Legislative Party meetings
-
సర్కారును ఎలా ఎదుర్కొందాం?
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శాసనసభాపక్షం కీలక భేటీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఈ నెల 8న (ఆదివారం) మధ్యాహ్నం ఒంటి గంటకు జరిగే ఈ భేటీకి రావాల్సిందిగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కొందరు ముఖ్య నేతలను ఆహ్వానించనున్నారు.అసెంబ్లీ ఉభయ సభల్లో లేవనెత్తాల్సిన అంశాలపై పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత హాజరుకావాలంటూ సీఎం రేవంత్ చేస్తున్న వ్యాఖ్యలపై ఈ భేటీ సందర్భంగా కేసీఆర్ తన మనోగతాన్ని వెల్లడించే అవకాశం ఉందని సమాచారం. 9న జరిగే శాసనసభ బీఏసీ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించే ఎజెండాలోని అంశాలను బట్టి కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యేదీ, లేనిదీ స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.అలా గొంతు నొక్కితే ఎలా?ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తమ గొంతునొక్కారని బీఆర్ఎస్ ఆరోపించింది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనూ అదే రకమైన పరిస్థితి తలెత్తితే ఎలా ఎదుర్కోవాలన్న వ్యూహంపైనా బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. 9న కొత్త రూపుతో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో.. శుక్రవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. ఎర్రవల్లి నివాసంలో జరిగిన ఈ భేటీలో పలు అంశాలపై కేసీఆర్ సూచనలు చేసినట్టు సమాచారం.9న ‘తెలంగాణ తల్లి’ విగ్రహావిష్కరణఏడాది పాలన విజయోత్సవాల్లో భాగంగా సచివాలయంలో తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆవిష్కరించనుంది. అయితే తెలంగాణ తల్లి విగ్రహం రూపు మార్చడాన్ని వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్ అదే రోజున పోటీ కార్యక్రమానికి సిద్ధమైంది. మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఉద్యమకాలంలో రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు సన్నాహాలు చేస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇక పార్టీ అధినేత కేసీఆర్ కూడా ఈ అంశంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ సుదీర్ఘ లేఖ విడుదల చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.ఇక రేవంత్ ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలను ఎత్తిచూపుతూ శనివారం చార్జిషీటు విడుదల చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. మాజీ మంత్రి హరీశ్‌రావుకు ఈ చార్జిషీటు బాధ్యత అప్పగించినట్టు తెలిసింది. మరోవైపు అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమానికి కేసీఆర్‌ను ఆహ్వానిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ ప్రభుత్వపరంగా ఎలాంటి ఆహ్వానం అందలేదని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. -
ఎమ్మెల్యేలూ.. జర జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో జాగ్రత్తగా పనిచేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతికి తావు ఇవ్వొద్దని, ముఖ్యంగా అధికారుల పోస్టింగ్‌ల విషయంలో జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిదని స్పష్టం చేసినట్టు తెలిసింది. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడటం, పోస్టింగుల విషయంలో జోక్యం చేసుకోవడం వల్లే ఓటమి పాలయ్యారని వ్యాఖ్యానించినట్టు సమాచారం. అందువల్ల ఎలాంటి ఆరోపణలు, విమర్శలకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా పనిచేసుకుంటే.. రెండోసారి కూడా అధికారంలోకి వస్తామని పేర్కొన్నట్టు తెలిసింది. టీపీసీసీ నూతన అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్‌గౌడ్ బాధ్యతల స్వీకారం నేపథ్యంలో.. ఆయనకు అభినందనలు తెలిపేందుకు ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని ఓ హోటల్లో సీఎల్పీ సమావేశమైంది. ఈ కార్యక్రమంలో మహేశ్‌కుమార్‌గౌడ్‌ను పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సన్మానించారు. మహేశ్‌గౌడ్ నియామకంపై పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియాగాం«దీ, రాహుల్ గాం«దీలకు ధన్యవాదాలు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు. అనంతరం రాష్ట్ర రాజకీయాలు, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, పారీ్టలో సమన్వయం తదితర అంశాలపై చర్చించారు. సమన్వయంతో ముందుకు వెళ్లాలి సమావేశంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం గత తొమ్మిది నెలల్లో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజలకు తీసుకెళ్లే బాధ్యతలను పార్టీ నేతలు తీసుకోవాలని కోరారు. ‘‘పీసీసీ అధ్యక్షుడిగా నా ఆధ్వర్యంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాం. లోక్‌సభ సీట్లు గెలిచాం. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసిన వారికి పదవులు ఇచ్చాం. కష్టపడి పనిచేసిన వారికి కాంగ్రెస్ పార్టీలో కచి్చతంగా అవకాశాలు వస్తాయి. నిబద్ధత కలిగిన నాయకుడు కాబట్టే మహేశ్ గౌడ్‌కు పీసీసీ అధ్యక్ష పదవి వచి్చంది. బీసీల కులగణన చేయాలన్నది రాహుల్ గాంధీ బలమైన ఆలోచన. ఆయన ఆలోచన మేరకు రాష్ట్రంలో బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులను నియమించాం. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే వారి జనాభాను లెక్కించాల్సిందే. ఎస్సీ వర్గీకరణ అమలుపై ఉత్తమ్ నాయకత్వంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశాం. ఈ కమిటీ సుప్రీం తీర్పును పూర్తిగా అధ్యయనం చేసి నివేదిక ఇస్తుంది. దేశంపై నాలుగోసారి పట్టు సాధించడానికి మోదీ ప్రయత్నాలు చేస్తున్నారు. నాలుగోసారి గెలవడం కోసమే జమిలి ఎన్నికలు తీసుకువస్తున్నారు. ఈ ప్రతిపాదన పట్ల ఎమ్మెల్యేలు అప్రమత్తంగా ఉండాలి..’’ అని రేవంత్ పేర్కొన్నారు. ప్రజల్లో ఉండేవారికే డీసీసీల బాధ్యతలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఈ తొమ్మిది నెలల కాలంలో తాను ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేశానని సీఎం రేవంత్ చెప్పారు. అధికారం కోల్పోయిన అసహనంతో ప్రతిపక్షం తప్పుడు ప్రచారాలు చేస్తోందని, ఆ ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా 27 రోజుల్లో రూ.18 వేల కోట్ల రైతు రుణమాఫీ చేయలేదని.. తెలంగాణలో చేసి చూపించామని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ హెల్త్ ప్రొఫైల్ డిజిటల్ కార్డు ఇస్తామని, రాష్ట్రంలో ఎక్కడున్నా రేషన్ తీసుకునే అవకాశం కలి్పస్తామని చెప్పారు. ప్రజల్లో ఉన్న వారికే కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవులు వస్తాయన్నారు. ఇన్చార్జ్ మంత్రులు వారానికి రెండు సార్లు తమ జిల్లాలో పర్యటించాలని సూచించారు. కార్యకర్తల రుణం తీర్చుకోవాలి: మహేశ్‌గౌడ్ తాను పీసీసీ అధ్యక్ష పదవిని బాధ్యతగా భావిస్తానని.. పారీ్టకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయకర్తగా ఉంటానని పీసీసీ చీఫమహేశ్కుమార్గౌడ్ తెలిపారు. పార్టీని ముందుకు నడపడంలో సమష్టి బాధ్యత అవసరమన్నారు. కార్యకర్తలు, నేతలకు నిత్యం అందుబాటులో ఉంటానని చెప్పారు. క్షేత్రస్థాయి కార్యకర్తలు కష్టపడి పనిచేసినందుకే అధికారంలోకి రాగలిగామన్న విషయాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు గుర్తించాలని.. ఆ కార్యకర్తల రుణం తీర్చుకోవాలని పేర్కొన్నారు. అధికారాన్ని కట్టబెట్టిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయాలని పార్టీ ప్రజాప్రతినిధులను కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 90% స్థానాలను గెలిపించుకోవడం ద్వారా పార్టీ కార్యకర్తలను గ్రామం నుంచి జిల్లాస్థాయి వరకు పదవుల్లో కూర్చోబెట్టాలన్నారు.సీఎం రేవంత్ నాయకత్వంలోని ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అందిస్తోందని.. కార్యకర్తలను సమాయత్తం చేసి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడమే తన లక్ష్యమని మహేశ్‌గౌడ్ చెప్పారు. రాహుల్ గాం«దీని ప్రధాని చేయడమే ధ్యేయంగా అంతా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలను ఎమ్మెల్యేలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు. పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం పనిచేయాలని కోరారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించిన సీఎం సీఎం రేవంత్ సీఎల్పీ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరి స్థితి గురించి ఎమ్మెల్యేలకు వివరించారు. రాష్ట్ర ఖ జానాకు నెలకు సగటున రూ.18 వేలకోట్ల ఆదా యం వస్తోందని.. అందులో రూ.6 వేలకోట్లు ప్రభు త్వ ఉద్యోగుల జీతాలకే పోతాయని, మరో రూ.6 వేలకోట్లు గత ప్రభుత్వం చేసిన అప్పులు, వాటి వడ్డీలకు చెల్లిస్తున్నామని చెప్పారు. మిగతా రూ.6 వేలకోట్లలో రూ.3 వేలకోట్లు ప్రభుత్వ పథకాల అమలు కోసం ఖర్చవుతున్నాయని, ఇంకో రూ.3 వేల కోట్లతో కొత్త పథకాల అమలు, ప్రభుత్వ నిర్వహణ జరుగుతోందని వివరించారు. ఆర్థిక పరిస్థితి కష్టతరంగా ఉండటంతో దుబారా ఖర్చులు తగ్గించుకుని ప్రభుత్వాన్ని నడుపుతున్నామని చెప్పారు. ⇒ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ, ఫ్యామిలీ హెల్త్ కార్డుల అంశాలను ఎమ్మెల్యేలకు సుదీర్ఘంగా వివరించారు. పాత రేషన్‌కార్డులు తొలగించడం లేదని.. ఈ విషయంలో ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టాలని సూచించారు. ⇒ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించేలా చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యేలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. ⇒ ఇక ఈ సమావేశంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు బాలూ నాయక్, పరి్ణకారెడ్డి, అమీర్ అలీఖాన్ తదితరులు మాట్లాడారు.సీఎల్పీ సమావేశానికి ‘ఫిరాయింపు’ ఎమ్మెల్యేలు! ఆదివారం రాత్రి జరిగిన సీఎల్పీ సమావేశానికి బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా హాజరవడం గమనార్హం. పీఏసీ చైర్మన్ అరెకపూడి గాం«దీతోపాటు ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలంతా సమావేశంలో పాల్గొన్నారు. ఇక మంత్రి సీతక్క, ఇద్దరు, ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనివార్య కారణాలవల్ల సీఎల్పీ సమావేశానికి హాజరుకాలేకపోయారు.గాంధీ నియోజకవర్గమనే వచ్చారు: మంత్రి శ్రీధర్‌బాబు పీఏసీ చైర్మన్ అరెకపూడి గాంధీ బీఆర్ఎస్ నేత అయినప్పుడు సీఎల్పీ సమావేశానికి ఎందుకు వచ్చారనే ప్రశ్నలకు.. సమావేశం అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు సమాధానమిచ్చారు. ఏదైనా నియోజకవర్గానికి సీఎం వచి్చనప్పుడు స్థానిక ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలవడం సాధారణమేనని చెప్పారు. సీఎల్పీ సమావేశం జరిగిన హోటల్ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఉందని.. స్థానిక ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మర్యాదపూర్వకంగా సీఎంను కలిసేందుకు వచ్చారని పేర్కొన్నారు. సిద్దిపేటలో సీఎం కార్యక్రమం జరిగితే హరీశ్‌రావు వెళ్లరా? అని ప్రశ్నించారు. -
కలిసికట్టుగా పనిచేద్దాం
సాక్షి, అమరావతి : శాసనసభకు ఎన్నికైన 23 మంది ఎమ్మెల్యేలు కలిసికట్టుగా, పట్టుదలగా పని చేయాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పారు. ఉండవల్లిలోని తన నివాసంలో మంగళవారం జరిగిన టీడీపీ శాసనసభాపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ చారిత్రక అవసరమని, గత 37 సంవత్సరాల్లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నామని, ఎన్టీఆర్ హయాంలో, ఆ తర్వాత అనేక అవమానాలు భరించామని తెలిపారు. రాజీవ్ గాంధీ హత్యోదంతం దరిమిలా విశాఖ నుంచి హైదరాబాద్ వస్తుంటే ఎన్టీఆర్‌కు అవమానాలు ఎదురయ్యాయని అవన్నీ గుర్తు పెట్టుకోవాలని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నాయకత్వ సామర్థ్యం బయట పడుతుందన్నారు. కార్యకర్తల్లో, నాయకుల్లో ఆత్మ విశ్వాసం, మనో ధైర్యం పెంచాలన్నారు. గత 15 రోజులుగా అనంతపురం, ప్రకాశం, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో టీడీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులు జరుగుతున్నాయని, వీటిని ఖండించాలని తెలిపారు. దీనిపై జిల్లా, రాష్ట్ర స్థాయిలో పార్టీ తరఫున ఏం చేయాలనే దానిపై కార్యాచరణ రూపొందించాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ లక్ష్యం అభివృద్ధి, పేదల సంక్షేమమేనని, అధికారం కాదన్నారు. చివరి దశకు చేరిన పనులు ఆపేస్తున్నారు.. రుణమాఫీ నాలుగు, ఐదు విడతల చెల్లింపు 10 శాతం వడ్డీతో సహా రైతులకు ఇచ్చిన బాండ్లు చెల్లేలా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. నాలుగు, ఐదు కిస్తీల కింద ఇవ్వాల్సిన రూ.10 వేల కోట్ల రైతుల సొమ్మును ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదన్నారు. ప్రతిరోజూ తనను కలుస్తున్న అనేక మంది రైతులు, రైతు కుటుంబాల మహిళలు దీనిపై ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఈ ఖరీఫ్ నుంచే రైతులకు పెట్టుబడి కొరత లేకుండా చేయాలని, రబీ నుంచి ఇవ్వడం వల్ల రైతులకు ఖరీఫ్‌లో పెట్టుబడులకు సమస్య వస్తుందన్నారు. అభద్రత పెంచితే, శాంతిభద్రతలను దెబ్బతీస్తే పెట్టుబడులు ఏం వస్తాయని వ్యాఖ్యానించారు. వైఎస్ చేపట్టిన ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేశామని, మిగిలినవి చివరి దశకు చేరాయని, వాటిని ఇప్పుడు రద్దు చేస్తున్నారని, పనులు నిలిపేస్తున్నారని, దీనివల్ల రాయలసీమ, ఉత్తరాంధ్ర సాగు, తాగునీటి అవసరాలకు అడ్డంకిగా మారుతుందన్నారు. వైఎస్సార్సీపీ వైఖరితో రాష్ట్రానికి నష్టం అవగాహన లేక పోవడం, చెప్పుడు మాటలు వినడం, టీడీపీపై బురద జల్లడమే త్రిసూత్రంగా వైఎస్సార్సీపీ పెట్టుకుందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు పనులు, రాజధాని అమరావతి అభివృద్ధి అంశం.. ఇలా ప్రతి అభివృద్ధి కార్యక్రమంలోనూ ఇదే విధంగా వ్యవహరించడం వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందని తెలిపారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో సభ ద్వారా ప్రజలకు తెలపాలని సూచించారు. తొలుత టీడీపీ కార్యకర్తలు, నాయకులపై జరుగుతున్న దాడులను, దౌర్జన్యాలను ఖండిస్తూ సమావేశంలో ఒక తీర్మానం ఆమోదించారు. కార్యకర్తల రక్షణ కోసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని, కార్యకర్తల రక్షణ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, 15వ తేదీ వర్క్ షాప్‌లో దీనికి సంబంధించి కార్యాచరణ సిద్ధం చేయాలని తీర్మానాలు చేశారు. అసెంబ్లీ ప్రారంభంరోజు అందరూ పసుపు చొక్కాలతో రావాలని, ఉదయం 9.30 కల్లా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్దకు చేరుకుని అక్కడి నుంచి బయల్దేరి వెంకటపాలెం వద్ద ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులు అర్పించి అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకోవాలని నిర్ణయించారు. సమావేశంలో కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, నిమ్మకాయల చినరాజప్ప, నారా లోకేష్, గంటా శ్రీనివాసరావు, రామానాయుడు, కరణం బలరామ్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వీరాంజనేయులు, బాలకృష్ణ, వల్లభనేని వంశీ తదితర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. శాసనసభలో టీడీపీ నేతగా చంద్రబాబు శాసనసభలో తెలుగుదేశం పార్టీ నేతగా ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వ్యవహరించనున్నారు. శాసనసభ, శాసనమండలిలో పార్టీ ఫ్లోర్ లీడర్లు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు, విప్‌లను నియమించే బాధ్యతను గత శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబుకు అప్పగించగా ఆయన ఈ నియామకాలను ప్రకటించినట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. శాసనసభలో టీడీపీ ఫ్లోర్ లీడర్‌గా చంద్రబాబునాయుడు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నిమ్మల రామానాయుడు, విప్‌గా వీరాంజనేయస్వామి వ్యవహరిస్తారని పేర్కొన్నారు. శాసనమండలిలో టీడీపీ ఫ్లోర్ లీడర్‌గా యనమల రామకృష్ణుడు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా డొక్కా మాణిక్య వరప్రసాద్, సంధ్యారాణి, గౌరువాని శ్రీనివాసులు, విప్‌గా బుద్ధా వెంకన్న ఉంటారని తెలిపారు. టీడీపీ శాసనసభాపక్ష కోశాధికారిగా మద్దాల గిరిని నియమించినట్లు తెలిపారు. శాసనమండలిలో క్రియాశీలంగా ఉండాలి : ఎమ్మెల్సీలకు చంద్రబాబు సూచన టీడీపీ శాసనసభా పక్ష సమావేశం అనంతరం ప్రజావేదికలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులందరితో చంద్రబాబు సమావేశమయ్యారు. ప్రస్తుతం అసెంబ్లీలో టీడీపీ 23 మంది సభ్యులు ఉండగా, మండలిలో అంతకన్నా ఎక్కువ మంది ఉన్నందున మరింత క్రియాశీలకంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వానికి తొలుత ఆరు నెలల సమయం ఇద్దామనుకున్నామని, అయితే వైఎస్సార్సీపీ ఆధిపత్య ధోరణితో వెళ్తున్నందున మౌనంగా ఉండలేమని చెప్పారు. -
నేడు త్రిపుర సీఎం ఎంపిక
అగర్తలా: మంగళవారం జరిగే త్రిపుర బీజేపీ, దాని మిత్రపక్షం ఐపీఎఫ్టీ శాసనసభా పక్ష సమావేశంలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోనున్నారు. త్రిపుర సీఎంగా ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విప్లవ్ దేవ్ పేరు దాదాపుగా ఖరారైనా.. నేడు జరిగే భేటీలో కొత్తగా ఎన్నికైన∙ఎమ్మెల్యేలు ఆయనను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకోనున్నారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు గడ్కారీ, ఓరంలు పరిశీలకులుగా హాజరవుతారు. ఈనెల 8న నూతన మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేస్తుంది. నాగాలాండ్‌లో..: ఎన్నికల భాగ స్వామి ఎన్డీపీపీతో కలిసే నాగా లాండ్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని బీజేపీ తెలిపింది. 15 ఏళ్ల పాటు మిత్రపక్షంగా కొనసాగిన నాగా పీపుల్స్ ఫ్రంట్(ఎన్పీఎఫ్)కు మద్దతు ఇవ్వబోమని చెప్పింది. -
అసమ్మతిచిచ్చు
మంత్రులు లేకుండా సీఎల్పీ సమావేశం నిర్వాహించాలన్న ఎమ్మెల్యేలు శీతాకాల సమావేశాల తర్వాత సమస్యలు వినడానికి ఓ వారం కేటాయిస్తానని సీఎం బుజ్జగింపు దీంతో వెనక్కు తగ్గిన ఎమ్మెల్యేలు రామనాథ్ రై, అంబరీష్లే ప్రధాన టార్గెట్లుగాఎమ్మెల్యేల విమర్శలు అర్ధాంతరంగా బయటకు వెళ్లిన మంత్రి రామనాథ్ రై బెంగళూరు: అధికార కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి స్వరం తగ్గడం లేదు. వారం వ్యవధిలో రెండు సార్లు శాసనసభ పక్ష సమావేశాలు (సీఎల్పీ) జరిపినా పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు. తాజాగా మంత్రులు లేకుండానే సీఎల్పీ నిర్వహించాలని ఎమ్మెల్యేలు పట్టుపట్టడం, సమావేశం నుంచి అర్ధాంతరంగా అమాత్యులు బయటకు రావాడం వంటి విషయాలను గమనిస్తే కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందని ఆ పార్టీ నాయకులే పేర్కొనడం గమనార్హం. బెళగావిలోని సువర్ణ విధాన సౌధాలో బుధవారం ఉదయం కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. సభ ప్రారంభమైన వెంటనే పలువురు ఎమ్మెల్యేలు మంత్రులపై విమర్శల వర్షం కురిపించారు. తమ నియోజక వర్గ పరిధిలో మంత్రులు పెత్తనాలు చెలాయిస్తున్నారని వాపోయారు. అంతేకాకుండా సీఎల్పీ సమావేశాల్లో మంత్రులపై ఆరోపణలు చేస్తున్నామనే విషయం మనసులో పెట్టుకుని తమ నియోజక వర్గంలోని సమస్యల పట్ల వారు స్పందించడం లేదన్నారు. అంతేకాకుండా అభివృద్ధి పనులకు నిధుల విడుదల్లో కూడా మోకాలడ్డుతున్నారని వాపోయారు. అందువల్ల వెంటనే మంత్రులను సీఎల్పీ సమావేశం నుంచి బయటకు పంపించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కంగుతిన్న సీఎం సిద్ధరామయ్య శాసనసభ్యులకు సర్ధిచెప్పడానికి నానా తంటాలు పడాల్సి వచ్చింది. ‘మంత్రులు లేకుండా సీఎల్పీ నిర్వహిస్తే విపక్షాలతో పాటు ప్రజల దృష్టిలో కూడా చులకన కావాల్సి వస్తుంది. అందువల్ల కొంత సహనం వహించండి. మీ సమస్యలు వినడానికి బెంగళూరులో వచ్చే సోమవారం నుంచి వారం రోజులు నాతోపాటు మంత్రులు సైతం మీకు ప్రత్యేక సమయం కేటాయిస్తారు.’ అని సర్ధి చెప్పడంతో ఎమ్మెల్యేలు వెనక్కుతగ్గారు. అంబరీష్, రామనాథరై లే టార్గెట్లు ... శాసనసభాపక్ష సమావేశంలో గృహ నిర్మాణశాఖ మంత్రి అంబరీష్, అటవీ శాఖ మంత్రి రామనాథరైలను టార్గెట్ చేసుకొని ఎమ్మెల్యేలు విమర్శలు కురిపించినట్లు తెలిసింది. ముఖ్యంగా ‘ఆశ్రయ’ పథకం కింద పేదలకు ఇళ్లను కేటాయించే విషయంలో ఎమ్మెల్యేలకు కాక స్థానిక పంచాయతీలు లబ్ధిదారులను ఎంపిక చేసే విధంగా నిబంధనలు రూపొందిస్తూ అంబరీష్ తమకు విలువ లేకుండా చేస్తున్నారని ఎమ్మెల్యేలు వాపోయారు. ఇలా అయితే త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి శరాఘాతం తప్పదని ఎమ్మెల్యేలు ఆక్రోశం వ్యక్తం చేశారు. అంబరీష్ సమాధానం కోసం సీఎం సిద్ధుతో పాటు మిగిలిన వారు ఎదురుచూడగా అసలు సభలో అంబరీష్ లేరనే తెలియడంతో అందరూ అవాక్కయ్యారు. తర్వాత కొద్ది సేపటికి నింపాదిగా అంబరీష్ సీఎల్పీ సమావేశానికి హాజరయ్యారు. మరోవైపు బుధవారం జరిగిన సీఎల్పీ సమావేశంలో అటవీశాఖ మంత్రి రామనాథరై పై మరోసారి పలువురు శాసనసభ్యులు ఫిర్యాదుల పరంపర కొనసాగించారు. దీంతో అసహనం వ్యక్తం చేస్తూ సమావేశం నుంచి రామనాథరై అర్ధాంతరంగా బయటికి వచ్చేశారు. ఈ ఏడాది శీతాకాల శాసనసభ సమావేశాల ప్రారంభం రెండో రోజున (ఈనెల 10న) ఎమ్మెల్యే శంకుంతలా శెట్టి ‘రై’ కార్యవైఖరిపై ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరు కార్చిన విషయం ఇక్కడ గమనార్హం.