కోహిమా: నాగాలాండ్‌లో సామాన్యులపైకి కాల్పులు జరిపిన భద్రతా సిబ్బందిని చట్టం ముందు నిలబెట్టేదాకా ప్రభుత్వం అందించే పరిహారాన్ని తీసుకునేదిలేదని మృతుల కుటుంబాలు స్పష్టం చేశాయి. ఈ మేరకు ఓటింగ్ గ్రామస్తులు ఒక ప్రకటన విడుదల చేశారు. నాడు కాల్పుల్లో ఓటింగ్ గ్రామానికి చెందిన 14 మంది మృతి చెందడం తెల్సిందే. ‘వారి అంత్యక్రియల సమయంలో ఐదో తేదీన రాష్ట్ర మంత్రి కొన్యాక్, పోలీస్ డిప్యూటీ కమిషనర్ వచ్చి రూ.18.30లక్షలు ఇవ్వబోయారు.
చదవండి: కశ్మీర్‌లో పోలీసుల బస్సుపై ఉగ్ర దాడి
ఆ డబ్బును వారు ప్రేమతో ఇస్తున్నారని భావించాం. కానీ, అది ప్రభుత్వ పరిహారంలో మొదటి విడత అని మాకు తర్వాత తెలిసింది. సైనిక సిబ్బందిని ముందుగా చట్టం ఎదుట నిలబెట్టాలి. ఈశాన్య రాష్ట్రాల్లో భద్రతా బలగాల ప్రత్యేక చట్టాన్ని రద్దు చేయాలి. లేకుంటే ప్రభుత్వం అందించే ఎలాంటి పరిహారాన్ని మేం స్వీకరించబోం’ అని ఓటింగ్ గ్రామ కౌన్సిల్ తీర్మానం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment