![Bangladeshi immigrants away](/styles/webp/s3/article_images/2017/10/6/Chumukedima-.jpg.webp?itok=Rxg1wNzd)
సాక్షి, గువాహటి : అక్రమ బంగ్లాదేశీయులకు మా గ్రామంలో స్థానం లేదు.. ఎవరూ ఇటు రాకండి అంటూ నాగాలండ్‌లోని ఒక గ్రామం శుక్రవారం తీర్మానం చేసింది. ఇప్పటికే నాగాలాండ్‌లోని పలు ప్రాంతాల్లో అక్రమ బంగ్లాదేశీ వలసదారులు పెరిగిపోవడం.. వాళ్లు చేసే వికృత చేష్టలను సహించలేక.. చుమ్కేడిమా గ్రామం ఈ విధంగా తీర్మానం చేసింది. తీర్మానం చేయడమేకాకుండా స్థానిక ప్రజల్లో అవగాహన పెంచే ఉద్దేశంతో గ్రామంలో ర్యాలీని సైతం నిర్వహించారు.
ఇదిలా ఉండగా.. ఇప్పటికే గ్రామంలో స్థిరపడ్డ వారిలో.. నాగాలాండ్ వాసులు కాని వారిని గుర్తించేందుకు ఈ నెల 9 నుంచి 31 వరకూ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గ్రామ పెద్దలు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అక్రమ బంగ్లాదేశీ వలసదారులు బయటపడితే.. వారిని స్థానిక రాయబార కార్యాలయానికి అప్పగిస్తామని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment