న్యూఢిల్లీ: మణిపూర్ ఉక్కుమహిళ ఇరోమ్ షర్మిళ కల సాకారం అయ్యేట్టు కనిపిస్తుంది. తమ రాష్ట్రంలో ప్రత్యేక సాయుధ బలగాలను ఉపసంహరించాలంటూ ఆమె గత పద్నాలుగేళ్లుగా చేస్తున్న దీక్షకు ప్రతిఫలం లభించే అవకాశం కలిగేలా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఆర్మీ, పారామిలిటరీ బలగాలు మితిమీరిన బలగాన్ని మణిపూర్లో మోహరించవద్దని, ఇష్టమొచ్చినట్లుగా ప్రతిదాడులు చేయొద్దని సుప్రీంకోర్టు సూచించింది.
ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో జరిగిన 1500 ఫేక్ ఎన్ కౌంటర్లకు సంబంధించి ఓ స్వతంత్ర్య దర్యాప్తు సంస్థ ద్వారా విచారణ జరపాలని ఆదేశించింది. రెండు దశాబ్దాల కాలంగా మణిపూర్ లో ఎన్కౌంటర్లు జరుగుతున్నాయని కోర్టు గుర్తు చేసింది. మణిపూర్ లో ఏఎఫ్ఎస్పీఏ(సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం) అమలులో ఉన్న విషయం తెలిసిందే. దీని ప్రకారం ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎవ్వరినైనా తమ అదుపులోకి తీసుకునే అధికారం సైనికులకు ఉండగా దానిని రద్దు చేయాలని షర్మిల దీక్ష చేస్తున్నారు.
ఉక్కుమహిళ కల నెరవేరుతుందా..!
Published Fri, Jul 8 2016 12:48 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
Advertisement