వీరంతా నాగాలాండ్‌కు చెందిన కొన్యక్ తెగకు చెందిన మహిళలు. గిన్నిస్‌బుక్‌లో స్థానం సంపాదించేందుకు ఇలా అందరూ కలసి వారి సంప్రదాయ నృత్యమైన కొన్యక్ నృత్యాన్ని ప్రదర్శించారు. 4,700 మంది కొన్యక్ తెగ మహిళలు 5 నిమిషాల 1 సెకను పాటు సంగీత వాయిద్యాలను మోగిస్తూ నృత్య ప్రదర్శన చేశారు. ఇటీవల నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో ఈ నృత్య ప్రదర్శన జరిగింది. అత్యధిక మంది కలసి కొన్యక్ నృత్యప్రదర్శన చేసి రికార్డు కోసం ప్రయత్నించారు. అయితే గిన్నిస్ నిర్వాహకులు రాకపోయేసరికి.. ఈ ప్రదర్శన మొత్తాన్ని వీడియో తీసి వారికి పంపారు. త్వరలోనే ఇది గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment