సాక్షి, న్యూఢిల్లీ: మూడు ఈశాన్య రాష్ట్రాల ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం గురువారం మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. త్రిపురలో ఫిబ్రవరి 18, నాగాలాండ్, మేఘాలయాల్లో ఫిబ్రవరి 27 ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది.
ఈ మూడు రాష్ట్రాల్లోనూ మార్చి 3న ఎన్నికల లెక్కింపు జరుగుతుంది. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయాల్లో ఒక్కో రాష్ట్రంలో 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ఎన్నికల్లో ఈవీఎంలకు వీవీ ప్యాట్ మిషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ అచల్ కుమార్ జ్యోతి తెలిపారు. కాగా ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తయిందని, సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత ఏర్పాటు చేశామన్నారు. ఇదిలావుండగా త్రిపురలో 1993 నుంచి సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇక మేఘాలయలో కాంగ్రెస్, నాగాలాండ్‌లో నాగా పీపుల్స్ ఫ్రంట్ అధికారంలో ఉన్నాయి.
త్రిపుర అసెంబ్లీ స్థానాలు - 60
సీపీఎం-50
సీపీఐ-01
బీజేపీ-07
కాంగ్రెస్-02
నాగాలాండ్ అసెంబ్లీ స్థానాలు - 60
ఎన్‌పీఎఫ్ - 45
బీజేపీ - 04
జేడీ(యూ) - 01
ఎన్‌సీపీ - 01
స్వతంత్రులు - 08
ఖాళీలు - 01
మేఘాలయ అసెంబ్లీ స్థానాలు - 60
ఐఎన్‌సీ - 24
యూడీపీ - 07
హెచ్‌ఎస్‌పీడీపీ 04
బీజేపీ - 02
ఎన్‌సీపీ - 02
ఎన్‌పీపీ- 02
ఎన్‌ఈఎస్‌డీపీ -01
స్వతంత్రులు - 01
ఖాళీలు - 09
Comments
Please login to add a commentAdd a comment