న్యూఢిల్లీ:ఉద్యమ నాయకురాలు ఐరోమ్ షర్మిలను విడుదల చేయాలని మణిపూర్ కోర్టు ఆదేశించింది. గతంలో ఎఎఫ్‌ఎస్‌పిఎ(ఆర్మ్ డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్) రద్దు కోరుతూ ఆమరణ దీక్షకు దిగిన షర్మిలను జ్యూడిషియల్ కస్టడీలో ఉంచిన సంగతి తెలిసిందే. దీనిపై మంగళవారం విచారించిన కోర్టు.. ఆమె ఆత్మహత్య చేయడానికి యత్నించినట్లు సరైన అధారాలు లేనందున విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
1958 చట్ట పరిధిలో ఉన్న ఎఎఫ్ఎస్పీఏ రద్దు చేయాలని కోరుతూ ఆమె 2000 వ సంవత్సరం నవంబర్ 4 వ తేదీన ఆమరణ దీక్ష కు దిగింది.