ఈ సీజన్‌లో నాలుగో స్థానంతో సరి
ఆఖరి మ్యాచ్‌లో విదర్భ చేతిలో 58 పరుగుల తేడాతో పరాజయం
నాగ్‌పూర్: భారత జట్టు పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ బరిలోకి దిగినా... హైదరాబాద్ జట్టుకు నిరాశ తప్పలేదు. రంజీ ట్రోఫీ 2024–2025 దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్‌ను హైదరాబాద్ జట్టు పరాజయంతో ముగించింది. మాజీ చాంపియన్ విదర్భ జట్టుతో ఆదివారం ముగిసిన గ్రూప్ ‘బి’ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో చామా మిలింద్ నాయకత్వంలోని హైదరాబాద్ జట్టు 58 పరుగుల తేడాతో ఓడిపోయింది.
విదర్భ నిర్దేశించిన 220 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో... ఓవర్‌నైట్ స్కోరు 23/1తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన హైదరాబాద్ జట్టు 38.5 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటై పరాజయాన్ని చవిచూసింది. రాహుల్ రాదేశ్ (77 బంతుల్లో 48; 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలువగా... చివర్లో మిలింద్ (32 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్), సిరాజ్ (14 బంతుల్లో 26; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కాసేపు అలరించారు. ఎడంచేతి వాటం స్పిన్నర్ హర్‡్ష దూబే 57 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టి విదర్భ జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు.
బ్యాటర్లు క్రీజులో నిలబడితే ఛేదించే లక్ష్యమైనా... చివరిరోజు హైదరాబాద్ బ్యాటర్లు తడబడి మూల్యం చెల్లించుకున్నారు. ఓవరాల్‌గా గ్రూప్ ‘బి’లో హైదరాబాద్ జట్టు 16 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. ఎనిమిది జట్లున్న ఈ గ్రూప్‌లో హైదరాబాద్ 2 మ్యాచ్‌ల్లో గెలిచి, 2 మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకొని, 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. గ్రూప్ ‘బి’లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన విదర్భ, గుజరాత్ జట్లు నాకౌట్ దశకు అర్హత సాధించాయి.
స్కోరు వివరాలు
విదర్భ తొలి ఇన్నింగ్స్: 190; హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: 326; విదర్భ రెండో ఇన్నింగ్స్: 355; హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (సి అండ్ బి) యశ్ ఠాకూర్ 6; అభిరత్ రెడ్డి (సి) దానిశ్ (బి) హర్ష్ దూబే 21; తనయ్ త్యాగరాజన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఆదిత్య థాకరే 18; రాహుల్ రాదేశ్ (సి) అథర్వ తైడే (బి) పార్థ్ రేఖడే 48; హిమతేజ (సి) అథర్వ తైడే (బి) హర్ష్ దూబే 0; వరుణ్ గౌడ్ (సి) యశ్ రాథోడ్ (బి) హర్ష్ దూబే 5; రాహుల్ బుద్ది (సి) అక్షయ్ వాడ్కర్ (బి) పార్థ్ రేఖడే 9; చామా మిలింద్ (సి) దానిశ్ (బి) హర్‡్ష దూబే 20; రక్షణ్ రెడ్డి (బి) హర్ష్ దూబే 0; సిరాజ్ (సి) అథర్వ తైడే (బి) హర్‡్ష దూబే 26; అనికేత్ రెడ్డి (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (38.5
ఓవర్లలో ఆలౌట్) 161. వికెట్ల పతనం: 1–11, 2–36, 3–61, 4–67, 5–94, 6–107, 7–116, 8–123, 9–140, 10–161. బౌలింగ్: యశ్ ఠాకూర్ 5–1–26–1, ఆదిత్య థాకరే 7–0–27–1, హర్ దూబే 11.5–1–57–6, అక్షయ్ వఖారే 7–3–16–0, పార్థ్ రేఖాడే 8–0–33–2.
Comments
Please login to add a commentAdd a comment