కోవిడ్‌ టీకా: పడిపడి నవ్విన పోలీసు అధికారి | Viral Video: Nagaland Police Cop Laugh While Taking Covid Vaccine | Sakshi
Sakshi News home page

కోవిడ్‌ టీకా: పడిపడి నవ్విన పోలీసు అధికారి

Published Tue, Mar 9 2021 2:32 PM | Last Updated on Tue, Mar 9 2021 9:21 PM

Viral Video: Nagaland Police Cop Laugh While Taking Covid Vaccine - Sakshi

కోహిమా: మహమ్మారిని తరిమేందుకు దేశంలో కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్‌ రెండవ దశ ముమ్మురంగా కొనసాగుతోంది. మొదటి దశలో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కి టి​కా  ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వ్యాక్సిన్‌ వేసుకునేందుకు కోవిడ్‌ సెంటర్‌కు వచ్చిన ఓ‌ పోలీసు అధికారి పడిపడి నవ్వుతున్న వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. సాధారణంగా వ్యాక్సిన్‌ వేసుకునే సమయంలో చాలా మంది భయపడటం మనం గమనించాము. కానీ ఐపీఎస్‌ అధికారి రూపిన్‌ శర్మ మంగళవారం ట్విటర్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో టీకా వేసుకునేందుకు వచ్చిన నాగాలాండ్‌ పోలీసు అధికారి నవ్వుతూ కనిపించాడు.

ఈ వీడియోలో వ్యాక్సినేషన్‌ సెంటర్‌కు వచ్చిన పోలీసు అధికారికి టీకా ఇచ్చేందుకు నర్సు అతని భజాన్ని తాకింది. దీంతో సదరు పోలీసు చెక్కిలిగింతలు పుట్టినట్లు ఒక్కసారిగా నవ్వుడం ప్రారంభించాడు. అలా అతడు ఎందుకు నవ్వుతున్నాడో అక్కడి వారికేవరికి అర్థం కాలేదు. ‘చివరికి అతడికి వ్యాక్సిన్‌ వేశారా లేదో తెలీదు. కానీ నర్సు అతడిని తాకగానే​ చెక్కిలిగింతలు పెట్టినట్లుగా అత్యుత్సాహంతో నవ్వడం ప్రారంభించాడు’ అంటూ ఆయన ఈ వీడియోను షేర్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement