గాంధీనగర్: గత ఏడాదిన్నర కాలంగా ప్రపంచాన్ని కరోనా మహమ్మారి పట్టి పీడిస్తున్న సంగతి తెలిసిందే. దీని వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వైరస్ అడ్డుకట్టకు వ్యాక్సినే కీలకమని కేంద్రం వాటిని అందుబాటులోకి తెసుకొచ్చి దేశవ్యాప్తంగా వ్యాక్సిన్లను విరివిగా అందజేస్తోంది. మరి కొన్ని దేశాలలో ఏకంగా వ్యాక్సిన్ ఖచ్చితంగా వేయించుకోవాలని ఆదేశాలు కూడా జారీ చేస్తున్నాయి. తాజాగా ప్రజల్లో వ్యాక్సిన్ పట్ల అవగాహన కల్పించేందుకు గుజరాత్‌లో ఓ యువకుడు వినూత్నంగా ప్రయత్నించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల్లో టీకా వేయించుకోవడం కంపల్సరీగా మారింది. అయితే ఇంత జరుగుతున్న వ్యాక్సిన్ పై వస్తున్న అసత్య ప్రచారాలు, అపోహలు కారణంగా ప్రజలు టీకా విషయంలో కాస్త వెనకడుగు వేస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేస్తున్న ఫలితం అంతంత మాత్రంగానే ఉంది. వ్యాక్సిన్ వేసుకోవాలంటూ ఓ వ్యక్తి.. జనం ఎక్కువగా ఉండే ప్రాంతాన్ని ఎంచుకుని వ్యాక్సిన్ వ్యాక్సిన్ అంటూ కూరగాయలు అమ్మినట్లుగా పెద్దగా అరుస్తున్నాడు. మొదటి డోసైనా, రెండోదైనా వ్యాక్సిన్ తీసుకోవాల్సిందేనంటూ.. అందరీ దృష్టిని ఆకర్షించాడు. భయ్యా మీరు వ్యాక్సిన్ తీసుకోకపోతే తక్షణమే తీసుకోవాలంటూ వారిని టీకా ప్రాధాన్యతను చెప్తున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. వ్యాక్సినేషన్ కోసం ఇవ్వాలని ఆ యువకుడు చేస్తున్న పనికి నెటిజన్లు హాట్స్ ఆఫ్ అంటూ ప్రశంసిస్తున్నారు.
చదవండి: పెళ్లిలో తాగొచ్చిన వరుడు.. మాజీ ప్రియుడితో వధువు పరార్..
Comments
Please login to add a commentAdd a comment