మణిపురి మహిళ దీక్ష భగ్నం | Police picks up Manipuri woman editor fasting against AFSPA | Sakshi
Sakshi News home page

మణిపురి మహిళ దీక్ష భగ్నం

Published Sun, Aug 14 2016 2:52 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

మణిపురి మహిళ దీక్ష భగ్నం - Sakshi

మణిపురి మహిళ దీక్ష భగ్నం

ఇంఫాల్: మణిపూర్‌లో సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టానికి (ఏఎఫ్‌ఎస్‌పీఏ) వ్యతిరేకంగా స్థానిక ‘ఉమెన్ అండ్ క్రైమ్ జర్నల్’  పత్రిక ఎడిటర్ రాంబం రోబితా శనివారం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. మణిపూర్ వర్సిటీ ముందున్న కాంచిపురలోని తన ఆఫీసులోనే ఆమె దీక్షకు పూనుకున్నారు. కూతుళ్ల భవిష్యత్తు, భర్త వ్యతిరేకత నేపథ్యంలో దీక్ష చేపట్టవద్దని సహచరులు సూచించినా పట్టించుకోలేదు. అయితే, పోలీసులు దీక్షాశిబిరం వద్దకు వచ్చి ఆమెను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఏఎఫ్‌ఎస్‌పీఏ రద్దు కోసం 16 ఏళ్లుగా చేసిన నిరశనను ఇరోం షర్మిల ఇటీవల విరమించడం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement