సార్వత్రిక ఎన్నికల భేరి మోగింది. ఎన్నికల క్షేత్రంలో నువ్వా.. నేనా?.. విజయమా.. పరాజయమా? తేల్చుకోవాల్సిన సమయం అన్ని పార్టీలకు, ఆయా పార్టీల నాయకులకు ఆసన్నమైంది. ఓ వైపు దేశ ప్రధాని నరేంద్ర మోదీ 400 సీట్ల లక్ష్యంతో పర్యటిస్తున్నారు. మరో వైపు ఇండియా కూటమి కూడా తనదైన రీతిలో ప్రచారం సాగిస్తోంది. పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు మాత్రమే కాకుండా ఒడిశా, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో స్థానిక పార్టీలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. ఈ కథనంలో ఈశాన్య రాష్ట్రాల్లో ఏ పార్టీ బలంగా ఉంది.. కీలక నేతలు ఎవరనే వివరంగా వివరంగా తెలుసుకుందాం.
పశ్చిమ బెంగాల్
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), బీజేపీ, కాంగ్రెస్ ప్రధాన పార్టీలుగా.. 'మమతా బెనర్జీ, అధీర్ రంజాన్ చౌదరి, సువెందు అధికారి' కీలక నేతలుగా ఉన్నారు. కాగా 2019లో మొత్తం 42 లోక్‌సభ స్థానాల్లో 22 టీఎంసీ, 18 బీజేపీ, 2 కాంగ్రెస్ సొంతం చేసుకున్నారు. ఇక జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలుపొందనుందనే విషయం త్వరలోనే తెలుస్తుంది.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మమతా బెనర్జీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మరో వైపు సందేశ్‌ఖాలీ దురాగతాలపై కూడా విమర్శలు జోరందుకున్నాయి. సీఏఏ అమలుపై టీఎంసీ ప్రభుత్వం వ్యతిరేకతను చూపుతోంది. ఈ తరుణంలో జరగనున్న 294 అసెంబ్లీ స్థానాల్లో ఏ పార్టీ ఎక్కువ స్థానాల్లో గెలుస్తుంది. ఏ ప్రభుత్వం అమల్లోకి వస్తుందనే విషయాలు తెలియాల్సి ఉంది.
మధ్యప్రదేశ్
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రధానంగా ఉన్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శివరాజ్‌సింగ్ చౌహన్, మోహన్ యాదవ్, కమల్‌నాథ్, జ్యోతిరాదిత్య సింధియా కీలకనేతలుగా ఉన్నారు. 2019లో బీజేపీ 28, కాంగ్రెస్ 1 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకున్నాయి.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో హిందుత్వ వాదం, కుల సమీకరణ, నిరుద్యోగం వంటివి ప్రధాన సమస్యలుగా ఉన్న తరుణంలో 230 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనుంది. కాగా ఫలితాలు వెల్లడైన తరువాత మధ్యప్రదేశ్ ఏ పార్టీ హస్తగతం చేసుకోనుందనే విషయం తెలియాల్సి ఉంది.
ఝార్ఖండ్
14 లోక్‌సభ స్థానాలకు, 81 అసెంబ్లీ స్థానాలకు ఝార్ఖండ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ 2019లో ఎన్డీఏ 12 స్థానాల్లో యూపీఏ 2 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం మీద ఆరోపణలు, నగదు అక్రమ చలామణి కేసులో హేమంత్ సోరెన్ అరెస్ట్ వంటి విషయాలు కీలకమైన అంశాలుగా చెలరేగుతున్నాయి.
ఒడిశా
బిజూ జనతాదళ్ (బీజద), బీజేపీ, కాంగ్రెస్ ప్రధాన పార్టీలుగా ఉన్న ఒడిశాలో ఈ సారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో మరి కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది. నవీన్ పట్నాయక్ఎం మన్మోహన్ సామల్ కీలక నేతలుగా ఉన్న ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలులో అవినీతి వంటి అంశాలు ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. కాగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజద 12, బీజేపీ 8, కాంగ్రెస్ 1 స్థానాలను సొంతం చేసుకున్నాయి.
అస్సాం
2019లో ఎన్డీఏ 9, కాంగ్రెస్ 3, ఇతరులు 2 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకున్న అస్సాం రాష్ట్రంలో ఈ సారి ఏ పార్టీ ఆధిక్యంలో ఉంటుందనేది తెలియాల్సి ఉంది. 126 స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో హిమంత బిశ్వశర్మ, బద్రుద్దీన్ అజ్మల్, భూపేన్ కుమార్ బోరా కీలక నేతలుగా ఉన్నారు.
ఛత్తీస్‌గఢ్
90 స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఛత్తీస్‌గఢ్ ఎవరి చేతుల్లోకి వెళుతుందనేది తెలియాల్సిన విషయం. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 9, కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలుపొందింది. విష్ణుదేవ్ సాయ్, రమణ్ సింగ్, భూపేశ్ బఘేల్ కీలక నేతలుగా ఛత్తీస్‌గఢ్ ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యలతో సతమతమవుతోంది.
అరుణాచల్ ప్రదేశ్
అరుణాచల్ ప్రదేశ్ రెండు లోక్‌సభ స్థానాలను 2019లో బీజేపీ హస్తగతం చేసుకుంది. అయితే ఈ రాష్ట్రంలో 60 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరనున్నాయి. పెమా ఖండూ, నబమ్ తుకి కీలక నేతలుగా రాష్ట్రంలో సరిహద్దు ప్రాంత అభివృద్ధి మాత్రమే కాకుండా.. మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమస్యలు ఉన్నట్లు సమాచారం. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ ప్రధాన పార్టీలుగా ఉన్నాయి.
మణిపూర్
ఎన్డీఏ అధికార పక్షంగా ఉన్న మణిపూర్ రాష్ట్రంలో 60 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. 2019లో బీజేపీ1, నేషనల్ పీపుల్స్ పార్టీ 1 లోక్‌సభ స్థానాలను గెలుచుకున్నాయి. ఎన్. బీరేన్ సింగ్, ఇబోబి సింగ్ కీలక నేతలుగా ఈ రాష్ట్రంలో జాతుల మధ్య ఘర్షణ, శాంతి భద్రతల సమస్యలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ప్రధాన పార్టీలుగా బీజేపీ, నేషనల్ పీపుల్స్ పార్టీ, కాంగ్రెస్ ప్రధాన పార్టీలుగా ఉన్నాయి.
మేఘాలయ
నేషనల్ పీపుల్స్ పార్టీ అధికారంలో ఉన్న మేఘాలయలో.. అస్సాం సరిహద్దు, నిరుద్యోగం వంటి సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. ఇక్కడ కెలక నేతలుగా కాన్రాడ్ సంగ్మా, ముకుల్ సంగ్మా కీలక నేతలుగా ఉన్నారు. 60 స్థానాలకు అసెంబ్లీ జరగాల్సి ఉంది. అయితే 2019లో ఇక్కడున్న రెండు లోక్‌సభ స్థానాలను కాంగ్రెస్, NPP చెరొకటి సొంతం చేసుకున్నాయి.
త్రిపుర
బీజేపీ అధికారంలో ఉన్న త్రిపురలోని రెండు లోక్‌సభ స్థానాలను భాజపా హస్తగతం చేసుకుంది. ఇక్కడ బీజేపీ, సీపీఎం ప్రధాన పార్టీలుగా.. మాణిక్ సాహా, మాణిక్ సర్కార్ కీలక నేతలుగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ధరల పెరుగుదల ప్రధాన సమస్యగా ఉంది. త్రిపురలో 60 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది.
మిజోరం
మిజో నేషనల్ ఫ్రంట్ పార్టీ ఉన్న ఒక్క లోక్‌సభ స్థానం సొంతం చేసుకోగా.. అధికార పక్షంలో ZPM ఉంది. ఇక్కడ 40 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన నేతలుగా లాల్ దుహోమా, జోరథంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో రైతు సమస్యలు, రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేఖత, హిందూ క్రిస్టియన్ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రధాన సమస్యలుగా ఉన్నాయి.
నాగాలాండ్
యునైటెడ్ డెమొక్రాటిక్ అలయెన్స్ కూటమి అధికారంలో ఉన్న నాగాలాండ్ రాష్ట్రంలో 'నెప్యూ రియో' కీలక నేతగా ఉన్నారు. బీజేపీ, నేషనల్ డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ, నాగా పీపుల్స్ ఫ్రంట్ పార్టీలు ప్రధానంగా ఉన్న ఈ రాష్ట్రంలో నేషనల్ డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ ఏట నాగాలాండ్ రాష్ట్రంలో ఏ పార్టీ జెండా ఎగురుతుందో చూడాలి.
సిక్కిం
32 అసెంబ్లీ స్థానాలు, 1 లోక్‌సభ స్థానం ఉన్న సిక్కిం రాష్ట్రంలో సిక్కిం క్రాంతికారి మోర్చా (SKM), బీజేపీ కూటమి అధికార పక్షంగా ఉంది. ఈ రాష్ట్రంలో ప్రేమ్‌సింగ్ తమాంగ్, పవన్ కుమార్ చామ్లింగ్ కీలక నేతలుగా ఉన్నారు. సిక్కిం 1 లోక్‌సభ స్థానాన్ని 2019లో SKM సొంతం చేసుకుంది. ఈ ఏట ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలుసుకోవడానికి మరికొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది.
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ 2024 ఏప్రిల్ 19న ప్రారంభమై.. ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20, మే 25, జూన్ 1 తేదీల్లో మొత్తం ఏడు దశల్లో జరుగుతుంది. భారతీయ పౌరులు తప్పకుండా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును తప్పకుండా ఉపయోగించుకోవాలి. మందుకు, విందుకు, కరెన్సీ నోటుకు నీ ఓటును అమ్ముకుంటే.. భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుంది. కులానికో.. మతానికో కాకుండా సమర్ధుడైన నాయకున్ని ఎన్నుకుంటే సమర్థవంతమైన పాలన సాగుతుంది. మేలుకో.. తెలుసుకుని మసలుకో.
Comments
Please login to add a commentAdd a comment