కోహిమా: లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా నాగాలాండ్‌లో అరుదైన రికార్డు నమోదైంది. రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక ఎంపీ సీటుకు శుక్రవారం(ఏప్రిల్19) పోలింగ్ జరిగింది. అయితే ఈ పోలింగ్‌కు ఆరు జిల్లాల ప్రజలు దూరంగా ఉన్నారు. ఈ ఆరు జిల్లాల్లో ఉన్న నాలుగు లక్షల ఓటర్లలో ఒక్కరంటే ఒక్కరు కూడా ఒంటి గంటవరకు ఓటు వేయడానికి రాకపోవడం గమనార్హం.
ఆరు జిల్లాలు కలిపి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న తమ డిమాండ్‌ను పరిష్కరించనందున ఓటింగ్‌కు దూరంగా ఉండాలని ద ఈస్టర్న్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్(ఈఎన్‌పీవో) పిలుపునిచ్చింది. ఈ పిలుపుతో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు.
ఆరు జిల్లాల్లో ఈఎన్‌పీవో పబ్లిక్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఆరు జిల్లాలతో కలిపి ఫ్రాంటియర్ నాగాలాండ్ టెరిటరీ(ఎఫ్‌ఎన్‌టీ) ఏర్పాటు చేయాలని ఈఎన్‌పీవో పోరాడుతోంది. మొత్తం ఆరు గిరిజన సంఘాలు కలిసి ఈఎన్‌పీవోను ఏర్పాటు చేశాయి.
ఇదీ చదవండి.. కొనసాగుతున్న లోక్‌సభ ఎన్నికల తొలివిడత పోలింగ్
Comments
Please login to add a commentAdd a comment