త్రిపుర సీఎం కుటుంబంలో కరోనా కలకలం | Tripura CM Biplab Deb gets tested after family members contract virus | Sakshi
Sakshi News home page

త్రిపుర సీఎం కుటుంబంలో కరోనా కలకలం

Published Tue, Aug 4 2020 9:37 AM | Last Updated on Tue, Aug 4 2020 9:42 AM

Tripura CM Biplab Deb gets tested after family members contract virus - Sakshi

అగర్తలా : త్రిపుర ముఖ్యమంత్రి  నివాసంలో కరోనా వైరస్ కలకలం  రేగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్  కుటుంబంలోని ఇద్దరు సభ్యులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో వీరిని ఆసుపత్రికి తరలించారు. తనకు కూడా పరీక్షలు నిర్వహించారనీ, ఇంకా ఫలితాలు రావాల్సి ఉందని సీఎం కుమార్ దేవ్  వెల్లడించారు. ఈ నేపథ్యంలో  ముందు జాగ్రత్తగా తాను ఇంట్లోనే హోం ఐసోలేషన్‌లో ఉన్నానని  సీఎం ట్వీట్ చేశారు.  బాధిత కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామన్నారు. కాగా ఈశాన్య రాష్ట్రం త్రిపురలో 5374 మందికి కరోనా సోకగా 27 మంది ప్రాణాలు కోల్పోయారు. (మాజీ సీఎంకు కరోనా పాజిటివ్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement