BJP MP Biplab Deb Car Meets With Accident in Haryana - Sakshi
Sakshi News home page

బీజేపీ ఎంపీకి తృటిలో తప్పిన పెను ప్రమాదం

Published Mon, Feb 20 2023 6:50 PM | Last Updated on Mon, Feb 20 2023 7:07 PM

BJP MP Biplab Deb Car Meets With Accident In Haryana - Sakshi

ఛండీగఢ్‌: బీజేపీ నేత, త్రిపుర మాజీ సీఎం, రాజ్యసభ ఎంపీ విప్లవ్‌ దేబ్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. బిప్లవ్‌ దేబ్‌ ప్రయాణిస్తున్న కారు.. మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విప్లవ్‌ దేబ్‌ సురక్షితంగా బయటపడ్డారు. దీంతో, అందరూ ఊపిరిపీల్చుకున్నారు. 

వివరాల ప్రకారం.. బిప్లవ్‌ దేబ్‌ ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ సందర్భంగా కారు డ్రైవర్‌ సెక్షన వ్యవధిలో చాకచక్యంగా కారును పక్కకు తప్పించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ రోడ్డు ప్రమాదంలో కారు ముందు భాగం బాగా దెబ్బతిన్నది. ఇక, ఈ ఘటన హర్యానాలోని పానిపట్‌లో ఉన్న జీటీ రోడ్డులో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం అనంతరం.. బిప్లవ్‌ దేబ్ మరో కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement