AFSPA
-
జమ్మూకశ్మీర్‌లో సెప్టెంబర్‌లోగా ఎన్నికలు: అమిత్ షా
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ప్రత్యేక సైనిక దళాల చట్టాన్ని ఉపసంహరించుకునే దిశగా కేంద్రం యోచిస్తుంది. జమ్మూలో సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టాన్ని వెనక్కి తీసుకునే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. బలగాలను ఉపసంహరించుకొని శాంతిభద్రతలను జమ్మూ కశ్మీర్ పోలీసులకే అప్పగించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పారు. గతంలో జమ్మూకశ్మీర్ పోలీసులపై నమ్మకం ఉండేది కాదని కానీ ప్రస్తుతం వారు సమర్థవంతంగా పనిచేస్తున్నారని, అనేక ఆపరేషన్లను లీడ్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. జమ్మూలో అమలులో ఉన్న AFSPAను.. ఈశాన్య రాష్ట్రాల్లోని 70% ప్రాంతాల్లో తొలగించినట్లు పేర్కొన్నారు. ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని అనేక సంస్థలు, వివిధ వ్యక్తుల నుంచి డిమాండ్లు వస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా సెప్టెంబర్‌లోపు జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు అమిత్‌షా చెప్పారు. జమ్మూకశ్మీర్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తానని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని, దానిని నెరవేరుస్తారని తెలిపారు. అయితే ఈ ప్రజాస్వామ్యం కేవలం మూడు కుటుంబాలకే పరిమితం కాదని.. ప్రజల ప్రజాస్వామ్యమని అన్నారు. ఇదిలా ఉండా జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో సెప్టెంబర్‌లోపు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా ఏఎఫ్ఎస్పీఏ చట్టం కేంద్ర సాయుధ బలగాలకు ప్రత్యేక అధికారాలను కల్పిస్తోంది. ప్రభుత్వ ఆదేశాల నిర్వహణలో భాగంగా కేంద్ర బలగాలకు శోధనలు చేపట్టడానికి, అరెస్టులు, అవసరమైతే కాల్పులు చేపట్టడానికి ఈ చట్టం విస్తృత అధికారాలను కల్పిస్తోంది. సాయుధ బలగాల కార్యకలాపాలను సులభతరం చేయడానికి ఈ చట్టాన్ని రూపొందించారు. -
మణిపూర్‌లో సాయుధ చట్టం... మరో ఆర్నెల్లు
ఇంఫాల్: మణిపూర్‌లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్ఎస్పీఏ)ను మరో ఆర్నెల్ల పాటు పొడిగించారు. ప్రస్తుత కల్లోల పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో ఏఎఫ్ఎస్పీఏను అక్టోబర్ 1 నుంచి ఆరు నెలల పాటు పొడిగిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారని పేర్కొంటూ అధికారిక ప్రకటన వెలువడింది. ఇంఫాల్ లోయ, అసోం సరిహద్దు ప్రాంతాల్లోని 19 పోలీస్ స్టేషన్లను మాత్రం దీని పరిధి నుంచి మినహాయించారు. అక్కడ చట్టాన్ని అమలు చేయాలంటే సంబంధిత పోలీస్ స్టేషన్ అనుమతి తప్పనిసరి. లేదంటే సైన్యం, అస్సాం రైఫిల్స్‌ను అక్కడ నియోగించడానికి వీల్లేదు. దీనిపై భద్రతా దళాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలోని నిషేధిత ఉగ్ర గ్రూపులు లోయలో తలదాచుకుని సవకు విసురుతున్నట్టు చెబుతున్నాయి. మణిపూర్ పోలీసు ఆయధాగారం నుంచి దోచుకెళ్లిన మొత్తం 4,537 ఆయుధాలు, 6.32 లక్షల రౌండ్ల మందుగుండు వాటి చేతిలో పడ్డాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
మణిపూర్‌ను 'కల్లోలిత ప్రాంతం'గా ప్రకటించిన ప్రభుత్వం
ఇంఫాల్: మణిపూర్‌లో ఇద్దరు విద్యార్థుల హత్య వెలుగులోకి రావడంతో మరోసారి అక్కడ హింసాత్మక వాతావరణం నెలకొంది. విద్యార్థుల మృతికి నిరసనగా పెద్దఎత్తున విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అక్టోబర్ 1 వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తూ సాయుధ బలగాల ప్రత్యేక అధికారుల చట్టాన్ని (AFSPA) మరో ఆరు నెలల పాటు పొడిగించింది. మళ్ళీ మొదలు.. మే 3న మొదలైన అల్లర్లకు మణిపూర్ రాష్ట్రం నాలుగు నెలలుగా అట్టుడుకుతూనే ఉంది. ఇప్పటికీ ఒక్కో దారుణం వెలుగులోకి వస్తుండటంతో అక్కడ వాతావరణం చల్లారినట్టే చల్లారి అంతలోనే మళ్ళీ అల్లర్లు చెలరేగుతున్నాయి. కొన్నాళ్ల క్రితం ఇద్దరు యువతులను నగ్నంగా ఊరేగించిన వీడియో ఎలాంటి పరిణామాలను సృష్టించిందో తాజాగా ఇద్దరు విద్యార్థుల మృతదేహాల ఫోటోలు వెలుగులోకి రావడంతో మళ్ళీ అలాంటి ఉద్రిక్తతే నెలకొంది. The students of #Manipur have joined forces to express their solidarity, demanding #Justice4LinthoiNHemanjit. Our commitment to ensuring accountability for the tragic loss of the 2 Students is unwavering. The fact that not a single #Kuki spoke out against the slaughter is awful! pic.twitter.com/s1KAG6hxVt — YumnamEvelyn (@YumnamEvelyn) September 27, 2023 విద్యార్ధులపై లాఠీ.. ఇద్దరు విద్యార్థుల మృతదేహాల ఫోటోలు ఒక్కసారిగా ఇంటర్నెట్లో వైరల్ కావడంతో విద్యార్థులంతా ఇంఫాల్ వీధుల్లో నిరసనలకు దిగారు. ముఖ్యమంత్రి నివాసానికి దగ్గర్లోని కంగ్లా కోట సమీపంలో నిరసనలు హింసాత్మకంగా మారడంతో పోలీసులు విద్యార్థులను చెదరగొట్టేందుకు లాఠీలకు పనిచెప్పారు. పోలీసుల దాడిలో సుమారు 45 మంది విద్యార్థినీ విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. కల్లోలిత ప్రాంతం.. మణిపూర్ అల్లర్లు జరిగి ఐదు నెలల తర్వాత సెప్టెంబర్ 23న మొబైల్ ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించిన ప్రభుత్వం తిరిగి మంగళవారం నుండి మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిషేధించింది. పదేపదే రాష్ట్రంలో అల్లర్లు చెలరేగుతున్న నేపథ్యంలో మణిపూర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించింది. ఇంఫాల్ లోయ వద్ద 19 పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాన్ని మినహాయించి మిగతా రాష్ట్రమంతా కల్లోలిత ప్రాంతంగా ప్రకటించింది. అదేవిధంగా సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల అఫ్స్పా చట్టాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించింది. సీఎం బైరెన్ సింగ్ ఇద్దరు విద్యార్థుల కేసులో దర్యాప్తుకు సీబీఐని ఆదేశించారు. The situation in #Manipur is very bad and PM Modi is busy campaigning for his party.#Manipur pic.twitter.com/MQvbraAWXB — Aafrin (@Aafrin7866) September 26, 2023 The students of Manipur continue to protest for justice for the "Murder of Linthoinganbi and Hemanjit" The police can act only on the protests in Imphal. Had they acted like on 3rd May, would the violence be there?#JusticeForLinthoiganbiAndHemanjit #Manipur #Imphal… pic.twitter.com/cmkyFYJYAy — babynongsha (@nongsha_meetei) September 27, 2023 ఇది కూడా చదవండి: కావేరీ జలాలపై సుప్రీం కోర్టులో సవాల్ చేస్తాం: సిద్దరామయ్య -
జవాబుదారీతనం అవసరం
ఒక పెద్ద ఘోరం చోటుచేసుకున్నప్పుడు... అకారణంగా కాల్పులు జరిపి అమాయక పౌరుల ఉసురు తీసినప్పుడు దోషులను కఠినంగా దండించాలని డిమాండ్ చేయటం, జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని అడగటం గొంతెమ్మ కోర్కెలేమీ కాదు. కానీ ఈశాన్య రాష్ట్ర ప్రజానీకం ప్రారబ్ధమేమిటో గానీ ఆ కనీస ప్రజాస్వామిక డిమాండ్ నెరవేరటం కూడా వారికి కనాకష్టంగా మారింది. దశాబ్దా లుగా అమలవుతున్న ఈ ఆటవిక న్యాయంపై విసుగెత్తి అక్కడి ప్రజలు కమలనాథులను నెత్తినెత్తు కుని ఏడెనిమిదేళ్లు దాటుతోంది. కొన్నిచోట్ల సొంతంగా, మరికొన్నిచోట్ల మిత్రపక్షాలతో కలిసి బీజేపీ అధికారాన్ని పంచుకోవటం మొదలైంది. తాము అధికారంలోకొస్తే అవసరం లేని ప్రాంతాల్లో సైనిక దళాల ప్రత్యేకాధికారాల(ఏఎఫ్ఎస్పీఏ) చట్టాన్ని క్రమేపీ తొలగిస్తామని బీజేపీ మేనిఫెస్టో 2014లో హామీ ఇచ్చింది. అక్కడక్కడైనా ఆ దిశగా చర్యలు తీసుకుంటున్న వైనం కనబడింది. అస్సాం, నాగా లాండ్, మణిపూర్ వగైరాల్లో తిరుగుబాటుదార్ల బెడదలేని ప్రాంతాల్లో ఆ చట్టాన్ని వెనక్కి తీసు కున్నారు. ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అంతమాత్రాన ఆ చట్టం ఇంకా అమలవుతున్న ప్రాంతాల్లో ఎప్పటి మాదిరే ఏం చేసినా చెల్లుబాటవుతుందని పాలకులు చెప్పదల్చుకుంటే మాత్రం ప్రజలు సహించలేరు. తెల్లారిలేస్తే అదే పనిగా హోరెత్తే చానెళ్లు, అనేకానేక సామాజిక మాధ్యమాలు ప్రజల జ్ఞాపకశక్తికి పెద్ద పరీక్షే పెడుతున్నాయి. నిన్న మొన్న జరిగిన ఘటనలు సైతం జనం మస్తిష్కాల నుంచి సత్వరమే చిత్తగిస్తున్నాయి. కానీ నిష్కారణంగా అమాయక కూలీల నిండు ప్రాణాలు బలి గొన్న నెత్తుటి ఉదంతం కూడా జనం జ్ఞాపకాల్లో మసకబారివుంటుందని భావిస్తే ఎలా? నాగాలాండ్‌లోని మాన్ జిల్లా ఒటింగ్‌లో 2021 డిసెంబర్ 4న చీకట్లు ముసురుకుంటున్నవేళ ఏం జరిగిందో గుర్తు తెచ్చుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అస్సాం సరిహద్దుల్లోని తిరు లోయ బొగ్గు గనిలో రోజంతా కాయకష్టం చేసి గూటికి చేరటానికి ట్రక్కులో వెళ్తున్న రోజు కూలీలపై హఠాత్తుగా గుళ్ల వర్షం కురిసింది. వాహనం ఎవరిదో, అందులో ఎవరున్నారో కూడా గమనించకుండా విచక్షణా రహితంగా కాల్పులు జరిపినవారు ఆర్మీ జవాన్లు. బహుశా కాల్పులు జరిగిన ప్రాంతం జనావాసా లకు దూరంగా ఉంటే ఎన్కౌంటర్ కథనం మీడియాలో వెలువడేది కావొచ్చు. కానీ అక్కడికి కూత వేటు దూరంలో ఉన్న గ్రామస్థులు కాల్పుల కలకలం, హాహాకారాలు వినబడి ఆత్రంగా పరుగెత్తు కుంటూ చేరుకున్నారు. అప్పటికే శవాలను తమ ట్రక్కులోకి తరలిస్తున్న జవాన్లను వారు నిలదీశారు. ఘర్షణ జరిగింది. మళ్లీ కాల్పులు జరిగి మరో ఏడుగురు గ్రామస్థులు బలయ్యారు. ఇదెంత సంచ లనమైందో ఎవరూ మరిచిపోరు. దీనిపై సత్వరమే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని బీజేపీ భాగస్వామిగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు హామీ ఇచ్చాయి. ఆ ప్రకారమే సైన్యం అంతర్గతంగా ప్రత్యేక విచారణ ప్రారంభించింది. నివేదిక కూడా రూపొందింది. అందులోని అంశాలేమిటో, ఎలాంటి నిర్ధారణ కొచ్చారో బయటపడలేదు. దీనికి సమాంతరంగా నాగాలాండ్ పోలీసులు ఘటన జరిగిన మర్నాడే సిట్ ఏర్పాటుచేసి దర్యాప్తు మొదలుపెట్టారు. మాన్ జిల్లా సెషన్స్ కోర్టులో నిరుడు మే నెల 30న చార్జిషీటు దాఖలు చేశారు. ఒక మేజర్, ఇద్దరు సుబేదార్లు, ఎనిమిదిమంది హవల్దార్లు, నలుగురు నాయక్‌లు, ఆరుగురు లాన్స్ నాయక్‌లు, తొమ్మిదిమంది పారాట్రూపర్లు– మొత్తం 30 మందిని నిందితులుగా తేల్చారు. సెషన్స్ కోర్టులో విచారణ మొదలైవుంటే ఏమయ్యేదోగానీ నిరుడు జూలైలో జవాన్ల భార్యలు ఈ విచారణపై స్టే కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సర్వోన్నత న్యాయ స్థానం వారి వినతిని మన్నించింది. ఈలోగా జవాన్ల ప్రాసిక్యూషన్‌కు అనుమతించాలన్న సిట్ విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నట్టు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారుల నుంచి నాగాలాండ్ పోలీసు ఉన్నతా ధికారులకు వర్తమానం అందింది. ప్రజాస్వామిక రిపబ్లిక్ ఉనికిలో ఉంటున్నచోట భద్రతా బలగాలు 13 మంది సాధారణ పౌరుల ప్రాణాలు బలిగొంటే వారి కుటుంబాలకు కనీస న్యాయం అందించ టంలో వ్యవస్థలన్నీ విఫలం కావటం ఊహించలేనిది. తొందరపాటుతోనో, తప్పుడు అంచనాలతోనో విచక్షణారహితంగా వ్యవహరించేవారు సైన్యంలో అక్కడక్కడ ఉంటున్నారు. ఇలాంటి ఉదంతాలపై స్థానిక ప్రజల్లో నిరసనలు వెల్లువెత్తినాకే ఏఎఫ్ఎస్పీఏ చట్టం ఎత్తివేత అంశం తెరపైకొచ్చింది. మణిపూర్ యువతి ఇరోం షర్మిల సుదీర్ఘకాలం ఈ అంశంపైనే నిరవధిక నిరాహారదీక్ష చేసింది. ఆ చట్టాన్ని ఎత్తి వేస్తామని గతంలో కాంగ్రెస్ హయాంలోని యూపీఏ సర్కారు హామీ ఇచ్చినా సైన్యం నుంచి తీవ్ర వ్యతిరేకత రావటంతో వెనక్కు తగ్గింది. ఆ విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎంతో మేలు. మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానం మేరకు ప్రశాంతత నెలకొన్న ప్రాంతాల్లో ఆ చట్టాన్ని వెనక్కు తీసుకోవటం మొదలైంది. కానీ కూలీలను కాల్చిచంపిన ఉదంతం, అందుకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవటంలో చూపిస్తున్న అల సత్వం ఈ ప్రతిçష్ఠను మసకబారుస్తోంది. దేశ రక్షణ యజ్ఞంలో జవాన్ల త్యాగనిరతి వెలకట్ట లేనిది. ఆ విషయంలో రెండో మాటకు తావులేదు. కానీ తప్పులు చేస్తున్న గుప్పెడుమంది వ్యవహార శైలిని చూసీచూడనట్టు వదిలేయటం సరికాదు. పొరపాటు చోటుచేసుకుంటే, అందునా ఆ పొరపాటు మూల్యం నిండు ప్రాణాలైతే ఎంతటివారిపైన అయినా కఠిన చర్యలుంటాయన్న అభిప్రాయం కలి గించినప్పుడే సాధారణ పౌరులకు భరోసా ఏర్పడుతుంది. చట్టబద్ధ పాలనపై విశ్వాసం కలుగుతుంది. అటు జవాన్లలో సైతం జవాబుదారీతనం పెరుగుతుంది. కేంద్రం పునరాలోచించాలి. -
స్వతంత్ర భారతి: అఫ్స్పా చట్టం
తీవ్రవాదాన్ని అణచివేసి, శాంతిభద్రతలను కాపాడడమే ధ్యేయంగా ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, అస్సాం, మణిపూర్, త్రిపుర, మేఘాలయ, మిజోరామ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లలో సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని 1958 సెప్టెంబర్ 11 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం సైనిక దళాలకు కొన్ని అధికారాలు దక్కాయి. ముందస్తుగా వారంట్ ఇవ్వకుండానే ఎవరినైనా అరెస్టు చేయొచ్చు. సోదాలు నిర్వహించవచ్చు. ఎవరినైనా కాల్చి చంపినా అరెస్టు, విచారణ నుంచి ప్రత్యేక రక్షణ ఉంటుంది. అయితే ఆనాటి నుంచీ ఈ చట్టాన్ని రద్దు చేయాలంటూ డిమాండ్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఏఎఫ్‌ఎస్‌పీఏకు వ్యతిరేకంగా సామాజిక కార్యకర్త ఇరోం చాను షర్మిళ 16 ఏళ్లపాటు నిరాహార దీక్ష కొనసాగించారు. 2015లో త్రిపురలో, 2018లో మేఘాలయాలో ఈ చట్టాన్ని కేంద్రం పూర్తిగా ఎత్తివేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 న నాగాలాండ్, అస్సాం, మణిపూర్ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఈ వివాదాస్పద సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్ఎస్పీఏ)–1958 ను ఎత్తివేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. అస్సాంలో 23 జిల్లాలు, మణిపూర్‌లో 6 జిల్లాలు (15 పోలీసు స్టేషన్ల పరిధిలో), నాగాలాండ్‌లో 7 జిల్లాలకు (15 పోలీసు స్టేషన్ల పరిధిలో) ఈ చట్టం నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. ఇదొక కీలకమైన అడుగు అని ఆయన అభివర్ణిం చారు. 2021 డిసెంబర్లో నాగాలాండ్‌లో సైనికుల దాడిలో 14 మంది సాధారణ ప్రజలు మృతి చెందారు. దాంతో అక్కడి ప్రజల వినతి మేరకు ఏఎఫ్ఎస్పీఏ (అఫ్స్పా) ను ఎత్తివేయడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. -
ప్రత్యేక ‘పరిధి’ తగ్గింది
న్యూఢిల్లీ/గౌహతి/కోహిమా: ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, అస్సాం, మణిపూర్ ప్రజల దశాబ్దాల ఆకాంక్ష నెరవేరుతోంది. ఆయా రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వివాదాస్పద సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టం(ఏఎఫ్ఎస్పీఏ)–1958ను ఎత్తివేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. అస్సాంలో 23 జిల్లాలు, మరో జిల్లాలో కొన్ని ప్రాంతాలు, మణిపూర్‌లో 6 జిల్లాలు (15 పోలీసు స్టేషన్ల పరిధిలో), నాగాలాండ్‌లో 7 జిల్లాలకు(15 పోలీసు స్టేషన్ల పరిధిలో) ఈ చట్టం నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు గురువారం ట్వీట్లు చేశారు. ఇదొక కీలకమైన అడుగు అని అభివర్ణించారు. నాగాలాండ్, అస్సాం, మణిపూర్‌లో ఏఎఫ్ఎస్పీఏ పరిధిలోని ప్రాంతాల సంఖ్యను తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీని నేతృత్వంలోని భారత ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ఏప్రిల్ 1 (శుక్రవారం) నుంచే ఇది అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఈశాన్య భారతదేశంలో తీవ్రవాదానికి చరమగీతం పాడి, శాంతిని స్థాపించడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు, చేపట్టిన చర్యల వల్ల మూడు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భద్రత మెరుగుపడిందని, అభివృద్ధి వేగం పుంజుకుంటోందని హర్షం వ్యక్తం చేశారు. అందువల్లే ఏఎఫ్ఎస్పీఏ పరిధి నుంచి ఆయా ప్రాంతాలను మినహాయిస్తున్నట్లు స్పష్టం చేశారు. కొన్ని ప్రాంతాల్లో యథాతథంగా.. అయితే, మూడు రాష్ట్రాల నుంచి సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని పూర్తిగా ఎత్తివేయడం లేదని, కొన్ని ప్రాంతాల్లో యథాతథంగా కొనసాగుతుందని కేంద్ర హోంశాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈశాన్య రాష్ట్రాల్లో 2014తో పోలిస్తే 2021లో తీవ్రవాద ఘటనలు 74 శాతం తగ్గిపోయాయని చెప్పారు. భద్రతా సిబ్బంది మరణాలు 60 శాతం, సాధారణ ప్రజల మరణాలు 84 శాతం తగ్గాయని గుర్తుచేశారు. గత కొన్నేళ్లలో 7,000 మంది తీవ్రవాదులు లొంగిపోయారన్నారు. ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సుకు ఆమోదం! 2021 డిసెంబర్లో నాగాలాండ్‌లో సైనికుల దాడిలో 14 మంది సాధారణ ప్రజలు మృతిచెందిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడి ప్రజల వినతి మేరకు ఏఎఫ్ఎస్పీఏను ఎత్తివేయడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని అస్సాం రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ స్వాగతించారు. మూడు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాలను ఏఎఫ్ఎస్పీఏ నుంచి మినహాయించడం సంతోషకరమని నాగాలాండ్ సీఎం నీఫియూ రియో చెప్పారు. ఏమిటీ చట్టం? తీవ్రవాదాన్ని అణచివేసి, శాంతిభద్రతలను కాపాడడమే ధ్యేయంగా ఈశాన్య రాష్ట్రాల్లో సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని 1958 సెప్టెంబర్ 11 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం సైనిక దళాలకు కొన్ని అధికారాలు దక్కాయి. ముందస్తుగా వారంట్ ఇవ్వకుండానే ఎవరినైనా అరెస్టు చేయొచ్చు. సోదాలు నిర్వహించవచ్చు. ఎవరినైనా కాల్చి చంపినా అరెస్టు, విచారణ నుంచి ప్రత్యేక రక్షణ ఉంటుంది. ఈ చట్టాన్ని రద్దు చేయాలంటూ డిమాండ్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఏఎఫ్‌ఎస్‌పీఏకు వ్యతిరేకంగా సామాజిక కార్యకర్త ఇరోంచాను షర్మిళ 16 ఏళ్లపాటు నిరాహార దీక్ష కొనసాగించారు. 2015లో త్రిపురలో, 2018లో మేఘాలయాలో ఈ చట్టాన్ని కేంద్రం పూర్తిగా ఎత్తివేసింది. చదవండి: (కాంగ్రెస్ వల్లే నేను రాజ్యసభకు రాగలిగాను: విజయసాయిరెడ్డి ఛలోక్తి) -
నాగాలకు కేంద్రం షాక్
న్యూఢిల్లీ: అమాయక కూలీలపై ఆర్మీ కాల్పులతో రగిలిపోతున్న నాగాలాండ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గురువారం షాకిచ్చింది. సైనిక బలగాలకు విస్తృత అధికారాలు, శిక్ష భీతిని లేకుండా చేస్తున్న ‘సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని (ఏఎఫ్ఎస్పీఏ) నాగాలాండ్‌లో మరో ఆరు నెలలు పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ గురువారం ఆదేశాలు జారీచేసింది. నాగాలాండ్‌ను కల్లోలిత ప్రాంతంగా ప్రకటిస్తూ... అక్కడ పరిస్థితి ఇంకా ప్రమాదకరంగానే ఉందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి అండగా నిలిచేందుకు సాయుధ బలగాల మొహరింపు తప్పనిసరని తెలిపింది. అందువల్ల ఏఎఫ్ఎస్పీఏ–1958 సెక్షన్ 3 కింద నాగాలాండ్ రాష్ట్రం మొత్తాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించింది. డిసెంబరు 30 నుంచి ఆరునెలల పాటు ఏఎఫ్ఎస్పీఏ అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. చొరబాటుదారులు వస్తున్నారనే సమాచారంతో ఈనెల 3వ తేదీన ఆర్మీ నాగాలాండ్‌లోని మోన్ జిల్లా ఓటింగ్ గ్రామ పరిసరాల్లో నిఘా పెట్టింది. పనులు ముగించుకొని ఒక ఓపెన్ జీపులో వస్తున్న బొగ్గుగని కార్మికులపైకి వారెవరనేది ధ్రువీకరించుకోకుండానే సైనికులు కాల్పు లు జరపడంతో ఆరుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కోపోద్రిక్తులైన స్థానికులు సైనికులపై దాడి చేయగా.. ఒక జవాను మరణించారు. వీరిని అదుపు చేసే ప్రయత్నంలో ఆర్మీ మళ్లీ కాల్పులు జరపడంతో ఎనిమిది మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. సైన్యానికి విస్తృత అధికారాలు కట్టబెడుతున్న ఏఎఫ్ఎస్పీఏను రద్దు చేయాలని ముఖ్యమంత్రి రిఫియూతో పాటు నాగాలాండ్‌లోని అన్ని రాజకీయపక్షాలూ, గిరిజన సంఘాలు డిమాండ్ చేశాయి. పార్లమెంటులో ఈ ఘటనను లేవనెత్తిన విపక్షాలు ఈ నిరంకుశ చట్టాన్ని ఉపసంహరించాలని గట్టిగా కోరాయి. కమిటీ వేసి... అంతలోనే 1958లో ఏఎఫ్ఎస్పీఏను తెచ్చారు. అప్పటినుంచీ నాగాలాండ్‌లో ఇది అమలవుతోంది. ఆరునెలలకు ఒకసారి పొడిగిస్తూ పోతున్నారు. ఓటింగ్ ఘటన తర్వాత నాగా ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. దీన్ని గమనించిన నాగాలాండ్ ప్రభుత్వం డిసెంబరు 20న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి... ఈ నిరంకుశ చట్టాన్ని ఉపసంహరించాలనే తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపింది. ఏఎఫ్ఎస్పీఏ ఉపసంహరణ సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసిన కేంద్రం నాలుగురోజులు తిరగకముందే... దీన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకొంది. ఆమోదయోగ్యం కాదు: కేంద్రం నిర్ణయం ఆమోదయోగ్యం కాదని నాగా గిరిజన సంఘాలు తేల్చిచెప్పాయి. కొన్నితరాల పాటు నాగాలను అణచివేయాలనే ఉద్దేశంతోనే కేంద్ర సర్కారు ఏఎఫ్ఎస్సీఏను పొడిగించిందని ఆగ్రహం వ్యక్తం చేశా యి. ‘నాగా ప్రజల ఆకాంక్షలను కేంద్రం పట్టించుకోలేదు. చట్టం ఉపసంహరణకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చే క్రమంలో ఎంతదూరమైనా వెళతాం’ అని నాగా హోహో సంస్థ ప్రధాన కార్యదర్శి కె. ఎలు ఎన్ డాంగ్ స్పష్టం చేశారు. కేంద్ర నిర్ణయంపై చర్చించడానికి జనవరి 7న సమావేశాన్ని ఏర్పాటు చేశామని ఈఎన్‌పీవో అధ్యక్షుడు ఆర్.టి.సంగ్టామ్ తెలిపారు. -
ఏఎఫ్ఎస్పీఏ ఎత్తివేత పరిశీలనకు కమిటీ
కోహిమా/గువాహటి: సాయుధ బలగాల(ప్రత్యేక అధికారాల)చట్టం (ఏఎఫ్ఎస్పీఏ)–1958ను ఉపసంహరించుకునే విషయాన్ని పరిశీలించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా వివేక్ జోషి నేతృత్వంలోని ఈ కమిటీలో హోంశాఖ అదనపు కార్యదర్శి పీయూశ్ గోయల్ సభ్య కార్యదర్శిగా ఉంటారు. ఈ కమిటీ 45 రోజుల్లో తన నివేదికను కేంద్రానికి సమర్పించనుంది. ఈ కమిటీలో నాగాలాండ్ చీఫ్ సెక్రటరీ, పోలీస్ డైరెక్టర్ జనరల్‌తోపాటు అస్సాం రైఫిల్స్(నార్త్) ఇన్స్పెక్టర్ జనరల్, సీఆర్పీఎఫ్ నుంచి ఒక ప్రతినిధి ఉంటారు. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా నాగాలాండ్‌కు కల్లోలిత ప్రాంతంగా గుర్తింపును కొనసాగించడం/ రాష్ట్రం నుంచి ఏఎఫ్ఎస్పీఏను ఉపసంహరించడంపై స్పష్టత వస్తుందన్నారు. ఇటీవల మోన్ జిల్లాలో భదత్రాబలగాలు జరిపిన కాల్పుల్లో 14 మంది పౌరులు మృతి చెందడంతో ఏఎఫ్ఎస్పీఏను ఉపసంహరించాలనే డిమాండ్ ఊపందుకుంది. కాల్పులకు బాధ్యులుగా అనుమానిస్తున్న వారిపై సస్పెన్షన్ వేటు పడిందన్నారు. -
మాకు న్యాయం కావాలి.. పరిహారం కాదు!
కోహిమా: నాగాలాండ్‌లో సామాన్యులపైకి కాల్పులు జరిపిన భద్రతా సిబ్బందిని చట్టం ముందు నిలబెట్టేదాకా ప్రభుత్వం అందించే పరిహారాన్ని తీసుకునేదిలేదని మృతుల కుటుంబాలు స్పష్టం చేశాయి. ఈ మేరకు ఓటింగ్ గ్రామస్తులు ఒక ప్రకటన విడుదల చేశారు. నాడు కాల్పుల్లో ఓటింగ్ గ్రామానికి చెందిన 14 మంది మృతి చెందడం తెల్సిందే. ‘వారి అంత్యక్రియల సమయంలో ఐదో తేదీన రాష్ట్ర మంత్రి కొన్యాక్, పోలీస్ డిప్యూటీ కమిషనర్ వచ్చి రూ.18.30లక్షలు ఇవ్వబోయారు. చదవండి: కశ్మీర్లో పోలీసుల బస్సుపై ఉగ్ర దాడి ఆ డబ్బును వారు ప్రేమతో ఇస్తున్నారని భావించాం. కానీ, అది ప్రభుత్వ పరిహారంలో మొదటి విడత అని మాకు తర్వాత తెలిసింది. సైనిక సిబ్బందిని ముందుగా చట్టం ఎదుట నిలబెట్టాలి. ఈశాన్య రాష్ట్రాల్లో భద్రతా బలగాల ప్రత్యేక చట్టాన్ని రద్దు చేయాలి. లేకుంటే ప్రభుత్వం అందించే ఎలాంటి పరిహారాన్ని మేం స్వీకరించబోం’ అని ఓటింగ్ గ్రామ కౌన్సిల్ తీర్మానం చేసింది. -
17 మంది అమాయకులు బలి.. ఇంకెన్నాళ్లీ చట్టం?
సాక్షి, నేషనల్ డెస్క్: వచ్చిందెవరో ధ్రువీకరించుకోకుండానే... వారి వద్ద ఆయుధాలున్నాయా? దాడికి ప్రయత్నిస్తున్నారా? అనేవి ఏవీ చూడకుండా పనులకెళ్లి తిరిగి వస్తున్న కూలీలపై ఆర్మీ జవాన్లు కాల్పులకు తెగబడటం విభ్రాంతికలిగించింది. బొగ్గు గనిలో పని పూర్తిచేసుకొని పాటలు పాడుకుంటూ వాహనంలో ఇళ్లకు తిరిగి వస్తున్న కార్మికులపై సైనికులు తుపాకులు ఎక్కుపెట్టారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య 17కే చేరింది. అయితే ఈశాన్య రాష్ట్రాల్లో ఇలాంటి దారుణాలు కొత్తేమీ కాదు. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్ఎస్పీఏ) కట్టబెట్టిన అపరిమిత అధికారాలతోనే సైన్యం ఇలాంటి అతిక్రమణలకు, హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోంది. తిరుగుబాట్లను, వేర్పాటువాదాన్ని, నిషేధిత ఉగ్రసంస్థలను అణచివేసే చర్యల పేరిట అమాయాకుల ఊచకోత, మహిళలపై సైన్యం అకృత్యాలు చేసిన దృష్టాంతాలెన్నో ఉన్నాయి. ఈ నిరంకుశ చట్టాన్ని ఉపసంహరించాలని ఇక్కడి పౌర సమాజం, హక్కుల కార్యకర్తలు, రాజకీయ నాయకులు ఎన్నో ఏళ్లుగా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో అశాంతిని, అలజడులను నియంత్రించడం రాష్ట్ర ప్రభుత్వాల యం త్రాంగాలకు సాధ్యం కాకపోవడంతో ఆరు దశాబ్దాల కిందట 1958లో కేంద్ర ప్రభుత్వం ‘ఏఎఫ్ఎస్పీఏ’ చట్టాన్ని తెచ్చింది. దీని ప్రకారం... ►కల్లోలిత ప్రాంతంగా ప్రకటించిన ప్రదేశాల్లో శాంతిభద్రతలను కాపాడే అధికారం సైనిక బలగాలకు దఖలు పడుతుంది. ►ఐదుగురికి మించి ఒకేచోట గుమిగూడకుండా ఆర్మీ నిషేధం విధించగలదు. ►ఎవరైనా ఈ ఆజ్ఞలను ఉల్లంఘించారని భావిస్తే బలప్రయోగం ద్వారా నియంత్రించొచ్చు. ముందస్తు హెచ్చరిక జారీచేసి కాల్పులూ జరపొచ్చు. ►సమంజసమైన అనుమానం ఉంటే వారెంటు లేకుండానే ఎవరినైనా అరెస్టు చేయవచ్చు. అరెస్టుకు కారణాలను వివరిస్తూ తర్వాత సమీపంలోని పోలీసుస్టేషన్లో సదరు వ్యక్తిని లేదా వ్యక్తులను అప్పగించవచ్చు. ►వారెంటు లేకుండానే ఎవరి ఇంట్లోకైనా ప్రవేశించి సోదాలు జరపొచ్చు. ►ఆయుధాలు కలిగి ఉండటాన్ని నిషేధించొచ్చు. ఏది కల్లోలిత ప్రాంతమంటే... భిన్న మతాలు, జాతులు, భాషలు, కులాలు, ప్రాంతాల ప్రజల మధ్య వైషమ్యాలు పెరిగి ఘర్షణలు తలెత్తితే... ఆ ఏరియాను ‘కల్లోలిత ప్రాంతం’గా ప్రకటించే వీలును ఏఎఫ్ఎస్పీఏ చట్టంలోని సెక్షన్–3 కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం (హోంశాఖ), లేదా రాష్ట్ర గవర్నర్ మొత్తం రాష్ట్రాన్ని లేదా కేంద్ర పాలిత ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించొచ్చు. శాంతిభద్రతలను కాపాడటానికి రాష్ట్ర యంత్రాంగానికి సైనిక బలగాల సాయం అవసరమైన చోట్ల ఈ చట్టాన్ని ప్రయోగించవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఏఎఫ్ఎస్పీఏను ప్రయోగించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికే వదిలివేయవచ్చు. ఎక్కడెక్కడ అమలులో ఉంది? అస్సాం, నాగాలాండ్, మణిపూర్ (మణిపూర్ మున్సిపల్ కౌన్సిల్ ఏరియాను మినహాయించి), అరుణాచల్‌ప్రదేశ్‌లోని చాంగ్లాంగ్, లాంగ్డింగ్, తిరప్ జిల్లాల్లో ఈ చట్టం అమలులో ఉంది. నాగాలాండ్‌లో డిసెంబరు 31 దాకా దీన్ని పొడిగిస్తూ ఈ ఏడాది జూన్ 30నే ఆదేశాలు జారీ అయ్యాయి. అస్సాంలో రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబరు 11న మరో ఆరునెలలు ఈ చట్టం అమలును పొడిగిస్తూ ఆదేశాలు జారీచేసింది. మేఘాలయలో ఏప్రిల్ 1, 2018న ఈ చట్టాన్ని కేంద్రం ఎత్తివేసింది. 16 ఏళ్ల పోరాటం ఇరోమ్ షర్మిల... మణిపూర్ ఉక్కుమహిళగా ఖ్యాతికెక్కిన ఈ పేరు చిరపరిచితమే. 2000 నవంబరులో మణిపూర్‌లోని మలోమ్ పట్టణంలో బస్సు కోసం వేచిచూస్తున్న 10 మంది సాధారణ పౌరులను అస్సాం రైఫిల్స్ దళం కాల్చి చంపింది. ఈ మలోమ్ ఊచకోతకు నిరసనగా, ఏఎఫ్ఎస్పీఏను ఉపసంహరించాలనే డిమాండ్‌తో 28 ఏళ్ల ఇరోమ్ షర్మిల నిరాహార దీక్షకు దిగారు. మూడు రోజులకే ఆత్మహత్యకు ప్రయత్నించిందనే అభియోగంపై ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. 2000 నవంబర్ నుంచి 2016 ఆగస్టు దాకా పోలీసు కస్టడీలోనే ఇరోమ్ షర్మిల నిరాహారదీక్షను కొనసాగించారు. ఈ సమయంలో ట్యూబ్ ద్వారా ఆమెకు బలవంతంగా ద్రవాహారం అందించారు. కేంద్రం ఈ చట్టాన్ని ఎంతకీ ఉపసంహరించుకోకపోవడంతో ఆమె మనసు మార్చుకొని 2016 ఆగస్టు 9న తన దీక్షను విరమించారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఇరోమ్ సొంత పార్టీ పెట్టి 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఆనాటి మణిపూర్ సీఎం ఓక్రమ్ ఇబోబీ సింగ్‌పై పోటీచేశారు. కేవలం 90 ఓట్లు మాత్రమే పడ్డాయి. తమ ప్రజలపై అకృత్యాలను ఎండగడుతూ... ప్రపంచం దృష్టిని అకర్షించి, ఏకధాటిగా 16 ఏళ్లు దీక్ష చేసినా... సొంత జనమే ఆదరించలేదు. సాయుధ బలగాల అకృత్యాలకు ఊతమిచ్చే ఈ నిరంకుశ చట్టం ఇంకా కొనసాగుతూనే ఉంది. -
ఆ పార్టీ మ్యానిఫెస్టోతో దేశ భద్రతకు ప్రమాదం
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మ్యానిఫెస్టోపై రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులకు, వేర్పాటువాదులకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో ఉందని విమర్శించారు. వివాదాస్పద సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని (ఏఎఫ్ఎస్పీఏ) నిర్వీర్యం చేస్తే.. దేశ భద్రతా వ్యవస్థ ప్రమాదంలో పడే అవకాశముందని ఆమె బుధవారం విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఏఎఫ్ఎస్పీఏను సమీక్షిస్తామని, జమ్మూకశ్మీర్లోన్ని అన్ని వర్గాల వారీతో బేషరతుగా చర్చలు జరుపుతామని కాంగ్రెస్ పార్టీ మంగళవారం ప్రకటించిన మ్యానిఫెస్టోలో ప్రకటించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ మ్యానిఫెస్టో సాయుధ బలగాలను బలహీనపరిచేలా ఉందని, భదత్రా బలగాలకు ఉన్న రక్షణ పొరను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని ఆమె మండిపడ్డారు. ‘ఏఎఫ్ఎస్పీఏను నిర్వీర్యం చేసి.. భద్రతా దళాలను నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. జిల్లా మేజిస్ట్రేట్ల అధికారాలు తగ్గించాలని ఆ పార్టీ భావిస్తోంది. దేశద్రోహం చట్టాన్ని ఎత్తివేయాలని కోరుతోంది’ అని ఆమె అన్నారు. అయితే, నిర్మలా సీతారామన్ విమర్శలను కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోను రూపొందించిన కేంద్ర మాజీ హోంమంత్రి చిదంబరం తోసిపుచ్చారు. ఐదేళ్లు అధికారుంలో ఉన్న బీజేపీ రెండు కీలకమైన విషయాల (ఏఎఫ్ఎస్పీఏ, జమ్మూకశ్మీర్)పై ఉదాసీన వైఖరితో భారత్‌కు ఉగ్రవాద దాడులకు ఆలవాలంగా మారుస్తోందని విమర్శించారు. -
అణచివేత చట్టానికి స్వస్తి
మేఘాలయలో ఇరవై ఏడేళ్లనుంచి అమల్లో ఉన్న సాయుధ దళాల (ప్రత్యేకాధికా రాల) చట్టాన్ని ఉపసంహరిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. దాంతోపాటు అరుణాచల్ ప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాలకు ఈ చట్టం నుంచి మిన హాయింపు ఇచ్చినట్టు తెలిపింది. అస్సాంలో కూడా పాక్షికంగా ఉపసంహరించే ప్రతిపాదన ఉన్నట్టు చెబుతున్నారు. త్రిపురలో మూడేళ్లక్రితం అప్పటి వామపక్ష ప్రభుత్వం దీన్ని ఉపసంహరించుకుంది. ఆనాటినుంచీ మా ప్రాంతాల్లో కూడా దీన్ని తొలగించాలని ఇతర ఈశాన్య రాష్ట్రాలనుంచి, జమ్మూ–కశ్మీర్‌నుంచి పలు సంస్థలు డిమాండు చేస్తున్నాయి. ఈ చట్టాన్ని రద్దు చేయాలని మణిపూర్ యువతి ఇరోం షర్మిల దాదాపు పదహారేళ్ల సుదీర్ఘకాలం నిరాహార దీక్ష జరిపారు. ఇది అమలవు తున్న తీరుపై సర్వోన్నత న్యాయస్థానం పలు సందర్భాల్లో అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చట్టాన్ని సమీక్షించి తగిన సిఫార్సులు చేయాలని యూపీఏ ప్రభుత్వం సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బీపీ జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ ఈ చట్టాన్ని రద్దు చేయాలని సిఫార్సు చేసింది. ఆ విషయంలో 2010లో యూపీఏ సర్కారు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయగా అది కూడా చట్టాన్ని పాక్షికంగా ఉపసంహరించాలని సూచించింది. ఇలా వ్యక్తులు, సంస్థలు, వ్యవస్థలు ఏక కంఠంతో అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు... సాక్షాత్తూ కేంద్ర మంత్రివర్గ ఉపసంఘమే పాక్షిక ఉపసంహరణకు మొగ్గు చూపినప్పుడు కూడా ఓ చట్టం ఇన్నాళ్లు మనుగడ సాగించగలగటం ఆశ్చర్యకరమే. కానీ సైన్యం అభ్యంతరం వ్యక్తం చేయడం వల్లనే ఇవన్నీ నిరర్ధకమయ్యాయని తెలిస్తే అంతకన్నా ఆశ్చర్యం కలుగుతుంది. కల్లోలిత రాష్ట్రాల్లో ఇలాంటి చట్టం ఆసరా లేకుండా శాంతిభద్రతలను కాపాడే బాధ్యత తీసుకోవడం తమకు సాధ్యం కాదని సైన్యం చెప్పిన పర్యవసానంగా యూపీఏ సర్కారు దీని జోలికెళ్లడం మానుకుంది. దేశంలో స్వాతంత్య్రానంతరం రూపొందించిన ఒక చట్టంపై ఇంత పెద్ద యెత్తున నిరసనలు, అభ్యంతరాలు వ్యక్తం కావడం సాయుధ దళాల(ప్రత్యేకాధికా రాల) చట్టం విషయంలో మాత్రమే జరిగింది. అయితే దీని మూలాలు ‘క్విట్ ఇండియా’ ఉద్యమాన్ని అణచడానికి బ్రిటిష్ వలసపాలకులు తీసుకొచ్చిన సాయుధ దళాల విశేషాధికారాల ఆర్డినెన్స్‌లో ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాలు తిరుగు బాట్లతో అట్టుడుకుతున్నప్పుడు 1958లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అవిభక్త అస్సాంలోని నాగాలాండ్‌లో అమలు చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత క్రమేపీ ఇతరచోట్లకు ఇది విస్తరించింది. 1990లో జమ్మూ–కశ్మీర్లో శాంతిభద్రతలు క్షీణిం చడం మొదలయ్యాక అక్కడ కూడా దీన్ని ప్రయోగించడం మొదలుపెట్టారు. కల్లోల పరిస్థితులున్నప్పుడు శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రభుత్వాలు చర్యలు తీసు కోవడం సర్వసాధారణం. కానీ ఆ వంకన ప్రభుత్వాలే జనం బతుకుల్లో కల్లోలం సృష్టిస్తే దాన్నెవరూ చూస్తూ ఊరుకోరు. తిరుగుబాట్లకూ లేదా ఉద్యమాలకూ మూల కారణాలేమిటో, అవి లేవనెత్తుతున్న సమస్యలేమిటో అవగాహన చేసుకుని పరిష్కరించడానికి బదులు ఇలాంటి కఠిన చట్టాలను ఆశ్రయిస్తే ‘సులభంగా’ గట్టె క్కగలమని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. పర్యవసానంగా ఆ కల్లోలిత ప్రాంతాల్లోని జనం ప్రాణభయంతో బతుకీడుస్తున్నారు. సాయుధ దళాల చట్టం సైన్యానికి విశేషాధికారాలు ఇస్తోంది. శాంతిభద్రతల పరిరక్షణకు నియమితులైన బలగాలు అనుమతి లేకుండా ఎవరి ఇళ్లనైనా తనిఖీ చేయొచ్చు. వారెంటు లేకుండా ఎవరినైనా అరెస్టు చేయొచ్చు. ప్రమాదకారులన్న అనుమానం వచ్చిన వ్యక్తులను కాల్చి చంపొచ్చు. బహిరంగ స్థలాల్లో అయిదుగురు వ్యక్తులు గుమిగూడి ఉంటే, వారి వల్ల ముప్పు వాటిల్లవచ్చునని అనిపిస్తే కాల్పులు జరపొచ్చు. సైన్యం చర్యలను న్యాయస్థానాల్లో సవాలు చేయడం పౌరులకు సాధ్యం కాదు. ఏ సైనికుడైనా అన్యాయంగా, అకారణంగా ప్రాణం తీశాడని ఆరోపణ వస్తే వారిని విచారించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందస్తు అనుమతినీయాలి. ప్రజా ప్రతినిధులుగానీ, రాష్ట్ర ప్రభుత్వంగానీ నోరెత్తడానికి లేదు. పౌరుల స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు విశేష ప్రాధాన్యమిచ్చే రాజ్యాంగం అమలవుతున్నచోట దానికి విరుద్ధమైన ఇలాంటి క్రూర చట్టం రూపొందడం, ఎందరు కాదన్నా అవిచ్ఛిన్నంగా కొనసాగడం దిగ్భ్రాంతికరమే. శత్రువులన్న అనుమానం కలిగినంతమాత్రాన, ఆరోపణలొచ్చినంతమాత్రాన పౌరులను కాల్చిచంపడమంటే చట్టబద్ధపాలన మాత్రమే కాదు... ప్రజాస్వామ్యం కూడా తీవ్ర ప్రమాదంలో పడినట్టు పరిగణించా ల’ని రెండేళ్లక్రితం సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. మణిపూర్‌లో 2000 సంవత్సరం నుంచి 2012 వరకూ 1528మంది పౌరులను సాయుధ బలగాలు అకారణంగా హతమార్చాయని, వాటిపై విచారణ జరిపించడంతోపాటు సాయుధ దళాల చట్టాన్ని రద్దు చేయాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఇచ్చిన తీర్పులో ధర్మాసనం ఈ వ్యాఖ్య చేసింది. 2004లో తంగజం మనోరమ చాను అనే మహిళను అస్సాం రైఫిల్స్ సిబ్బంది అరెస్టు చేశాక ఆమె శవమై కనబడినప్పుడు పార్లమెంటులో తీవ్ర దుమారం చెలరేగింది. ఆ ఘటనను నిరసిస్తూ కొందరు మణి పురి మహిళా ఉద్యమకారులు సైనికులు బస చేసిన కాంగ్లా భవనం ముందు నగ్న నిరసనకు దిగారు. సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం వంటివి ఉన్న సమస్యను పరిష్క రించకపోగా కొత్త సమస్యలను తీసుకొస్తాయి. ప్రజలకూ, ప్రభుత్వాలకూ మధ్య అగాధాన్ని పెంచుతాయి. అసంతృప్తిని మరింత విస్తరింపజేస్తాయి. జనం ఎదు ర్కొంటున్న సమస్యలపై సకాలంలో స్పందిస్తే, వారి డిమాండ్లలోని సహేతుకతను అవగాహన చేసుకుని తగిన పరిష్కారాన్ని అన్వేషిస్తే ఉద్యమాలు ఉగ్రరూపం దాల్చవు. అమానుష చట్టాల అవసరమే ఉండదు. అంతర్జాతీయంగా మన దేశాన్ని అపఖ్యాతిపాలు చేస్తున్న ఈ చట్టాన్ని మణిపూర్, అస్సాం, నాగాలాండ్ రాష్ట్రాల్లో సైతం ఉపసంహరించడంతోపాటు దాన్ని సంపూర్ణంగా రద్దు చేసే దిశగా ఆలోచించాలి. -
మేఘాలయలో ఏఎఫ్ఎస్పీఏ ఎత్తివేత
న్యూఢిల్లీ: మేఘాలయలో భద్రతా దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (ఏఎఫ్ఎస్పీఏ) కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేసింది. అరుణాచల్‌ప్రదేశ్‌లో పాక్షికంగా తొలగించింది. భద్రతా దళాలు ఆపరేషన్లు నిర్వహించేందుకు ఎవరినైనా, ఎక్కడైనా, ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా అరెస్టు చేసేందుకు అధికారం కల్పిస్తున్న ఏఎఫ్ఎస్పీఏను మార్చి 31 నుంచి మేఘాలయలోని అన్ని ప్రాంతాల్లో ఎత్తివేశారు. భద్రత పరంగా మేఘాలయలో గణనీయమైన మెరుగుదల కనిపిస్తోందని, అందుకే ఈ చట్టాన్ని తొలగించామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, దేశంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు విదేశీయులపై ఉన్న నిబంధనలను కేంద్రం ఎత్తేసింది. ప్రత్యేక పర్మిట్ ఏదీ అవసరం లేకుండానే పర్యటించవచ్చని స్పష్టం చేసింది. అయితే పాకిస్తాన్, చైనా, ఆఫ్ఘనిస్తాన్ వంటి పలు దేశాల పర్యాటకులకు మాత్రం అనుమతివ్వలేదు. -
మణిపురి మహిళ దీక్ష భగ్నం
ఇంఫాల్: మణిపూర్‌లో సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టానికి (ఏఎఫ్ఎస్పీఏ) వ్యతిరేకంగా స్థానిక ‘ఉమెన్ అండ్ క్రైమ్ జర్నల్’ పత్రిక ఎడిటర్ రాంబం రోబితా శనివారం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. మణిపూర్ వర్సిటీ ముందున్న కాంచిపురలోని తన ఆఫీసులోనే ఆమె దీక్షకు పూనుకున్నారు. కూతుళ్ల భవిష్యత్తు, భర్త వ్యతిరేకత నేపథ్యంలో దీక్ష చేపట్టవద్దని సహచరులు సూచించినా పట్టించుకోలేదు. అయితే, పోలీసులు దీక్షాశిబిరం వద్దకు వచ్చి ఆమెను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఏఎఫ్ఎస్పీఏ రద్దు కోసం 16 ఏళ్లుగా చేసిన నిరశనను ఇరోం షర్మిల ఇటీవల విరమించడం తెలిసిందే. -
ఇరోమ్ షర్మిల గురించి ఈ విషయాలు మీకు తెలుసా!
సాయుధ బలగాల అకృత్యాలపై పోరుబాట పట్టి.. 16 ఏళ్లుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఇరోమ్ షర్మిల మహాపోరాట ప్రస్థానం మంగళవారం మరో కీలక మలుపు తీసుకుంది. ఆమె నిర్విరామ నిరాహార దీక్షను మంగళవారం విరమించారు. రాజకీయాల్లో అడుగుపెట్టాలని నిశ్చయించారు. రాజకీయాల్లోకి రావాలన్న ఆమె నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొందరు ఆమెను చంపేస్తామని బెదిరిస్తున్నారు కూడా.. ఆ బెదిరింపులను లక్ష్యపెట్టకుండా ముందుకుసాగుతున్న ఉక్కుమహిళ షర్మిల ప్రస్థానంలోని కీలకాంశాలివి.. మణిపూర్ ఉక్కుమహిళగా పేరొందిన ఇరోమ్ షర్మిల మధ్యతరగతి కుటుంబంలో 1972లో జన్మించారు. తొమ్మిది మంది తోబుట్టువుల్లో చివరి సంతానం ఆమె. మొదట్లో డాక్టర్ కావాలనుకున్నారు. కానీ హక్కుల కార్యకర్తగా మారి.. 'సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టం (ఆఫ్సా)కు వ్యతిరేకంగా పోరుబాట పట్టారు. సైనికులకు 'చంపే లైసెన్స్' ఇచ్చే చట్టంగా పేరొందిన ఆఫ్సాను రద్దుచేయాలని నినదించారు. ఇరోమ్ షర్మిల 28 ఏళ్ల వయస్సులో ఉండగా 2000 నవంబర్ 4న ఉక్కుసంకల్పంతో నిరాహార దీక్షకు దిగారు. అంతకు రెండురోజుల ముందు మణిపూర్ రాజధాని ఇంఫాల్ సమీపంలోని మాలోమ్‌లో సైనికుల కాల్పుల్లో పదిమంది చనిపోయారు. అందులో ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వెళుతున్న టీనేజ్ విద్యార్థులు కూడా ఉన్నారు. ఈ ఘటనతో చలించిపోయిన షర్మిల పోరుబాటను ఎంచుకున్నారు. మణిపూర్‌లో, దేశవ్యాప్తంగా ఆఫ్సా వ్యతిరేక ఉద్యమానికి షర్మిల కేంద్రంగా మారారు. ముక్కు ద్వారా ద్రవాహారం తీసుకుంటూ ఏళ్లకు ఏళ్లు ఆమె కొనసాగించిన దీక్ష దేశమంతటికీ చేరింది. అప్పటినుంచి షర్మిల ఇంఫాల్‌లోని సజీవ సెంట్రల్ జైలులో కస్టడీలో ఉంచారు. కానీ, ఎక్కువకాలం నగరంలోని జవహర్ లాల్ నెహ్రూ వైద్య విజ్ఞాన కేంద్రంలోనే గడిపారు. ఐదుగురు వైద్యులు, 12మంది నర్సులు, ముగ్గురు మహిళా పోలీసులు.. ఇలా దాదాపు 40మంది నిత్యం ఆమెకు బలవంతంగా ముక్కు ద్వారా ద్రవాహారం, పౌష్టికాలు అందజేసేవారు. షర్మిల 2000 సంవత్సరంలో తొలిసారి అరెస్టు అయ్యారు. ఆ తర్వాత ఆత్మహత్యకు ప్రయత్నించారన్న కారణంతో ఆమెను అరెస్టు చేయడం, విడుదల చేయడం నిత్యకృత్యంగా జరుగుతూ వచ్చింది. ఇప్పటివరకు దేశంలో ఆత్మహత్యాయత్నం నేరంగా ఉండగా.. దీనిని నేరరహితంగా ప్రతిపాదిస్తూ రూపొందించిన బిల్లును గత సోమవారం రాజ్యసభ ఆమోదించింది. ఇంకా లోక్‌సభ ఈ బిల్లును ఆమోదించాల్సి ఉంది. షర్మిల మంచి రచయిత, కవి. స్థానిక మీటిలాన్ భాషలో ఆమె రచనలు చేశారు. ఆమె రచనల్లో 12 కవితలతో కూడిన 'ఫ్రాగ్రాన్స్ ఆఫ్ పీస్' పుస్తకాన్ని తన మహా దీక్షకు ముందే రచించారు. 2006లో షర్మిల తన ఆందోళనకు దేశ రాజధాని ఢిల్లీని వేదికగా చేసుకున్నారు. జంతర్ మంతర్‌లో ఆమె, కార్యకర్తలతో కలిసి దీక్ష చేశారు. వెంటనే ఆమెను అరెస్టు చేసినప్పటికీ ఆమె నిరాహార దీక్ష ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఆఫ్సాలో మార్పులు తీసుకురావాలంటూ కోరుతూ యూరోపియన్ పార్లమెంటు భారత ప్రభుత్వానికి లేఖ రాసింది. అహింసాయుత మార్గంలో షర్మిల సాగించిన పోరాటం ఆమెకు ఎన్నో అవార్డులను తెచ్చిపెట్టింది. 2007లో గ్వాంగ్జు మానవహక్కుల పురస్కారం, ఆసియన్ మానవ హక్కుల కమిషన్ జీవితసాఫల్య పురస్కారం, 2010లో విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ శాంతి బహుమతి ఆమెకు లభించాయి. 2013లో ఆమెస్టీ ఇంటర్నేషనల్ ఆమెను 'ప్రిజనర్ ఆఫ్ కాన్షైన్స్' (ఆత్మసాక్షికి ఖైదీ)గా కీర్తించింది. ప్రజాజీవితంలోకి వచ్చిన తర్వాత షర్మిల వ్యక్తిగత జీవితం ప్రారంభమైందని చెప్పవచ్చు. 2011 మార్చిలో భారత సంతతికి చెందిన బ్రిటిష్ పౌరుడు డెస్మండ్ కౌటిన్హో (48) ఆమెను ఆస్పత్రిలో కలిశారు. 2009లో నుంచి వీరిద్దరూ పరస్పరం లేఖలు రాసుకుంటున్నారు. అతడు తనను ప్రేమిస్తున్నట్టు షర్మిల మీడియాకు తెలిపింది. అయితే, ఆఫ్సా వ్యతిరేక ఉద్యమం నుంచి ఆమె దారి మళ్లించేందుకే ప్రభుత్వం కౌటిన్హోను పరోక్షంగా రంగంలోకి దింపిందని అప్పట్లో అనుమానాలు వచ్చాయి. గత నెల 26న తాను దీక్షను విరమించబోతున్నట్టు ప్రకటించి షర్మిల తన మద్దతుదారులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. మంగళవారం దీక్ష విరమించి రాజకీయాల్లో చేరుతానని, పెళ్లి చేసుకుంటానని ఆమె ప్రకటించారు. -
ఆ వివాదాస్పద చట్టాన్ని ఎత్తివేయరా?
జమ్ము కశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగానైనా సైనిక దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని (ఏఎఫ్ఎస్పీఏ) ఎత్తివేయాలని, అవసరమైతే మళ్లీ విధించవచ్చని రాష్ర్ట ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఇటీవల కేంద్రాన్ని కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, విపక్షంలోని కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఇప్పటికీ మౌనం పాటిస్తున్నాయి. మొదటి నుంచి కశ్మీర్ విషయంలో సైనిక దళాల పక్షాన నిలబడుతూ వచ్చిన బీజేపీ ముఫ్తీ డిమాండ్‌ను పరిశీలిస్తుందని ఎవరూ ఊహించం లేం. అనేక సందర్భాల్లో ఈ చట్టాన్ని ఎత్తివేసేందుకు అవకాశం వచ్చినా పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు స్పందిస్తుందని కూడా ఆశించలేం. వామపక్షాలు, మైనారిటీల పక్షాన నిలిచే పార్టీలైనా స్పందించవచ్చు గదా? అన్నది విజ్ఞుల ప్రశ్న. ఈ వివాదాస్పద చట్టాన్ని ఎత్తివేయడమే ప్రధాన నినాదంగా అధికారంలోకి వచ్చిన మెహబూబా ముఫ్తీకి చెందిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ మిత్రపక్షమైన బీజేపీపై ఒత్తిడి తీసుకరాచ్చు కదా! అన్నది ఆ పార్టీల ఎదురు ప్రశ్న. అవును, అదీ నిజమే. ప్రజల సానుభూతి పవనాలతో అధికారంలోకి వచ్చిన పీడీపీ పార్టీ ప్రధాన ఎన్నికల నినాదాల్లో సైనిక దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని ఎత్తివేయాలన్నది ఒకటి. అందుకనే రాష్ట్రంలో బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆమె ఈ వివాదాస్పద చట్టాన్ని సమీక్షించాలని షరతు విధించారు. అందుకు బీజేపీ ససేమిరా అంగీకరించలేదు. కొన్ని నెలలపాటు ఈ అంశంపై ఇరు పార్టీల మధ్యన ప్రతిష్టంభన ఏర్పడింది. చివరకు పొత్తులో భాగంగా సైనిక దళాల ప్రత్యేకాధికారాల చట్టం స్థానే ‘కల్లోలిత ప్రాంతాల చట్టం’ను సమీక్షిస్తామంటూ అతి తెలివితో అంగీకారం కుదుర్చుకున్నారు. 1998లోనే కశ్మీర్లో కాలం తీరిపోయిన కల్లోలిత ప్రాంతాల చట్టాన్ని ఇప్పుడు సమీక్షించడం ఏమిటీ? ఏ రాష్ట్రంలోనైనా ఆరు నెలలకు మించి కల్లోలిత ప్రాంతాల చట్టాన్ని అమలు చేయకూడదని, దాన్ని పొడిగించదల్చుకుంటే ఆ రాష్ట్ర శాసన సభ ఆమోదం తప్పనిసరి అని కోర్టు 1998లోనే తీర్పుచెప్పింది. అప్పటి నుంచి కల్లోలిత ప్రాంతాల చట్టాన్ని పక్కన పెట్టి అప్పటికే అమల్లోకి వచ్చిన సైనిక దళాల ప్రత్యేకాధికారాల చట్టం కింద కశ్మీర్ ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించారు. 2001లో సైనిక దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని జమ్మూలోని ఇతర ప్రాంతాలకు విస్తరింపచేశారు. వివాదాస్పదమైన ఈ చట్టాన్ని మొదటిసారి నాగాల తిరుగుబాటును అణచివేసేందుకు నాగాలండ్‌లో 1958లో ప్రవేశపెట్టారు. 1990లో ఇతర ఈశాన్య రాష్ట్రాలకు విస్తరించారు. మణిపూర్‌లో ఈ చట్టాన్ని ఎత్తివేయాలంటూ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిలా 16 ఏళ్లపాటు సుదీర్ఘ పోరాటం చేసి అలసిపోయారు. ఈ చట్టాన్ని సమీక్షించాలని కోరుతూ 2004లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం జస్టిస్ బీపీ జీవన్ రెడ్డితో ఓ కమిషన్‌ను నియమించింది. ఈ వివాదాస్పద చట్టాన్ని ఎత్తివేయాలంటూ ఆ కమిషన్ కేంద్రానికి సిఫారసు చేసింది. కేంద్రమంత్రి చిదంబరం ఆ సిఫారసుకు మద్దతు పలికినా, కేంద్ర కేబినెట్ దాన్ని తోసిపుచ్చింది. చర్చల ప్రక్రియలో భాగంగా 2011లో కశ్మీర్లో పర్యటించిన కేంద్రం దూతలు కూడా ఈ వివాదాస్పద చట్టాన్ని సమీక్షించాలని సిఫార్సు చేశారు. అయినా కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టించుకుంటుందన్న ఆశ అసలే లేదు. --ఓ సెక్యులరిస్ట్ కామెంట్ (ఎలాంటి వారెంటు లేకుండా ఎవరినైనా తనిఖీ చేసి అరెస్ట్ చేసే అధికారాన్ని ఈ సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం కల్పిస్తోంది. ఆందోళనలను అణచివేయడంలో భాగంగా అత్యవసర సమయాల్లో ఏకపక్షంగా కాల్పులు జరపొచ్చు. ఇలాంటి కేసులను కేంద్రం అనుమతిస్తే తప్ప పౌర కోర్టులకు విచారించే అధికారం లేదు. సైనిక కోర్టులే విచారించాలి. 2010 ఆందోళనలు అణచివేయడంలో భాగంగా సైనికులు జరిపిన కాల్పుల్లో 120 మంది కశ్మీర్ యువకులు మరణించారు) -
ఉక్కుమహిళ కల నెరవేరుతుందా..!
న్యూఢిల్లీ: మణిపూర్ ఉక్కుమహిళ ఇరోమ్ షర్మిళ కల సాకారం అయ్యేట్టు కనిపిస్తుంది. తమ రాష్ట్రంలో ప్రత్యేక సాయుధ బలగాలను ఉపసంహరించాలంటూ ఆమె గత పద్నాలుగేళ్లుగా చేస్తున్న దీక్షకు ప్రతిఫలం లభించే అవకాశం కలిగేలా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఆర్మీ, పారామిలిటరీ బలగాలు మితిమీరిన బలగాన్ని మణిపూర్‌లో మోహరించవద్దని, ఇష్టమొచ్చినట్లుగా ప్రతిదాడులు చేయొద్దని సుప్రీంకోర్టు సూచించింది. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో జరిగిన 1500 ఫేక్ ఎన్ కౌంటర్లకు సంబంధించి ఓ స్వతంత్ర్య దర్యాప్తు సంస్థ ద్వారా విచారణ జరపాలని ఆదేశించింది. రెండు దశాబ్దాల కాలంగా మణిపూర్ లో ఎన్కౌంటర్లు జరుగుతున్నాయని కోర్టు గుర్తు చేసింది. మణిపూర్ లో ఏఎఫ్ఎస్పీఏ(సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం) అమలులో ఉన్న విషయం తెలిసిందే. దీని ప్రకారం ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎవ్వరినైనా తమ అదుపులోకి తీసుకునే అధికారం సైనికులకు ఉండగా దానిని రద్దు చేయాలని షర్మిల దీక్ష చేస్తున్నారు. -
ఏఎఫ్ఎస్పీఏ ‘రద్దు’ను తోసిపుచ్చండి
న్యూఢిల్లీ: వివాదాస్పద సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని (ఏఎఫ్ఎస్పీఏ) ఉపసంహరించాలంటూ జస్టిస్ బి.పి. జీవన్‌రెడ్డి కమిటీ చేసిన సిఫార్సును తోసిపుచ్చాలంటూ కేంద్ర హోంశాఖ ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు ప్రధాని మోదీ సారథ్యంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీకి నివేదిక పంపినట్లు హోంశాఖ అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు ఈ చట్టాన్ని నీరుగార్చేందుకు వీల్లేదన్న రక్షణశాఖ...తీవ్రవాద ప్రాబల్య ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న భద్రతా దళాలకు వేధింపుల నుంచి ఈ చట్టం రక్షణ కల్పిస్తుందని పేర్కొంది. అస్సాం రైఫిల్స్ కస్టడీలో ఉండగా తాంగ్జిం మనోరమ అనే మహిళ హత్యకు గురికావడం... తమ రాష్ట్రంలో ఈ చట్టాన్ని ఉపసంహరించాలంటూ మణిపూర్ హక్కుల కార్యకర్త ఇరోం షర్మిల ఆమరణ నిరాహారదీక్షకు దిగడం...దీనిపై ఆ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం తీవ్ర రూపు దాల్చడంతో 2004లో అప్పటి ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.పి. జీవన్‌రెడ్డి నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీని నియమించింది. ఏఎఫ్ఎస్పీఏ అమలు తీరును అధ్యయనం చేసిన జీవన్‌రెడ్డి కమిటీ...ఈ చట్టం అణచివేతకు చిహ్నంగా మారిందని, వివక్షకు, ఆధిపత్య ధోరణికి పనిముట్టుగా మారిందని పేర్కొంటూ దీన్ని ఉపసంహరించాలని 2005 జూన్ 6న సమర్పించిన నివేదికలో కేంద్రానికి సిఫార్సు చేసింది. -
సాయుధదళాల చట్టం తొలగించాలి: కాంగ్రెస్
జమ్మూ: జమ్మూకాశ్మీర్‌లో అమలవుతున్న సాయుధదళాల ప్రత్యేక అధికారాల చట్టం(ఏఎఫ్ఎస్పీఏ) తొలగించాల్సిన అవసరం ఉందని కాశ్మీర్ పీసీసీ అధినేత సైఫుద్దీన్ సోజ్ అభిప్రాయపడ్డారు. ఆదివారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ప్రస్తుతం కాశ్మీర్‌కు ఆ ప్రత్యేక చట్టం అవసరంలేదని, సైన్యాధికారులతో సంప్రతించి దానిని ఎత్తివేయాలన్నారు. రెండు రోజుల కిందట ఈ చట్టాన్ని కేంద్ర మాజీ హోంమంత్రి పి. చిదంబరం తప్పుపట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో శాంతియుతవాతావరణం సైఫుద్దీన్ ఉందన్నారు. కాగా సైన్యాధికారులతో చర్చించకుండానే సాయుధదళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని సవరిస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చేసిన ప్రకటనను ఆయన ఉదహరిస్తూ, ఎవరినీ సంప్రతించకుండానే సీఎం అలా ప్రకటించారన్నారు. -
'ఉక్కు మహిళ'కు ఎట్టకేలకు విముక్తి
ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రాల్లో సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దు చేయాలనే డిమాండ్‌తో 14 ఏళ్లుగా నిరాహారదీక్ష చేస్తున్న మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిలకు ఎట్టకేలకు విముక్తి లభించింది. మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లోని ఆస్పత్రి నుంచి ఆమె బుధవారం విడుదలయ్యారు. తనను విడుదల చేయడం పట్ల ఇరోమ్ షర్మిల సంతోషం వ్యక్తం చేసింది. సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దు చేయాలనే డిమాండ్ పై వెనక్కు తగ్గబోనని స్పష్టం చేసింది. నిరాహారదీక్ష కొనసాగిస్తానని ఆమె తెలిపింది. ఆస్పత్రి ప్రత్యేక వార్డులో ఉంచి ఇప్పటివరకు బలవంతంగా ఆమెకు ఫ్లూయిడ్స్ ఎక్కించారు. ఆమె ఉంటున్న గదినే సబ్ జైలుగా మార్చారు. అయితే ఇరోమ్ షర్మిలను విడుదల చేయాలని మణిపూర్ కోర్టు ఆదేశించడంతో ఆమెకు విముక్తి ప్రసాదించారు. -
ఐరోమ్ షర్మిల చానును విడుదల చేయండి:కోర్టు
న్యూఢిల్లీ:ఉద్యమ నాయకురాలు ఐరోమ్ షర్మిలను విడుదల చేయాలని మణిపూర్ కోర్టు ఆదేశించింది. గతంలో ఎఎఫ్ఎస్పిఎ(ఆర్మ్ డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్) రద్దు కోరుతూ ఆమరణ దీక్షకు దిగిన షర్మిలను జ్యూడిషియల్ కస్టడీలో ఉంచిన సంగతి తెలిసిందే. దీనిపై మంగళవారం విచారించిన కోర్టు.. ఆమె ఆత్మహత్య చేయడానికి యత్నించినట్లు సరైన అధారాలు లేనందున విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 1958 చట్ట పరిధిలో ఉన్న ఎఎఫ్ఎస్పీఏ రద్దు చేయాలని కోరుతూ ఆమె 2000 వ సంవత్సరం నవంబర్ 4 వ తేదీన ఆమరణ దీక్ష కు దిగింది.