంకే సీఎం అభ్యర్థి కరుణానిధే | Karunanidhi will be Chief Ministerial candidate, says stalin | Sakshi
Sakshi News home page

డీఎంకే సీఎం అభ్యర్థి కరుణానిధే

Published Sun, Oct 26 2014 10:21 PM | Last Updated on Sat, Sep 2 2017 3:25 PM

డీఎంకే సీఎం అభ్యర్థి కరుణానిధే

డీఎంకే సీఎం అభ్యర్థి కరుణానిధే

చెన్నై: వచ్చే ఎన్నికల్లో డీఎంకే గెలిస్తే ఆ పార్టీ అధ్యక్షుడు కరుణానిధి తమిళనాడు ముఖ్యమంత్రి అవుతారని ఆయన కుమారుడు స్టాలిన్ చెప్పారు. కరుణానిధి నాయకత్వంలోనే పార్టీ వ్యవహారాలు నడుస్తాయని స్పష్టం చేశారు.

డీఎంకే తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా స్టాలిన్ను ప్రకటించాలని ఆయన మద్దతుదారులు డిమాండ్ చేసిన నేపథ్యంలో పైవిధంగా స్పందించారు. మాజీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన స్టాలిన్ ప్రస్తుతం డీఎంకే కోశాధికారిగా వ్యవహరిస్తున్నారు. డీఎంకే నుంచి బహిష్కరణకు గురైన తన సోదరుడు అళగిరి మళ్లీ పార్టీలోకి వస్తారన్న వార్తల గురించి మాట్లాడేందుకు స్టాలిన్ నిరాకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement