జమ్మూ: జమ్మూకాశ్మీర్‌లో అమలవుతున్న సాయుధదళాల ప్రత్యేక అధికారాల చట్టం(ఏఎఫ్‌ఎస్‌పీఏ) తొలగించాల్సిన అవసరం ఉందని కాశ్మీర్ పీసీసీ అధినేత సైఫుద్దీన్ సోజ్ అభిప్రాయపడ్డారు. ఆదివారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ప్రస్తుతం కాశ్మీర్‌కు ఆ ప్రత్యేక చట్టం అవసరంలేదని, సైన్యాధికారులతో సంప్రతించి దానిని ఎత్తివేయాలన్నారు. రెండు రోజుల కిందట ఈ చట్టాన్ని కేంద్ర మాజీ హోంమంత్రి పి. చిదంబరం తప్పుపట్టిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం రాష్ట్రంలో శాంతియుతవాతావరణం సైఫుద్దీన్ ఉందన్నారు. కాగా సైన్యాధికారులతో చర్చించకుండానే సాయుధదళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని సవరిస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చేసిన ప్రకటనను ఆయన ఉదహరిస్తూ, ఎవరినీ సంప్రతించకుండానే సీఎం అలా ప్రకటించారన్నారు.