దీమాపూర్: రంజీ ట్రోఫీ సీజన్‌ను హైదరాబాద్ భారీ విజయంతో మొదలు పెట్టింది. ‘ప్లేట్’ గ్రూప్‌లో రెండో రోజే ముగిసిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు ఇన్నింగ్స్, 194 పరుగుల తేడాతో నాగాలాండ్‌ను చిత్తు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 35/1తో ఆట కొనసాగించిన నాగాలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులకే ఆలౌటైంది. ఆర్‌ఎస్ జగన్నాథ్ శ్రీనివాస్ (49) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
హైదరాబాద్ బౌలర్లలో తనయ్ త్యాగరాజన్ (5/43) ఐదు వికెట్లతో చెలరేగగా...సీవీ మిలింద్, కార్తీకేయ చెరో 2 వికెట్లు తీశారు. దాంతో హైదరాబాద్‌కు 321 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం ‘ఫాలో ఆన్’లో రెండో ఇన్నింగ్స్ ఆడిన నాగాలాండ్ మళ్లీ పేలవ బ్యాటింగ్‌లో 127 పరుగులకే కుప్పకూలింది. సుమిత్ కుమార్ (62) అర్ధ సెంచరీ సాధించాడు. సీవీ మిలింద్ 4 వికెట్లు పడగొట్టగా, తనయ్ త్యాగరాజన్‌కు 3 వికెట్లు దక్కాయి.
ఆంధ్ర 119/3
విశాఖ స్పోర్ట్స్: బెంగాల్‌తో జరుగుతున్న ‘ఎలైట్’ డివిజన్ రంజీ మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసే సరికి ఆంధ్ర తమ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. ప్రశాంత్ కుమార్ (41), సీఆర్ జ్ఞానేశ్వర్ (33), షేక్ రషీద్ (32) వెనుదిరగ్గా...కెప్టెన్ హనుమ విహారి (6 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నాడు. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 289/4తో ఆట కొనసాగించిన బెంగాల్ 409 పరుగులకు ఆలౌటైంది. అభిషేక్ పొరేల్ (70) హాఫ్ సెంచరీ చేయగా, లలిత్ మోహన్‌కు 4 వికెట్లు దక్కాయి. ప్రస్తుతం ఆంధ్ర మరో 290 పరుగులు వెనుకబడి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment