ఇంఫాల్: మణిపూర్‌లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్‌ఎస్‌పీఏ)ను మరో ఆర్నెల్ల పాటు పొడిగించారు. ప్రస్తుత కల్లోల పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో ఏఎఫ్‌ఎస్‌పీఏను అక్టోబర్ 1 నుంచి ఆరు నెలల పాటు పొడిగిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారని పేర్కొంటూ అధికారిక ప్రకటన వెలువడింది. ఇంఫాల్ లోయ, అసోం సరిహద్దు ప్రాంతాల్లోని 19 పోలీస్ స్టేషన్లను మాత్రం దీని పరిధి నుంచి మినహాయించారు.
అక్కడ చట్టాన్ని అమలు చేయాలంటే సంబంధిత పోలీస్ స్టేషన్ అనుమతి తప్పనిసరి. లేదంటే సైన్యం, అస్సాం రైఫిల్స్‌ను అక్కడ నియోగించడానికి వీల్లేదు. దీనిపై భద్రతా దళాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలోని నిషేధిత ఉగ్ర గ్రూపులు లోయలో తలదాచుకుని సవకు విసురుతున్నట్టు చెబుతున్నాయి. మణిపూర్ పోలీసు ఆయధాగారం నుంచి దోచుకెళ్లిన మొత్తం 4,537 ఆయుధాలు, 6.32 లక్షల రౌండ్ల మందుగుండు వాటి చేతిలో పడ్డాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment