‘చైనా సాయంతో పాక్‌ పక్కా ప్లాన్‌’ | Army chief Bipin Rawat blames Pakistan | Sakshi
Sakshi News home page

‘చైనా సాయంతో పాక్‌ పక్కా ప్లాన్‌’

Published Thu, Feb 22 2018 9:06 AM | Last Updated on Thu, Feb 22 2018 11:16 AM

Army chief Bipin Rawat blames Pakistan - Sakshi

న్యూఢిల్లీ: చైనా సాయంతో పాకిస్తానే పక్కా ప్రణాళికతో బంగ్లాదేశీయులు ఈశాన్య రాష్ట్రాల్లోకి వలస వచ్చేలా చేస్తోందని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ బుధవారం అన్నారు. ఈ ప్రాంతంలో అస్థిరత నెలకొనేలా చూడటమే వారి లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లోకి బంగ్లాదేశీయుల వలసలు పెరిగిపోతున్న అంశంపై ఆయన ఢిల్లీలో ఓ కార్యక్రమంలో మాట్లాడారు.

అస్సాంలో ముస్లింల జనాభా పెరిగిపోతుండటాన్ని రావత్‌ ప్రస్తావిస్తూ అక్కడ ఏఐయూడీఎఫ్‌ అనే ముస్లిం పార్టీ బీజేపీ కన్నా చాల వేగంగా ఎదుగుతోందని అన్నారు. ఈశాన్య ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలోనే ఈ సమస్యకు పరిష్కారం దాగుందని రావత్‌ సూచించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement